నగరంలో క్రికెట్ ట్రైనింగ్‌పై పెరుగుతున్న క్రేజ్
చిన్నతనం నుంచే అకాడమీల్లో చేరుతున్న పిల్లలు
ఒకప్పుడు ఆదివారం వస్తే చాలు ఉదయం చాయ్ తాగి ఇంట్లో నుంచి బయటకు వెళ్తే సాయంత్రం ఆరు గంటల వరకూ కూడా ఇంటికి రాకుండా క్రికెట్ ఆడిన రోజులు పాత తరం యువతకు చాలామందికి అనుభవమే. అలాగే క్రికెట్ చూడాలంటే కనీసం 5 నుంచి 7 కి.మీ. ప్రయాణించి టీవీ చూసి వచ్చిన రోజులూ ఉన్నాయి.. క్రికెట్ అంటే అంత పిచి్చ.. అంత అభిమానం ఉండేది. ఇప్పుడు కూడా ఆ అభిమానం అస్సలు మారలేదు. కానీ రూపు మార్చుకుంది. గల్లీ క్రికెట్ కాస్త పోష్ క్రికెట్ అయ్యింది. అకాడమీల్లో గంటకు కొంత డబ్బులు చెల్లించి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నారు. అంతేనా లోకల్ మ్యాచ్‌ల నుంచి జాతీయ స్థాయి మ్యాచ్‌ల స్థాయికి చేరుతున్నారు.
రోజుకు కనీసం 8 గంటల పాటు ప్రాక్టీస్
మెళకువలతో పాటు ఫిట్‌నెస్‌పై దృష్టి
బౌండరీలు దాటుతున్న లోకల్ టాలెంట్
ఐపీఎల్ వరకూ ఎదిగేందుకు అడుగులు
క్రికెట్.. భారతదేశంలో ఒక మతం. దేశంలో క్రికెట్‌ను ఆరాధించని వారు లేరంటే అతిశయోక్తి కాదు. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు చిన్నా పెద్దా, ఆడా మగ తేడా లేకుండా టీవీలకు అతుక్కుపోతుంటారు. క్రికెట్ ఆడటం అంటే చిన్నప్పటి నుంచే క్రేజ్. గల్లీ క్రికెట్‌లో ఆడుతూ మంచి షాట్ కొడుతూ తమను తామే సచిన్ టెందుల్కర్, విరాట్‌కోహ్లి అనుకుంటూ సంబరపడిపోతుంటారు. అయితే ఒకప్పుడు క్రికెట్ అంటే కేవలం వినోదం కోసం చూడటమో.. ఆడటమో చేస్తుండేవారు. కానీ నేటి తరం క్రికెట్‌ను కూడా తమ కెరీర్‌గా మార్చుకుంటున్నారు.
క్రికెట్ కాస్త ఖరీదైన వ్యవహారమే అయినా.. ఎలాగైనా కష్టపడి రంజీ లేదా ఐపీఎల్ ఆడి తమ సత్తా చూపాలని తాపత్రయపడుతున్నారు. అందుకోసం చిన్నతనం నుంచే గ్రౌండ్‌లో చెమటలు చిందిస్తున్నారు. ఎప్పటికైనా జాతీయ స్థాయిలో ఆడకపోతామా అనే ధీమాతో ముందుకు వెళ్తున్నారు. క్రికెట్‌ను కెరీర్‌గా చేసుకునే వారికి చాలా నిబద్ధతతో శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్లు నగరంలో భారీగా వెలిశాయి. అసలు కోచింగ్ సెంటర్లు పిల్లలను క్రికెటర్లుగా ఎలా మలుస్తున్నాయి.. ఎన్ని గంటల పాటు వారికి శిక్షణ ఇస్తున్నాయి.. ఎలా కష్టపడితే ఐపీఎల్ లేదా జాతీయ స్థాయిలో ఆడేందుకు అవకాశం వస్తుంది.. అనే విషయాలను తెలుసుకుందాం..!
ఏడో యేటనుంచే..
సాధారణంగా క్రికెట్ ఆకాడమీల్లో పిల్లలు ఏడేళ్ల వయసు నుంచే చేరుతుంటారు. అందరూ క్రికెట్‌ను కెరీర్‌గా మలచుకునేందుకు చేరరు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశంతో చిన్నతనంలోనే క్రికెట్ అకాడమీల్లో చేరి్పస్తుంటారు. మిగిలిన వారంతా క్రికెటర్లుగా చూడాలనే ఉద్దేశంతోనే అకాడమీల్లో చేరి్పస్తుంటారు. మొదటి రెండేళ్ల వరకూ టెన్నిస్ బాల్, ప్లాస్టిక్ బాల్‌తో ఆడిస్తారు. 12 ఏళ్లు దాటిన తర్వాత లెదర్ బాల్‌తో నెట్స్‌లో ఆడిస్తుంటారు. ఈ సమయంలోనే బ్యాచ్‌లుగా వేరు చేసి, వారి ఆట తీరునుబట్టి తరీ్ఫదు ఇస్తుంటారు.
కష్టపడితే ఎన్నో అవకాశాలు..
క్రికెట్‌లో రాణించడం ఒకప్పుడు డబ్బులపైనే ఆధారపడి ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. కష్టపడి మంచి ఆటతీరు కనబరిస్తే ఎంతో ఎత్తుకు వెళ్లే అవకాశాలు ఉంటాయని పలువురు కోచ్‌లు చెబుతున్నారు. టాలెంట్ ఉన్న వారికి అవకాశాలు ఎదురుచూస్తూనే ఉంటాయని, ఎట్టిపరిస్థితుల్లో కుంగిపోకుండా ముందుకు వెళ్లాలని చెబుతున్నారు.
ఒక్కో రోజు ఒక్కో సెషన్..
సాధారణంగా క్రికెట్ ఆడాలంటే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని అంశాల్లో ప్రత్యేకంగా శిక్షణ పొందాల్సి ఉంటుంది. రోజుకో అంశంలో పిల్లలకు కోచ్ శిక్షణ ఇస్తుంటారు. ఒక రోజు బ్యాటింగ్ అయితే మరో రోజు బౌలింగ్, ఇంకో రోజు నాకింగ్, ఫీల్డింగ్‌లో ప్రాక్టీస్ చేయిస్తుంటారు. క్యాచ్‌లు పట్టే విధానంలో కూడా మెళకువలు నేరి్పస్తుంటారు. దీంతో పాటు క్రికెట్ ఫిట్‌నెస్ కూడా ముఖ్యం. ఇందులో భాగంగా జంపింగ్స్, ఫాస్ట్ రన్నింగ్, డ్రిల్స్ చేయిస్తుంటారు.
అకాడమీ ఎంచుకునే ముందు..
చాలా అకాడమీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఈ ట్రెండ్‌ను క్యాష్ చేసుకునేందుకు కొందరు ప్రయతి్నస్తున్నారు. ఇలాంటి వారి వద్ద చేరితే సమయంతో పాటు డబ్బు కూడా వృథా అవుతుంది. కమర్షియల్‌గా, బాక్స్ క్రికెట్ మాదిరిగా ఉండే అకాడమీలు కూడా ఉన్నాయి. అందుకే అకాడమీల్లో చేరేముందు అది ఎలాంటి అకాడమీ.. వాళ్లు ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు.. ఎంత సమయం ప్రాక్టీస్ చేయిస్తారు అనే విషయాలు ముందే చూసుకుని చేరి్పస్తే మంచిదని పలువురు శిక్షకులు సూచిస్తున్నారు.
భారత్ తరపున ఆడించాలనే లక్ష్యంతో..
ప్రతి అకాడమీ కూడా తమ పిల్లలను భారత జట్టులో చూసుకోవాలన్నదే లక్ష్యంగా పెట్టుకుంటాయి. అందుకోసం వారు మెళకువలు నేర్చుకోవడంతో పాటు వాటిని పిల్లలకు నేరి్పస్తుంటారు. ప్రతి వారం మ్యాచ్‌లు పెట్టి వారి ఆటతీరును పరిశీలిస్తుంటారు. సీజనల్ మ్యాచ్‌లు అంటే జూన్–జులైలో జరిగే వన్ డే, టూడే, త్రీడే లీగ్ మ్యాచ్‌లకు కూడా వెళ్లి పాల్గొంటారు. హెచ్‌సీఏ నుంచి జరిగే లీగ్ మ్యాచ్‌లలో బాగా ఆడితే అండర్–14, –16, –19 స్టేట్ టీమ్స్‌కు ఆడే అవకాశం వస్తుంది. అక్కడ ఎవరైనా మంచి పెర్ఫార్మెన్స్ చేస్తే రంజీ ఆడే అవకాశం ఉంటుంది.
రోజుకు ఎనిమిది గంటల ప్రాక్టీస్
క్రికెట్ అకాడమీల్లో చాలావరకూ ఉదయం 5– 5.30 గంటల నుంచే దినచర్య ప్రారంభం అవుతుంది. రెండు గంటల పాటు ప్రాక్టీస్ చేస్తుంటారు. ఆ తర్వాత కాసేపు బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత మళ్లీ ప్రాక్టీస్ చేస్తుంటారు. మళ్లీ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ రాత్రి 7 గంటల వరకూ ప్రాక్టీస్ చేస్తుంటారు. బౌలింగ్ మెషీన్స్, నెట్ సెషన్స్, సైడ్ ఆర్మ్ ప్రాక్టీస్ చేస్తుంటారు. వీరి వెన్నంటే ఉండే కోచ్‌లు ఎప్పటికప్పుడు వారికి ఆటలో తప్పులు అర్థం చేసుకుని ఆటగాళ్లు ఆడే విధానంలో మార్పులు చేస్తుంటారు. ఎక్కడైనా టోర్నమెంట్స్‌కు వెళ్లినప్పుడు వేరే అకాడమీ లేదా వేరే జట్టు ఆటగాళ్లు ఆడే తీరును కూడా పరిశీలించి.. తమ అకాడమీ పిల్లల ఆటలో ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుందనే విషయాలను వారికి చెబుతుంటారు. ఇలా రోజులో కనీసం 8 నుంచి 9 గంటల పాటు గ్రౌండ్‌లోనే ప్రాక్టీస్ చేస్తూ ఎప్పటికప్పుడు తమ ఆటతీరును అప్‌డేట్ చేసుకుంటారు.
క్వాలిఫైడ్ ట్రైనర్స్‌తో..
క్రికెట్ కోసం చాలా మంది అకాడమీకి వస్తుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ శిక్షణ ఇస్తుంటాం. దాదాపు 15 మంది మా అకాడమీ నుంచి రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ అయ్యారు. వారికి ఎప్పటికప్పుడు ఆటలో మెళకువలు నేర్పించేందుకు క్వాలిఫైడ్ ట్రైనర్స్ ఉంటారు. మానసికంగా కూడా వారికి కావాల్సిన మద్దతు ఇస్తుంటాం.
– కల్యాణ్, క్రికెట్ కోచ్, కూకట్‌పల్లి
ఆసక్తి చూపుతున్న అమ్మాయిలు..
ఇటీవల కాలంలో అమ్మాయిలు కూడా క్రికెట్‌పై ఎంతో ఆసక్తి చూపుతున్నారు. వారికి కూడా అబ్బాయిలతో పాటు సమానంగా అకాడమీ నుంచి శిక్షణ ఇస్తుంటాం. కావ్యశ్రీ అనే అమ్మాయి ఇటీవల సీనియర్ వుమెన్స్ రంజీ ట్రోఫీలో ఆడుతున్నారు. ఆమెతో పాటు మరో నలుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు స్టేట్ లెవల్ టీమ్స్‌లో ఆడే అవకాశం దక్కించుకున్నారు. వారిలో ఒకరినైనా ఇండియా జట్టులో చూడాలనేదే మా ఆశ.
– తలకంటి సతీశ్‌రెడ్డి, ఎంఎస్‌డీ క్రికెట్ అకాడమీ, మేడిపల్లి
Comments
Please login to add a commentAdd a comment