local
-
లోకల్ హిట్టర్స్..
ఒకప్పుడు ఆదివారం వస్తే చాలు ఉదయం చాయ్ తాగి ఇంట్లో నుంచి బయటకు వెళ్తే సాయంత్రం ఆరు గంటల వరకూ కూడా ఇంటికి రాకుండా క్రికెట్ ఆడిన రోజులు పాత తరం యువతకు చాలామందికి అనుభవమే. అలాగే క్రికెట్ చూడాలంటే కనీసం 5 నుంచి 7 కి.మీ. ప్రయాణించి టీవీ చూసి వచ్చిన రోజులూ ఉన్నాయి.. క్రికెట్ అంటే అంత పిచి్చ.. అంత అభిమానం ఉండేది. ఇప్పుడు కూడా ఆ అభిమానం అస్సలు మారలేదు. కానీ రూపు మార్చుకుంది. గల్లీ క్రికెట్ కాస్త పోష్ క్రికెట్ అయ్యింది. అకాడమీల్లో గంటకు కొంత డబ్బులు చెల్లించి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నారు. అంతేనా లోకల్ మ్యాచ్‌ల నుంచి జాతీయ స్థాయి మ్యాచ్‌ల స్థాయికి చేరుతున్నారు. రోజుకు కనీసం 8 గంటల పాటు ప్రాక్టీస్ మెళకువలతో పాటు ఫిట్‌నెస్‌పై దృష్టి బౌండరీలు దాటుతున్న లోకల్ టాలెంట్ ఐపీఎల్ వరకూ ఎదిగేందుకు అడుగులు క్రికెట్.. భారతదేశంలో ఒక మతం. దేశంలో క్రికెట్‌ను ఆరాధించని వారు లేరంటే అతిశయోక్తి కాదు. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు చిన్నా పెద్దా, ఆడా మగ తేడా లేకుండా టీవీలకు అతుక్కుపోతుంటారు. క్రికెట్ ఆడటం అంటే చిన్నప్పటి నుంచే క్రేజ్. గల్లీ క్రికెట్లో ఆడుతూ మంచి షాట్ కొడుతూ తమను తామే సచిన్ టెందుల్కర్, విరాట్‌కోహ్లి అనుకుంటూ సంబరపడిపోతుంటారు. అయితే ఒకప్పుడు క్రికెట్ అంటే కేవలం వినోదం కోసం చూడటమో.. ఆడటమో చేస్తుండేవారు. కానీ నేటి తరం క్రికెట్‌ను కూడా తమ కెరీర్‌గా మార్చుకుంటున్నారు. క్రికెట్ కాస్త ఖరీదైన వ్యవహారమే అయినా.. ఎలాగైనా కష్టపడి రంజీ లేదా ఐపీఎల్ ఆడి తమ సత్తా చూపాలని తాపత్రయపడుతున్నారు. అందుకోసం చిన్నతనం నుంచే గ్రౌండ్లో చెమటలు చిందిస్తున్నారు. ఎప్పటికైనా జాతీయ స్థాయిలో ఆడకపోతామా అనే ధీమాతో ముందుకు వెళ్తున్నారు. క్రికెట్‌ను కెరీర్‌గా చేసుకునే వారికి చాలా నిబద్ధతతో శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్లు నగరంలో భారీగా వెలిశాయి. అసలు కోచింగ్ సెంటర్లు పిల్లలను క్రికెటర్లుగా ఎలా మలుస్తున్నాయి.. ఎన్ని గంటల పాటు వారికి శిక్షణ ఇస్తున్నాయి.. ఎలా కష్టపడితే ఐపీఎల్ లేదా జాతీయ స్థాయిలో ఆడేందుకు అవకాశం వస్తుంది.. అనే విషయాలను తెలుసుకుందాం..! ఏడో యేటనుంచే.. సాధారణంగా క్రికెట్ ఆకాడమీల్లో పిల్లలు ఏడేళ్ల వయసు నుంచే చేరుతుంటారు. అందరూ క్రికెట్‌ను కెరీర్‌గా మలచుకునేందుకు చేరరు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశంతో చిన్నతనంలోనే క్రికెట్ అకాడమీల్లో చేరి్పస్తుంటారు. మిగిలిన వారంతా క్రికెటర్లుగా చూడాలనే ఉద్దేశంతోనే అకాడమీల్లో చేరి్పస్తుంటారు. మొదటి రెండేళ్ల వరకూ టెన్నిస్ బాల్, ప్లాస్టిక్ బాల్‌తో ఆడిస్తారు. 12 ఏళ్లు దాటిన తర్వాత లెదర్ బాల్‌తో నెట్స్‌లో ఆడిస్తుంటారు. ఈ సమయంలోనే బ్యాచ్‌లుగా వేరు చేసి, వారి ఆట తీరునుబట్టి తరీ్ఫదు ఇస్తుంటారు. కష్టపడితే ఎన్నో అవకాశాలు.. క్రికెట్లో రాణించడం ఒకప్పుడు డబ్బులపైనే ఆధారపడి ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. కష్టపడి మంచి ఆటతీరు కనబరిస్తే ఎంతో ఎత్తుకు వెళ్లే అవకాశాలు ఉంటాయని పలువురు కోచ్‌లు చెబుతున్నారు. టాలెంట్ ఉన్న వారికి అవకాశాలు ఎదురుచూస్తూనే ఉంటాయని, ఎట్టిపరిస్థితుల్లో కుంగిపోకుండా ముందుకు వెళ్లాలని చెబుతున్నారు.ఒక్కో రోజు ఒక్కో సెషన్.. సాధారణంగా క్రికెట్ ఆడాలంటే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని అంశాల్లో ప్రత్యేకంగా శిక్షణ పొందాల్సి ఉంటుంది. రోజుకో అంశంలో పిల్లలకు కోచ్ శిక్షణ ఇస్తుంటారు. ఒక రోజు బ్యాటింగ్ అయితే మరో రోజు బౌలింగ్, ఇంకో రోజు నాకింగ్, ఫీల్డింగ్‌లో ప్రాక్టీస్ చేయిస్తుంటారు. క్యాచ్‌లు పట్టే విధానంలో కూడా మెళకువలు నేరి్పస్తుంటారు. దీంతో పాటు క్రికెట్ ఫిట్నెస్ కూడా ముఖ్యం. ఇందులో భాగంగా జంపింగ్స్, ఫాస్ట్ రన్నింగ్, డ్రిల్స్ చేయిస్తుంటారు.అకాడమీ ఎంచుకునే ముందు..చాలా అకాడమీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఈ ట్రెండ్‌ను క్యాష్ చేసుకునేందుకు కొందరు ప్రయతి్నస్తున్నారు. ఇలాంటి వారి వద్ద చేరితే సమయంతో పాటు డబ్బు కూడా వృథా అవుతుంది. కమర్షియల్‌గా, బాక్స్ క్రికెట్ మాదిరిగా ఉండే అకాడమీలు కూడా ఉన్నాయి. అందుకే అకాడమీల్లో చేరేముందు అది ఎలాంటి అకాడమీ.. వాళ్లు ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు.. ఎంత సమయం ప్రాక్టీస్ చేయిస్తారు అనే విషయాలు ముందే చూసుకుని చేరి్పస్తే మంచిదని పలువురు శిక్షకులు సూచిస్తున్నారు.భారత్ తరపున ఆడించాలనే లక్ష్యంతో.. ప్రతి అకాడమీ కూడా తమ పిల్లలను భారత జట్టులో చూసుకోవాలన్నదే లక్ష్యంగా పెట్టుకుంటాయి. అందుకోసం వారు మెళకువలు నేర్చుకోవడంతో పాటు వాటిని పిల్లలకు నేరి్పస్తుంటారు. ప్రతి వారం మ్యాచ్‌లు పెట్టి వారి ఆటతీరును పరిశీలిస్తుంటారు. సీజనల్ మ్యాచ్‌లు అంటే జూన్–జులైలో జరిగే వన్ డే, టూడే, త్రీడే లీగ్ మ్యాచ్‌లకు కూడా వెళ్లి పాల్గొంటారు. హెచ్‌సీఏ నుంచి జరిగే లీగ్ మ్యాచ్‌లలో బాగా ఆడితే అండర్–14, –16, –19 స్టేట్ టీమ్స్‌కు ఆడే అవకాశం వస్తుంది. అక్కడ ఎవరైనా మంచి పెర్ఫార్మెన్స్ చేస్తే రంజీ ఆడే అవకాశం ఉంటుంది.రోజుకు ఎనిమిది గంటల ప్రాక్టీస్ క్రికెట్ అకాడమీల్లో చాలావరకూ ఉదయం 5– 5.30 గంటల నుంచే దినచర్య ప్రారంభం అవుతుంది. రెండు గంటల పాటు ప్రాక్టీస్ చేస్తుంటారు. ఆ తర్వాత కాసేపు బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత మళ్లీ ప్రాక్టీస్ చేస్తుంటారు. మళ్లీ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ రాత్రి 7 గంటల వరకూ ప్రాక్టీస్ చేస్తుంటారు. బౌలింగ్ మెషీన్స్, నెట్ సెషన్స్, సైడ్ ఆర్మ్ ప్రాక్టీస్ చేస్తుంటారు. వీరి వెన్నంటే ఉండే కోచ్‌లు ఎప్పటికప్పుడు వారికి ఆటలో తప్పులు అర్థం చేసుకుని ఆటగాళ్లు ఆడే విధానంలో మార్పులు చేస్తుంటారు. ఎక్కడైనా టోర్నమెంట్స్‌కు వెళ్లినప్పుడు వేరే అకాడమీ లేదా వేరే జట్టు ఆటగాళ్లు ఆడే తీరును కూడా పరిశీలించి.. తమ అకాడమీ పిల్లల ఆటలో ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుందనే విషయాలను వారికి చెబుతుంటారు. ఇలా రోజులో కనీసం 8 నుంచి 9 గంటల పాటు గ్రౌండ్‌లోనే ప్రాక్టీస్ చేస్తూ ఎప్పటికప్పుడు తమ ఆటతీరును అప్డేట్ చేసుకుంటారు. క్వాలిఫైడ్ ట్రైనర్స్‌తో.. క్రికెట్ కోసం చాలా మంది అకాడమీకి వస్తుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ శిక్షణ ఇస్తుంటాం. దాదాపు 15 మంది మా అకాడమీ నుంచి రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ అయ్యారు. వారికి ఎప్పటికప్పుడు ఆటలో మెళకువలు నేర్పించేందుకు క్వాలిఫైడ్ ట్రైనర్స్ ఉంటారు. మానసికంగా కూడా వారికి కావాల్సిన మద్దతు ఇస్తుంటాం. – కల్యాణ్, క్రికెట్ కోచ్, కూకట్పల్లి ఆసక్తి చూపుతున్న అమ్మాయిలు.. ఇటీవల కాలంలో అమ్మాయిలు కూడా క్రికెట్‌పై ఎంతో ఆసక్తి చూపుతున్నారు. వారికి కూడా అబ్బాయిలతో పాటు సమానంగా అకాడమీ నుంచి శిక్షణ ఇస్తుంటాం. కావ్యశ్రీ అనే అమ్మాయి ఇటీవల సీనియర్ వుమెన్స్ రంజీ ట్రోఫీలో ఆడుతున్నారు. ఆమెతో పాటు మరో నలుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు స్టేట్ లెవల్ టీమ్స్‌లో ఆడే అవకాశం దక్కించుకున్నారు. వారిలో ఒకరినైనా ఇండియా జట్టులో చూడాలనేదే మా ఆశ. – తలకంటి సతీశ్‌రెడ్డి, ఎంఎస్డీ క్రికెట్ అకాడమీ, మేడిపల్లి -
ఏడు రైల్వే స్టేషన్ల పేర్లు మార్పు
ముంబై: మహానగరం ముంబైలోని ఏడు లోకల్ స్టేషన్ల పేర్లు త్వరలో మారనున్నాయి. ముంబైలోని మెరైన్ లైన్స్ స్టేషన్‌ను ఇకముందు ముంబా దేవి స్టేషన్‌గా పిలవనున్నారు. ఈ స్టేషన్ పేరును మార్చడం వల్ల ముంబా దేవి దర్శనానికి వెళ్లే భక్తులకు ఎంతో సౌలభ్యంగా ఉండనుంది.ముంబైలోని ఏడు స్థానిక రైల్వే స్టేషన్ల పేర్లను మార్చే ప్రతిపాదనను మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆమోదించింది. దీంతో ఈ ప్రతిపాదనను రైల్వే మంత్రిత్వ శాఖకు పంపనున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే రైల్వే స్టేషన్ల పేర్లను మార్చనున్నారు. మెరైన్ లైన్‌ను ముంబా దేవిగా, కర్రీ రోడ్డును లాల్‌బాగ్‌గా, సాండ్హర్స్ట్ రోడ్డును డోంగ్రీగా, చర్ని రోడ్డును గిర్గావ్ స్టేషన్‌గా మార్చనున్నారు. అలాగే కాటన్ గ్రీన్ స్టేషన్‌కు కాలాచౌకీ అని, డాక్‌యార్డ్ రోడ్డును మజ్‌గావ్‌గా, కింగ్ సర్కిల్‌ను తీర్థంకర్ పార్శ్వనాథ్ స్టేషన్‌గా మార్చనున్నారు.ఈ ప్రతిపాదనను రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి చంద్రకాంత్ పాటిల్ సమర్పించారు. ఇది ఏకగ్రీవంగా ఆమోదంపొందింది. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నాయి. దీనికి అనుమతి లభించిన వెంటనే ఈ స్టేషన్ల పేర్లను మార్చనున్నారు. -
మళ్లీ ‘లోకల్’ ఫైట్: మెడపట్టి రైలులో నుంచి..
ఢిల్లీ మెట్రో- ముంబై లోకల్ మధ్య వైరల్ వీడియోల వార్ జరుగుతోంది. రీల్స్ చేయడం మొదలుకొన్ని ప్రయాణికులు పరస్పరం తన్నుకునేవరకూ ఇలా లెక్కలేనన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజా వీడియో ముంబై లోకల్ ట్రైన్‌కు సంబంధించినది. వేగంగా వెళుతున్న రైలులో డోరు దగ్గర నిలుచున్న ఇద్దరు ప్రయాణికుల మధ్య వివాదం చేటుచేసుకోవడాన్ని వీడియోలో చూడవచ్చు. ముంబై మేటర్స్ పేరుతో ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసిన ఈ వీడియోలో ఇద్దరు ప్రయాణికులు రైలు డోర్ దగ్గర నిలుచుని ఉండటం కనిపిస్తుంది. వారిద్దరూ ఏదో విషయమై గొడవపడుతుంటారు. ఇంతలో ఒక వ్యక్తి తన ఎదురుగా ఉన్న వ్యక్తి గొంతుపట్టి అతనిని రైలు నుంచి బయటకు నెట్టివేసేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఆ వ్యక్తి ట్రైన్ గ్రిల్ పట్టుకుని తనను తాను కాపాడుకుంటాడు. దీనిని చూసిన రైలులోని తోటి ప్రయాణికులు పెద్దగా కేకలు పెడతారు. ఈ వీడియోను చూసినవారికి తృటిలో ప్రమాదం తప్పిందని అనిపిస్తుంది. ఈ వీడియో వైరల్ అయిన నేపధ్యంలో పలువురు యూజర్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ ముంబై మెట్రోలో ఇది నిత్యకృత్యమై పోయిందని కామెంట్ చేయగా, మరొక యూజర్ ‘ఇంత చిన్న గొడవకే ప్రాణాలు తీసుకుంటారా?’ అని ప్రశ్నించాడు. ఇది కూడా చదవండి: ఈ ఆమ్లెట్ తింటే లక్ష.. కండీషన్స్ అప్లై! Commuter Fights inside speeding #MumbaiLocal trains that too near the Open Doors (Gate) is very very Risky. Whenever the much promised conversion of all the Mumbai local trains into AC Local trains (with doors) happens, commuters can fight in cool comfort without sweating &… pic.twitter.com/d8KCxYc9Np — मुंबई Matters™ (@mumbaimatterz) October 11, 2023 -
‘స్థానిక’ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా
సాక్షి, అమరావతి: ఎన్నికలు ఏవైనా రాష్ట్రంలో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం నగర కార్పొరేషన్ మేయర్ స్థానంతో పాటు నందిగామ మున్సిపల్ వైస్ చైర్మన్, రెండు ఎంపీపీ, మూడు వైస్ ఎంపీపీ స్థానాలకు సోమవారం జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ విజయం సాధించింది. మచిలీపట్నం నగర కార్పొరేషన్ మేయర్‌గా వైఎస్సార్సీపీకి చెందిన 43వ వార్డు మెంబర్ సీహెచ్ వెంకటేశ్వరమ్మ ఎన్నికయ్యారు. నందిగామ మున్సిపల్ వైస్ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ తరుఫున గెలిచిన ఒకటో వార్డు మెంబర్ పాకాలపాటి కృష్ణ ఎన్నికైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం వెల్లడించింది. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం, లింగాల ఎంపీపీగా అలవాలపాటి రమాదేవి (వైఎస్సార్సీపీ), తాడిపత్రి నియోజకవర్గం, పెద్దపప్పూరు మండలాధ్యక్షుడిగా జి.వెంకటరామిరెడ్డి (వైఎస్సార్సీపీ), అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా గాలి శ్రీనివాసులు (వైఎస్సార్సీపీ), రాప్తాడు నియోజకవర్గం, చెన్నేకొత్తపల్లి మండల పరిషత్ ఉపాధ్యక్షులుగా పి.జ్యోతి (వైఎస్సార్సీపీ), అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎస్.రాయవరం మండల ఉపాధ్యక్షుడిగా బొలిశెట్టి గోవిందరావు (వైఎస్సార్సీపీ)లు ఎన్నికైనట్టు అధికారులు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా నలజర్ల మండలంలో పార్టీ రహితంగా జరిగిన కోఆప్షన్ సభ్యుని ఎన్నికలో సయ్యద్ మునాఫ్ గెలిచినట్లు అధికారులు వెల్లడించారు. 170 గ్రామాల్లో ఉప సర్పంచి ఎన్నిక పూర్తి.. రాష్ట్ర వ్యాప్తంగా 186 గ్రామాల్లో ఉప సర్పంచి పదవులకుగాను సోమవారం 170 గ్రామాల్లో ఎన్నిక పూర్తయినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం అధికారులు పేర్కొన్నారు. 11 గ్రామాల్లో ఎన్నికలు వాయిదా పడగా.. మరో చోట స్థానిక వార్డు మెంబర్ చనిపోయిన కారణంగాను, ఇంకో నాలుగు గ్రామ పంచాయతీల్లో కోరం లేక తాత్కాలికంగా ఉప సర్పంచ్ ఎన్నిక వాయిపడినట్టు అధికారులు వివరించారు. వాయిదా పడిన 11 గ్రామాల్లో మంగళవారం మరో విడత ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. -
‘లోకల్’లో హోరాహోరీ.. ‘మెట్రో’తో పోటీ అంటూ..
రద్దీగా ఉన్న ముంబై లోకల్ ట్రైన్లో సీటు కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య చోటుచేసుకున్న గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఇద్దరు ప్రయాణికుల మధ్య ఘర్షణ చెలరేగడాన్ని గమనించవచ్చు. Just a Normal daily scene inside a crowded #MumbaiLocal Loved the Super Cool Referee.. pic.twitter.com/i0X9yAperP — मुंबई Matters™ (@mumbaimatterz) September 1, 2023 ముంబైలోని కిక్కిరిసిన లోకల్ రైళ్లలో పరిమిత సీటింగ్ స్థలం కోసం ప్రయాణికులు పోటీ పడుతుంటారు. అయితే ఈ వీడియోలో ఇద్దరు ప్రయాణికులు కొట్టుకుంటుండగా ఒక ప్రయాణికుడు జోక్యం చేసుకుని వారిద్దరి ఆగ్రహాన్ని చల్లార్చాడు. ఈ వీడియో వైరల్ అయిన నేపధ్యంలో ఇంటర్నెట్లో ముంబై లోకల్.. ఢిల్లీ మెట్రో మధ్య పోలికలు మొదలయ్యాయి. ఢిల్లీ మెట్రోలో ఘర్షణలు, ఇబ్బందికర పరిస్థితులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఢిల్లీ మెట్రోతో ముంబై లోకల్ రైలు పోటీపడుతున్నదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: పుట్టాడు ఏలియన్ లాంటి పిల్లోడు.. చేస్తున్నాడు వింతవింత శబ్ధాలు! Fight in Delhi metro. Passengers were fighting into the train during the journey. #delhimetro #Metro #Delhi pic.twitter.com/kDUOydRQEY — anuj kumar singh (@sanuj42) June 28, 2023 -
మొక్కుబడిగా ‘స్థానిక’ ధ్రువీకరణ పత్రాలిస్తారా?
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య (ఎంబీబీఎస్, బీడీఎస్) అడ్మిషన్ల భర్తీ కోసం ‘స్థానిక’ధ్రువీకరణ పత్రాల జారీలో తహసీల్దార్ల తీరు ఆక్షేపణీయమని హైకోర్టు వ్యాఖ్యానించింది. స్థానికత ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థి తెలంగాణకు చెందిన వారో.. కాదో విచారణ చేసి సర్టీ ఫికెట్ ఇవ్వాలి తప్ప, మొక్కబడిగా ఇస్తే ఎలాగని ప్రశ్నించింది. ఈ విషయంలో తహసీల్దార్లకు తగిన సూచనలు చేయాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ)కు చెప్పింది. ఇతర రాష్ట్రాల్లో చదివి తిరిగి తెలంగాణకు వచ్చిన విద్యార్థులకు ‘స్థానిక’ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారని, ఇందులో ఫలానా చోట రెండేళ్లుగా నివాసం ఉంటున్నారని మాత్రమే జారీ చేయడంతో వాటిని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఆమోదించడం లేదని పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తెచ్చిన వైద్య విద్య అడ్మిషన్ల నిబంధనల కారణంగా తెలంగాణకు చెందిన వారైనప్పటికీ సీట్లు కోల్పోతున్నారని, తల్లిదండ్రుల ఉద్యోగ, ఇతర కారణాలతో ఒకట్రెండేళ్లు పక్క రాష్ట్రాల్లో చదువుకున్న వారికి స్థానిక కోటా కింద సీటు నిరాకరించడం తగదని ఇటీవల సీజే ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుంటే.. ఎటూ తేల్చని విధంగా ఇస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది చెప్పారు. దీంతో స్థానికతపై స్పష్టత ఇస్తూ సర్టి ఫికెట్లు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. -
హానర్ లవర్స్‌కు గుడ్ న్యూస్: స్మార్ట్ఫోన్లు వచ్చేస్తున్నాయ్!
