
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎయిమ్స్ ద్వారా ఎంబీబీఎస్ అడ్మిషన్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు సీఎస్ ఎస్‌కే జోషి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్‌కు లేఖ రాశారు. అలాగే నిమ్స్ భవనాలను, అక్కడి భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఎయిమ్స్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) చేసుకోవాలని కోరారు.
శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత భవనంలో ఓపీ సేవలను ప్రారంభించాలని విన్నవించారు. ఎయిమ్స్ కోసమే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఎయిమ్స్ కోసం టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంటు వేదికగా పోరాటం చేశారు. పార్లమెంటు వెలుపల కూడా కేంద్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రులను కలసి వినతిపత్రాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment