MBBS & BDS
-
శాశ్వత నివాసితులైతే స్థానికులే..హైకోర్టు కీలక తీర్పు!
వైద్య విద్య సీట్ల భర్తీకి సంబంధించి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. శాశ్వ త నివాసితులైన విద్యార్థులను స్థానికులుగానే పరిగణించాలని స్పష్టం చేసింది. దీనిప్రకారం 2023 –24 ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను భర్తీ చేయాలని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీని ఆదే శించింది. అయితే ప్రభుత్వ అధికారి జారీ చేసిన ఏదైనా స్థానిక సరి్టఫికెట్‌ను వర్సిటీకి సమరి్పంచా లని పిటిషనర్లకు చెప్పింది. తీర్పు వెలువరించిన తేదీ నుంచి వారం రోజుల్లోగా సరి్టఫికెట్‌ను అందజేయాలని పేర్కొంది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మా సనం మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది. ఆ నిబంధన వర్తించదు. ‘తెలంగాణ మెడికల్, డెంటల్ కాలేజీల అడ్మిషన్ నిబంధనలు–2017లోని 3(జీజీజీ)(బీ) ప్రకారం విద్యారి్థని స్థానికుడిగా పరిగణించాలంటే అర్హత పరీక్ష(నీట్)కు ముందు నాలుగేళ్లు తెలంగాణలోనే చదివి ఉండాలని చెబుతోందని.. ఈ నిబంధన రాజ్యాంగంలోని ఆరి్టకల్ 14ను ఉల్లంఘిస్తోందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇలాంటి నిబంధనను తప్పుబడుతూ గతంలో సుప్రీంకోర్టు పలు కేసుల్లో ఉత్తర్వులు కూడా ఇచి్చందని గుర్తుచేసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిబంధనను పూర్తిగా ఎత్తివేయలేమంది. తెలంగాణలోని శాశ్వత నివాసితులకు 3 (జీజీజీ)(బీ) నిబంధన వర్తించదని తేలి్చచెప్పింది. పిటిషనర్ల కేసు.. రూల్ 3 (జీజీజీ)(బీ) కిందకు రాదని యూనివర్సిటీ తరఫు న్యాయవాది కూడా చెబుతున్నారని వ్యాఖ్యానించింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 95కూ, ఈ రిట్ పిటిషన్ల వివాదానికీ ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ఈ కేసులో పిటిషనర్లు తాము తెలంగాణలో శాశ్వత నివాసితులమని చెబుతున్నందున, వారు సర్టిఫికెట్ అందజేస్తే మెరిట్ ప్రకారం స్థానిక కోటాలో సీట్లు కేటాయించాలని వర్సిటీని ఆదేశించింది. హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి ప్రశంస రాథోడ్ తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులు. విధి నిర్వహణలో భాగంగా చెన్నైకి బదిలీ కావడంతో అతడు అక్కడే ఇంటర్మీడియెట్ చదివారు. ఒకటి నుంచి 10వ తరగతి వరకు తెలంగాణలోనే చదువుకున్నారు. అయితే, ఇంటర్ చెన్నైలో చదివినందున ఆ విద్యారి్థని నాన్‌లోకల్‌గా పరిగణిస్తామని అధికారులు పేర్కొన్నారు. దీంతో ఇంటరీ్మడియెట్ స్థానికంగా చదవకుంటే నీట్లో లోకల్ కోటా (85 శాతం) కిందికి రారంటూ ప్రభుత్వం తెచ్చిన జీవో 114ను ప్రశంస రాథోడ్ హైకోర్టులో సవాల్ చేశారు. లోకల్‌గా పరిగణించకుంటే కేవలం 15 శాతం సీట్లలోనే తాము పోటీ పడాల్సి ఉంటుందని, ఇది చట్టవిరుద్ధమని చెప్పారు. ఇదే తరహా పిటిషన్లను కలిపి ధర్మాసనం విచారణ జరిపి తీర్పు వెలువరించింది. -
ఆ కోర్సుల్లో క్రీడా కోటా ఎందుకు తొలగించారు: హైకోర్టు ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్..లాంటి వైద్య విద్యా కోర్సుల్లో క్రీడా కోటా రిజర్వేషన్ ఎందుకు తొలగించారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను వాయిదా వేసింది. కాగా, వైద్య, విద్యా కోర్సుల్లో క్రీడా కోటా కింద 0.3 శాతం రిజర్వేషన్‌ను తీసివేస్తూ ప్రభుత్వం.. జూలై 4న జీవో 75ను జారీ చేసిందని, ఇది చట్టవిరుద్ధమని పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన జి.హరికృష్ణతో పాటు మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్ కుమార్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. క్రీడా కోటా రిజర్వేషన్ కింద 2018లో ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది జైశ్వాల్ వాదనలు వినిపించారు. అయితే, హైకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్ల కల్పన నిమిత్తం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక అందజేసిందని, ఆ నివేదిక ఇవ్వాలని సమాచార హక్కు చట్ట ప్రకారం అడిగినా ఇవ్వడం లేదన్నారు. వాదనలను విన్న ధర్మాసనం.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది. ఇది కూడా చదవండి: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తెలంగాణలో మరో కొత్త రైల్వే లైన్ -
