సాక్షి, అమరావతి: ఏపీ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో 47 హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టుల భర్తీకి వైద్య శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. https://dmeaponline.com వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ అప్లికేషన్‌ను అందుబాటులో ఉంచారు. బుధవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలు పెట్టారు. అర్హులైన వైద్యులు ఈ నెల 17వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.వెయ్యి, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.750 చొప్పున దరఖాస్తు రుసుం ఉంటుంది.
రెండేళ్ల కాలపరిమితితో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టుల భర్తీ చేపడతారు. ఎంబీబీఎస్/బీడీఎస్ పూర్తి చేసి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్ డిగ్రీ/హాస్పిటల్ మేనేజ్‌మెంట్/ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్‌మెంట్/ఎంబీఏ హ్యూమన్ రీసోర్స్ కోర్సులు చేసి, ఇతర అర్హతలున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నాటికి గరిష్ట వయోపరిమితి 42 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయోపరిమితి నుంచి మినహాయింపు ఉంటుంది. http://hmfw.ap.gov.in వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌ను ఉంచారు.
47 హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Published Thu, Jan 12 2023 5:20 AM | Last Updated on Thu, Jan 12 2023 8:18 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment