ఇక చకచక ధ్రువీకరణ పత్రాలు
Published Thu, Mar 23 2017 2:09 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM
ఏలూరు సిటీ : విద్యార్థులకు అవసరమైన కుల, నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు రెవెన్యూ శాఖ అధికారుల ద్వారా అందించేందుకు చర్యలు తీసుకున్నట్టు జేసీ పి.కోటేశ్వరరావు తెలిపారు. భూ పరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఎ) అనిల్ చంద్రపునీత బుధవారం విజయవాడ నుంచి జాయింట్ కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పునీత మాట్లాడుతూ ఏప్రిల్ 15లోగా విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందించాలి్సందిగా సూచించగా జేసీ ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. విద్యార్థుల చెంతకే మీ సేవ కేంద్రాలను తరలించి అవసరమైన ధ్రువీకరణ పత్రాలను అక్కడికక్కడే జారీ చేసే ప్రక్రియ పటిష్టవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌వో కే.హైమావతి, సూపరింటెండెంట్ సూర్యనారాయణ పాల్గొన్నారు.
Advertisement