వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ | Increased Reservation Of Medicine B Category Seats In Telangana | Sakshi
Sakshi News home page

TS: మెడిసిన్‌ చదివే విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. కీలక ఉత్తర్వులు జారీ

Published Thu, Sep 29 2022 2:48 PM | Last Updated on Thu, Sep 29 2022 9:16 PM

Increased Reservation Of Medicine B Category Seats In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మెడిసిస్‌ చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాల నిబంధనలను సవరిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, వెయ్యికిపైగా ఎంబీబీఎస్‌ బీ-కేటగిరి సీట్లు తెలంగాణ విద్యార్థులకే ఇచ్చేలా సవరణలు చేశారు. ఎంబీబీఎస్‌ బీ-కేటగిరి సీట్లలో 85శాతం లోకల్‌ రిజర్వేషన్ల(తెలంగాణకు చెందినవారికే) కింద ఉండేలా మార్పులు చేశారు.

ఇకపై కేవలం 15 శాతం మాత్రమే ఓపెన్‌ కోటా కింద సీట్లు ఇవ్వనున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి హారీష్‌ రావు స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం జీవో నెంబర్ 129, 130 లను ప్రభుత్వం విడుదల చేసింది. కాగా, ప్రభుత్వ నిర్ణయంతో మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్-బీ కేట‌గిరీ సీట్ల‌లో కేటాయించే 35శాతం సీట్ల‌లో 85శాతం సీట్లు తెలంగాణ విద్యార్థుల‌కే దక్కనున్నాయి. దీంతో, రాష్ట్రంలోని మొత్తం 24 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 1,068 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా తెలంగాణ విద్యార్థుల‌కే ల‌భించ‌నున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement