మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ 3 కోసం రిలయన్స్‌ఫౌండేన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ యాజమాన్యలోని ముంబై ఇండియన్స్ పటిష్టమైన టీంను సిద్ధం చసింది. WPL 2025 ఆదివారం బెంగుళూరులో జరిగిన వేలంలో కొత్తగా నలుగురు మహిళా క్రికెటర్లను జట్టులో చేర్చుకుంది. దీనిపై నీతా అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. తమ ముంబై ఇండియన్స్ మహిళా జట్టులో యువతకు ప్రాధాన్యత ఇచ్చి, వారిలోని ప్రతిభను గుర్తించి, తద్వారా టీం పటిష్టతకు ప్రయత్నిస్తోందని నీతా తెలిపారు.
నీతా అంబానీ కొత్తగా ఎంపికైన టీంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పురుషుల జట్టులో ఆటగాళ్లు బుమ్రా, హార్తిక్, తిలక్ ప్రపంచ వేదికపై ప్రతిభతో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందన్నారు. అలాగే గతేడాది వేలంలో తీసుకున్న సజనకూడా అద్భుతంగా ఆడిందంటూ ప్రశంసించారు నీతా.
ముంబై ఇండియన్స కుటుంబంలో భాగమైన అమ్మాయిలందరి గురించి తాను గర్వపడుతున్నానని వ్యాఖానించారు. కొత్తగా టీంలో చేరిన తమిళనాడుకు చెందిన 16 ఏళ్ల వికెట్ కీపర్ జి. కమలిని, ఆల్ రౌండర్లు సంస్కృతి గుప్తా, అక్షితా మహేశ్వరి, దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ నాడిన్ డి క్లర్క్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు.
“Grooming young talent, and watching them play at the global stage feels wonderful.”
Mrs. Nita Ambani encourages new talent joining the 𝗙𝗔𝕄𝕀𝗟𝗬 at the #TATAWPLAuction! 💙#OneFamily #AaliRe #MumbaiIndians pic.twitter.com/VySfK4B6W6— Mumbai Indians (@mipaltan) December 15, 2024
Comments
Please login to add a commentAdd a comment