MBBS admissions
-
శాశ్వత నివాసితులైతే స్థానికులే..హైకోర్టు కీలక తీర్పు!
వైద్య విద్య సీట్ల భర్తీకి సంబంధించి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. శాశ్వ త నివాసితులైన విద్యార్థులను స్థానికులుగానే పరిగణించాలని స్పష్టం చేసింది. దీనిప్రకారం 2023 –24 ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను భర్తీ చేయాలని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీని ఆదే శించింది. అయితే ప్రభుత్వ అధికారి జారీ చేసిన ఏదైనా స్థానిక సరి్టఫికెట్‌ను వర్సిటీకి సమరి్పంచా లని పిటిషనర్లకు చెప్పింది. తీర్పు వెలువరించిన తేదీ నుంచి వారం రోజుల్లోగా సరి్టఫికెట్‌ను అందజేయాలని పేర్కొంది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మా సనం మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది. ఆ నిబంధన వర్తించదు. ‘తెలంగాణ మెడికల్, డెంటల్ కాలేజీల అడ్మిషన్ నిబంధనలు–2017లోని 3(జీజీజీ)(బీ) ప్రకారం విద్యారి్థని స్థానికుడిగా పరిగణించాలంటే అర్హత పరీక్ష(నీట్)కు ముందు నాలుగేళ్లు తెలంగాణలోనే చదివి ఉండాలని చెబుతోందని.. ఈ నిబంధన రాజ్యాంగంలోని ఆరి్టకల్ 14ను ఉల్లంఘిస్తోందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇలాంటి నిబంధనను తప్పుబడుతూ గతంలో సుప్రీంకోర్టు పలు కేసుల్లో ఉత్తర్వులు కూడా ఇచి్చందని గుర్తుచేసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిబంధనను పూర్తిగా ఎత్తివేయలేమంది. తెలంగాణలోని శాశ్వత నివాసితులకు 3 (జీజీజీ)(బీ) నిబంధన వర్తించదని తేలి్చచెప్పింది. పిటిషనర్ల కేసు.. రూల్ 3 (జీజీజీ)(బీ) కిందకు రాదని యూనివర్సిటీ తరఫు న్యాయవాది కూడా చెబుతున్నారని వ్యాఖ్యానించింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 95కూ, ఈ రిట్ పిటిషన్ల వివాదానికీ ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ఈ కేసులో పిటిషనర్లు తాము తెలంగాణలో శాశ్వత నివాసితులమని చెబుతున్నందున, వారు సర్టిఫికెట్ అందజేస్తే మెరిట్ ప్రకారం స్థానిక కోటాలో సీట్లు కేటాయించాలని వర్సిటీని ఆదేశించింది. హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి ప్రశంస రాథోడ్ తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులు. విధి నిర్వహణలో భాగంగా చెన్నైకి బదిలీ కావడంతో అతడు అక్కడే ఇంటర్మీడియెట్ చదివారు. ఒకటి నుంచి 10వ తరగతి వరకు తెలంగాణలోనే చదువుకున్నారు. అయితే, ఇంటర్ చెన్నైలో చదివినందున ఆ విద్యారి్థని నాన్‌లోకల్‌గా పరిగణిస్తామని అధికారులు పేర్కొన్నారు. దీంతో ఇంటరీ్మడియెట్ స్థానికంగా చదవకుంటే నీట్లో లోకల్ కోటా (85 శాతం) కిందికి రారంటూ ప్రభుత్వం తెచ్చిన జీవో 114ను ప్రశంస రాథోడ్ హైకోర్టులో సవాల్ చేశారు. లోకల్‌గా పరిగణించకుంటే కేవలం 15 శాతం సీట్లలోనే తాము పోటీ పడాల్సి ఉంటుందని, ఇది చట్టవిరుద్ధమని చెప్పారు. ఇదే తరహా పిటిషన్లను కలిపి ధర్మాసనం విచారణ జరిపి తీర్పు వెలువరించింది. -
వైద్యశాఖలో 2,118 పోస్టుల మంజూరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో మూడు వైద్య కళాశాలలను కొత్తగా ప్రారంభించేందుకు వీలుగా కీలక ముందడుగు పడింది. ఇందులో భాగంగా ప్రభుత్వం 2,118 పోస్టులను కొత్తగా మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడం కోసం ప్రభుత్వం 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడేళ్ల వ్యవధిలో ఈ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్లు చేపట్టి కార్యకలాపాలు ప్రారంభించేలా ప్రణాళికలు రచించారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే మచిలీపట్నం, నంద్యాల, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం వైద్య కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఒక్కోచోట 150 సీట్ల చొప్పున 750 ఎంబీబీఎస్ అడ్మిషన్లు చేపట్టనున్నారు. ఇదిలావుండగా వచ్చే విద్యా సంవత్సరంలో ఏఎస్ఆర్ జిల్లా పాడేరు, వైఎస్సార్ జిల్లా పులివెందుల, కర్నూలు జిల్లా ఆదోని వైద్య కళాశాలల కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఒక్కో చోట వైద్య కళాశాలకు 222, బోధనాస్పత్రికి 484 చొప్పున 2,118 పోస్టులను కొత్తగా సృష్టించారు. ఇప్పటికే ఈ మూడు చోట్ల ఉన్న ప్రభుత్వాస్పత్రులను ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా 330 పడకల స్థాయికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ క్రమంలో 16 యూనిట్లతో ఆయా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేయడానికి వీలుగా అడిషనల్ డీఎంఈ హోదాలో సూపరింటెండెంట్, వివిధ పోస్టులను సృష్టించారు. అదేవిధంగా వైద్య కళాశాలకు సంబంధించి అడిషనల్ డీఎంఈ హోదాలో ప్రిన్సిపాల్, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రో బయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, సైకియాట్రీ, జనరల్ సర్జరీ వంటి వివిధ విభాగాలు ఏర్పాటు, పరిపాలన విభాగాలకు సంబంధించిన పోస్టులను మంజూరు చేశారు. ఇదిలావుండగా అన్నమయ్య జిల్లా మదనపల్లి, ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏర్పాటు చేస్తున్న కొత్త వైద్య కళాశాలల్లో కూడా వచ్చే ఏడాది నుంచి అకడమిక్ కార్యకలాపాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని డీఎంఈ డాక్టర్ నరసింహం ‘సాక్షి’తో చెప్పారు. కళాశాల, బోధనాస్పత్రి నిర్మాణ పనులు ఈ రెండుచోట్ల వేగంగా పూర్తవుతున్న నేపథ్యంలో 2025–26కు బదులు 2024–25లో వీటిని అందుబాటులోకి తేవాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ రెండు చోట్ల పోస్టుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నామన్నారు. -
వైద్య విద్యార్థుల గోస.. టీఆర్ఆర్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు రద్దు
టీఆర్ఆర్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు రద్దయిన ఎంబీబీఎస్ ఫస్టియర్ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారిని వివిధ మెడికల్ కాలేజీల్లో సర్దుబాటు చేసినా, ఆ కాలేజీ నుంచి ఫీజు బదిలీ జరగకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. సర్దుబాటు చేసిన కాలేజీలకు ఫీజు చెల్లించకపోతే మొదటి ఏడాది పరీక్ష రాసేందుకు వీలు లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. టీఆర్ఆర్ యాజమాన్యం ఫీజు డబ్బులు బదిలీ చేయకపోవడం లేదా వెనక్కు ఇవ్వకపోవడంతో ఏకంగా బీ, సీ కేటగిరీలకు చెందిన ఏడుగురు విద్యార్థులు వైద్య విద్యకు స్వస్తి చెప్పాల్సివచ్చిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. – సాక్షి, హైదరాబాద్ ఎవ్వరికీ పట్టని విద్యార్థుల గోడు 2021–22 వైద్య విద్యా సంవత్సరంలో ప్రమాణాలకు అనుగుణంగా సౌకర్యాలు లేవంటూ రాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజీల్లోని మొదటి ఏడాది ఎంబీబీఎస్ అడ్మిషన్లను జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) రద్దు చేసిన సంగతి తెలిసిందే. సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్, పటాన్‌చెరులోని టీఆర్ఆర్, వికారాబాద్‌లోని మహవీర్ కాలేజీల్లో మొదటి ఏడాదికి చెందిన మొత్తం 450 ఎంబీబీఎస్ సీట్లను ఎన్ఎంసీ రద్దు చేసింది. దాంతో ఆయా కాలేజీల్లో చేరిన వైద్య విద్యార్థులు అడ్మిషన్లు పొందిన నెలకే రోడ్డున పడ్డారు. వాటిల్లో తొలి ఏడాది చేరిన వైద్య విద్యార్థులు అంతా కలిపి రూ.66 కోట్లు చెల్లించారు. తర్వాత టీఆర్ఆర్, మహావీర్ మెడికల్ కాలేజీలకు చెందిన 300 మంది (ఒక్కో మెడికల్ కాలేజీకి చెందిన 150 మంది) విద్యార్థులను 13 ప్రైవేట్ కాలేజీల్లో సర్దుబాటు చేశారు. ఎమ్మెన్నార్ కాలేజీ విద్యార్థులను మాత్రం తిరిగి అందులోనే కొనసాగించారు. ఈ క్రమంలో టీఆర్ఆర్ కాలేజీ డబ్బులు ఇవ్వకుండా చెక్కులు ఇచ్చింది. అయితే అవి బౌన్స్ అవుతున్నాయి. ముఖ్యంగా బీ, సీ కేటగిరీల్లో పెద్ద మొత్తంలో డొనేషన్లు చెల్లించిన విద్యార్థులకు రసీదులు లేకపోవడం ఒక సమస్య కాగా, కొందరు తక్కువ ధరకు మాట్లాడుకోవడం వల్ల ఇతర కాలేజీల్లో సర్దుబాటుతో అక్కడ పూర్తి స్థాయి ఫీజు చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సీ కేటగిరీకి చెందిన కొందరు విద్యార్థులైతే ఏకంగా ఏడాదికి రూ. 23 లక్షల చొప్పున చెల్లించారు. ఇందులో డొనేషన్ల సొమ్ముకు కాలేజీలు ఎలాంటి రసీదులూ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. బీ, సీ కేటగిరీలకు చెందిన ఓ ఏడుగురు విద్యార్థులు పెద్దమొత్తంలో టీఆర్ఆర్ కాలేజీకి డొనేషన్ చెల్లించారు. కానీ ఆ కాలేజీ యాజమాన్యం ఇప్పటివరకు తిరిగి డబ్బు ఇవ్వకపోవడం, తమకు తిరిగి సీటు కేటాయించిన కాలేజీకీ డబ్బులు బదిలీ చేయకపోవడం.. మళ్లీ ఇక్కడ అంత మొత్తంలో చెల్లించేంత డబ్బు తమ వద్ద లేకపోవడంతో మొత్తంగా ఆ ఏడుగురు విద్యార్థులూ ఎంబీబీఎస్ విద్యకే దూరమయ్యారని అంటున్నారు. కాగా మొత్తం ఈ వ్యవహారంపై కాలేజీ యాజమాన్యం వివరణ కోసం పలుమార్లు ఫోన్ చేసినా వారు స్పందించకపోవడం గమనార్హం. వైద్య విద్యకు దూరం మా అమ్మాయిని సీ కేటగిరీలో టీఆర్ఆర్లో చేర్పించాను. ఒకేసారి రూ. 75 లక్షల ఫీజు చెల్లించాను. ఇతర కాలేజీలో చేరాలంటే అక్కడ డబ్బు చెల్లించాలన్నారు. టీఆర్ఆర్ యాజమాన్యం మాత్రం డబ్బులు బదిలీ చేయలేదు. దీంతో మా అమ్మాయి ఏకంగా ఎంబీబీఎస్ చదువుకే దూరమైంది. – శ్రద్ధ (విద్యార్థిని తల్లి) రసీదులు తెస్తే న్యాయం చేస్తా టీఆర్ఆర్ కాలేజీలో చేరి డబ్బులు చెల్లించినట్లు తల్లిదండ్రులు, విద్యార్థులు తమ వద్దకు రసీదులతో వచ్చి లిఖిత పూర్వక ఫిర్యాదులు చేస్తే, అటువంటి వారికి న్యాయం చేస్తాము. కాలేజీ యాజమాన్యంతో మాట్లాడతాం. – కరుణాకర్‌రెడ్డి, వీసీ, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం రూ.45 లక్షలు చెల్లించా మా అబ్బాయిని టీఆర్ఆర్లో చేర్పించాను. ïఫీజు రూ.75 లక్షలకు మాట్లాడుకున్నాను. అడ్మిషన్ రద్దయ్యే నాటికి రూ. 45 లక్షలు చెల్లించాను. ఇప్పుడు మా అబ్బాయిని కరీంనగర్‌లోకి ఒక కాలేజీలో సర్దుబాటు చేశారు. టీఆర్ఆర్ కాలేజీ చెక్‌లను కరీంనగర్ కాలేజీ అనుమతించడంలేదు. టీఆర్ఆర్ కాలేజీ యాజమాన్యం ఇప్పటివరకు మేం చెల్లించిన సొమ్మును ఇవ్వలేదు. పరీక్ష ఫీజు దగ్గర పడుతోంది. ఫీజు చెల్లించకుంటే పరీక్ష రాసే పరిస్థితి లేదంటున్నారు. – శ్రీనివాసరెడ్డి, ఎంబీబీఎస్ విద్యార్థి తండ్రి చెక్‌లు బౌన్స్ అవుతున్నాయి టీఆర్ఆర్ కాలేజీలో బీ కేటగిరీలో మా అబ్బాయిని చేర్పించాను. మొదటి ఏడాది కింద రూ. 11.25 లక్షల ఫీజు చెల్లించాను. తర్వాత ఆర్వీఎం కాలేజీలో సర్దుబాటు చేశారు. కానీ టీఆర్ఆర్ కాలేజీ యాజమాన్యం మాత్రం ఫీజు ఆర్వీఎం కాలేజీకి బదిలీ చేయలేదు. దీంతో మళ్లీ ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. లేకుంటే పరీక్ష రాయడానికి వీలుండదని చెబుతున్నారు. – రుక్మిణి, (ఎంబీబీఎస్ విద్యార్థి తల్లి) -
జూన్‌లో నీట్? వచ్చే వారంలో నోటిఫికేషన్
సాక్షి,హైదరాబాద్: వైద్య సీట్లల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)–2022 ఈ ఏడాది జూన్‌లో జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వచ్చే వారంలో నోటిఫికేషన్ విడుదలవుతుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వర్గాలు తెలిపాయి. నీట్ పరీక్ష ద్వారా దేశంలోని 532 మెడికల్ కాలేజీల్లో 83,125 ఎంబీబీఎస్సీట్లు, 313 డెంటల్ కాలేజీల్లో 26,949 బీడీఎస్ సీట్లు, 52,720 ఆయుష్, 525 బీవీఎస్సీ సీట్లకు ప్రవేశాలు కల్పించనున్నారు. తెలంగాణలో 2022–23 వైద్య విద్యా సంవత్సరంలో అదనంగా 8 వైద్య కళాశాలలు రానున్నాయి. వాటిల్లో 1,200 ఎంబీబీఎస్ సీట్లు వస్తాయి. మెడికల్ ప్రవేశాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలవుతాయి. ఈ కోటా కింద ఆయా అభ్యర్థులకు 10% రిజర్వేషన్ లభిస్తుంది. ఈడబ్ల్యూఎస్‌కోటాకు అనుగుణంగా ఈసారి 5,200 మెడికల్ సీట్లు రానున్నాయని ఎన్టీఏ వర్గాలు తెలిపాయి. కాగా, ఎయిమ్స్, జిప్ మర్ వంటి ప్రతిష్టాత్మక మెడికల్ విద్యాసంస్థలతో పాటు దేశంలోని అగ్రశ్రేణి వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి యూజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు నీట్ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. నీట్–2021 పరీక్షకు 15 లక్షల మందికి పైగా దేశవ్యాప్తంగా హాజరుకాగా, వీరిలో సుమారు 8 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అభ్యర్థి ర్యాంకు, కేటగిరీని బట్టి మెడికల్ కాలేజీల్లో సీటు దక్కుతుంది. ఈ పరీక్షను ఆఫ్‌లైన్ మోడ్‌లోనే నిర్వహిస్తారు. -
NEET UG 2021: ర్యాంక్ సాధించే మార్గం!
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్–అండర్ గ్రాడ్యుయేట్.. సంక్షిప్తంగా.. నీట్–యూజీ! జాతీయ స్థాయిలో.. సెంట్రల్ యూనివర్సిటీలు, స్టేట్ యూనివర్సిటీలు, ఇతర అన్ని మెడికల్ ఇన్స్టిట్యూట్స్లో.. ఎంబీబీఎస్, బీడీఎస్లతోపాటు ఆయుష్ కోర్సుల్లో చేరాలంటే.. నీట్–యూజీ ఎంట్రన్స్‌లో స్కోరే ప్రధానం! నీట్లో సాధించిన స్కోర్ ఆధారంగానే మెడికల్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. అందుకే.. ఇంటర్మీడియెట్ బైపీసీ అర్హతగా నిర్వహించే ఈ పరీక్షకు.. ఏటేటా పోటీ పెరుగుతోంది. నీట్–యూజీ–2021 తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారికంగా ప్రకటించింది. ఆగస్ట్ 1వ తేదీన ఈ పరీక్ష జరుగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో.. నీట్–యూజీ 2021 విధి విధానాలు.. పరీక్ష ప్యాట్రన్.. ఈ టెస్ట్‌లో మంచి స్కోర్ సాధించడానికి నిపుణుల సలహాలు.. ఎంబీబీఎస్, బీడీఎస్.. దేశంలో లక్షల మంది విద్యార్థుల కల. తమ డాక్టర్ కలను సాకారం చేసుకునే దిశగా.. నీట్ యూజీలో ర్యాంకు సాధిం చేందుకు ఇంటర్ తొలిరోజు నుంచే కృషి చేస్తుంటారు. ఇంతటి కీలకమైన నీట్–యూజీ –2021 తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఇటీవల వెల్లడించింది. దీంతో విద్యార్థులు ఈ పరీక్షలో స్కోర్ సాధించే దిశగా కసరత్తు ముమ్మరం చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పొచ్చు. మొత్తం పదకొండు భాషలు నీట్–యూజీని తెలుగు సహా మొత్తం పదకొండు భాషల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది. విద్యార్థులు దరఖాస్తు సమ యంలోనే తమకు ఆసక్తి ఉన్న భాషను ఎంచు కుంటే.. ఆ భాషలోనే పరీక్ష పేపర్‌ను అందిస్తారు. ఒక్కసారే.. ఆఫ్‌లైన్‌లోనే నీట్‌ను కూడా జేఈఈ మెయిన్ మాదిరిగానే ఒకటి కంటే ఎక్కువసార్లు నిర్వహించే అవకాశముందనే వార్తలు ఇటీవల వినిపించాయి. వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెడుతూ.. గతేడాది మాదిరిగానే నీట్ ఈ ఏడాది ఒక్కసారి మాత్రమే జరుగుతుందని ఎన్టీఏ స్పష్టం చేసింది. అది కూడా ఆఫ్‌లైన్ విధా నంలో పెన్ పేపర్ పద్ధతిలో నిర్వహించనున్న ట్లు పేర్కొంది. దీంతో విద్యార్థులకు పరీక్ష నిర్వహణపై ఒక స్పష్టత వచ్చింది. కాబట్టి ఇప్పుడిక ఎలాంటి ఆందోళన లేకుండా.. పూర్తిగా ప్రిపరేషన్‌కు ఉప క్రమించాలని నిపుణులు సూచిస్తున్నారు. 180 ప్రశ్నలు.. 720 మార్కులు నీట్ యూజీకి అర్హత ఇంటర్మీడియెట్ బైపీసీ. ఈ పరీక్ష మొత్తం మూడు విభాగాల్లో 180 ప్రశ్నలకు ఆబ్జెక్టివ్ (బహుళైచ్ఛిక ప్రశ్నలు) విధానంలో జరుగుతుంది. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు చొప్పున 720 మార్కులకు నీట్ పరీక్ష ఉంటుంది. వివరాలు.. సిలబస్ కుదింపు కష్టమే కొవిడ్ కారణంగా ఇంటర్మీడియెట్, సీబీఎస్ఈ +2 స్థాయిలో సిలబస్‌ను తగ్గించిన సంగతి తెలిసిందే. దాంతో నీట్ సిలబస్‌ను కూడా కుదిస్తారా? అనే సందేహం విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది. కాని నీట్ సిలబస్ గతేడాది మాదిరిగానే యథాతథంగా ఉంటుందని, ఎలాంటి మార్పులు ఉండవని కొన్ని రోజుల క్రితం కేంద్ర విద్యా శాఖ మంత్రి ట్వీట్ ద్వారా తెలిపారు. జేఈఈ–మెయిన్ మాదిరిగానే నీట్‌లోనూ ఛాయిస్ విధానం ఉంటుందా అనే వాదన కూడా వినిపిస్తోంది. దీనిపైనా మరో వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అవగాహన ముఖ్యం నీట్–యూజీ–2021కు తేదీ వెల్లడైంది. కాబట్టి ఇప్పటి నుంచి అందుబాటులో ఉన్న సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ఇంటర్ పరీక్షల ప్రిపరేషన్‌తో సమన్వయం చేసుకుంటూ.. నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు సాగాల్సి ఉంటుంది. తొలుత అభ్యర్థులు నీట్ సిలబస్‌పై పూర్తి స్థాయి అవగాహన తెచ్చుకోవాలి. ఆ తర్వాతే ప్రిపరేషన్‌కు ఉపక్రమించాలి. సిలబస్‌లో పేర్కొన్న దానికి అదనంగా ఇతర అంశాలను చదవాల్సిన అవసరం లేదు. నీట్, బోర్డ్ సిలబస్‌లో కొన్ని కామన్ టాపిక్స్ ఉంటాయి. ఆయా అంశాలను మొదట బోర్డు ఎగ్జామ్స్ కోణంలో ప్రిపేరవ్వాలి. దీనివల్ల ఎంతో విలువైన సమయం ఆదా అవుతుంది. టైమ్ ప్లాన్ కూడా ► నీట్ విద్యార్థులు ఆయా సబ్జెక్టుల ప్రిపరేషన్ కోసం ముందుగానే నిర్దిష్ట సమయ ప్రణాళికను రూపొందించుకోవాలి. దానికి కట్టుబడి ప్రిపరేషన్ సాగించాలి. ► ప్రిపరేషన్ టైమ్ టేబుల్‌ను తప్పనిసరిగా ఏరోజుకారోజు అనుసరించాలి. ► నీట్ సిలబస్‌కు అనుగుణంగా ఆయా సబ్జెక్ట్‌లకు కేటాయించాల్సిన సమయాన్ని నిర్దేశించుకోవాలి. ► నిర్దిష్ట సమయంలో సిలబస్‌ను పూర్తి చేసేలా ముందుకు కదలాలి. ► ఈ సమయంలో అభ్యర్థులంతా స్వీయ సామర్థ్యాలపై స్పష్టతతో వ్యవహరించాలి. ► ప్రతి సబ్జెక్టుకూ సమానంగా సమయం కేటాయించుకోవాలి. ► ప్రతి రోజు చదవాల్సిన టాపిక్స్‌ను ముందుగానే విభజించుకుని.. దానికి అనుగుణంగా అధ్యయనం చేయాలి. ► ప్రతి రోజు మాక్ టెస్టులకు హాజరవ్వాలి. ఫలితంగా స్వీయ సామర్థ్యాలపై అవగాహన వస్తుంది. ఇంకా ఏఏ సబ్జెక్ట్‌లలో పట్టు సాధించాలనే దానిపై స్పష్టత లభిస్తుంది. ► సబ్జెక్ట్ పరంగా బలహీనంగా ఉన్న అంశాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి. ► పరీక్షకు రెండు నెలల ముందు కొత్త చాప్టర్లు, అంశాల జోలికి వెళ్లకూడదు. ఈ సమయాన్ని పూర్తిగా రివిజన్‌కే కేటాయించాలి. ► మోడల్ ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయాలి. ► డైరెక్ట్ కొశ్చన్స్ కంటే ఇన్ డైరెక్ట్ కొశ్చన్స్‌నే ఎక్కువ అడుగుతున్న విషయాన్ని గుర్తించాలి. దీనికి అనుగుణంగా మోడల్ టెస్ట్‌లను వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ► ఇంటర్ పరీక్షలకు నెల రోజుల ముందు వరకు నీట్ ప్రిపరేషన్‌ను సమాంతరంగా కొనసాగించొచ్చు. ► ఇంటర్మీడియెట్ పరీక్షలకు నెల రోజుల ముందు నుంచి పూర్తిగా బోర్డ్ పరీక్షలకే సమయం కేటాయించాలి. ► ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తయ్యాక.. తిరిగి నీట్‌కు పూర్తిస్థాయిలో ప్రిపరేషన్ సాగించాలి. ► ప్రిపరేషన్ సమయంలోనే షార్ట్ నోట్స్ రూపొందించుకోవాలి. ఇది రివిజన్‌కు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. సబ్జెక్టుల వారీగా నిపుణుల ప్రిపరేషన్ టిప్స్ ఫిజిక్స్.. ఈ టాపిక్స్ ప్రధానం నీట్ ఫిజిక్స్ విభాగంలో మంచి స్కోర్ సాధించాలంటే.. ఆప్టిక్స్, మెకానిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మోడరన్ ఫిజిక్స్ చాప్టర్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో అధ్యాయానికి చివర ఇచ్చిన ప్రశ్నలను సాధించాలి. అవకలనం, సమాకలనం అనువర్తనాలపై పట్టు సాధించాలి. ఇంటర్ రెండేళ్ల పాఠ్యాంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. పైన పేర్కొన్న చాప్టర్లతోపాటు మిగిలిన సిలబస్ అంశాలను అధ్యయనం చేయాలి. గత రెండేళ్ల ప్రశ్నల సరళిని పరిశీలిస్తే.. రొటేషనల్ డైనమిక్స్, సిగ్మా పార్టికల్స్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాలని అర్థం అవుతోంది. అదేవిధంగా ఎలక్ట్రోమ్యాగ్నటిజం, ఇండక్షన్, కరెంట్ ఎలక్ట్రిసిటీ వంటి చాప్టర్లు విద్యార్థులకు అంత త్వరగా ఎక్కవు. వీటిని చదవడంతోపాటు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని గుర్తించాలి. - ఎన్.నరసింహమూర్తి, సబ్జెక్ట్ నిపుణులు కెమిస్ట్రీ.. పునశ్చరణ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, మోల్ కాన్సెప్ట్, కెమికల్ బాండింగ్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కోఆర్డినేషన్ కాంపౌండ్, ఈక్విలిబ్రియమ్, పాలిమర్లు, బయో మాలిక్యూల్స్, పరమాణు నిర్మాణం, సాలిడ్ స్టేట్, ద్రావణాలు, సర్ఫేజ్ కెమిస్ట్రీ తదితరాలను కెమిస్ట్రీలో కీలక పాఠ్యాంశాలుగా పేర్కొవచ్చు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో.. ఐసోమెరిసమ్, సమ్మేళనాల తయారీ, ధర్మాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. కెమిస్ట్రీలో విద్యార్థులు చర్యలు, సమీకరణాలను మర్చిపోతుంటారు. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు పునఃశ్చరణ చేయాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో.. వివిధ మూలకాలు, వాటి సమ్మేళనాల ధర్మాలను అధ్యయనం చేయాలి. కెమిస్ట్రీలో.. ఫిజికల్, ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలను వాటి వాటి స్వభావాల ఆధారంగా ప్రిపేరవ్వాలి. ఫిజికల్ కెమిస్ట్రీ విషయానికొస్తే... ఇందులో ఫార్ములాలతో సొంత నోట్స్ రూపొందిం చుకోవాలి. ఫలితంగా ఫార్ములాను అన్వయించే నైపుణ్యాలు సొంతమవుతాయి. పీరియాడిక్ టేబుల్‌పై పట్టు సాధిస్తే.. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మంచి మార్కులు సాధించొచ్చు. పునశ్చరణ చేస్తూ, మాదిరి ప్రశ్నలు సాధించడం ద్వారా.. పరీక్షకు కావల్సిన సన్నద్ధత లభిస్తుంది. - విజయ్ కిశోర్, కెమిస్ట్రీ సబ్జెక్ట్ నిపుణులు బయాలజీ.. కాన్సెప్ట్లపై పట్టు నీట్–యూజీ పరీక్షలో కీలకంగా భావించే విభాగంగా బయాలజీని పేర్కొనొచ్చు. ఇంటర్ బైపీసీ విద్యార్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ కంటే బయాలజీపై ఎక్కువ పట్టు కలిగి ఉంటారు. నీట్ బయాలజీలో రాణించాలంటే.. ఫిజియాలజీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, మార్ఫాలజీ, జెనిటిక్స్ అండ్ ఎవల్యూషన్, సెల్ బయాలజీ, బయోటెక్నాలజీ, హ్యూమన్ ఫిజియాలజీ, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్‌లను ముఖ్య చాప్టర్లుగా భావించి చదవాలి. అన్ని అంశాలకు సంబంధించి కాన్సెప్ట్ట్‌లపై పట్టు సాధించాలి. ఎకాలజీలో ఆర్గనైజేషన్స్ అండ్ పాపులేషన్, ఎకోసిస్టమ్‌పై ప్రశ్నలు వస్తున్నాయి. వీటితోపాటు బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ పాఠ్యాంశాలపై ఫోకస్ చేయడం లాభిస్తుంది. ప్లాంట్ ఫిజియాలజీలో.. ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, మొక్కల హార్మోనులు, ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్ చాప్టర్లను ప్రిపేరవ్వాలి. సెల్ స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్‌లో కణ విభజన(సమ విభజన, క్షయకరణ విభజన)లోని వివిధ దశల్లో జరిగే మార్పులు, కణచక్రం తదితరాలను అధ్యయనం చేయాలి. బయోమాలిక్యూల్స్ నుంచి కంటెంట్ సంబంధిత ప్రశ్నలు వస్తాయి. రీప్రొడక్షన్ నుంచి దాదాపు 10 ప్రశ్నల వరకు అడుగుతున్నారు. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థను బాగా అధ్యయనం చేయాలి. మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్‌హెరిటన్స్‌లో రెప్లికేషన్, ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్, రెగ్యులేషన్లపై దృష్టిపెట్టాలి. నీట్లో ఇంటర్ సిలబస్‌లో లేని అంశాలను గుర్తించి.. వాటికోసం ప్రత్యేక సమయం కేటాయించాలి. - బి.రాజేంద్ర, బోటనీ సబ్జెక్ట్ నిపుణులు జువాలజీలో ఇలా జువాలజీలో గత రెండేళ్ల ప్రశ్న పత్రాలను పరిగణనలోకి తీసుకుంటే.. మొత్తం 45 ప్రశ్నల్లో హ్యూమన్ ఫిజియాలజీ నుంచి 14, ఎకాలజీ నుంచి 10–12, జెనిటిక్స్, ఎవల్యూషన్ కలిపి 6 ప్రశ్నలు వరకు వస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు ఆయా పాఠ్యాంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్‌సీఈఆర్‌టీతోపాటు ఇంటర్ పుస్తకాల నుంచీ ప్రశ్నలు అడుగుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని గత ప్రశ్న పత్రాలను, ఇంటర్లో ఆయా చాప్టర్స్ చివరలో అడిగే ప్రశ్నలను సాధన చేయాలి. ఎన్సీఈఆర్టీ, ఇంటర్ పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. ఇలా చేస్తే ఆశించిన ర్యాంకు సొంతమవడం ఖాయం. - కె.శ్రీనివాస్, జువాలజీ సబ్జెక్ట్ నిపుణులు అనలిటికల్ అప్రోచ్‌తో ఎంతో మేలు నీట్ ప్రిపరేషన్ క్రమంలో అనలిటికల్ అప్రోచ్‌తో సాగితే..ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. ప్రతి రోజు తాము చదివిన అంశాలతో షార్ట్ నోట్స్ రూపొందించుకోవడం, ఇన్స్టిట్యూట్లు నిర్వహించే వీక్లీ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లకు హాజరు కావడం కూడా ఎంతో మేలు చేస్తుంది. – అనంత పరాక్రమ్ భార్గవ్, నీట్–2020 11వ ర్యాంకు నీట్–యూజీ(2021) సమాచారం ► నీట్ పరీక్ష తేదీ: ఆగస్ట్ 1, 2021 ► పరీక్ష వ్యవధి: మూడు గంటలు(పెన్, పేపర్ విధానంలో) ► అర్హత: బైపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► నీట్‌కు బైపీసీతో ఉత్తీర్ణత అని పేర్కొన్నప్పటికీ.. ప్రవేశాల సమయంలో కొన్ని ఇన్స్టిట్యూట్లు బైపీసీ గ్రూప్ సబ్జెక్ట్‌లలో 50 శాతం మార్కులు పొంది ఉండాలనే నిబంధన విధిస్తున్నాయి. ► వయో పరిమితి: కనిష్ట వయోపరిమితి 17 ఏళ్లు, గరిష్ట వయో పరిమితి 25 ఏళ్లు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ► పూర్తి నోటిఫికేషన్ ఏప్రిల్ మొదటి వారంలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ► పూర్తి వివరాలకు వెబ్‌సైట్స్: https://ntaneet.nic.in, https://nta.ac.in -
64 ఏళ్ల వయస్సులో ఎంబీబీఎస్
భువనేశ్వర్: 40 ఏళ్లపాటు బ్యాంకు ఉద్యోగం చేసి, 4 దశాబ్దాల పాటు సంసార సాగరాన్ని ఈది, పిల్లలను పెంచి పెద్దచేసి, ప్రయోజకులను చేశాక ఎవరైనా సంతృప్తిగా ఊపిరి పీల్చుకుంటారు. కానీ, ఒడిశాకు చెందిన 64 ఏళ్ళ విశ్రాంత బ్యాంకు ఉద్యోగి జై కిశోర్ ప్రధాన్ మాత్రం అలా అనుకోలేదు. డాక్టర్ అవ్వాలన్న తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు వయస్సుని పక్కనబెట్టి కృషి చేశారు. ఎట్టకేలకు నీట్లో 175 మార్కులు పొంది, 5,94,380 స్కోరుని సాధించి, ఒడిశాలోని బర్లాలో ప్రభుత్వ, వీర్ సురేంద్ర సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ కాలేజీలో నాలుగేళ్ళ ఎంబీబీఎస్ కోర్సులో చేరి తన కల నిజం చేసుకున్నారు. ప్రధాన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 2016లో డిప్యూటీ మేనేజర్‌గా రిటైర్ అయ్యారు. 1970లో ఇంటర్మీడియట్ అయిన తరువాత ఒకసారి ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాశారు. సీటు రాకపోవడంతో బీఎస్సీలో చేరారు. అయితే అప్పటి నుంచి తన కోరిక అసంపూర్ణంగానే ఉండిపోయింది. 15 ఏళ్ళు బ్యాంకు ఉద్యోగం చేశాక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని, ఇదే ప్రయత్నం చేయాలను కున్నప్పటికీ కుటుంబం గడవడం కష్టమని భావించారు. కూతుళ్ళిద్దరూ నీట్కి ప్రిపేర్ అవుతుండడంతో వారిని చదివిస్తూ తాను కూడా కృషిని కొనసాగించారు ప్రధాన్. 2019లో సుప్రీంకోర్టు నీట్ పరీక్షకు వయోపరిమితిని తాత్కాలికంగా ఎత్తివేయ డంతో ఇది సాధ్యమైందంటారు ప్రధాన్. అయితే తన కూతుళ్ళలో ఒకరు ఇటీవల మృతి చెందడంతో ప్రధాన్ కుటుంబాన్ని విషాదం వీడలేదు. తన కూతురుకు గుర్తుగా ఈ చదువుని కొనసాగిస్తానంటున్నారు ప్రధాన్. -
‘నీట్’తోనే ఎయిమ్స్, జిప్మర్ ప్రవేశాలు
న్యూఢిల్లీ చెన్నై: ఆల్ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్)లో ప్రవేశాలను వచ్చే ఏడాది నుంచి నీట్ ద్వారానే చేపట్టనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ప్రస్తుతం ఈ రెండు మినహా మిగతా అన్ని కాలేజీల్లో ఎంబీబీఎస్ ప్రవేశాలను నీట్ ద్వారా చేపడుతున్నారు. జాతీయ మెడికల్ కమిషన్ యాక్ట్ ప్రకారం వచ్చే ఏడాది నుంచి అన్ని కాలేజీల్లో ఎంబీబీఎస్ ప్రవేశాలను నీట్ ద్వారానే జరపనున్నట్లు మంత్రి వెల్లడించారు. దీంతో అన్ని కాలేజీలకు ఒకేసారి కౌన్సెలింగ్ నిర్వహించే వీలు ఉంటుందన్నారు. తమ మంత్రిత్వశాఖ కింద పనిచేసే ఎయిమ్స్, జిప్మర్లో ప్రవేశానికి ఇకపై ప్రత్యేక పరీక్ష ఉండదని వెల్లడించారు. ఎన్ఎంసీ ప్రకారం పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు, ప్రాక్టీస్ లైసెన్స్ పొందడానికి ‘నెక్ట్స్’పరీక్ష నిర్వహించే ఆలోచనలో ఉన్నామన్నారు. దేశమంతటా నీట్ కుంభకోణం నీట్ ఎంట్రెన్స్‌లో అవకతవకలకు పాల్పడి తప్పుడు మార్గంలో మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు పొందిన వ్యవహారంపై కేంద్రానికి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కుంభకోణం తమిళనాడుకే పరిమితంకాదని, దేశవ్యాప్తంగా విస్తరించి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేసింది. కేవీ ఉదిత్ సూర్య అనే విద్యార్థి అక్రమంగా మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందారంటూ సూర్యతోపాటు ఆయన తండ్రి డాక్టర్ వీకే వెంకటేశన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కుంభకోణంపై హైకోర్టు కేంద్ర ఆరోగ్య, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై ప్రతిస్పందించాలని పేర్కొంది. ఇప్పటివరకు ఐదుగురు విద్యార్థులు తమ తరఫున వేరే వారితో ఎంట్రెన్స్ రాయించారని తేలింది. -
రిజర్వేషన్లకు లోబడే మెడికల్ అడ్మిషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది రెండో విడత ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలు చట్టబద్ధంగా జరిగాయని, రిజర్వేషన్ల అమల్లో తప్పులు జరగలేదని హైకోర్టు తీర్పు చెప్పింది. నిబంధనల మేరకే ప్రవేశాలు జరిగాయని, రిజర్వేషన్ల అమలు వల్ల ఎవరికీ నష్టం జరగలేదని న్యాయమూర్తులు జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, జస్టిస్ పి.కేశవరావుల ధర్మాసనం సోమవారం స్పష్టం చేసింది. రెండో విడత వైద్య విద్య ప్రవేశాలను జీవోలు 550, 114 ప్రకారం జరగలేదని పేర్కొంటూ ఆదిలాబాద్ జిల్లా ఎన్.భావన మరో నలుగురు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. దీంతో గతంలో హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల అమలు రద్దయింది. తొలి విడత ప్రవేశాల్లో వివిధ కారణాల వల్ల మిగిలిపోయిన సీట్లను ఓపెన్ కేటగిరీ ద్వారా భర్తీ చేశాకే రిజర్వేషన్ కోటా భర్తీ చేయాలని జీవోలు స్పష్టం చేస్తున్నాయని, అయితే కాళోజీ వర్సిటీ అధికారులు రెండో విడత సీట్లను ముందుగా రిజర్వేషన్ కేటగిరీ సీట్లను భర్తీ చేసిన తర్వాత ఓపెన్ కోటా సీట్లను భర్తీ చేశారనే వాదన సరికాదని తేల్చింది. అయితే కౌన్సెలింగ్‌లో చట్ట నిబంధనల అమలు విషయంలో వర్సిటీ కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు అనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘రెండు విడతల ప్రవేశాలు జరిగాక వర్సిటీ ఇచ్చిన వివరాల్ని పరిశీలిస్తే రిజర్వేషన్ కేటగిరీకి అన్యాయం జరగలేదని స్పష్టం అవుతోంది. 2,487 సీట్ల భర్తీ తర్వాత 1,800 సీట్లు రిజర్వ్డ్ అభ్యర్థులకు లభించాయి. ఓసీలకు 687 సీట్లు వచ్చాయి. ఓపెన్ కోటాలో 137, మిగిలిన 1,663 సీట్లు రిజర్వేషన్ కోటాలో రిజర్వేషన్ వర్గాలకు సీట్లు దక్కాయి. ఓపెన్ కోటాలో ప్రతిభావంతులైన రిజర్వేషన్ వర్గాలకు చెందిన 440 సీట్ల భర్తీలోనూ తప్పులేమీ కన్పించలేదు’ అని ధర్మాసనం వివరించింది. స్పష్టం చేసి ఉండాల్సింది: జీవో 550ను 2001లో జారీ చేశారు. ఆ జీవోను పేరా 5 ప్రకారం ఓపెన్ కేటగిరీ సీటు ఎంపిక చేసుకున్న రిజర్వ్డ్ కోటా అభ్యర్థి తర్వాత దాన్ని వదులుకుని రిజర్వేషన్ కోటాలో సీటు పొందితే.. ఓపెన్ కోటాలో వదిలిన సీటును రిజర్వ్డ్ కోటా అభ్యర్థితోనే భర్తీ చేయాలి. దీనినే ప్రభుత్వం జీవో 114లో పేర్కొంది. ఫలితంగా జీవో 550 రద్దు అయినట్లే. జీవో 114 గురించి ప్రభుత్వం హైకోర్టు, సుప్రీం కోర్టులకు నివేదించింది. దీని గురించి వర్సిటీ సీట్ల భర్తీకి నిర్వహించే కౌన్సెలింగ్‌లో అభ్యర్థులకు స్పష్టం చేయలేదు. దీంతో జీవో 550 వినియోగంలో ఉందనే ఆశల్లో పలువురు ఉండిపోయారు. ఈ విషయంలో కాళోజీ వర్సిటీ స్పష్టత ఇచ్చి ఉంటే బాగుండేదని ధర్మాసనం తప్పుపట్టింది. -
వచ్చే ఏడాదే మన ఎయిమ్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఏర్పాటు చేయబోయే అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో ఎంబీబీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2019–20 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 14 ఎయిమ్స్‌లలో ఒకేసారి ప్రవేశాలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని బీబీనగర్‌లో ఎయిమ్స్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల కేంద్ర బృందం అక్కడికి వచ్చి నిమ్స్ భవనాలు, అదనపు స్థలాలను పరిశీలించింది. ఎంబీబీఎస్‌లో ప్రవేశాల్లో భాగంగా తెలంగాణ ఎయిమ్స్‌కు కూడా ప్రవేశాలు జరిపేలా నోటిఫికేషన్ ఇవ్వడంతో ఎయిమ్స్ ఏర్పాటు వచ్చే ఏడాదే ఉంటుందని స్పష్టమైంది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి, బఠిండా, భోపాల్, భువనేశ్వర్, గోరఖ్‌పూర్, దేవ్‌గఢ్, జోధ్‌పూర్, కల్యాణి, నాగ్‌పూర్, పట్నా, రాయ్‌పూర్, రాయ్‌బరేలీ, రిషికేశ్‌ల్లో ఉన్న ఎయిమ్స్‌ల్లోనూ ప్రవేశాలు జరుపుతామని నోటిఫికేషన్లో వెల్లడించారు. మే 25, 26 తేదీల్లో ఎంట్రన్స్ టెస్ట్ అన్ని ఎయిమ్స్‌ల్లో ఎంబీబీఎస్ ప్రవేశాలకు ప్రత్యేక పరీక్ష నిర్వహించనున్నారు. అందుకోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు. జనవరి మూడో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష వచ్చే ఏడాది మే 25, 26 తేదీల్లో నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రాల వివరాలు ఎయిమ్స్ వెబ్సైట్లో పొందుపరిచారు. ఇంటర్మీడియెట్ బైపీసీ విద్యార్థులు ఎంబీబీఎస్ కోర్సుకు అర్హులు. అలాగే ఎంబీబీఎస్‌లో ప్రవేశం పొందాలంటే ప్రవేశ పరీక్షలో సరైన ర్యాంకు రావడంతోపాటు ఇంటర్మీడియెట్‌లోని ఇంగ్లీషు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీలు 50 శాతం, వికలాంగులు 45 శాతం మార్కులు సాధించి ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎయిమ్స్ ఏర్పాటుకు మొదలైన సన్నాహాలు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఎయిమ్స్ ద్వారా ఎంబీబీఎస్ అడ్మిషన్లు చేపట్టాలని తెలంగాణ ప్రభు త్వం అక్టోబర్‌లో కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి.. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్‌కు అప్పట్లో లేఖ రాశారు. నిమ్స్ భవనాలను, అక్కడి భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఎయిమ్స్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకోవాలని కోరారు. శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత భవనంలో ఓపీ సేవలను ప్రారంభించాలని విన్నవించారు. ఇచ్చిన స్థలంలో భవనాల నిర్మాణం చేసుకోవచ్చని తెలిపారు. బీబీనగర్‌లో ప్రస్తుతమున్న 150 ఎకరాల ప్రాంగణం, ఇంకా అవసరమైన మరో 50 ఎకరాల స్థలాన్ని అంతకుముందు కేంద్ర బృందం పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేసింది. స్థలానికి సంబంధించి డాక్యుమెంట్లు, ఇతరత్రా సమాచారాన్ని కేంద్రం తీసుకుంది. అంతేగాక ఎయిమ్స్ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. -
ఎయిమ్స్ ఎంబీబీఎస్ అడ్మిషన్లు ప్రారంభించండి
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎయిమ్స్ ద్వారా ఎంబీబీఎస్ అడ్మిషన్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు సీఎస్ ఎస్కే జోషి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్‌కు లేఖ రాశారు. అలాగే నిమ్స్ భవనాలను, అక్కడి భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఎయిమ్స్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) చేసుకోవాలని కోరారు. శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత భవనంలో ఓపీ సేవలను ప్రారంభించాలని విన్నవించారు. ఎయిమ్స్ కోసమే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఎయిమ్స్ కోసం టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు వేదికగా పోరాటం చేశారు. పార్లమెంటు వెలుపల కూడా కేంద్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రులను కలసి వినతిపత్రాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
ఎంబీబీఎస్‌కు దరఖాస్తులు 3,000
- ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - 18 వరకు గడువు.. 20న ప్రొవిజనల్ మెరిట్ జాబితా సాక్షి, హైదరాబాద్ 2017–18 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆదివారం నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. తొలి రెండు రోజుల్లో 3 వేల మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ఉత్తీర్ణత ఆధారంగా రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీల్లో మొత్తం సీట్లకు, ప్రైవేటు వైద్య కాలేజీల్లో 50 శాతం సీట్ల భర్తీకి కాళోజీ విశ్వవిద్యాలయం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ నిర్వహిస్తోంది. జూలై 18 సాయంత్రం 5 గంటలకు దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. జూలై 20న అభ్యర్థుల ప్రొవిజనల్ మెరిట్ జాబితాను ఆరోగ్య విశ్వవిద్యాలయం వెబ్సైట్లో ఉంచనుంది. అనంతరం విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఆ తర్వాత అభ్యర్థుల తుది మెరిట్ జాబితాను వెల్లడిస్తారు. ఈ జాబితా ఆధారంగా అభ్యర్థులు కాలేజీల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుల కోసం కాళోజీ విశ్వవిద్యాలయం http://medadm.tsche.in వెబ్‌సైట్‌ను అందుబాటులో ఉంచింది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 11 వెర్షన్ మాత్రమే ఉపయోగించి దరఖాస్తులు సమర్పించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆధార్ తప్పనిసరి.. ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల ఆన్లైన్ దరఖాస్తులో రిజిస్ట్రేషన్/వెరిఫికేషన్ రుసుము కింద ఓïసీ, బీసీ కేటగిరి అభ్యర్థులు రూ.2,500లను, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2 వేలు చెల్లించాల్సి ఉంటుంది. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల్లో ఏదో ఒక పద్ధతిలో చెల్లించాలని నోటిఫికేషన్లో సూచించారు. దరఖాస్తు సమయంలో విద్యార్థులు నీట్ అడ్మిట్ కార్డు, ర్యాంకు కార్డు, పదో తరగతి లేదా సమానమైన విద్యార్హతల సర్టిఫికెట్లో ఉండే పుట్టిన తేదీ వివరాలను, ఇంటర్మీడియట్, తత్సమానమైన విద్యార్హతను ధ్రువీకరించే మార్కుల మెమో, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీసర్టిఫికెట్లు, కేటగిరీ సర్టిఫికెట్, ఆధార్ కార్డులను తప్పనిసరిగా దగ్గర ఉంచుకుని వివరాలు నమోదు చేయాలని పేర్కొన్నారు. -
మెడికల్ కౌన్సెలింగ్ ఏదీ?
* ఎంబీబీఎస్ ప్రవేశాలపై స్పష్టత ఇవ్వని సర్కారు * ఇప్పటికీ ఏర్పాట్లపై దృష్టిసారించని వైద్యారోగ్యశాఖ * ఎప్పుడు నిర్వహిస్తారో తెలియని వైనం.. ఆందోళనలో విద్యార్థులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహణపై గందరగోళం నెలకొంది. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ తేదీలు ఖరారైనా మెడికల్ కౌన్సెలింగ్‌పై మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టతా రాలేదు. ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారన్న దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అసలు ఇది తమకు సంబంధించిన అంశం కాదన్నట్లుగా వైద్యారోగ్య శాఖ వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ తేదీలను, స్థలాన్ని నిర్ణయించాల్సిన బాధ్యత తమదన్న ఆలోచన కూడా వైద్యారోగ్యశాఖకు లేకపోవడం గమనార్హం. అసలు ఓ ఉన్నతాధికారి అయితే ఇది ఉన్నత విద్యామండలి తీసుకోవాల్సిన నిర్ణయంగా చెబుతుండటం గమనార్హం. మరోవైపు మెడికల్ కౌన్సెలింగ్‌పై ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రైవేటు ఎం-సెట్ నిర్వహించిన కళాశాలలు తూతూమంత్రంగా కౌన్సెలింగ్ నిర్వహించి, ఇప్పటికే సీట్లు కొనేసుకున్నవారికి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక లేదు. మొత్తంగా అటు ప్రభుత్వ సీట్లు.. ఇటు ప్రైవేటు సీట్లకు సంబంధించిన కౌన్సెలింగ్‌పై స్తబ్దత నెలకొంది. ఎవరి ఆధ్వర్యంలో.. తెలంగాణలో మొత్తం 2,600 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. వాటిలో 850 సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో, 1,750 సీట్లు ప్రైవేటు కళాశాలల్లో ఉన్నాయి. ప్రైవేటు కాలేజీల్లోని ‘ఏ’ కేటగిరీ సీట్లలో 50 శాతాన్ని ప్రభుత్వం కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తుంది. ‘బీ’ కేటగిరీలో 35 శాతం యాజమాన్య కోటా సీట్లకు ప్రత్యేకంగా ప్రైవేటు ఎం-సెట్ నిర్వహించారు. వాటికి ప్రత్యేక కౌన్సెలింగ్ జరిపి సీట్లు భర్తీ చేస్తారు. మిగతా 15 శాతం సీట్లను ఎన్నారై కోటా కింద ప్రైవేటు యాజమాన్యాలు భర్తీ చేసుకుంటాయి. ఎంసెట్ మెడికల్ విభాగానికి 92 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. గత నెల 14న పరీక్ష నిర్వహించి, అదే నెల 27న ఫలితాలు ప్రకటించారు. ఇది జరిగి దాదాపు నెల రోజులు కావస్తున్నా.. వైద్యారోగ్యశాఖ అధికారుల్లో చలనం లేదు. అసలు తెలంగాణ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఎక్కడ నిర్వహిస్తారన్న అంశంలోనూ స్పష్టత లేదు. వరంగల్‌లో ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినా ఇప్పటివరకు రిజిస్ట్రార్‌ను కానీ, కార్యనిర్వాహక మండలిని కానీ ఏర్పాటు చేయలేదు. దీంతో అక్కడ కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ ఆధ్వర్యంలోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తారని అంటున్నారు. అయితే పీజీ కౌన్సెలింగ్‌లో తమకు అన్యాయం జరిగిందని అప్పట్లో తెలంగాణ వైద్య విద్యార్థులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ఏపీలో జరిపితే అన్యాయం జరుగుతుందని పేర్కొంటున్నారు. కౌన్సెలింగ్‌పై స్పష్టత ఇవ్వాలని.. విజయవాడలో నిర్వహించాలని భావిస్తే, అందుకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
డబ్బున్న వారికే డాక్టర్ చదువు!
ప్రైవేటు కళాశాలల్లో ఇకపై 50 శాతం సీట్లు యాజమాన్యాల చేతుల్లోనే... రూ.5.5 లక్షల నుంచి రూ.11.5 లక్షలకు పెరిగిన యాజమాన్య కోటా ఫీజు సాక్షి, హైదరాబాద్: పేదవాడి మెడిసిన్ కల చెదిరిపోనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో.. డాక్టర్ అవుదా మనుకున్న లక్షలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థుల ఆశలు అడియాసలు కానున్నాయి. ప్రైవేటు కళాశాలల్లో సగం సీట్లను యాజమాన్యాల ఇష్టానికే వదిలేయడం, ఉన్నఫళంగా ఫీజులు లక్షలాది రూపాయలు పెంచడాన్ని చూస్తే ప్రభుత్వం డబ్బున్న వారికే వైద్య డిగ్రీని పరిమితం చేస్తోందనే విషయం స్పష్టమవుతోంది. ఇకమీదట ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా సీటు కావాలంటే అధికారికంగా ఏడాదికి రూ.11.50 లక్షలు చెల్లించాలి. బి కేటగిరీ ఎత్తివేత ఇప్పటివరకు ప్రైవేటు వైద్య కళాశాలల సీట్లలో 50 శాతం కన్వీనర్ కోటా కింద, 10 శాతం బి-కేటగిరీలో, మిగిలిన 40 శాతం.. యాజమాన్య (25), ఎన్ఆర్ఐ (15) కోటా సీట్లుగా భర్తీ చేసేవారు. కానీ వచ్చే విద్యా సంవత్సరం (2015-16) నుంచి ప్రభుత్వం బి- కేటగిరీ సీట్లనూ యాజమాన్య కోటాలో కలిపేస్తోంది. అంటే మొత్తం యాజమాన్య కోటా 50 శాతం అవుతుందన్నమాట. దీనివల్ల కొద్దో గొప్పో డబ్బు చెల్లించి వైద్య విద్యను చదవాలనుకునేవారికి ఆ అవకాశం లేకుండా పోతోంది. బి- కేటగిరీ కింద చేరే విద్యార్థులకు ఏడాదికి రూ.2.40 లక్షల ఫీజు ఉండేది. అయితే అర్హత ఉన్న విద్యార్థులకు అప్పట్లో ప్రభుత్వమే ఈ ఫీజును రీయింబర్స్ చేసేది. తాజాగా ఈ సీట్లన్నీ యాజమాన్య కోటాలోకి వెళుతున్నాయి కాబట్టి వీటికి ఇక ఫీజు రీయింబర్స్‌మెంటు అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లు పొందే వారు ఏడాదికి 60 వేలు ఫీజు చెల్లిస్తున్నారు. బి-కేట గిరీ ఎత్తేయడంతో కన్వీనర్ కోటా సీట్ల ఫీజులను తగ్గించాలని భావిస్తున్నారు. ప్రైవేటు కాలేజీల ఒత్తిడితో యాజ మాన్య కోటా సీట్లకు ఏడాదికి 11.5 లక్షల ఫీజును నిర్ధారిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమ్మకానికి అదనంగా 200 ఎంబీబీఎస్ సీట్లు సర్కారు తాజా నిర్ణయం ప్రకారం ప్రైవేటు కళాశాలలకు 200 సీట్లు అమ్ముకునేందుకు అవకాశం లభించింది. గతంలో బి- కేటగిరీ సీట్లను ప్రభుత్వమే భర్తీ చేసేది. ప్రస్తుతం ఈ 10 శాతం సీట్లను ప్రైవేటు కళాశాలలే యాజమాన్య కోటా కింద భర్తీ చేసుకోనున్నాయి. ఈ సీటు పొందిన విద్యార్థి ఏడాదికి రూ.11.5 లక్షలు చెల్లించాలి. వైద్య విద్య టెర్మ్ నాలుగున్నరేళ్లే అయినా ప్రైవేటు కళాశాలల్లో ఐదేళ్లకూ ఫీజు వసూలు చేస్తారు. అంటే ఐదేళ్లకు రూ.57.5 లక్షలు అవుతుంది. 200 సీట్లకు ఏడాదికి రూ.23 కోట్లు లెక్కన ఐదేళ్లలో రూ.115 కోట్లు లభిస్తాయన్న మాట. ఇదెక్కడి న్యాయం ఇప్పటికే పేద విద్యార్థులు చాలామంది ఫీజులు చెల్లించలేక వైద్యవిద్యకు దూరమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో బి కేటగిరీ సీట్లను ప్రైవేటుకు అప్పజెప్పడం, యాజమాన్యకోటా సీట్ల ఫీజులు పెంచడం ఎంతవరకు సమంజసం? కర్ణాటక తరహాలోనే వైద్య విద్యను ప్రైవేటుకు అప్పజెప్పాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుంది. - డాక్టర్ స్నిగ్ధ, పీజీ వైద్యవిద్యార్థిని, సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల, విజయవాడ -
ఎంబీబీఎస్ ప్రవేశాలపై సింగిల్ జడ్జి ఉత్తర్వులు నిలుపుదల
సాక్షి, హైదరాబాద్: యాజమాన్యాల తీరు వల్ల తమకు ప్రవేశం దొరకలేదంటూ హైకోర్టును ఆశ్రయించిన పలువురు విద్యార్థులకు 2014-15 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ ప్రవేశాలు కల్పించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం నిలుపుదల చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుండా చంద్రయ్య, జస్టిస్ ఎం.సునీల్‌కుమార్ జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మధ్యంతర ఉత్తర్వులతో సంబంధం లేకుండా ఎంబీబీఎస్ యాజమాన్యపు కోటా సీట్ల విషయంలో ప్రభుత్వం ఏవైనా నిబంధనలు రూపొందించదలచుకుంటే, ఆ పని చేయవచ్చునని తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పలు ప్రైవేటు మెడికల్ కాలేజీలు తమకు ఉద్దేశపూర్వకంగా దరఖాస్తులు ఇవ్వలేదని, వాటి తీరుతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని, అందువల్ల ప్రతిభ ఆధారంగా తమకు సీట్లు కేటాయించేలా కాలేజీలను ఆదేశించాలని కోరుతూ పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ నూతి రామ్మోహనరావు యాజమాన్యపు కోటా సీట్ల భర్తీ విషయంలో పలు మార్గదర్శకాలను రూపొందించి వాటి అమలుకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులకు 2014-15 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ ప్రవేశాలు కల్పించాలని ఆయా కాలేజీలను ఆదేశించారు. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ ఎంఎన్ఆర్, కామినేని, అపోలో తదితర మెడికల్ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. వాటి వ్యాజ్యాలను గురువారం ధర్మాసనం విచారించింది. సింగిల్‌జడ్జి తీర్పు తమ హక్కులను హరించే విధంగా ఉందని ఆయా కాలేజీల తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్న ధర్మాసనం... గతంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.