సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్..లాంటి వైద్య విద్యా కోర్సుల్లో క్రీడా కోటా రిజర్వేషన్ ఎందుకు తొలగించారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను వాయిదా వేసింది.
కాగా, వైద్య, విద్యా కోర్సుల్లో క్రీడా కోటా కింద 0.3 శాతం రిజర్వేషన్‌ను తీసివేస్తూ ప్రభుత్వం.. జూలై 4న జీవో 75ను జారీ చేసిందని, ఇది చట్టవిరుద్ధమని పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన జి.హరికృష్ణతో పాటు మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్ కుమార్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. క్రీడా కోటా రిజర్వేషన్ కింద 2018లో ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది జైశ్వాల్ వాదనలు వినిపించారు.
అయితే, హైకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్ల కల్పన నిమిత్తం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక అందజేసిందని, ఆ నివేదిక ఇవ్వాలని సమాచార హక్కు చట్ట ప్రకారం అడిగినా ఇవ్వడం లేదన్నారు. వాదనలను విన్న ధర్మాసనం.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తెలంగాణలో మరో కొత్త రైల్వే లైన్
Comments
Please login to add a commentAdd a comment