47 హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: ఏపీ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో 47 హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టుల భర్తీకి వైద్య శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. https://dmeaponline.com వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్‌ను అందుబాటులో ఉంచారు. బుధవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలు పెట్టారు. అర్హులైన వైద్యులు ఈ నెల 17వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.వెయ్యి, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.750 చొప్పున దరఖాస్తు రుసుం ఉంటుంది. రెండేళ్ల కాలపరిమితితో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టుల భర్తీ చేపడతారు. ఎంబీబీఎస్/బీడీఎస్ పూర్తి చేసి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్ డిగ్రీ/హాస్పిటల్ మేనేజ్మెంట్/ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్మెంట్/ఎంబీఏ హ్యూమన్ రీసోర్స్ కోర్సులు చేసి, ఇతర అర్హతలున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నాటికి గరిష్ట వయోపరిమితి 42 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్మెన్లకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయోపరిమితి నుంచి మినహాయింపు ఉంటుంది. http://hmfw.ap.gov.in వెబ్సైట్లో నోటిఫికేషన్‌ను ఉంచారు. -
వచ్చే ఏడాది మే 7న ‘నీట్’
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ, ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) యూజీ–2023 తేదీ ఖరారైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నీట్ యూజీ–2023 క్యాలెండర్‌ను శుక్రవారం ప్రకటించింది. వచ్చే ఏడాది మే 7న దేశ వ్యాప్తంగా నీట్ యూజీ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. పరీక్ష రాయడానికి దరఖాస్తుల ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనున్నట్లు పేర్కొంది. 17 ఏళ్ల వయసు కలిగి, గుర్తింపు కలిగిన బోర్డుల్లో బయోలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ కోర్ సబ్జెక్టులుగా ఇంటర్ లేదా సమానమైన డిప్లమో కోర్సులు చేసిన విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. దేశ వ్యాప్తంగా 645 మెడికల్, 318 డెంటల్, 914 ఆయుష్, ఇతర కళాశాలల్లో నీట్–యూజీ అర్హత ఆధారంగా ప్రవేశాలుంటాయి. నీట్ యూజీ–2022ను ఈ ఏడాది జూలై 17న దేశ వ్యాప్తంగా నిర్వహించారు. ఈ పరీక్షకు ఏపీలో 65,305 మంది హాజరు కాగా 40,344 మంది అర్హులుగా నిలిచారు. దేశవ్యాప్తంగా 17,64,571 మంది పరీక్ష రాశారు. వీరిలో 9.93 లక్షల మంది అర్హత సాధించారు. రాష్ట్రంలో 11 ప్రభుత్వ, 16 ప్రైవేట్, 2 మైనారిటీ, శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాలలున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో 2,185, ప్రైవేట్, మైనారిటీ కళాశాలల్లో 3,175 ఎంబీబీఎస్ సీట్లు కలిపి రాష్ట్రంలో 5,360 ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వం 5 వైద్య కళాశాలల్లో 2023 నుంచి అకడమిక్ కార్యకలాపాలు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. 2023 నుంచి ఒక్కో చోట 150 చొప్పున 750 సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చే అవకాశముంది. -
85% మెడికల్ సీట్లు రాష్ట్ర విద్యార్థులకే..
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న తరుణంలో ఆయా కోర్సుల్ని చేయాలనుకునే విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు సంబంధించిన బీ కేటగిరీ సీట్లలో 85 శాతం సీట్లను ఏపీ విద్యార్థులకు రిజర్వ్ చేస్తూ అడ్మిషన్ల నిబంధనలు సవరించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో 11 ప్రభుత్వ, 15 ప్రైవేట్, 2 మైనార్టీ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీల్లో 2,450 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా.. ఈ ఏడాది రెండు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఒక్కో కాలేజీకి 50 చొప్పున 100 సీట్లు పెరిగాయి. మరోవైపు తిరుపతి జిల్లా రేణిగుంటలో శ్రీ బాలజీ మెడికల్ కాలేజీలో అడ్మిషన్లకు అనుమతులు లభించాయి. ఇక్కడ 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అంటే ప్రైవేట్ కాలేజీల్లో 2,700 ఎంబీబీఎస్ సీట్లు ఈ విద్యా సంవత్సరం అందుబాటులో ఉంటాయి. ఇందులో బీ కేటగిరీ కింద 35 శాతం అంటే 945 సీట్లు ఉన్నాయి. గత ఏడాది వరకూ వీటికి అన్ని రాష్ట్రాల విద్యార్థులు అర్హులుగా ఉన్నారు. తాజా సవరణ మేరకు బీ కేటగిరీలో సీట్లలో 85 శాతం సీట్లు అంటే సుమారు 804 సీట్లు ప్రత్యేకంగా ఏపీ విద్యార్థుల కోసం కేటాయిస్తారు. మిగతా 15 శాతం సీట్లు మాత్రమే ఓపెన్ కోటాలో ఇతర రాష్ట్ర విద్యార్థులు పోటీ పడతారు. ఓపెన్ కోటాలోనూ మన రాష్ట్ర విద్యార్థులకు కూడా అవకాశం ఉంటుంది. రాష్ట్ర విద్యార్థులకు ఎంతో మేలు ఇప్పటివరకు ‘బీ’ కేటగిరీలో ఉండే 35 శాతం కోటాలో ఎలాంటి స్థానిక రిజర్వేషన్లు లేవు. దీంతో ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ‘బీ’ కేటగిరీ ఎంబీబీఎస్ సీట్లను ఎక్కువగా సొంతం చేసుకునేందుకు అవకాశాలు ఉండేవి. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో మన విద్యార్థులకు ఎంతో మేలు చేకూరనుంది. ‘కన్వీనర్’ సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లలో 2022–23 విద్యా సంవత్సరానికి సం బంధించిన ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయస్థాయి అర్హత పరీక్ష (నీట్) యూజీ– 2022లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాసు చేసుకోవాల్సిందిగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 20వ తేదీ సాయంత్రం 6గంటల వరకూ దరఖాస్తులకు అవకాశం కల్పించారు. https://ugcq.ntruhsadmi ssions. com/ వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్‌ను అందుబాటులో ఉంచారు. పూర్తి నోటిఫికేషన్ http://ntruhs.ap.nic.in/ వెబ్సైట్లో ఉంది. నియమ, నిబంధనల కోసం 89787 80501, 79977 10168, 93918 05238, 93918 05239 నంబర్లలోను, ఫీజు చెల్లింపు కోసం 83338 83934లోనూ సంప్రదించాలి. -
వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మెడిసిస్ చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల నిబంధనలను సవరిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, వెయ్యికిపైగా ఎంబీబీఎస్ బీ-కేటగిరి సీట్లు తెలంగాణ విద్యార్థులకే ఇచ్చేలా సవరణలు చేశారు. ఎంబీబీఎస్ బీ-కేటగిరి సీట్లలో 85శాతం లోకల్ రిజర్వేషన్ల(తెలంగాణకు చెందినవారికే) కింద ఉండేలా మార్పులు చేశారు. ఇకపై కేవలం 15 శాతం మాత్రమే ఓపెన్ కోటా కింద సీట్లు ఇవ్వనున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి హారీష్ రావు స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం జీవో నెంబర్ 129, 130 లను ప్రభుత్వం విడుదల చేసింది. కాగా, ప్రభుత్వ నిర్ణయంతో మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్-బీ కేటగిరీ సీట్లలో కేటాయించే 35శాతం సీట్లలో 85శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి. దీంతో, రాష్ట్రంలోని మొత్తం 24 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 1,068 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా తెలంగాణ విద్యార్థులకే లభించనున్నాయి. -
నీట్ తేలేదెప్పుడు..? క్లాసులు కదిలేదెప్పుడు..?
సాక్షి, హైదరాబాద్: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ఫలితాలు వచ్చి రెండు వారాలైనా ప్రవేశాల షెడ్యూల్‌ను ఇంకా ప్రకటించలేదు. జాతీయస్థాయి నోటిఫికేషన్ విడుదల కాలేదు. మరోవైపు రాష్ట్రానికి చెందిన నీట్ ర్యాంకులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇప్పటికీ విడుదల చేయలేదు. వాటిని ఇప్పటికే రాష్ట్రాలకు పంపాల్సి ఉండగా, మరింత ఆలస్యం అవుతోంది. త్వరలో రాష్ట్రస్థాయి నీట్ ర్యాంకులు వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారే కానీ, ఎప్పుడనేది స్పష్టత లేదు. దీంతో నీట్ అర్హత సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎదురుచూపులు తప్పలేదు. వాస్తవంగా నీట్ ఫలితాల ప్రకటన సమయంలోనే షెడ్యూల్ వంటి వాటిపై స్పష్టత ఇవ్వాలని, కానీ ఈ విషయంలో ప్రతీసారి అస్పష్టతే ఉంటోందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు అంటున్నాయి. కరోనా కారణంగా గతేడాది వైద్య విద్య ప్రవేశాల్లో జాప్యం జరగ్గా, ఈసారీ అదే పరిస్థితి నెలకొంది. దీనివల్ల వైద్య విద్యా సంవత్సరం గందరగోళానికి గురవుతుందని వాపోతున్నారు. నాలుగైదు నెలలు ఆలస్యంగా ప్రవేశాలు ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నీట్ ఫలితాలు ఈ నెల 1న విడుదలయ్యాయి. అనేకమంది తెలంగాణ విద్యార్థులు నీట్లో అర్హత సాధించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 15 శాతం సీట్లను జాతీయస్థాయి కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. ఎయిమ్స్, జిప్మర్ వంటి ప్రసిద్ధ వైద్య సంస్థల్లోని సీట్లనూ నీట్ ద్వారానే భర్తీ చేస్తారు. అందుకోసం ముందుగా జాతీయ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.రెండు విడతల జాతీయ కౌన్సెలింగ్ తర్వాత 15 శాతం సీట్లలో ఏవైనా మిగిలితే వాటిని తిరిగి ఆయా రాష్ట్రాలకు వెనక్కిస్తారు. వాటిని రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్‌లోనే నింపుకోవచ్చు. జాతీయస్థాయి కౌన్సెలింగ్ మొదలైన వెంటనే రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ జారీచేస్తారు. కరోనాకు ముందు సాధారణంగా ఆగస్టులో మెడికల్ మొదటి ఏడాది తరగతులు ప్రారంభమయ్యేవి. కరోనా వల్ల గతేడా ది చాలా ఆలస్యంగా తరగతులు మొదలుకాగా, ఈసారి మహమ్మారి తీవ్రత తగ్గినా కూడా మరింత జాప్యం అవుతోంది. త్వరగా కౌన్సెలింగ్ మొదలుపెడితే డిసెంబర్లో తరగతులు ప్రారంభించడానికి వీ లుండేది. అయితే, జనవరిలో ఫస్టియర్ తరగతులు ప్రారంభమయ్యే పరిస్థితి ఉందని అంటున్నారు. ఫస్టియర్ ఫెయిలైన విద్యార్థులెక్కువ.. కరోనా కారణంగా వైద్య విద్యార్థులు చాలావరకు నష్టపోయారు. పది, ఇంటర్ మాదిరిగా ఆపై తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండా ప్రమోట్ చేయడం కుదరదు. అయితే, వైద్య విద్యార్థుల పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుంది. 50 శాతం మార్కులు వస్తేనే పాసైనట్లు లెక్క. కరోనా వల్ల గతేడాది కాళోజీ వర్సిటీ పరిధిలో ఫెయిలైన విద్యార్థుల సంఖ్య పెరిగింది. నేరుగా తరగతులు జరగకపోవడంతో విద్యార్థులు నష్టపోయారు. కాబట్టి సకాలంలో ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించి, త్వరగా తరగతులు ప్రారంభించాలని వైద్య నిపుణులు కోరుతున్నారు. -
ఏ ర్యాంకుకు ఎక్కడ ఎంబీబీఎస్ సీటు? విద్యార్థుల్లో పరేషాన్
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి జాతీయ స్థాయిలో నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) ఇటీవలే ముగిసింది. మన రాష్ట్రం నుంచి మొత్తం 59 వేల మందికిపైగా నీట్ రాశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అభ్యర్థుల ఆందోళన అంతా తమకొచ్చే ర్యాంకుకు సీటు వస్తుందో, రాదోననే. మన రాష్ట్రంలో 11 ప్రభుత్వ, 15 ప్రైవేటు, 2 మైనార్టీ కాలేజీల్లో కన్వీనర్, యాజమాన్య, ప్రవాస భారతీయ కోటా.. ఇలా అన్నీ కలిపి 5,010 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల వరకు మాత్రమే చూస్తే ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2,180. అభ్యర్థుల్లో అందరి దృష్టి ప్రభుత్వ కళాశాలలపైనే ఉంది. దీనికోసం ఎన్ని మార్కులు వస్తే.. ఎంత ర్యాంకు వస్తుంది, ఎంత ర్యాంకు సాధిస్తే ప్రభుత్వ కాలేజీల్లో సీటు వస్తుందో తెలుసుకునే పనిలో ప్రస్తుతం అభ్యర్థులంతా తలమునకలై ఉన్నారు. ఈ ఏడాది నీట్లో భౌతిక శాస్త్రం (ఫిజిక్స్) కొంచెం కష్టంగా వచ్చింది. దీంతో ఫిజిక్స్‌లో బాగా పట్టున్న వారు, ఆ సబ్జెక్టు బాగా రాసిన వారు సీటు వస్తుందన్న ఆశతో ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లలో 15 శాతం జాతీయ కోటా కింద నేషనల్ పూల్‌లో భర్తీ చేస్తారు. మిగతా 85 శాతం సీట్లను రాష్ట్రమే భర్తీ చేస్తుంది. కాగా, 2 ప్రభుత్వ డెంటల్ కాలేజీల్లో 140, 14 ప్రైవేటు డెంటల్ కాలేజీల్లో 1,300 బీడీఎస్ సీట్లు ఉన్నాయి. ఎన్ని మార్కులొస్తే సీటు వస్తుంది? ఏయూ పరిధిలో ఓపెన్ కేటగిరీలో 343 మార్కులకు డెంటల్ సీటు గతేడాది ఆంధ్రా విశ్వవిద్యాలయం పరిధిలో ఎస్టీ కేటగిరీలో 162 మార్కులు సాధించిన వ్యక్తికి ప్రభుత్వ కళాశాలలో దంత వైద్య సీటు లభించింది. జాతీయ స్థాయిలో 6,31,277 ర్యాంకు సాధించిన అభ్యర్థికి 162 మార్కులు వచ్చాయి. అదే ఓపెన్ కేటగిరీలో చివరి సీటు 343 మార్కులు (ర్యాంకు 2,57,671) వచ్చినవారికి దక్కింది. ఎస్సీ కేటగిరీలో 310 మార్కులు వచ్చిన వారికి చివరి సీటు లభించింది. అదే శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో చూస్తే ఎస్టీ కేటగిరీలో 359 మార్కులు (2,35,606 ర్యాంకు) వచ్చిన వారికి కూడా సీటు దక్కింది. దీన్ని బట్టి చూస్తే ఒకే రాష్ట్రంలో రెండు యూనివర్సిటీల పరిధిలో ఎంత వ్యత్యాసం ఉందో అంచనా వేయొచ్చు. -
ఒక్కో ఎంబీబీఎస్ సీటుకు 16.37 మంది పోటీ
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం నీట్ ప్రవేశ పరీక్ష రాయడానికి మరో 20 రోజులు మాత్రమే గడువు ఉండటంతో విద్యార్థులు కసరత్తు ముమ్మరం చేశారు. ఈ ఏడాది మన రాష్ట్రంలో 59,951 మంది విద్యార్థులు నీట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య కొంచెం తక్కువ. గతేడాది 62,051 మంది దరఖాస్తు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో మొత్తం 5,010 సీట్లు ఉన్నాయి. సీట్లు, దరఖాస్తు చేసిన అభ్యర్థుల సంఖ్య చూస్తే ఒక్కో సీటుకు సగటున 11.96 మంది పోటీ పడుతున్నారు. యాజమాన్య సీట్లు, ఎన్ఆర్ఐ కోటా సీట్లు కాకుండా ప్రభుత్వ సీట్లు, ప్రైవేటు కాలేజీల్లో ఉన్న కన్వీనర్ కోటా సీట్లు 3,662 మాత్రమే లెక్కలోకి తీసుకుంటే ఒక్కో సీటుకు 16.37 మంది పోటీ పడుతున్నారు. ఒక్క మార్కులోనే ర్యాంకులు తల్లకిందులవుతాయి. కొంత కాలంగా కోవిడ్ మహమ్మారి ఇబ్బంది పెట్టినా, ఎలాగైనా సీటు సంపాదించాలనే దిశగా విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు. ఈ ఏడాది నీట్‌కు దరఖాస్తు చేసిన వారిలో తెలుగు మీడియంలో పరీక్ష రాస్తున్న వారు కేవలం 1,253 మంది మాత్రమే. గత ఏడాది 1600 మందికి పైగా తెలుగులో పరీక్ష రాశారు. ఈ ఏడాది మొత్తం 13 భాషల్లో ప్రవేశ పరీక్ష ఉంటుంది. సెప్టెంబర్ 12వ తేదీన నీట్ పరీక్ష జరగనుంది. ఫిజిక్స్ మార్కులపైనే గురి మెజారిటీ విద్యార్థులు ఫిజిక్స్ కష్టంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఒక్కో సబ్జెక్టు 180 మార్కులకు ఉంటుంది. ఇలా బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్.. మొత్తం 720 మార్కులకు పరీక్ష ఉంటుంది. మిగతా మూడు సబ్జెక్టుల్లో ఎలా ఉన్నా ఫిజిక్స్‌లో ఎవరు ఎక్కువ మార్కులు తెచ్చుకోగలిగితే వారికి సీటు తప్పక వస్తుందని విద్యార్థుల అభిప్రాయం. కానీ చాలా మంది ఫిజిక్స్ కంటే మిగతా మూడు సబ్జెక్టుల పట్లే మక్కువ చూపిస్తారు. కానీ నిపుణులు మాత్రం ఫిజిక్స్‌పై ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మంచి స్కోరు సాధించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కష్టమైన సబ్జెక్టు అని చాలా మంది ఫిజిక్స్‌పై దృష్టి సారించకుండా మిగతా సబ్జెక్టులపై సమయం ఎక్కువగా వెచ్చిస్తారని, కానీ ఫిజిక్స్‌ను కూడా బాగా చదివితే వాటికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చని సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ప్యాట్రన్ మారినా ఇబ్బంది లేదు ఈ ఏడాది ప్రశ్నాపత్రం మారింది. ఆప్షన్ ఎక్కువ ఇచ్చారు కాబట్టి పోటీ కాస్త ఎక్కుగా ఉండే అవకాశం ఉంటుంది. అయినా ఏం ఇబ్బంది లేదు. రోజుకు 10 గంటలపైనే ప్రిపరేషన్ కొనసాగిస్తున్నా. ఎలాగైనా ప్రభుత్వ కాలేజీలో సీటు తెచ్చుకోవాలన్నదే ధ్యేయం. – మేసా క్లాడియా, ఇంటర్ సెకండ్ ఇయర్, ఉయ్యూరు ఈ 20 రోజులే కీలకం రానున్న 20 రోజులే కీలకం. ప్రణాళికా బద్ధంగా చదువుకోవాల్సి ఉంది. సులభమైన సబ్జెక్టు కాకుండా కష్టమైన సబ్జెక్టుపై ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నా. ముఖ్యంగా ఫిజిక్స్‌పై దృష్టి సారించా. మొదటి ప్రయత్నంలో సీటు రాలేదు. అందుకే లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నా. ప్రిపరేషన్‌ను బట్టి సీటు సాధించగలనన్న నమ్మకం ఉంది. – సీహెచ్.రవళి, లాంగ్‌టర్మ్ కోచింగ్, విజయవాడ ఒత్తిడి లేకుండా చదవగలగాలి పరీక్ష దగ్గర పడేకొద్దీ చాలా మంది ఒత్తిడికి లోనవుతున్నారు. నాకు మొదటి సారి సీటు రాకపోవడానికి ఇదే కారణం. అందుకే ఈ సారి లాంగ్‌టర్మ్ కోచింగ్‌లో ఒత్తిడికి గురికాకుండా ఒక ప్లానింగ్‌తో వెళుతున్నా. నిపుణుల సూచనల మేరకు సబ్జెక్టులపై పట్టు పెంచుకున్నాను. – అక్సా రాణి, లాంగ్‌టర్మ్ కోచింగ్ ప్రాక్టీస్‌తోనే ఫిజిక్స్‌లో మార్కులు ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్లే ఫిజిక్స్‌లో ఎక్కువ మార్కులు సాధించవచ్చు. చాలా మంది భయపడి ప్రాక్టీస్ చేయరు. కొద్దిగా మ్యాథమేటిక్స్‌తో అప్లై చేస్తే ఫిజిక్స్‌లో బాగా స్కోర్ చేయొచ్చు. ఫిజిక్స్‌లో మార్కులే సీటును నిర్ణయిస్తాయనేది మర్చిపోకూడదు. – డి.రాంబాబు, సీనియర్ ఫ్యాకల్టీ, ఫిజిక్స్, విజయవాడ -
ఏపీలో తగ్గిన MBBS, BDS ఫీజులు
-
ఏపీలో తగ్గిన ఎంబీబీఎస్, బీడీఎస్ ఫీజులు
సాక్షి, విజయవాడ: ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సూచనల మేరకు ఫీజులు తగ్గిస్తూ వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం జీఓ నెంబర్ 146ను జారీ చేసింది. దీంతో ప్రైవేట్ వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా కింద వైద్య విద్య అభ్యసించే ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఊరట కల్పించింది. ఇందుకు సంబంధించిన ఫీజులు తగ్గిస్తూ ప్రభుత్వం ఆయా కోర్సుల ఫీజులను ఖరారు చేసింది. ప్రైవేట్, మైనార్టీ కాలేజీలకు ఇవి వర్తిస్తాయని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకూ ఎంబీబీఎస్‌కు ఐదేళ్ల ఫీజు వసూలు చేస్తుండగా, ఇకపై నాలుగున్నరేళ్లకు మాత్రమే తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తాజాగా నిర్ణయించిన ఫీజులు 2020-21 నుంచి 2022-23 వరకూ అమల్లో ఉంటాయని ఆయన వెల్లడించారు. కాగా, 17 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, 14 డెంటల్ కాలేజీలకు ఈ ఫీజులు నిర్ణయించారు. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో సూపర్ స్పెషాల్టీ కోర్సులకూ వీటిని ఖరారు చేశారు. ఏ ప్రైవేట్ కళాశాల అయినా సరే ఇతరత్రా ఫీజుల పేరుతో వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సింఘాల్ ఆ ఉత్తర్వుల్లో హెచ్చరించారు. అంతేకాక.. మెడికల్, డెంటల్ అభ్యర్థులకు విధిగా స్టైఫండ్ చెల్లించాలన్నారు. ఈ సందర్భంగా రాష్డ్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల ప్రక్రియకి సిద్దమవుతున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. తొలివిడత కౌన్సిలింగ్ని నాలుగైదు రోజులలో ప్రారంభిస్తామన్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి, రెండు రోజుల్లో విడుదల చేస్తామన్నారు. అలాగే ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకి ఎ,బి,సి కేటగిరీ ఫీజులు ఖరారు చేస్తూ ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమీషన్ సూచనల మేరకే నిర్ణయించామని తెలిపారు. (ప్రజాశక్తి కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్) ఎంబీబీఎస్ కన్వినర్ కోటా ఫీజు రూ.15 వేలగా నిర్ణయించగా... బి కేటగిరీ ఫీజు ఏటా రూ.12 లక్షలుగా.. ఎన్నారై కోటా ఫీజు రూ.36 లక్షలుగా నిర్ణయించడం జరిగిందన్నారు. ఇక దంత వైద్య సీట్లకి కన్వినర్ కోటాకి రూ.13 వేలు, బి కేటగిరీకి రూ.4 లక్షలు, ఎన్నారై కోటాకి 12 లక్షల రూపాయిలుగా ఫీజులగా నిర్ణయించడం జరిగిందన్నారు. 2019-20 సంవత్సరంతో పోలిస్తే బీ, సీ కేటగిరి ఫీజులు తగ్గాయన్నారు. ఈ కొత్త ఫీజులు 2020-21 నుంచి 2022-23 విద్యా సంవత్సరం వరకు అమలులో ఉంటాయన్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల ప్రక్రియని రెండు విడతలలో పూర్తి చేస్తామని.. రెండో విడత కౌన్సిలింగ్ ఈ నెలాఖరున లేదా వచ్చే నెల మొదటి వారంలో చేపట్టనున్నామని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. (ఏపీలో పెట్టుబడులకు తైవాన్ కంపెనీల ఆసక్తి) ఫీజుల వివరాలు: ►ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కింద రూ.15వేలు ఫీజు ►బి కేటగిరీ (మేనేజ్మెంట్) కోటా కింద రూ.12లక్షల ఫీజు ►ఎంబీబీఎస్ కోర్సులో బి కేటగిరీకి 6.8లక్షల వరకు ఫీజు తగ్గింపు ►సి కేటగిరీ (ఎన్ఆర్ఐ) కోటా కింద రూ.36లక్షల ఫీజు ►ఎన్ఆర్ఐ కోటాలో రూ.16లక్షల వరకు ఫీజు తగ్గింపు ►బీడీఎస్ కోర్సు కన్వీనర్ కోటా కింద రూ.13వేలు ఫీజు ►బీడీఎస్- బి కేటగిరీ (మేనేజ్మెంట్) కోటా కింద రూ.4 లక్షల ఫీజు ►బీడీఎస్ (మేనేజ్మెంట్) కోటాలో రూ.7లక్షల వరకు ఫీజు తగ్గింపు ►బీడీఎస్ - సి కేటగిరీ (ఎన్ఆర్ఐ) కోటా కింద రూ.12 లక్షల ఫీజు ►బీడీఎస్ (ఎన్ఆర్ఐ) కోటా కింద రూ.50 లక్షలకు పైగా ఫీజు తగ్గింపు -
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు నోటిఫికేషన్
సాక్షి, వరంగల్ : రాష్ర్టంలో దంత వైద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు గాను ఆన్లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ 2020లో అర్హత సాధించిన అభ్యర్థులు నమోదు చేసుకోవాలని తెలిపారు. కరోనా వైరస్ దృష్ట్యా ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలిన పీజీ తరహాలోనే యుజి ప్రవేశాలకు చేపట్టనున్నారు. 01-11-20 నుంచి 08-11-20 వరకు ఉదయం 8 గంటల నుంచి సాయింత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. నిర్ధేశిత ధరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో సమర్పించిన దరఖాస్తులు , సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. ప్రవేశాలకు సంబంధించి అర్హత ఇతర సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.in లో సందర్శించాలని యూనివర్సిటీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపారు. -
గందరగోళం తగ్గింది.. ‘నీట్’గా ముగిసింది!
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్‌లలో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే ‘నీట్’పరీక్ష ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా జరిగింది. కఠినమైన నిబంధనల కారణంగా అక్కడక్కడ విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి నీట్లో అడిగిన ప్రశ్నలు సులువుగా ఉన్నాయని, గందరగోళం పెద్దగా లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈసారి అర్హత మార్కులు కూడా పెరిగే అవకాశముందంటున్నారు. గతేడాది కెమిస్ట్రీ పేపర్ లో 5 ప్రశ్నలు గందరగోళంగా ఉండగా ఈసారి అటువంటి పరిస్థితి లేదని నిపుణులు అంటున్నారు. బయాలజీ సబ్జెక్టుకు సంబంధించి గతంలో ఎన్సీఈఆర్టీలో లేనివి కనీసం నాలుగైదు ప్రశ్నలు వచ్చేవి. ఈసారి మాత్రం ఎన్సీఈఆర్టీ నుంచే వచ్చాయి. అయితే బాటనీలో మాత్రం క్రోమోజోమ్స్ కాన్సెప్ట్ మీద ఇచ్చిన ప్రశ్న సిలబస్‌లో లేదు. 98% మంది విద్యార్థులు దీనికి జవాబు రాసే అవకాశమే లేదని తెలుస్తోంది. మరో రెండు ప్రశ్నలు కాస్త కన్ఫ్యూజన్గా ఉన్నాయి. వాటికి ఏది సరైన సమాధానమో విద్యార్థులకు అంతుబట్టలేదు. నీట్లో ఫిజిక్స్ కఠినంగా ఉంటుందన్న భావన ఉంటుంది. కానీ ఈసారి ఫిజిక్స్‌లోని 45 ప్రశ్నల్లో 25 ప్రశ్నలు అత్యంత ఈజీగా ఉండేవి బేసిక్ మోడల్‌వి ఇచ్చారు. లెవల్ 3, 4స్థాయి ప్రశ్నలు కాకుండా లెవల్ 1 స్థాయి ప్రశ్నలు వచ్చాయి. దీనివల్ల చాలామంది ఫిజిక్స్‌లో మరిన్ని మార్కులు సాధించే అవకాశముంది. మిగిలినవాటిలో 15 ప్రశ్నలు మధ్యస్థంగా ఉండగా, మరో ఐదు ఫిజిక్స్ ప్రశ్నలు కఠినంగా ఉన్నాయి. అందులో ఒక ప్రశ్నకు సరైన సమాధానం విషయంలో కాస్త గందరగోళం ఉంది. మొత్తంగా ఈ ఏడాది నీట్ పేపర్లో 3 ప్రశ్నలు గందరగోళంగా ఉన్నాయని తేలినట్లు నిపుణులంటున్నారు. ఓవరాల్‌గా నీట్ పరీక్ష ఈజీగా ఉందని వివిధ కార్పొరేట్ కాలేజీల లెక్చరర్లు విశ్లేషిస్తున్నారు. పైగా గతంలో తప్పులు దొర్లేవని.. ఈసారి అలాంటివి కనిపించలేదని తెలిపారు. అర్హత మార్కులు పెరిగే చాన్స్ ఈసారి నీట్ పరీక్ష సులువుగా ఉండటంతో అర్హత మార్కులు కూడా పెరిగే అవకాశం ఉందని అధ్యాపకులు అంటున్నారు. గతేడాదితో పోలిస్తే 20–25 వరకు అర్హత మార్కులు పెరిగే అవకాశం ఉందంటున్నారు. 720 నీట్ మార్కులకు గాను, గతేడాది జనరల్ కేటగిరీలో అర్హత మార్కులు 105 ఉంది. ఈసారి 125 నుంచి 130 మార్కుల వరకు పెరిగే అవకాశముందని అంటున్నారు. అలాగే ఆలిండియా టాప్ వెయ్యి ర్యాంకులు సాధించిన విద్యార్థుల మార్కులు 650పైనే ఉండేది. అది కూడా ఈసారి పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని కూకట్పల్లి శ్రీచైతన్య జూనియర్ కాలేజీ డీన్ శంకర్రావు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 75 వేల మంది వరకు పరీక్ష రాసి ఉంటారని ఆయన వివరించారు. ఫుల్ షర్ట్‌ను కట్ చేసి.. ఆభరణాలు ధరించుకోకూడదని.. పొడుగు చొక్కాలు వేసుకోవద్దని.. ఇలా అనేక కఠిన నిబంధనలను నీట్ నిర్వాహకులు ముందే చెప్పారు. అయినా కొన్నిచోట్ల అలా వచ్చిన వారిపై ఏమాత్రం కనికరం లేకుండా నిర్వాహకులు వ్యవహరించారు. వరంగల్ జిల్లాలో నీట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినా ఒకట్రెండు చోట్ల ఇబ్బందులు తలెత్తాయి. ఆ జిల్లాలో మొత్తం 5,695 మంది కోసం 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 5,498 మంది (97%) హాజరయ్యారు. నీట్లో కఠినమైన నిబంధనలతో కొన్నిచోట్ల అపశ్రుతి దొర్లింది. ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ వేసుకొచ్చిన విద్యార్థులను షర్ట్‌లను హాఫ్ హ్యాండ్స్‌గా కట్ చేశాకే పరీక్ష హాల్లోకి అనుమతించారు. అలాగే ముక్కు పుడకలు తొలగించాకే అమ్మాయిలను అనుమతించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించినప్పటికీ..