రేపే ఎంసెంట్–3
రేపే ఎంసెంట్–3
Published Fri, Sep 9 2016 11:32 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
పరీక్ష రాయనున్న 4,710 మంది విద్యార్థులు
ఎనిమిది పరీక్షా కేంద్రాల ఏర్పాటు
నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
కేయూ క్యాంపస్ : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు గాను ఆదివారం జరిగే ఎంసెట్–3 నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. పరీక్షకు 4,710 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరగనుంది. హన్మకొండ సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కళాశాల, కాకతీయ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాల, యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల, యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల, వడ్డేపల్లిలోని ప్రభుత్వ పింగిళి డిగ్రీ కళాశాల, సీకెఎం ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కళాశాల, వరంగల్‌లోని ఎల్‌బి కళాశాల, హ్యూమనిటీస్ భవనంలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఆయా పరీక్ష కేంద్రాల్లోకి ఒక గంట ముందుగానే ఉదయం 9గంటల నుంచే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. నిర్దేశించిన సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని టీఎస్ ఎంసెట్ –3 రీజినల్ కోఆర్డినేటర్ అయిన కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి తెలిపారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకుగాను ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. 12మంది అబ్జర్వర్లును, రెండు ఫైయింగ్‌స్క్వాడ్‌ల బృందాలు, ఎనిమిది మంది ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను నియమించినట్టు చెప్పారు. పరీక్ష కేంద్రాల్లోకి వాచ్‌లు, సెల్‌ఫోన్‌లుఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదన్నారు. కాకతీయ యూనివర్సిటీలోని కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రానికి గుండ్లసింగారం రూట్ నుంచి చేరుకోవాలని ప్రొఫెసర్ మల్లారెడ్డి సూచించారు. పరీక్షాకేంద్రాలకు వీలైనంత ముందుగా చేరుకోవాలని ఆయన కోరారు.
Advertisement
Advertisement