తెలంగాణ వారికే విద్యుత్ పోస్టులు! | electricity posts for telanagana peoples | Sakshi
Sakshi News home page

తెలంగాణ వారికే విద్యుత్ పోస్టులు!

Published Tue, Sep 1 2015 2:17 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

electricity posts for telanagana peoples

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర జెన్‌కో పరిధిలో జరిగే నియామకాల్లో తెలంగాణ వారికే అవకాశం కల్పించనున్నారు. ఓపెన్ కేటగిరీలో పోటీ చేసే వారు కూడా తెలంగాణావాసులై ఉండాలి. ఈ మేరకు ఏపీ విద్యుత్ బోర్డు నియామక మార్గదర్శకాలను సవరిస్తూ జెన్‌కో సీఎం ప్రభాకర్‌రావు కొత్త మార్గదర్శకాలు జారీచేశారు. అసిస్టెంట్ ఇంజనీర్, కెమిస్ట్‌ల భర్తీలో 60:40 నిష్పత్తిలో, సబ్ ఇంజనీర్‌ల నియామకాల్లో 70:30 నిష్పత్తిలో లోకల్, ఓపెన్ రిజర్వేషన్లు అమలు కానున్నాయి.

జెన్‌కో పరిధిలోని విద్యుత్ కేంద్రాల ఆధారంగా రాష్ట్రాన్ని రెండు జోన్లుగా విభజించారు. ఉత్తర తెలంగాణ పరిధిలోని 4 జిల్లాలతో జోన్-1ను, దక్షిణ తెలంగాణలోని 6 జిల్లాలతో జోన్-2ను ఏర్పాటు చేశారు. ఆయా జోన్లలోని కేంద్రాల్లో ఖాళీల భర్తీకి స్థానిక అభ్యర్థులకు లోకల్ రిజర్వేషన్ కల్పిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement