Open Category
-
తెలంగాణ యువ గ్రాండ్ మాస్టర్ ఇరిగేశి అర్జున్ జైత్రయాత్ర
అల్మాటీ (కజకిస్తాన్): తెలంగాణ యువ గ్రాండ్ మాస్టర్ ఇరిగేశి అర్జున్ ‘ఫిడే’ ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో వరుస విజయాలతో సత్తా చాటుకున్నాడు. ఓపెన్ కేటగిరీలో అతను ప్రపంచ నంబర్‌వన్, చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో కలిసి ఉమ్మడిగా ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. వీళ్లిద్దరు మొదటి నాలుగు గేముల్లో వారి ప్రత్యర్థులపై విజయం సాధించారు. ఐదో గేమ్‌లో కార్ల్సన్తో తలపడిన అర్జున్ 44 ఎత్తుల్లో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. 38వ సీడ్‌గా బరిలోకి దిగిన అర్జున్, టాప్‌సీడ్ కార్ల్సన్ 4.5 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి ఉమ్మడిగా ఆధిక్యంలో ఉన్నారు. మొదటి నాలుగు గేముల్లో అర్జున్... సరాసి డెరిమ్ (కొసొవో), రౌనక్ (భారత్), వహప్ సనల్ (టర్కీ), రిచర్డ్ రపొర్ట్ (రొమేనియా)పై గెలుపొందాడు. సీనియర్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ (2.5) రెండో రౌండ్లో ఫ్రెడెరిక్ (జర్మనీ)పై గెలిచి, మిగతా మూడు రౌండ్లలోనూ డ్రాలతోనే సరిపెట్టుకున్నాడు. మహిళల ఈవెంట్లో సీనియర్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి (3.5) నాలుగు రౌండ్లలో మూడు విజయాలు సాధించింది. ఏడో సీడ్ హంపి ఎన్క్తూల్ అల్తాన్ (మంగోలియా), మరియమ్ (ఆర్మేనియా), గోంగ్ క్విన్యున్ (సింగపూర్)పై గెలుపొందింది. మరో నలుగురితో కలిసి ఆమె సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. ఆరోసీడ్ ద్రోణవల్లి హారిక (2.5)తొలి గేమ్‌లో గెలిచి తర్వాతి మూడు గేముల్లోనూ డ్రా చేసుకుంది. -
వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మెడిసిస్ చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల నిబంధనలను సవరిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, వెయ్యికిపైగా ఎంబీబీఎస్ బీ-కేటగిరి సీట్లు తెలంగాణ విద్యార్థులకే ఇచ్చేలా సవరణలు చేశారు. ఎంబీబీఎస్ బీ-కేటగిరి సీట్లలో 85శాతం లోకల్ రిజర్వేషన్ల(తెలంగాణకు చెందినవారికే) కింద ఉండేలా మార్పులు చేశారు. ఇకపై కేవలం 15 శాతం మాత్రమే ఓపెన్ కోటా కింద సీట్లు ఇవ్వనున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి హారీష్ రావు స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం జీవో నెంబర్ 129, 130 లను ప్రభుత్వం విడుదల చేసింది. కాగా, ప్రభుత్వ నిర్ణయంతో మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్-బీ కేటగిరీ సీట్లలో కేటాయించే 35శాతం సీట్లలో 85శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి. దీంతో, రాష్ట్రంలోని మొత్తం 24 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 1,068 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా తెలంగాణ విద్యార్థులకే లభించనున్నాయి. -
‘ఓపెన్’లో ఖాళీలు తగ్గవా?
