
పట్నా : బిహార్ లోని మొకామాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మొకామా రైల్వేస్టేషన్ యార్డ్‌లో నిలిపి ఉన్న పట్నా-మొకామా ప్యాసింజర్ రైలు అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అయిదు బోగీ అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో జరిగింది. ముందుగా రెండు బోగీల్లో మంటలు చెలరేగాయి. ఆర్పేందుకు ప్రయత్నిస్తుండగానే మంటలు మరో రెండు మూడు బోగీలకు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది అయిదు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికీ బోగీలు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాద కారణాలపై రైల్వే భద్రతా అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే అదృష్టవశాత్తూ ఎవరికి గాయాలు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment