వైద్య విద్య సీట్ల భర్తీకి సంబంధించి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. శాశ్వ త నివాసితులైన విద్యార్థులను స్థానికులుగానే పరిగణించాలని స్పష్టం చేసింది. దీనిప్రకారం 2023 –24 ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను భర్తీ చేయాలని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీని ఆదే శించింది. అయితే ప్రభుత్వ అధికారి జారీ చేసిన ఏదైనా స్థానిక సరి్టఫికెట్‌ను వర్సిటీకి సమరి్పంచా లని పిటిషనర్లకు చెప్పింది. తీర్పు వెలువరించిన తేదీ నుంచి వారం రోజుల్లోగా సరి్టఫికెట్‌ను అందజేయాలని పేర్కొంది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మా సనం మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది.
ఆ నిబంధన వర్తించదు.
‘తెలంగాణ మెడికల్, డెంటల్ కాలేజీల అడ్మిషన్ నిబంధనలు–2017లోని 3(జీజీజీ)(బీ) ప్రకారం విద్యారి్థని స్థానికుడిగా పరిగణించాలంటే అర్హత పరీక్ష(నీట్)కు ముందు నాలుగేళ్లు తెలంగాణలోనే చదివి ఉండాలని చెబుతోందని.. ఈ నిబంధన రాజ్యాంగంలోని ఆరి్టకల్ 14ను ఉల్లంఘిస్తోందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇలాంటి నిబంధనను తప్పుబడుతూ గతంలో సుప్రీంకోర్టు పలు కేసుల్లో ఉత్తర్వులు కూడా ఇచి్చందని గుర్తుచేసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిబంధనను పూర్తిగా ఎత్తివేయలేమంది. తెలంగాణలోని శాశ్వత నివాసితులకు 3 (జీజీజీ)(బీ) నిబంధన వర్తించదని తేలి్చచెప్పింది. పిటిషనర్ల కేసు.. రూల్ 3 (జీజీజీ)(బీ) కిందకు రాదని యూనివర్సిటీ తరఫు న్యాయవాది కూడా చెబుతున్నారని వ్యాఖ్యానించింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 95కూ, ఈ రిట్ పిటిషన్ల వివాదానికీ ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది.
ఈ కేసులో పిటిషనర్లు తాము తెలంగాణలో శాశ్వత నివాసితులమని చెబుతున్నందున, వారు సర్టిఫికెట్ అందజేస్తే మెరిట్ ప్రకారం స్థానిక కోటాలో సీట్లు కేటాయించాలని వర్సిటీని ఆదేశించింది. హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి ప్రశంస రాథోడ్ తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులు. విధి నిర్వహణలో భాగంగా చెన్నైకి బదిలీ కావడంతో అతడు అక్కడే ఇంటర్మీడియెట్ చదివారు. ఒకటి నుంచి 10వ తరగతి వరకు తెలంగాణలోనే చదువుకున్నారు. అయితే, ఇంటర్ చెన్నైలో చదివినందున ఆ విద్యారి్థని నాన్‌లోకల్‌గా పరిగణిస్తామని అధికారులు పేర్కొన్నారు. దీంతో ఇంటరీ్మడియెట్ స్థానికంగా చదవకుంటే నీట్‌లో లోకల్ కోటా (85 శాతం) కిందికి రారంటూ ప్రభుత్వం తెచ్చిన జీవో 114ను ప్రశంస రాథోడ్ హైకోర్టులో సవాల్ చేశారు. లోకల్‌గా పరిగణించకుంటే కేవలం 15 శాతం సీట్లలోనే తాము పోటీ పడాల్సి ఉంటుందని, ఇది చట్టవిరుద్ధమని చెప్పారు. ఇదే తరహా పిటిషన్లను కలిపి ధర్మాసనం విచారణ జరిపి తీర్పు వెలువరించింది.
Comments
Please login to add a commentAdd a comment