న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనకబడ్డ వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) విద్యా సంస్థలు, ప్రభుత్వోద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు బుధవారం పలు ప్రశ్నలు సంధించింది. ఈ కోటా వల్ల ఓపెన్ కేటగిరీలో అందుబాటులో ఉండే సీట్లు, ఖాళీలు 40 శాతానికి తగ్గిపోతాయన్న వాదనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, న్యాయమూర్తులు జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ బేలా ఎం.త్రివేదీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ప్రస్తావించింది. ఓపెన్ కేటగిరీలోని 50 శాతం ఖాళీలను తగ్గించడానికి వీల్లేదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన గత తీర్పులను గుర్తు చేసింది. ‘‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల్లోని పేదలను కులం ప్రాతిపదికన ఈడబ్ల్యూఎస్ కోటా నుంచి నహాయించడం వాస్తవమేనా? ఈ కోటా వల్ల ఓబీసీల్లోని క్రీమీ లేయర్‌కు అందుబాటులో ఉండే ఖాళీలు కూడా 40 శాతానికి తగ్గుతాయన్నది నిజమేనా? మెరిట్ ఉన్న వారందరికీ ఓపెన్ కేటగిరీలో పోటీపడేందుకు అవకాశం ఉండాలి కదా’’ అంటూ ప్రశ్నించింది. ఓపెన్ కేటగిరీ ఖాళీలకు ఏ విధంగానూ కోత పడని రీతిలోనే ఈడబ్ల్యూఎస్ కోటాను రూపొందించినట్టు కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు నివేదించారు. ఓపెన్, రిజర్వుడు కేటగిరీలు ప్రత్యేకమైన విభాగాలు. ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు 50 శాతం రిజర్వుడు కేటగిరీలో తగిన ప్రాతినిధ్యం దక్కిందని వేణుగోపాల్ వివరించారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా ఈడబ్ల్యూఎస్ వర్గానికి కూడా ఎన్నికల్లో కొన్ని స్థానాలు రిజర్వు చేయగలరా అని ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ గురువారం కూడా కొనసాగనుంది. ఇక ప్రత్యక్ష ప్రసారాలు సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కీలక కేసుల విచారణ ప్రక్రియ ఇకపై ప్రత్యక్షప్రసారం కానుంది. తొలుత రాజ్యాంగ ధర్మాసనాల విచారణలు 27వ తేదీ నుంచి ప్రసారం కానున్నాయి. ప్రస్తుతానికి యూట్యూబ్ ద్వారా ప్రసారాలు ఉంటాయని సమాచారం. త్వరలో సుప్రీంకోర్టు సొంత ప్లాట్‌ఫామ్‌ను రూపొందిస్తుందని కోర్టు వర్గాలు తెలిపాయి. గుజరాత్, ఒడిశా, కర్ణాటక, జార్ఖండ్, పట్నా, మధ్యప్రదేశ్ హైకోర్టులు ఇప్పటికే తమ యూట్యూబ్ ఛానళ్ల ద్వారా విచారణలు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. -
తెలంగాణ వారికే విద్యుత్ పోస్టులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర జెన్కో పరిధిలో జరిగే నియామకాల్లో తెలంగాణ వారికే అవకాశం కల్పించనున్నారు. ఓపెన్ కేటగిరీలో పోటీ చేసే వారు కూడా తెలంగాణావాసులై ఉండాలి. ఈ మేరకు ఏపీ విద్యుత్ బోర్డు నియామక మార్గదర్శకాలను సవరిస్తూ జెన్కో సీఎం ప్రభాకర్‌రావు కొత్త మార్గదర్శకాలు జారీచేశారు. అసిస్టెంట్ ఇంజనీర్, కెమిస్ట్‌ల భర్తీలో 60:40 నిష్పత్తిలో, సబ్ ఇంజనీర్ల నియామకాల్లో 70:30 నిష్పత్తిలో లోకల్, ఓపెన్ రిజర్వేషన్లు అమలు కానున్నాయి. జెన్కో పరిధిలోని విద్యుత్ కేంద్రాల ఆధారంగా రాష్ట్రాన్ని రెండు జోన్లుగా విభజించారు. ఉత్తర తెలంగాణ పరిధిలోని 4 జిల్లాలతో జోన్-1ను, దక్షిణ తెలంగాణలోని 6 జిల్లాలతో జోన్-2ను ఏర్పాటు చేశారు. ఆయా జోన్లలోని కేంద్రాల్లో ఖాళీల భర్తీకి స్థానిక అభ్యర్థులకు లోకల్ రిజర్వేషన్ కల్పిస్తారు. -
మేయర్ కిరీటం ఎవరికో..
పింప్రి, న్యూస్‌లైన్: నిబంధనల ప్రకారం పుణే నగర మేయర్ పదవి రెండున్నర సంవత్సరాల తర్వాత తిరిగి సాధారణ విభాగానికి (ఓపెన్ కేటగిరి) మారడంతో పైరవీలు, సిఫార్సులకు తెరలేచింది. అన్ని కులాల కార్పొరేటర్లు ఈ పదవి కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పుణే కార్పొరేషన్లో ప్రస్తుత కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి అధికారంలో ఉంది. ఎన్సీపీ సంఖ్యాబలం ఎక్కువ కాబట్టి ఈ పార్టీ కార్పొరేటర్లంతా మేయర్ పదవి కోసం పైరవీలు మొదలుపెట్టారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో మేయర్ అభ్యర్థి ఎంపిక ఎన్సీపీ కత్తి మీద సాములా మారింది. ప్రస్తుతం కార్పొరేషన్లో అధికారం కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి చేతిలో ఉంది. వచ్చే నెల 15వ తేదీలోపు మేయర్ పదవికి ఎన్నికలు జరగాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ఇవి జరుగుతుండడంతో ఈ ఎన్నికలకు ప్రాధాన్యం మరింత పెరిగింది. దీనికితోడు ఏ కులం/వర్గం నుంచి మేయర్ అభ్యర్థిని ఎంపిక చేయాలనే విషయంలో నిర్ణయం తీసుకోవడం అంత సులువు కాదని ఎన్సీపీ సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు. ఎన్సీపీ కార్పొరేటర్లు దిలీప్ బరోటే, దత్తా ధనకవడే, బాబూరావు చాండేరే, బాలా సాహెబ్ బోడకే, వికాస్ దాంగట్, విశాల్ తాంబే, చేతన్ తూపే, ప్రశాంత్ జగతాప్తోపాటు మరికొందరు అటు మేయర్ ఇటు ఎమ్మెల్యే టికెట్లకు పోటీపడుతున్నారు. మేయర్ పదవి దక్కనివారంతా అసెంబ్లీ అభ్యర్థిత్యానికి పోటీపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత లోక్‌సభ ఎన్నికలలో పార్టీ టికెట్టు ఇవ్వకపోవడంతో కొందరు ఎన్సీపీ నాయకులు వేరే పార్టీల్లో చేరారు. ఈసారి కూడా ఇలాగే జరిగితే పార్టీకి తీవ్రనష్టం జరుగుతుందని ఎన్సీపీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో రిజర్వేషన్ల ఉద్యమాలు తీవ్రరూపం దాల్చాయి. ఎన్సీపీ మరాఠా రిజర్వేషన్లకు అనుకూలమనే ముద్ర పడింది. దీంతో పలు కులాలు ఈ పార్టీపై కన్నెరజేస్తున్నాయి. ధన్‌గార్, వడార్ కులస్తులు తమను ఎస్టీలుగా గుర్తించాలంటూ రోడ్లెక్కారు. దీనిపై స్పందించిన ఎన్సీపీ అధిపతి పవార్ తాము కూడా ధన్గార్ల రిజర్వేషన్లకు అనుకూలమేనని ప్రకటన చేయాల్సి వచ్చింది. ఇటువంటి సంకటస్థితిలో నగర మేయర్ పదవి జనరల్ కేటగిరికి కేటాయించారు. సభాపక్ష నాయకుడు సుభాష్ జగతాప్ను మేయర్‌గా ఎన్నుకున్నా ఆశ్శర్యపడవలసిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా తాము ఏ ఒక్క కులానికీ కొమ్ముకాయటం లేదని చెప్పుకోవడం సాధ్యమవుతుందని ఎన్సీపీ భావిస్తోంది. అంతేగాక దళిత ఓటర్లను దగ్గర చేసుకోవడానికి ఈ వ్యూహాన్ని అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్పొరేషన్లో పార్టీల వారీగా బలాబలాలు ఎన్సీపీకి 56 మంది, కాంగ్రెస్-29, ఎమ్మెన్నెస్-28, బీజేపీ-26, శివసేన-15 మంది చొప్పున సభ్యులు ఉన్నారు. ఇప్పటి వరకు ఎన్సీపీ నుంచి మేయర్లుగా పనిచేసిన వారు రాజలక్ష్మీ భోసులే, మోహన్ సింగ్ రాజ్‌పాల్, వైశాలీ బన్కర్ ఉండగా, ప్రస్తుతం చంచలా కోడ్రే కొనసాగుతున్నారు. -
స్థానికేతర ఉద్యోగులు 1300 పైనే!
- ఇప్పటికే 350 మంది సీమాంధ్రుల గుర్తింపు - సింగరేణి అధికారుల్లో 90శాతం మంది వారే.. - పోలీస్, విద్య, యూనివర్సిటీలో సింహభాగం - వివరాలు సేకరిస్తున్న టీఎన్జీవోలు - బోగస్ సర్టిఫికెట్లపైనా నజర్ తెలంగాణ ఆవిర్భావ దినం సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో ‘లోకల్’ లొల్లి మొదలైంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ ప్రాంత ఉద్యోగులే జిల్లాలో పనిచేసే దిశగా సన్నాహాలు ముమ్మరమయ్యాయి. రాష్ట్ర సచివాలయంలో పనిచేస్తున్న తెలంగాణేతర ఉద్యోగులను సీమాంధ్రకు పంపించాలని నిర్ణయించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ మేరకు చర్యలు ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా జిల్లాలోనూ వివిధ ప్రభుత్వ శాఖల్లో 1300కు పైగా మంది సీమాంధ్ర ఉద్యోగులు పనిచేస్తున్నట్టు తెలంగాణ ఉద్యోగ సంఘాలు ప్రాథమికంగా అంచనా వేశాయి. ఈ మేరకు సంబంధిత ఉద్యోగుల వివరాలు సేకరించడంలో నిమగ్నమయ్యాయి. సాక్షి, కరీంనగర్ : ఈ నెల 24న కరీంనగర్ వచ్చిన టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్.. జిల్లాలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులను గుర్తించి టీఆర్ఎస్ వార్‌రూమ్, టీఎన్జీవో గ్రీవెన్స్‌సెల్‌కు సమాచారం ఇవ్వాలని ఉద్యోగ సంఘాలకు సూచించారు. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరిగే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. నాలుగో తరగతి నుం చి పదో తరగతి వరకు తెలంగాణలో విద్యాభ్యాసం చేసిన సీమాంధ్రులకు స్థానిక రిజర్వేషన్ వర్తిస్తుంది. వారికి మాత్రమే స్థానికేతర సమస్య నుంచి మినహాయింపు ఉంది. వివరాల సేకరణలో నిమగ్నం జిల్లాలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులను గుర్తించడంలో టీఎన్జీవోలు నిమగ్నమయ్యారు. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్సైట్ రూపొందించారు. జిల్లాలో 72 ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. వీటిలో ఉన్న త, ప్రాథమిక విద్య, పోలీసుశాఖలు మినహాయించి ఇప్పటివరకు 27 శాఖల నుంచి సమాచారం సేకరిం చారు. 350 మంది సీమాంధ్రులు జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నట్లు గుర్తించారు. ఇంకా 45 శాఖల నుంచి సమాచారం రావాల్సి ఉంది. ఒక్క సీమాంధ్ర ఉద్యోగిని వదలకుండా అందరి సమాచారం సేకరించాలని టీ ఎన్జీవో జిల్లాశాఖ అన్ని శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న తెలంగాణ ఉద్యోగులకు సూచించింది. ఆ మూడు శాఖల్లో ఎక్కువ పోలీస్, విద్య, యూనివర్సిటీ లో సింహభాగం మంది సీమాంధ్ర ఉద్యోగులున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 14,400 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో నాలుగు వందలకు పైగా సీమాంధ్రులున్నారు. డీఎస్సీల్లో 80 శాతం రిజర్వేషన్, 20 శాతం ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది. 1994 డీఎస్సీ నుంచి 2000 డీఎస్సీ వరకు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 70 శాతం రిజర్వేషన్, 30 శాతం ఓపెన్ కేటగిరీల్లో ఉద్యోగాలి చ్చారు. దీంతో అదనపు కోటా కింద జిల్లాలో 130 మంది ఉపాధ్యాయులు ఉద్యోగాలు పొందారు. వీరందరు గుంటూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచే ఉన్నారు. 2000 మేలో టీడీపీ అధినేత చంద్రబాబు సచివాలయ బదిలీలకు తెరలేపారు. అక్రమ బదిలీలతో 40 మంది కి పైగా ఉపాధ్యాయులు జిల్లాలో వివిధ పాఠశాలల్లో తిష్టవేశారు. వీరితోపాటు ఓపెన్ కేటగిరీ లో ఉద్యోగాలు సాధించిన వారందరూ జిల్లా నుంచి వెళ్లిపోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో 31 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. పోలీసు, యూనివర్సిటీలో వందలాది మంది సీమాంధ్రులున్నారు. వీరందరి వివరాలు సేకరిస్తే.. వందలాది పోస్టులు ఖాళీ అవుతాయని ఉద్యోగసంఘాలు పేర్కొంటున్నాయి. సింగరేణి సంస్థలో సీమాంధ్రుల ఆధిపత్యం కొనసాగుతోంది. క్లరికల్, ఇంజినీరింగ్, ఇతర ఉన్నత స్థానాల్లో 90 శాతం అధికారులు సీమాంధ్రకు చెందిన వారే ఉన్నారు. ఆదినుంచి తెలంగాణ వాసులు కింది స్థాయి ఉద్యోగాలకే పరిమితమయ్యారు. జిల్లాలో ఈ ఒక్క సంస్థలోనే సుమారు 320 మంది స్థానికేతరులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నట్టు కార్మిక సంఘాలు వెల్లడిస్తున్నాయి. ఆర్టీసీలోనూ సీమాంధ్రు ఉద్యోగుల సంఖ్య ఎక్కువగానే ఉంది. నాలుగో రోజుల్లో పూర్తి సమాచారం - ఎంఏ.హమీద్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు జిల్లాలోని సీమాంధ్ర ఉద్యోగుల వివరాలు సేకరిస్తున్నాం. నాలుగు రోజుల్లో స్థానికేతర ఉద్యోగుల గుర్తిం పు పూర్తవుతుంది. ఇప్పటివరకు 350 మందిని గుర్తిం చాం. జిల్లాలో మొత్తం 1300 మందికి పైగా ఉంటార ని ప్రాథమిక సమాచారం. సింగరేణి, ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థలు కావడం, ప్రత్యేక పాలసీలు ఉండటంతో ప్రభుత్వంతో చర్చించాల్సిన అవసరముంది. -
చెరకు రైతులకు నిరాశే..
చోడవరం, న్యూస్‌లైన్: సీఎం పర్యటనపై కొండంత ఆశ పెట్టుకున్న చెరకు రైతుకు నిరాశే మిగిలింది. సభలో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే రాజు, డీసీసీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ, గోవాడ సుగర్స్ చైర్మన్ గూనూరు మల్లునాయుడు తమ ప్రసంగాల్లో గోవాడ సుగర్ ఫ్యాక్టరీ, రైతుల ప్రోత్సాహకం గురించే ఎక్కువగా మాట్లాడారు. చెరకు రైతులను ఆదుకోవాలని కోరారు. ఫ్యాక్టరీ కో-జనరేషన్ నుంచి వచ్చే విద్యుత్ అమ్మకంలో తక్కువ ఆదాయం వస్తోందని ప్రైవేటు సంస్థకు అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలన్నారు. గతేడాది రోలుగుంట సమావేశంలో వారం రోజుల్లో మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పి వెళ్లిపోయిన ముఖ్యమంత్రి ఈ ఏడాది క్రషింగ్ సీజన్‌కు ముందు ఇక్కడికి రావడంతో ఏదో ప్రకటిస్తారని అంతా ఆశగా ఎదురుచూశారు. అయినా సీఎం మాత్రం తన ప్రసంగంలో ఎక్కడా చెరకు రైతుల గురించి ప్రస్తావించలేదు. జిల్లాలోని నాలుగు ఫ్యాక్టరీల పరిధిలో 50వేల మంది సభ్యరైతులకు సంబంధించిన సమస్యను కనీసం పట్టించుకోకపోవడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. జిల్లాకు వరాల జల్లు చోడవరం రచ్చబండ కార్యక్రమంలో సీఎం13,500 లబ్ధిదారులకు వివిధ ప్రభుత్వ పథకాలను పంపిణీ చేశారు. పాయకరావుపేటలో ఎస్సీ హాస్టల్ రూ.80లక్షలతో, అరుకులోయలో గిరిజన ఆశ్రమ పాఠశాల, ఉద్యోగుల క్వార్టర్లను రూ.4.25కోట్లు, వేచలం-ఖండివరం వంతెన రూ.5 కోట్లతో నిర్మాణానికి శంకుస్థాపన శిలాఫలకాల సముదాయాన్ని ఆవిష్కరించారు. జిల్లాకు రూ.262 కోట్లు వివిధ అభివృద్ధి పనులకు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. విమ్స్ అభివృద్ధికి రూ.135 కోట్లు, శారద, వరహా, పెద్దేరు, తాండవ నదీ గట్లు పటిష్టానికి, శాశ్వత పరిష్కారానికి రూ.114కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. చోడవరంలో డిగ్రీ కాలేజీ భవన నిర్మాణానికి రూ.50లక్షలు, పట్టణంలో తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి రూ.కోటి ఇస్తున్నామన్నారు. చోడవరం సీహెచ్‌సీ 30పడకల ఆస్పత్రిని 50పడకల స్థాయికి పెంచుతున్నామన్నారు. సభలో మంత్రి గంటా శ్రీనివాసరావు , చోడవరం ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజులు,మాడుగుల ఎమ్మెల్యే రామానాయుడు, డీసీసీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీలు పలు సమస్యలను సీఎం దృష్టికి తెచ్చారు. సుగర్‌ఫ్యాక్టరీ చైర్మన్ గూనూరు మల్లునాయుడు మాట్లాడుతూ చెరకు రైతులకు ప్రభుత్వం తరపున ప్రోత్సాహకం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్, కన్నబాబురాజు, ముత్యాలపాప, చింతలపూడి వెంకటరామయ్య, అవంతి శ్రీనివాస్‌తోపాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.