Honor Comeback: హానర్ బ్రాండ్ స్మార్ట్ఫోన్లు మళ్లీ భారత్ మార్కెట్లోకి రానున్నాయి. చైనా స్మార్ట్ డివైజెస్ సంస్థ హానర్ నుంచి లైసెన్సు పొందిన హానర్‌టెక్ కంపెనీ వీటిని సెపె్టంబర్లో ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఉంది. ఈ వ్యాపారానికి సంబంధించి రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. హానర్‌టెక్ సీఈవో మాధవ్ సేథ్ ఈ విషయాలు వెల్లడించారు. వచ్చే ఏడాది ఆఖరు నాటికి 4-5 శాతం మార్కెట్ వాటాను దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నట్లు, తద్వారా రూ. 10,000 కోట్లు ఆదాయం సాధించే అవకాశాలు ఉన్నట్లు ఆయన వివరించారు. హానర్‌టెక్ పూర్తిగా భారత సంస్థ అని, హానర్ నుంచి తీసుకున్న లైసెన్సుతో ఇక్కడే తయారీ నుంచి అమ్మకాల కార్యకలాపాలు నిర్వహించనున్నామని సేథ్ చెప్పారు. చైనా టెలికం దిగ్గజం హువావే అప్పట్లో హానర్ బ్రాండ్‌ను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత 2020లో మరో చైనా సంస్థకు దాన్ని విక్రయించింది. మరోవైపు, రియల్‌మి అంతర్జాతీయ వ్యాపారానికి సారథ్యం వహిస్తున్న సేథ్ ఇటీవలే దాన్నుంచి తప్పుకున్నారు. వ్యాపారవేత్త సీపీ ఖండేల్వాల్కి చెందిన పీఎస్ఏవీ గ్లోబల్‌తో కలిసి హానర్టెక్ను జాయింట్ వెంచర్‌గా ఏర్పాటు చేశారు. -
దేశీయంగా కీవే బైక్స్ తయారీ: లక్కీ కస్టమర్లకు భారీ ఆఫర్
సూపర్‌బైక్స్ బ్రాండ్ కీవే ఎస్ఆర్ 250, ఎస్ఆర్ 125 మోడళ్ల తయారీని దేశీయంగా ఈ ఏడాది నుంచి చేపట్టనున్నట్టు ఆదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా ప్రకటించింది. ఇటీవలే ప్రీమియం సెగ్మెంట్లో నాన్-రెట్రో మోటార్‌సైకిళ్లను ప్రవేశపెట్టింది కీవే. ఢిల్లీఎక్స్షోరూంలో పరిచయ ఆఫర్ ధర ఎస్ఆర్ 250 రూ.1.49 లక్షలు వద్ద అందుబాటులో ఉంటుంది. రూ.2,000కి బుక్ చేసుకోవచ్చు. ఇక ఎస్ఆర్ 125 రూ.1.19 లక్షలుగా ఉంది. కేవలం 1000కే బుక్ చేసుకోవచ్చు. వినియోగదార్లు దేశవ్యాప్తంగా ఉన్న 55 బెనెల్లి, కీవే షోరూంలు లేదా ఆన్లైన్లో ఈ బైక్స్‌ను కొనుక్కోవచ్చు. కీవే ఎస్ఆర్ 250 తొలి 500 డెలివరీల కోసం ప్రత్యేకంగా ఒక ప్రత్యేక లక్కీ డ్రాను ప్రకటించారు. ఈ లక్కీ డ్రాలో, ఐదుగురు లక్కీ కస్టమర్లు కీవే ఎస్ఆర్ ఎక్స్-షోరూమ్ ధరపై 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను గెలుచుకునే అవకాశం ఉంటుంది. అంతేనా దీనికి అదనంగా , AARI 'My SR My Way' అనే కొత్త ప్లాట్‌ఫారమ్‌ను పరిచయం చేస్తోంది. కీవే ఎస్ఆర్ 125 బెస్ట్ మైలేజీ సామర్థ్యాన్ని కోరుకునే బైక్ లవర్స్‌కు ఇది బెస్ట్ ఆప్షన్. 125 సీసీ 4-స్ట్రోక్ ఎలక్ట్రానిక్ ఫ్యూయల్-ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజన్ ఇందులో అమర్చారు. ఇది గరిష్టంగా 9.7hp శక్తిని 8.2nm గరిష్ట టార్క్ అందిస్తుంది. ఇంకా హాలోజన్ హెడ్‌ల్యాంప్, LCD కలర్ డిస్ప్లే, కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ , డ్యూయల్-పర్పస్ టైర్స్ 1 ఉంది. బ్రేకింగ్ సిస్ఠంలో 300ఎంఎం ఫ్రంట్ డిస్క్, వెనుకవైపు 210ఎంఎ డిస్క్‌ను అందించింది. బైక్‌కు 160ఎంఎ గ్రౌండ్ క్లియరెన్స్‌తో పాటు, అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్ లభిస్తుంది. Wishing a Happy World Motorcycle Day to those who love corners and the open highways.#HappyWorldMotorcycle #Bikers #MotorcycleDay #Passion #Riding #Keeway #India pic.twitter.com/sUPSPE272j — KeewayIndia (@keeway_india) June 20, 2023 -
ఎన్ని ప్లాప్ వచ్చిన టాలీవుడ్ ని వదిలేదే లే ....
-
ఓఎన్‌డీసీలోకి మీషో, ఎందుకో తెలుసా?
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ సంస్థ మీషో తాజాగా ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)లో చేరింది. కొనుగోలుదారులను హైపర్‌లోకల్ విక్రేతలకు అనుసంధానించేందుకు ఇది ఉపయోగపడ గలదని సంస్థ తెలిపింది. తమ పైలట్ ప్రాజెక్టు ముందుగా బెంగళూరులో ప్రారంభమై తర్వాత మిగతా నగరాలకు విస్తరించనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విదిత్ ఆత్రే తెలిపారు. (ఆకట్టుకునేలా స్పోర్టీ లుక్‌లో పల్సర్ పీ 150: ధర ఎంతంటే?) మీషోలో 8 లక్షల మంది పైగా విక్రేతలు ఉన్నారు. విక్రేతలు, వినియోగదారుల వ్యయాల భారాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఓఎన్డీసీని తెరపైకి తెచ్చింది. ఆన్లైన్లో తక్కువ రేట్లకు ఉత్పత్తులు, సర్వీసులను కొనుగోలుదారులు దక్కించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇది ప్రయోగదశలో ఉంది. (Satyam Scam:హెచ్డీఎఫ్సీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు) -
స్థానిక ఉత్పత్తులే కొనండి
అహ్మదాబాద్: భారత్ అన్ని రంగాల్లోనూ స్వయం సమృద్ధి సాధించాలంటే ప్రజలంతా స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 25 ఏళ్ల పాటు ఇలా స్థానిక ఉత్పత్తుల్నే కొంటే దేశంలో నిరుద్యోగ సమస్య తీరిపోతుందన్నారు. ‘‘స్థానిక ఉత్పత్తులకు ఆదరణ పెరిగితే అందరికీ ఉద్యోగావకాశాలు వస్తాయి. అందుకోసమే వోకల్ ఫర్ లోకల్ పథకం తెచ్చాం’’ అని చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ స్వయంసమృద్ధిని సాధనకు కృషి చేస్తున్నందున మనం కూడా అదే బాటన ముందుకెళ్లాలన్నారు. హనుమజ్జయంతి సందర్భంగా గుజరాత్‌లోని మోర్బిలో 108 అడుగుల భారీ విగ్రహాన్ని శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. దేశం నాలుగు దిక్కులా హనుమంతుడి భారీ విగ్రహాలను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన హనుమాన్జీ చార్ధామ్ ప్రాజెక్టులో భాగంగా పశ్చిమాన దీన్ని ఏర్పాటు చేశారు. ఉత్తరాన సిమ్లాలో 2010లో ఇలాంటి విగ్రహాన్నే ఆవిష్కరించారు. దక్షిణాన రామేశ్వరంలో సన్నాహాలు సాగుతున్నాయి. 3 రోజులు గుజరాత్‌కు మోదీ ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో సోమవారం నుంచి మోదీ మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారని పీఎం కార్యాలయం వెల్లడించింది. అల్లర్లపై మాట్లాడరేం? శ్రీరామనవమి సందర్భంగా దేశంలో పలు ప్రాంతాల్లో జరిగిన మత ఘర్షణలపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. విద్వేష ప్రసంగాలు, మతహింస ఘటనలపై ఆయన స్పందించకపోవడం దారుణమంటూ సోనియాగాంధీ (కాంగ్రెస్), శరద్‌పవార్ (ఎన్సీపీ), మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్), ఎంకె స్టాలిన్ (డీఎంకే) సహా 13 విపక్ష పార్టీల అధ్యక్షులు ధ్వజమెత్తారు. శనివారం వారు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మతఘర్షణలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలంతా శాంతి, సహనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని ఖండించకపోతే ఆయన మౌనాన్ని మద్దతుగా తీసుకుని మత విద్వేషకులు మరింత రెచ్చిపోతారన్నారు. ఇలాంటి కుట్రదారులందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
పండుగలప్పుడు ఆంక్షలు పెట్టండి!
న్యూఢిల్లీ: కోవిడ్19 వ్యాప్తిని అడ్డుకోవడానికి వీలుగా రాబోయే పండుగల సందర్భంగా స్థానికంగా ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. మొహర్రం (ఆగస్టు 19), ఓనం (ఆగస్టు 21), జన్మాష్టమి (ఆగస్టు 30), వినాయక చవితి (సెప్టెంబరు 10), దుర్గా పూజ (దసరా నవరాత్రులు, అక్టోబరు 5-15) లకు జనం గుంపులుగా ఒకేచోట చేరకుండా చూడాలని, స్థానికంగా ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో కోరారు. పండుగల సందర్భంగా జనం పెద్దసంఖ్యలో ఒకేచోటికి చేరితే... సూపర్ స్ప్రెడర్గా అవి మారే అవకాశం ఉంటుందని, కోవిడ్ కేసులు పెరిగిపోవచ్చని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం (ఎన్సీడీసీ) ఆందోళన వ్యక్తం చేశాయని తెలిపారు. సెకండ్ వేవ్‌లో కేసుల వ్యాప్తిని అడ్డుకోవడానికి రాష్ట్రాలు చేసిన కృషిని అభినందించారు. -
యూట్యూబ్ వీడియోలు తెగ చూస్తున్నారు
సాక్షి,న్యూఢిల్లీ: యూట్యూబ్‌లో వీడియోల వీక్షణం భారత్‌లో అంతకంతకూ పెరుగుతోంది. వీక్షిస్తున్న సమయం క్రితం ఏడాదితో పోలిస్తే 2020 జూలైలో 45 శాతం పెరిగింది. ఆరు ప్రాంతీయ భాషలలో 2020 రెండవ భాగంలో యూట్యూబ్ ఇండియాలో అత్యధికంగా వీక్షించిన టాప్ 10 వాణిజ్య ప్రకటనల జాబితాలో చోటు దక్కించుకున్నట్లు ఆన్లైన్ వీడియో ప్లాట్‌ఫాం శుక్రవారం తెలిపింది. తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, కన్నడ లాంటి ప్రాంతీయ భాషల్లో కంటెంట్ ఉండడం కూడా ఈ వృద్ధిని నడిపించిన కారణాల్లో ఒకటని యూట్యూబ్ తెలిపింది. అందుబాటు ధరలో స్మార్ట్ఫోన్లు లభించడం, చవక డేటా టారిఫ్‌లతో కొన్నేళ్లుగా వీడియోలు ఎక్కువగా చూస్తున్నారని వివరించింది. మహమ్మారి నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా ఓటీటీల వాడకం మరింతగా పెరిగిందని యూట్యూబ్ తెలిపింది. 2019 సెప్టెంబరులో విడుదలైన గూగుల్-కాంటార్ అధ్యయనం ప్రకారం 93 శాతం మంది ప్రాంతీయ భాషల్లో ఉన్న కంటెంట్‌ను చూసేందుకే మొగ్గు చూపుతున్నారు. యూట్యూబ్‌లో ప్రస్తుతం ఆరు ప్రాంతీయ భాషల్లో ప్రకటనలు వెలువడుతున్నాయి. -
మన నినాదం ‘వోకల్ ఫర్ లోకల్’
జైపూర్/న్యూఢిల్లీ: దీపావళి పండుగ సందర్భంగా స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేసి, దేశీయ వ్యాపారులకు ఊతం ఇచ్చినట్లుగానే స్థానిక ఆర్థిక వ్యవస్థకు మద్దతు కొనసాగించాలని దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వోకల్ ఫర్ లోకల్ (స్థానికానికి మద్దతుగా గళమెత్తాలి) అనే సందేశాన్ని దశదిశలా వ్యాపింపజేయాలని కోరారు. ప్రఖ్యాత జైన మత బోధకుడు విజయ్ వల్లభ్ సురీశ్వర్ 151వ జయంతి సందర్భంగా రాజస్తాన్‌లోని పాలీ పట్టణంలో నెలకొల్పిన ఆయన విగ్రహాన్ని ప్రధాని మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జైన ఆచార్యుడు విజయ్ వల్లభ్ విద్య, మహిళా సాధికారత కోసం ఎంతగానో కృషి చేశారని మోదీ కొనియాడారు. కరోనా మహమ్మారిపై ప్రజల్లో అవగాహన పెంచడంలో మీడియా ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కరోనాపై పోరాటం విషయంలో ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణలో మీడియా ఒక విలువైన భాగస్వామి అని తెలిపారు. సోమవారం నేషనల్ ప్రెస్ డే సందర్భంగా ఆయన లిఖితపూర్వక సందేశం ఇచ్చారు. సానుకూలమైన విమర్శలు లేదా విజయగాధలను ప్రచారం చేయడం ద్వారా మీడియా ప్రజలకు మేలు చేస్తోందన్నారు. -
మెర్సిడెస్ బెంజ్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: మెర్సిడెస్ బెంజ్ తన ఏఎంజీ కార్ల అసెంబ్లింగ్ ప్రక్రియను భారత్‌లో ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. పుణేలోని చకన్ యూనిట్లో అసెంబ్లింగ్‌ను చేపడతామని తెలిపింది. అసెంబ్లింగ్ ద్వారా తయారయ్యే మొదటి ఉత్పత్తి ‘‘ఏఎంజీ జీఎల్సీ 43 కూపె’’ మోడల్ అవుతుందని కంపెనీ పేర్కొంది. ఈ సందర్భంగా మెర్సిడస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సీఈవో మార్టిన్ ష్వెంక్ మాట్లాడుతూ ... భారత మార్కెట్ల పట్ల మెర్సిడస్ బెంజ్‌కు స్పష్టమైన ప్రణాళిక ఉంది. ధీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఏఎంజీ కార్ల అసెంబ్లింగ్ స్థానికంగానే జరగాలనే నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొస్తున్నాము, అర్హత కలిగిన కస్టమర్లకు అందరికీ ఏఎంజీను సులభంగా అందుబాటులోకి ఉంచుతాము, ఇక్కడ అసెంబ్లింగ్ అయ్యే మోడళ్లు మా పోర్ట్‌ఫోలియోలో కీలక పాత్ర పోషిస్తాయని ఆశిస్తున్నాము’’ అన్నారు. -
బాబాకా ధాబాకు క్యూ కట్టిన కస్టమర్లు
-
సోషల్ మీడియానా మజాకా: వైరల్ వీడియో
సాక్షి, న్యూఢిల్లీ: చిన్నపిల్లలనుంచి వృద్ధుల దాకా సోషల్ మీడియా విపరీతమైన ప్రభావాన్ని పడవేస్తోంది. ఆధునిక టెక్నాలజీ యుగంలో సోషల్ మీడియా ప్రపంచ దిశ దశను మారుస్తోంది. రాజకీయాలు నుంచి వంటింటి దాకా సోషల్ మీడియానా మజాకా అనిపిస్తోంది. ఢిల్లీలో చోటు చేసుకున్న ఒక సంఘటన గురించి తెలుసుకుంటే.. సోషల్ మీడియా మీద ఒకింత కోపంగా ఉన్న వారు కూడా ఔరా అనక మానరు. ఢిల్లీలోని మాలవీయనగర్‌లో ఉన్న బాబాకా ధాబా గురించి ట్విటర్లో ఒక వీడియో పోస్ట్ అయింది. కరోనా, లాక్డౌన్ కారణంగా డిమాండ్ లేక షాపు యజమాని కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలో షేర్ చేశారు. దాదాపు 80 ఏళ్ళ వృద్ధాప్యంలో జీవనం కోసం ఆ జంట పడుతున్న ఆరాటాన్ని చూపించారు. అంతేకాదు వీరిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతే క్షణాల్లో ఈ వీడియో వైరల్ గా మారింది. పిల్లల అనాదరణకు గురైన ఈ వృద్ధ దంపతుల పోరాట కథ పలువురి హృదయాలను కదిలించింది. బాలీవుడ్ నటులు సునీల్ శెట్టి, రవీన్ టాండన్, సోనమ్ కపూర్, రవీనా టాండన్, జర్నలిస్టు, నటి స్వర భాస్కర్, క్రికెటర్ ఆర్ అశ్విన్ లాంటి సెలబ్రిటీలతో పలువురు దీన్ని లైక్ చేసి, షేర్ చేశారు. దీంతో నెటిజనుల నుంచి స్పందన భారీగా వచ్చింది. సపోర్ట్ లోకల్ అంటూ స్థానికులు బాబా కా ధాబాకు క్యూ కట్టారు. ఫుడ్ స్టాల్ లో లభ్యమయ్యే భోజనం, చపాతీలకు ఇబ్బడి ముబ్బడిగా ఆర్డర్లు ఇవ్వడం మొదలు పెట్టారు. బాబా చేతి వంట మటర్ పనీర్ ఆసాంతం లొట్టలేసుకుంటూ ఆరగించేశారు. సెల్ఫీలతో సందడి చేశారు. దీంతో సంతోషంతో ఉక్కిరి అయిపోవడం యజమాని వంతైంది. అంతేకాదు మాలవీయ నగర్ బాబాకా ధాబా ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచింది. ఈ వీడియో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతిని కూడా కదిలించింది. బాబా కా ధాబాను తాను సందర్శించానని, వారి జీవితాల్లో సంతోషం కోసం తాను చేయగలిగింది తాను చేస్తానంటూ ట్వీట్ చేశారు. కాగా ఈ వీడియోను బ్లాగర్ గౌరవ్ వాసన్ చిత్రీకరించారు. బాబా కా దాబా ఓనరు పేరు కాంత ప్రసాద్. భార్య పేరు బాదామి దేవి. .@RICHA_LAKHERA .@VasundharaTankh .@sohitmishra99 .@sakshijoshii .@RifatJawaid .@ShonakshiC .@TheDeshBhakt Visited "Baba Ka Dhaba" n hv done d needful to bring SMILE on their faces as promised. Will take care of them n I am starting a drive 2 take care of similarly placed people. pic.twitter.com/S9A94AmJxK — Adv. Somnath Bharti (@attorneybharti) October 8, 2020 -
సూపర్ లోకల్ మొబైల్ యాప్స్.. అదుర్స్!
సాక్షి, సిటీబ్యూరో: మియాపూర్‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్న ప్రవీణ్‌కు క్రికెట్ అంటే మహా ఇష్టం. కానీ తానుండే ప్రదేశంలో తనలా ఆ ఆటపై ఆసక్తి ఉన్న వారెవరో తెలియదు. తన అభిరుచులు, ఇష్టాఇష్టాలకు అనుగుణంగా ఉన్నవారితో స్నేహం చేయడం మైలో యాప్ ద్వారా సాధ్యపడుతుంది. నగరానికి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ సిద్ధం చేసిన ఈ యాప్‌ను పలు గేటెడ్ కమ్యూనిటీల్లో వినియోగిస్తున్నారు. ఈ యాప్ ద్వారా ఇరుగుపొరుగు వారిని మరింత దగ్గర చేయడం, ఇష్టాఇష్టాలు, అభిరుచులు పరస్పరం పంచుకోవడం.. కష్టసుఖాలు షేర్ చేసుకునేందుకు ఈ యాప్ ఓ అవకాశం కల్పిస్తుండటం విశేషం. మైగేట్తో మరో ముందడుగు... గేటెడ్ కమ్యూనిటీల్లో స్థానికుల అవసరాలను తీరుస్తోన్న మరో యాప్ మైగేట్ మొబైల్ యాప్. ఈయాప్ ద్వారా ఆయా నివాస సముదాయాలకు బయటి వ్యక్తులు, మార్కెటింగ్ సిబ్బంది తదితరులు ఎవరు.. ఏఏ సమయాల్లో వచ్చారు..? క్యాబ్ సర్వీసులు ఏ సమయంలో లోనికి వచ్చాయి..? పనిమనిషి ఏ సమయంలో లోనికి ప్రవేశిస్తుంది.. తొలుత ఎవరి ఇంట్లో పనిచేస్తుంది. ఆమె తీరిక వేళలు ఏమిటి.. మీ ఇంటికి వచ్చేందుకు ఆమెకు ఏ సమయంలో వీలవుతుంది..? తదితర వివరాలన్నీ నోటిఫికేషన్స్, అలర్ట్ రూపంలో మొబైల్‌కు అందనుండటం సరికొత్త సమాచారం ఇచ్చినట్లవుతుంది. ఈయాప్‌లు భద్రమైనవేకాక... ఆయా పనులను సులభతరం చేస్తున్నాయని నిపుణులు సైతం చెబుతున్నారు. ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ, చెన్నై తదితర మహా నగరాల్లో సూపర్ లోకల్ మొబైల్ యాప్స్‌ను గేటెడ్ కమ్యూనిటీల్లో నివసిస్తున్న వారు విరివిగా వినియోగిస్తున్నారని.. భాగ్య నగరంలోనూ ఈ ట్రెండ్ ఇటీవలికాలంలో జోరందుకుందని చెబుతున్నారు. యాప్‌ల కాలం.. నెటిజనుల్లానే సిటీజనులు.. ఐటీ, బీపీఓ, కేపీఓ, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న వేతనజీవులు, విద్యార్థులు, వయోధికులు, మహిళలు, చిన్నారులు, రోగులు ఇలా అన్ని వర్గాల వారికీ కోరిన సేవలు ఇంటి ముందుకు తీసుకొచ్చేందుకు మొబైల్ యాప్స్ అందుబాటులోకి వచ్చిన విషయం విదితమే. కోవిడ్ కలకలం నేపథ్యంలో ఆహారం, మెడిసిన్స్, వైద్యసేవలు, వైద్య పరీక్షలు, వివిధ రకాల సేవలు, షాపింగ్ తదితర అవసరాలను తీర్చే యాప్స్ అందుబాటులోకి వచ్చిన తరుణంలో ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన సూపర్ లోకల్ మొబైల్ యాప్స్‌కు విశేష ప్రజాదరణ లభిస్తోంది. -
స్ధానిక సమరం!
-
ఉత్కంఠకు తెర!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలిఘట్టం పూర్తయ్యింది. జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి..జిల్లా పరిషత్ చైర్పర్సన్ పీఠం ఈసారి ఎస్సీ మహిళకు దక్కింది. 2014 జెడ్పీ ఎన్నికల్లో చైర్పర్సన్ స్థానం ఎస్టీ మహిళకు కేటాయించారు. ఈ సారి ఎస్సీ మహిళకు రిజర్వయ్యింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ రిజర్వేషన్ల వివరాల జాబితాను విడుదల చేశారు. జిల్లాలో 34 జెడ్పీటీసీలు, 34 ఎంపీపీలు, 549 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఎంపీపీల్లో ఎస్టీ మహిళలకు 2, ఎస్టీ జనరల్‌కు 2 స్థానాలు కేటాయించారు. ఎస్సీ మహిళలకు 2, ఎస్సీ జనరల్ 2 స్థానాలు, బీసీ మహిళలకు 13, బీసీ జనరల్‌కు 13 స్థానాలు కేటాయించారు. జిల్లాలోని 34 జెడ్పీటీసీ స్థానాలకు ఎస్టీ మహిళలకు 2 స్థానాలు, ఎస్టీ జనరల్‌కు 2 స్థానాలను కేటాయించారు. ఎస్సీ మహిళలకు 2, ఎస్సీ జనరల్ 2 స్థానాలు, బీసీ మహిళలకు 9, బీసీ జనరల్‌కు 9, అన్ రిజర్వుడ్ మహిళలకు 4, అన్ రిజర్వుడ్ జనరల్‌కు 4 స్థానాలు కేటాయించారు. ఎంపీటీసీలకు సంబంధించి 549 స్థానాలకు ఎస్టీ మహిళలకు 37, ఎస్టీ జనరల్‌కు 24, ఎస్సీలకు 35, ఎస్సీ జనరల్‌కు 23, బీసీ మహిళలకు 150, బీసీ జనరల్‌కు 138, అన్ రిజర్వుడ్ మహిళలకు 80, అన్ రిజర్వుడ్ జనరల్‌కు 62 స్థానాలను కేటాయించారు. తుది నిర్ణయం తీసుకోనున్న హైకోర్టు రిజర్వేషన్ల ఖరారుపై ఈ నెల 8న రాష్ట్ర హైకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం 1994 రూల్ నెం.13 ప్రకారం రిజర్వేషన్ల కేటాయింపు జరగడంతో దాదాపుగా ఇవే ఖరారయ్యే అవకాశం ఉంది. రిజర్వేషన్ల ప్రకారం చూస్తే జిల్లాలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యం లభించింది. ఎంపీటీసీలుగా 549 స్థానాలకు 302 స్థానాల్లో మహిళలే పోటీ చేయాల్సి ఉంది. 34 జెడ్పీటీసీ స్థానాల్లో సగం మహిళలకే దక్కాయి. ఎంపీపీల్లోనూ 34 స్థానాల్లో 17 మహిళలకే కేటాయించారు. తాజా రిజర్వేషన్ల ప్రకారం రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా చోట్ల ఆశావహులు పోటీ చేయాలని ఆశగా ఉన్నారు. రిజర్వేషన్ల గెజిట్ విడుదల తర్వాత వారిలో చాలా మంది అవకాశాన్ని కోల్పోయారు. అలాంటి వారిలో కొంత నైరాశ్యం ఏర్పడింది. కానీ ప్రభుత్వం ఏ విధమైన రాజకీయాలకు, పక్షపాతానికి తావు లేకుండా 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను అనుసరించి అధికారుల చేత రిజర్వేషన్లు రూపొందించింది. -
‘స్థానికులకే ఉపాధి కల్పించాలి’
రెబ్బెన : సింగరేణి యాజమాన్యం పులికుంట గ్రామానికి సమీపంలో నూతనంగా నిర్మించిన సీహెచ్‌పీలో పులికుంట గిరిజనులకు, యువకులకు ఉపాధి కల్పించాలని నంబాల ఎంపీటీసీ కొవ్వూరి శ్రీనివాస్, పులికుంట గ్రామస్తులు కోరారు. సోమవారం గోలేటిటౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో వినతిపత్రం అందచేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పులికుంట గ్రామానికి అతి సమీపంలో సీహెచ్‌పీని నిర్మించడం వల్ల దాని నుంచి వెలువడే దుమ్మూ, దూళితో గ్రామం నాషనం కానుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని గిరిజనులంతా వ్యవసాయంపై ఆధారపడి జీవించే ౖరైతులు, కూలీల కుటుంబాలు ఉన్నాయన్నారు. అయినప్పటికీ గ్రామస్తులు సీహెచ్‌పీ నిర్మాణానికి సహకరించారని పేర్కొన్నారు. సీహెచ్‌పీతో తీవ్రంగా ప్రభావానికి గురయ్యే పులికుంటను సింగరేణి యాజమాన్యం పునరావాస గ్రామంగా గుర్తించి గ్రామంలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ కోలావార్ మండల అధ్యక్షుడు మైలారం శ్రీనివాస్, గ్రామపెద్దలు ఎర్గటి పోచయ్య, మారయ్య, భీమేశ్, అశోక్, పోశం తదితరులు పాల్గొన్నారు. -
కుషాయిగూడలో కాల్పుల కలకలం
హైదరాబాద్ : కుషాయిగూడలోని ఈసీ నగర్లో కాల్పులు కలకలం రేగింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ వర్గం వారు, స్థానికంగా ఉన్న ఓ వర్గం వారు ఘర్షణ పడ్డారు. కూరగాయల మార్కెట్ స్థల వ్యవహారంలో ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన వర్గంతో స్థానిక వర్గీయులుతో ఘర్షణకు దిగారు. వివరాలు..ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన గజేందర్ సింగ్ స్థానికంగా వారంతపు సంత నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ వారాంతపు సంత విషయమై హెచ్‌బీ కాలనీకి చెందిన తులసి(41) అనే వ్యక్తితో వాగ్వివాదం జరిగింది. దీంతో ఆవేశం పట్టలేక తన దగ్గర ఉన్న లైసెన్స్‌లేని రివాల్వర్‌తో బెదిరింపులకు గురిచేస్తూ గాలిలోకి కాల్పులు జరిపాడు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. విషయం తెలియగానే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కాల్పులు జరిపిన గజరాజ్ సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రెండు తుపాకీలు స్వాధీనం చేసుకున్నారు. ఇరువర్గాల తోపులాటలో గాయపడిన వారిని 108 వాహనంలో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గజేందర్ కాల్పులు జరుపుతుండగా అడ్డుకుని అరెస్ట్ చేసిన కానిస్టేబుల్ చక్రపాణి రెడ్డిని సీపీ మహేష్ భాగవత్ అభినందించారు. -
సామరస్యంగా పరిష్కరించుకోండి
సాక్షి, హైదరాబాద్ : విద్యుత్ ఉద్యోగుల విభజన విషయంలో తలెత్తిన వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. అలా కుదరని పక్షంలో తామే పూర్తిస్థాయిలో వాదనలు విని నిర్ణయం వెలువరిస్తామని చెప్పి తదుపరి విచారణను డిసెంబర్ 15కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎం.ఎస్.కె. జైశ్వా ల్లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఉద్యోగుల విభజన నిమిత్తం తెలంగాణ విద్యుత్ సంస్థ లు రూపొందించిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ 1,260 మందికి పైగా విద్యుత్ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు.. ఏపీ స్థానికత ఆధారంగా రిలీవ్ చేసిన ఉద్యోగుల జీతభత్యాలను 58:42 నిష్పత్తిలో ఉభయ రాష్ట్రాలు చెల్లించాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ తుది విచారణను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై తుది విచారణ ప్రారంభించిన జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. స్థానికత ఆధారంగా పక్కన పెట్టిన 1,200 మంది ఉద్యోగుల్లో అసలు ఎంతమంది ఏపీకి వెళ్లాలనుకుంటున్నారు.. ఎంతమంది తెలంగాణలో ఉండదలిచారో తెలుసుకోవాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ధర్మాసనం గత విచారణ సమయంలో ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు తెలంగాణ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి ఆప్షన్ల వివరాలను ధర్మాసనం ముందుంచారు. 596 మంది ఏపీకి, 501 మంది తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చారని ఆయన తెలిపారు. 22 మంది ఆప్షన్లు ఇవ్వలేదని, మరో ఐదు మంది ఆప్షన్లు అవసరంలేదని చెప్పారని ఆయన వివరించారు. తరువాత ఏపీ ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది డి.రమేశ్ వాదనలు వినిపిస్తూ, సామరస్యపూర్వక పరిష్కారంపై వైఖరి తెలిపేందుకు తమకు మరో రెండు వారాల గడువు కావాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది. -
15 ఏళ్ల తల్లిదండ్రుల నివాసమే ‘స్థానికత’
► కొత్త నియామకాలకు స్థానికతను పునర్ నిర్వచించాలి ► ఉద్యోగ సంఘాల డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా చేపట్టే నియామకాలకు స్థానికతను పునర్ నిర్వ చించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. 4 నుంచి 10వ తరగతిలో నాలు గేళ్లు ఎక్కడ ఉంటే అక్కడే స్థానికులుగా గుర్తిస్తున్న ప్రస్తుత విధానాన్ని మార్పు చేయాలన్నాయి. 15 ఏళ్ల పాటు తల్లిదండ్రు లు నివాసమున్న ప్రాంతంలోనే స్థానికులు గా గుర్తించాలని పేర్కొన్నాయి. గురువారం తెలంగాణ గెజిటెట్ అధికారుల సంఘం (టీజీవో) కార్యాలయంలో ఉద్యోగ సంఘా ల రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. జోనల్ వ్యవస్థ రద్దు, రాష్ట్ర, జిల్లా కేడర్లపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. టీజీవో చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. కొత్త విధానాన్ని భవిష్యత్తులో చేపట్టే నియామకాల్లోనే వర్తింపజేయాలని.. ఇప్పటికే నియమితులైన ఉద్యోగులకు భవిష్యత్తులో సీనియారిటీ, బదిలీల్లో ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. టీజీవో అధ్యక్షురాలు మమత మాట్లా డుతూ.. యువతకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టా లన్నారు. రాష్ట్ర కేడర్‌లో స్థానిక రిజర్వేషన్ కోటా 85 శాతం, రాష్ట్ర రిజర్వేషన్ కోటా 15 శాతం ఉండాలన్నారు. ప్రస్తుత ఉద్యోగుల కు కొత్త విధానాలు ఎలా వర్తింపజేస్తారని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అ«ధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి ప్రశ్నించారు . వీటిపై రాత్రికిరాత్రే నిర్ణయం తీసుకో కుండా, నిఫుణుల కమిటీ అధ్యయనం చేయించాలన్నారు. గ్రూప్–1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ మాట్లా డుతూ.. గ్రూప్–1లోని జోనల్ పోస్టులను రాష్ట్ర పోస్టులుగా మార్పు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిభగల, వెనుకబడిన వర్గాల వారికి గ్రూప్–1, గ్రూప్–2 పోస్టుల భర్తీకి వార్షిక విధానం ఉండాలన్నారు. సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పద్మాచారి, శివశంకర్, లాలూ ప్రసాద్, చక్రధర్ పాల్గొన్నారు. అధ్యయనానికి గడువివ్వండి రెండంచెల జోన్ల విధానంపై మరింత లోతుగా చర్చించేందుకు సమయం ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం సచివాలయంలో సీఎస్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. ‘మోడల్’టీచర్లకు బకాయిలు విడుదల రాష్ట్రంలోని మోడల్ స్కూల్ టీచర్లకు అన్ని రకాల బకాయిలు విడుదల చేస్తూ పాఠ«శాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీచేసింది. 2013 జూలై 1 నుంచి 2017 మార్చి 31 వరకు రావాల్సిన డీఏ, 2014 జనవరి 1 నుంచి జూన్ 1 వరకు రావాల్సిన ఐఆర్ బకాయిలను మంజూరు చేసింది. 2014 జూన్ 2 నుంచి 2015 ఫిబ్రవరి 28 వరకు రావాల్సిన పీఆర్సీ బకాయిలను 18 భాగాలుగా ఇతర ఉద్యోగులకు ఇచ్చే విధంగానే నెలనెలా వేతంనంతో ఇచ్చేలా ఉత్తర్వులు జారీచేసింది. -
అమెరికా ఇన్పోసిస్‌లో స్థానికులకే ప్రాధాన్యత