విద్యార్థులు నిర్దేశిత సమయానికి గంటన్నర ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. హాల్‌టికెట్‌తో పాటు ఆధార్‌కార్డు ఉన్న వారిని అనుమతించారు. హైహీల్స్, వాచీలు, చెవి, ముక్కు పోగులు సహా ఇతర బంగారు ఆభరణాలను తీసివేయించారు. రెండు గంటల ముందే.. హైదరాబాద్‌లో నీట్‌పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నిమిషం నిబంధన నేపథ్యంలో విద్యార్థులు పరీక్ష సమయం కంటే రెండు గంటల ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఆదివారం కావడంతో నగరంలోనూ రోడ్లు ఖాళీగానే ఉన్నాయి. దీనికితోడు ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతాల్లో పోలీసుల ముందస్తు చర్యల కారణంగా విద్యార్థులు సరైన సమయంలోపే పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు వీలుపడింది. అయితే పరీక్షా కేంద్రాల వద్ద సరైన వసతుల్లేకపోవడంతో వీరితోపాటు వచ్చిన తల్లిదండ్రులు, బంధువులు ఇబ్బందులుపడాల్సి వచ్చింది. నగరంలో నీట్ పరీక్షకు 95శాతానికి పైగా హాజరైనట్లు తెలుస్తోంది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరక్కపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఖమ్మం జిల్లాలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 3,322మంది అభ్యర్థులకు గాను 3171మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు నీట్ సిటీ కోఆర్డినేటర్ పార్వతీరెడ్డి తెలిపారు. ఇదిలావుంటే పరీక్షా కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించకపోవటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. పరీక్షా కేంద్రాలకు తమ పిల్లలను తీసుకొచ్చిన తల్లిదండ్రులు పరీక్ష ముగిసే వరకు సమీపంలోని చెట్ల కింద సేద తీరారు. అయితే.. నీట్ పరీక్ష వ్యవహారాలను రాష్ట్రానికి సంబంధించి ఎవరు పర్యవేక్షిస్తున్నారన్న సమాచారం లేదు. కేంద్రమే దీన్ని నిర్వహిస్తున్నందున రాష్ట్రస్థాయిలో సమాచారం ఇచ్చే నాథుడే లేకపోవడంపై విమర్శలు వచ్చాయి. అర్హత సాధిస్తా ప్రణాళిక ప్రకారం చదువుకొని పరీక్ష బాగా రాశాను. నీట్ పరీక్షలో అర్హత సాధిస్తాననే నమ్మకం కలిగింది. పరీక్షా కేంద్రం వద్ద సరైన సౌకర్యాలు కల్పించకపోవటంతో ఇబ్బందులు పడ్డాం.– దలువాయి సాయి సాకేత్, ఖమ్మం మంచి ర్యాంక్ వస్తుంది నీట్ పరీక్షను బాగానే రాశాను. మంచి ర్యాంక్ వస్తుందని ఆశిస్తున్నా. సరైన సౌకర్యాలు కల్పించకపోవటంతో ఇబ్బందులు పడ్డాం. – నన్నక భార్గవ్, ఖమ్మం పేపర్ ఈజీగానే.. నీట్ పరీక్ష పేపర్ గత రెండేళ్ల కంటే చాలా సులువుగా ఉంది. పెద్దగా గందరగోళం కూడా లేదు. మొత్తంగా 3 ప్రశ్నలకు ఏది సరైన సమాధానమో అంతుబట్టడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా నీట్ ప్రశాంతంగా జరిగినట్లు సమాచారం ఉంది. – డి.శంకర్రావు, డీన్, శ్రీచైతన్య జూనియర్ కాలేజీ, కూకట్పల్లి, హైదరాబాద్ -
రేపే ఎంసెంట్–3
పరీక్ష రాయనున్న 4,710 మంది విద్యార్థులు ఎనిమిది పరీక్షా కేంద్రాల ఏర్పాటు నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు కేయూ క్యాంపస్ : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు గాను ఆదివారం జరిగే ఎంసెట్–3 నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. పరీక్షకు 4,710 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరగనుంది. హన్మకొండ సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కళాశాల, కాకతీయ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాల, యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల, యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల, వడ్డేపల్లిలోని ప్రభుత్వ పింగిళి డిగ్రీ కళాశాల, సీకెఎం ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కళాశాల, వరంగల్‌లోని ఎల్బి కళాశాల, హ్యూమనిటీస్ భవనంలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా పరీక్ష కేంద్రాల్లోకి ఒక గంట ముందుగానే ఉదయం 9గంటల నుంచే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. నిర్దేశించిన సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని టీఎస్ ఎంసెట్ –3 రీజినల్ కోఆర్డినేటర్ అయిన కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి తెలిపారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకుగాను ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. 12మంది అబ్జర్వర్లును, రెండు ఫైయింగ్స్క్వాడ్ల బృందాలు, ఎనిమిది మంది ఎన్ఫోర్స్మెంట్ అధికారులను నియమించినట్టు చెప్పారు. పరీక్ష కేంద్రాల్లోకి వాచ్‌లు, సెల్ఫోన్లుఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదన్నారు. కాకతీయ యూనివర్సిటీలోని కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రానికి గుండ్లసింగారం రూట్ నుంచి చేరుకోవాలని ప్రొఫెసర్ మల్లారెడ్డి సూచించారు. పరీక్షాకేంద్రాలకు వీలైనంత ముందుగా చేరుకోవాలని ఆయన కోరారు.