‘లోకల్‌’లో హోరాహోరీ.. ‘మెట్రో’తో పోటీ అంటూ.. | Passengers Fight for Seats Mumbai Local Train | Sakshi
Sakshi News home page

Mumbai Local vs Delhi Metro:‘లోకల్‌’లో హోరాహోరీ.. ‘మెట్రో’తో పోటీ..

Published Sun, Sep 3 2023 11:17 AM | Last Updated on Sun, Sep 3 2023 11:17 AM

Passengers Fight for Seats Mumbai Local Train - Sakshi

రద్దీగా ఉన్న ముంబై లోకల్ ట్రైన్‌లో సీటు కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య చోటుచేసుకున్న గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఇద్దరు ప్రయాణికుల మధ్య ఘర్షణ చెలరేగడాన్ని గమనించవచ్చు.

 

ముంబైలోని కిక్కిరిసిన లోకల్ రైళ్లలో పరిమిత సీటింగ్ స్థలం కోసం ప్రయాణికులు పోటీ పడుతుంటారు. అయితే ఈ వీడియోలో ఇద్దరు ప్రయాణికులు కొట్టుకుంటుండగా ఒక ప్రయాణికుడు జోక్యం చేసుకుని వారిద్దరి ఆగ్రహాన్ని చల్లార్చాడు. ఈ వీడియో వైరల్ అయిన నేపధ్యంలో ఇంటర్నెట్‌లో ముంబై లోకల్.. ఢిల్లీ మెట్రో మధ్య పోలికలు మొదలయ్యాయి. ఢిల్లీ మెట్రోలో ఘర్షణలు, ఇబ్బందికర పరిస్థితులకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఢిల్లీ మెట్రోతో ముంబై లోకల్ రైలు పోటీపడుతున్నదంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: పుట్టాడు ఏలియన్‌ లాంటి పిల్లోడు.. చేస్తున్నాడు వింతవింత శబ్ధాలు!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement