hospital authorities
-
47 హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: ఏపీ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో 47 హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టుల భర్తీకి వైద్య శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. https://dmeaponline.com వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్‌ను అందుబాటులో ఉంచారు. బుధవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలు పెట్టారు. అర్హులైన వైద్యులు ఈ నెల 17వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.వెయ్యి, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.750 చొప్పున దరఖాస్తు రుసుం ఉంటుంది. రెండేళ్ల కాలపరిమితితో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టుల భర్తీ చేపడతారు. ఎంబీబీఎస్/బీడీఎస్ పూర్తి చేసి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్ డిగ్రీ/హాస్పిటల్ మేనేజ్మెంట్/ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్మెంట్/ఎంబీఏ హ్యూమన్ రీసోర్స్ కోర్సులు చేసి, ఇతర అర్హతలున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నాటికి గరిష్ట వయోపరిమితి 42 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్మెన్లకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయోపరిమితి నుంచి మినహాయింపు ఉంటుంది. http://hmfw.ap.gov.in వెబ్సైట్లో నోటిఫికేషన్‌ను ఉంచారు. -
డబ్బు తీసుకుంటే ఆస్పత్రి సీజ్ చేస్తా
సాక్షి, అనంతపురం: ‘ఆరోగ్య శ్రీ కింద రోగులకందించే వైద్య సేవలకు సంబంధించి రూ.వేలల్లో డబ్బులు వసూలు చేయడమేంటి? మరోసారి ఇలా చేస్తే ఆస్పత్రిని సీజ్ చేస్తా’ అంటూ నగరంలోని చంద్ర సూపర్ సెష్పాలిటీ ఆస్పత్రి నిర్వాహకుడు డాక్టర్ నిరంజన్‌రెడ్డిని జాయింట్ కలెక్టర్ డాక్టర్ సిరి హెచ్చరించారు. మంగళవారం చంద్ర ఆస్పత్రిలో జేసీ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆరోగ్య శ్రీ వార్డులో ఉండే వైద్యులు, స్టాఫ్‌నర్సులు, తదితర సిబ్బందిని బయటకు పంపి, రోగులతో ఆస్పత్రిలో అందే సేవలపై ఆరా తీశారు. శానిటేషన్, భోజనం తదితర సౌలభ్యాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ టెస్టింగ్‌ల పేరుతో బాలింత భాగ్యలక్ష్మి నుంచి రూ.4,200 వసూలు చేసిన విషయం వెల్లడైంది. మరో నలుగురి నుంచి కూడా అదనపు డబ్బు వసూలు చేసినట్లుగా రోగుల సంబంధీకులు ఆమె ఎదుట వాపోయారు. దీంతో ఆస్పత్రి నిర్వాహకుడు డాక్టర్ నిరంజన్‌రెడ్డి, ఆరోగ్య శ్రీ జిల్లా మేనేజర్ శివకుమార్‌పై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి నిర్వాహకులు వసూలు చేసిన రూ.4,200ను భాగ్యలక్ష్మీకి తిరిగి ఇప్పించారు. మిగిలిన వారికి కూడా డబ్బు చెల్లించాలని, మరోసారి ఇలాంటి పరిస్థితి పునరావృతమైతే ఉపేక్షించేది లేదన్నారు. (అనంత కలెక్టర్‌కు కేంద్రమంత్రి జవదేకర్ ప్రశంస) 61 ఆస్పత్రుల్లో సేవలన్నీ ఉచితమే జిల్లాలోని 61 ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో సేవలన్నీ ఉచితమేనని జేసీ సిరి స్పష్టం చేశారు. రోగుల మంచాల షీట్లు మార్చడం, బాత్రూంలను శుభ్రంగా ఉంచడం, నాణ్యమైన భోజనం అందించే బాధ్యత ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలదేనన్నారు. ఆరోగ్య శ్రీ కింద అడ్మిషన్ అయిన రోగులకు అవసరమైన రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేయడంతో పాటు శస్త్రచికిత్సలు, డిశ్చార్జ్ సమయంలో మందులు కూడా ఇవ్వాలన్నారు. ఆరోగ్యశ్రీ ఆసరాలో భాగంగా రోగికందాల్సిన భృతిని సకాలంలో బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేలా చూడాలన్నారు. కోవిడ్‌పై నిర్లక్ష్యం వద్దు అనంతపురం అర్బన్: జిల్లాలో కోవిడ్ తగ్గుముఖం పట్టిందని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం తప్పదని, ఈ నెల 30వ తేదీ వరకూ చైతన్య కార్యక్రమాలు నిర్వహించాల్సిందేనంటూ వైద్యాధికారులకు జేసీ డాక్టర్ సిరి సూచించారు. కోవిడ్–19 అంశంపై మంగళవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్‌లో వైద్యాధికారులు, నోడల్ అధికారులతో ఆమె సమీక్షించారు. నవంబరు 2వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని పాఠశాలల్లో జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ చైతన్య ర్యాలీలు చేపట్టాలన్నారు. 22న దుకాణాల్లో కోవిడ్ నిబంధనలు అమలుపై తనిఖీలు చేపట్టాలన్నారు. 23న సినిమా హాళ్ల వద్ద అవగాహన హోర్డింగ్‌లు, పోస్టర్లు, స్టిక్కర్లు ప్రదర్శించాలన్నారున. 24న హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ యాజమానులతో సమావేశం, 25న సచివాలయాల పరిధిలో అవగాహన కార్యక్రమాలు, 26న ఐఏసీ కార్యక్రమాల, మతపెద్దలతో సమావేశాలు, 27న మాస్‌్కలు, శానిటైజర్ల పంపిణీ, 28న విద్యార్థులకు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో పోటీలు, 30న కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలన్నారు. సమావేశంలో ఇన్చార్జి డీఎంహెచ్ఓ పద్మావతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
వైద్యం.. ప్రైవేట్ రాజ్యం..!
వైద్యంలో ప్రైవేట్ ఇష్టారాజ్యంగా మారింది. అనుమతులు లేకుండా ఆస్పత్రులు, క్లినిక్‌లు, లేబొరేటరీలు నిర్వహిస్తున్నారు. వీరి వల్ల ప్రాణాలకు ముప్పు తలెత్తితే ఎవరిది బాధ్యత అనే ప్రశ్న తలెత్తుతోంది. ఒక్కో లేబొరేటరీ, స్కానింగ్ సెంటర్లు ఇస్తున్న రిపోర్టులకు పొంతన ఉండడం లేదు. వీటి ఆధారంగా ప్రైవేట్ వైద్యశాలల్లో వైద్యం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యం వికటించి ప్రాణాపాయం తలెత్తిన పరిస్థితులు లేకపోలేదు. రిజిస్ట్రేషన్ కలిగిన వైద్యసేవల సంస్థలు సైతం రెన్యువల్ చేయించుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఆయా వైద్య సేవా సంస్థలను తనిఖీ చేసి చర్యలు తీసుకోవాల్సిన వైద్యఆరోగ్య శాఖాధికారులు కాసులకు కక్కుర్తి పడి పట్టించుకోవడం మానేస్తున్నారు. సాక్షి, నెల్లూరు: జిల్లాలోని పలు ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, లేబొరేటరీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. రిజిస్ట్రేషన్లు చేయించకుండానే నడుపుతూ నిర్వాహకులు పలు అక్రమాలకు పాల్పడుతున్నారు. గతంలో రిజిస్ట్రేషన్లు చేసుకున్న పలు సంస్థలు గడువు ముగిసినా రెన్యువల్ చేసుకోకుండానే కొనసాగిస్తున్నారు. వీటిపై పర్యవేక్షణ కొరవడడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం ప్రతి ప్రైవేట్ ఆస్పత్రి, లేబొరేటరీ, క్లినిక్, పాలీక్లినిక్ డెంటల్ ఆస్పత్రి, ఫిజియోథెరపీ యూనిట్లు విధిగా వైద్య, ఆరోగ్యశాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తొలుత రిజిస్ట్రేషన్ చేసుకున్న సంస్థలు ఐదేళ్ల తర్వాత వాటిని పునరుద్ధరించుకోవాలన్న నిబంధనలు ఉన్నా అనేక చోట్ల అవి అమలు కావడం లేదు. వీటిని ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వివిధ కారణాలతో మిన్నకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతులు కొన్నింటికే.. వైద్యారోగ్యశాఖ వద్ద ఉన్న గణాంకాల మేరకు జిల్లాలో క్లినిక్‌లు 112, పడకల ఆస్పత్రులు 124, మేజర్ ఆస్పత్రులు 51, ల్యాబ్‌లు 48, స్కానింగ్ సెంటర్లు 176 వరకు అనుమతులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అనుమతులు లేకుండా దాదాపు 150 వరకు క్లినిక్‌లు, ఆస్పత్రులు ఉన్నట్లు తెలుస్తోంది. ల్యాబ్‌లు 50 వరకు అనుమతులు లేకుండా నిర్వహణ చేస్తున్నట్లు సమాచారం. ఇక గడువు ముగిసిన ఆస్పత్రుల పునద్ధరణ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అయితే ప్రతి సంస్థ ఈ ఏడాది జనవరి 1వ తేదీ లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, గడువు ముగిసిన సంస్థలు రెన్యువల్ చేసుకోవాలని ఉత్తర్వులు ఉన్నా అమలుకు నోచుకోలేదు. కొన్ని లేబొరేటరీలు డెంగీ, మలేరియా, ఇతర పరీక్షలు నిర్వహిస్తూ ప్రజల నుంచి పెద్ద మొత్తంలో దోచుకుంటున్నా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ తప్పని సరి ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు లేబొరేటరీలు, డెంటల్ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ఫిజియోథెరిపీ యూనిట్ల ఏర్పాటు చేయాలంటే వివిధ విభాగాల నుంచి అనుమతులు తప్పని సరి. వీటిని ఏర్పాటు చేసే భవనాలకు మున్సిపల్/పంచాయతీ అనుమతులు, అగ్నిమాపక శాఖ, ఐఎంఏ సభ్యత్వం, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, వైద్య పరీక్షల సామగ్రి వివరాలు, కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతి, స్పెషలిస్టు వైద్యులు, నర్సులు, ఫార్మసీ సిబ్బంది, ఆడిట్ నివేదిక, ఇలా అన్ని రకాల అనుమతులతో రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. కమిటీల జాడేది? ఏపీపీఎంసీ ఈ చట్టం అమలుకు జిల్లాలోని కమిటీలను డివిజన్ల వారీగా ఏర్పాటు చేసి ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు, లేబొరేటరీలు, డెంటల్ ఆస్పత్రులు, ఫిజియోథెరిపీ సెంటర్లు, డయాగ్నస్టిక్ సెంటర్లు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా, వైద్యులు, న్యాయవాదులు, ప్రముఖులతో కమిటీ ఏర్పాటు చేసి తరచూ తనిఖీలు చేస్తే అక్రమాలకు తావుండదు. ఆ ది«శగా అధికారులు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఆదాయానికి గండి ప్రైవేట్ ఆస్పత్రులు, లేబొరేటరీలు, డయాగ్నస్టిక్ సెంటర్లు, క్లినిక్‌లు డెంటల్ ఆస్పత్రులు, పిజియోథెరిపీ యూనిట్లు రిజిస్ట్రేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశిత మొత్తాన్ని రుసుంగా నిర్ణయించింది. క్లినిక్ రూ.1,250, పాలీక్లినిక్‌కు రూ.2,500, 20 పడకల ఆస్పత్రి రూ.3,750, 21 నుంచి 50 పడకల ఆస్పత్రి రూ.7,500, 101 నుంచి 200 పడకలు దాటిని ఆస్పత్రికి రూ.37,500, లేబొరేటరీకి రూ.2,500, డయాగ్నస్టిక్ సెంటర్‌కు రూ.10,000, ఫిజియోథెరిఫీ యూనిట్‌కు రూ. 3,750 చొప్పున రిజిస్ట్రేషన్ రుసుం చెల్లించాలి. కానీ ఏపీపీఎంసీ ఈ చట్టం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం వీటిని నిర్వహించడంతో నిర్వాహకులు అనుమతులు తీసుకోవడం లేదని తెలుస్తోంది. చర్యలు తీసుకుంటాం ప్రైవేట్ ఆస్పత్రులు వైద్య సంస్థలు ఏపీపీఎంసీఈ చట్టం ప్రకారం విధిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకుని గడువు ముగిసినా సంస్థలు రెన్యువల్ చేసుకోవాలి. వీటిని అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటాం. త్వరలోనే తనిఖీలు నిర్వహించి అనుమతులు లేని ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటాం. – రాజ్యలక్ష్మీ, డీఎంహెచ్ఓ -
ఆస్పత్రి అధికారులకు.. కలెక్టర్ క్లాస్
► రోగులకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదు ► వైద్యులు సాయంత్రం 4 గంటల వరకు విధులు నిర్వహించాల్సిందే ► ఆస్పత్రి ప్రతిష్ట పెంచాలి ► వైద్యాధికారులు, సిబ్బందికి స్పష్టం చేసిన కలెక్టర్ ► జీజీహెచ్‌లో మూడు గంటలపాటు తనిఖీలు ► శానిటేషన్ కాంట్రాక్టర్‌కు రూ.లక్ష జరిమానా గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి వైద్యాధికారులకు కలెక్టర్ కోన శశిధర్ క్లాస్ తీసుకున్నారు. ఆస్పత్రిలో గురువారం తనిఖీలు నిర్వహించిన ఆయన అక్కడ పరిస్థితులను చూసి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు సేవలు అందించటంలో నిర్లక్ష్యంపై నిలదీశారు. పలు వార్డులను పరిశీలించి వైద్యసేవలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. నెలకోసారి ఆస్పత్రికి వచ్చి సమస్యలపై చర్చిస్తానని స్పష్టం చేశారు. సాక్షి, గుంటూరు : గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ హెచ్చరించారు. ‘ప్రతిష్టకు పాతర’ శీర్షికతో గురువారం ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి స్పందించిన కలెక్టర్.. ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తనిఖీలు కొనసాగాయి. తనిఖీల్లో భాగంగా పారిశుద్ధ్యం సక్రమంగా లేకపోవడం గమనించిన కలెక్టర్ కాంట్రాక్టర్‌కు లక్ష రూపాయలు జరిమానా విధించారు. గుంటూరు జీజీహెచ్‌కి, గుంటూరు వైద్య కళాశాలకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, వాటిని మీరు పాడు చేయొద్దంటూ వైద్య సిబ్బంది, అధికారులకు క్లాస్ తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ జాబ్ చార్టు ప్రకారం పనిచేయాలని, సమస్యలు ఏదైనా ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే తన పరిధిలో ఉన్నవి తక్షణమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గతంలో ఆసుపత్రికి ఉన్న ప్రతిష్ట మొత్తం ఎలుక సంఘటనతో పోయిందని, తిరిగి ప్రతిష్ట తీసుకొచ్చేందుకు ఎంతో కష్టపడాల్సి వస్తుందన్నారు. దేశం మొత్తం ఎలుక సంఘటన పెద్ద చర్చనీయాంశమైందని గుర్తుచేశారు. సామాన్య వ్యక్తులకు జీజీహెచ్ పెద్ద దిక్కు అని, రోగులకు వైద్య సేవలు అందించడంలో జాప్యం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. శానిటేషన్ కాంట్రాక్టర్‌కు 96 మార్కులా? శానిటేషన్ కాంట్రాక్టర్‌కు 96 మార్కులు వేయడంపై డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ అనంత శ్రీనివాసులుకు కలెక్టర్ క్లాస్ తీసుకున్నారు. అన్ని మార్కులు పొందేందుకు కాంట్రాక్టర్ అర్హుడేనా అని ప్రశ్నించారు. శానిటేషన్ అంతంతమాత్రంగానే ఉందని, డస్ట్‌బిన్‌లో కవర్లు కూడా లేవని, అలాంటప్పుడు నెలకు రూ.40 లక్షలు ఎందుకు చెల్లించాలంటూ డిప్యూటీ ఆర్ఎంఓను నిలదీశారు. విభాగాధిపతుల ఫీడ్ బ్యాక్ తీసుకుని శానిటేషన్‌కు మార్కులు వేయాలన్నారు. ఆసుపత్రిలో వైద్య పరికరాలు సకాలంలో మరమ్మతులు జరుగుతున్నాయా, లేవా అని ప్రశ్నించారు. పలువురు వైద్య పరికరాల మరమ్మతుల జాప్యంపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడంతో వైద్య పరికరాల మరమ్మతుల కాంట్రాక్టర్ పవన్‌కు క్లాస్ తీసుకున్నారు. వారంలో ఒకరోజు తప్పనిసరిగా వైద్య విభాగాధిపతులను సంప్రదించి, వైద్య పరికరాల పనితీరు గురించి అడిగి తెలుసుకోవాలన్నారు. ఎలుకలనూ నివారించలేకపోతున్నారా? పెస్ట్ కంట్రోల్ కాంట్రాక్టర్‌ను కలెక్టర్ నిలదీస్తూ.. ఆసుపత్రిలో ఎలుకలు తిరుగుతున్నా ఎందుకు నివారించలేకపోతున్నారని ప్రశ్నించారు. కేవలం రూ.10 వేల మెష్ ఏర్పాటు చేయడం ద్వారా ఎలుకల నివారణ అడ్డుకోవచ్చని, దానిపై ఎందుకు దృష్టి సారించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ఆసుపత్రిలో సీసీ కెమెరాలు సైతం చాలా తక్కువగా ఉన్నాయని, తక్షణమే వాటిని పెంచాలని ఆసుపత్రి అధికారులకు ఆదేశించారు. ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ ప్రవీణ్‌కు సైతం కలెక్టర్ క్లాస్ తీసుకున్నారు. వైద్యులు ఎక్కడ ఉన్నా వార్డులో చికిత్స పొందుతున్న రోగుల రిపోర్టులను, రోగులను పర్యవేక్షించే విధంగా వైద్యుల సెల్ఫోన్లో వారి వివరాలు కనిపించేలా సాఫ్ట్వేర్ పెట్టాలని, అదికూడా మూడు రోజుల్లో ఏర్పాటు చేయాలని అడ్మినిస్ట్రేటర్‌కు ఆదేశించారు. ఆసుపత్రిలో తిరుగుతున్న ఇద్దరు మెడికల్ రిప్రజెంటేటివ్‌లను పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించినట్లు కలెక్టర్ చెప్పారు. జనరిక్ మందులనే రాయాలి... ఆసుపత్రిలో మందులు లేని సమయంలో జనరిక్ మందులనే వైద్యులు రాయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అనైతిక ప్రాక్టీస్ చేసే వైద్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతులు లేకుండా మెడికల్ రిప్రజెంటేటివ్‌లు ఆసుపత్రిలో వైద్యులను కలిస్తే సదరు వైద్యులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఫ్యాన్లు పలు వార్డుల్లో పనిచేయడం లేదన్న ఫిర్యాదుపై ఇంజినీరింగ్ అధికారులు, ఎలక్ట్రికల్ అధికారులకు కలెక్టర్ క్లాస్ తీసుకున్నారు. ఏడేళ్ళు దాటిన ఫ్యాన్లకు మరమ్మతులు చేయకుండా పక్కన పెట్టేసి కొత్త ఫ్యాన్లు బిగించాలని, అదనంగా కొత్త ఫ్యాన్లు స్టాక్ పెట్టుకోవాలని ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశించారు. పలు వార్డుల్లో ఏసీలు పనిచేయడం లేదన్న విషయాన్ని వైద్యులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడంతో వాటికి తక్షణమే మరమ్మతులు చేయాలని సూచించారు. ఆసుపత్రిలో నీటి సమస్య లేకుండా చూడాలన్నారు. ఆసుపత్రిలో ఏయే వార్డులకు ఎటు వెళ్ళాలో చూపించే విధంగా సైన్ బోర్డులు ఏర్పాటు చేయించాలన్నారు. ప్రతినెలా మొదటి గురువారం విభాగాధిపతులందరూ సమావేశం ఏర్పాటు చేసుకుని ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించాలన్నారు. వైద్యులకు ప్రైవేటు ప్రాక్టీస్ చేసే అనుమతి ఉంటే ఒకే అని, లేని పక్షంలో అనుమతులు లేకుండా ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ ముందే చెప్పినా... గుంటూరు మెడికల్ : ‘నేను ఆస్పత్రికి వస్తున్నానని ముందే చెప్పినా... వచ్చిన తర్వాత కూడా గదిలో నుంచి బయటకు రారా? నేనెవరో తెలుసా? మీ మీద చాలా ఫిర్యాదులు ఉన్నాయి.. వాటీజ్ దిస్ రాజునాయుడు..’ అంటూ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడును జిల్లా కలెక్టర్ కోన శశిధర్ నిలదీశారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా జీజీహెచ్‌కి వచ్చిన ఆయన ముందే ఆస్పత్రి అధికారులకు సమాచారమిచ్చారు. అయినా ఆస్పత్రికి వచ్చిన కొద్దిసేపటి వరకు ఎవరూ ఆయన వద్దకు రాలేదు. ఆ తరువాత వైద్య సిబ్బంది, వైద్యులు, సూపరింటెండెంట్ ఆయన వద్దకు వచ్చారు. ఈ నేపథ్యంలో తొలుత రాజునాయుడికి, అనంతరం వచ్చిన డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ అనంత శ్రీనివాసులుకు కలెక్టర్ క్లాస్ తీసుకున్నారు. ‘నేను ఎవరో మీకు తెలుసా?’ అంటూ ప్రశ్నించి ‘సస్పెండ్ చేయమంటారా?’ అనటంతో వారి ముఖాలు ఒక్కసారిగా మాడిపోయాయి. అనంతరం సూపరింటెండెంట్ చాంబర్లో వారిద్దరితో మాట్లాడిన కలెక్టర్ అనంతరం ఓపీ విభాగంలో తనిఖీలు చేశారు. ఇన్‌పేషెంట్ విభాగం ద్వారం వద్ద పైపులైన్ లీకులు గమనించి ఇంజినీరింగ్ అధికారులను నిలదీశారు. అనంతరం ఓపీ విభాగం ద్వారం వద్ద ఆర్థోపెడిక్ విభాగంలో కాలికి కట్టు కట్టించుకుని కుంటు కుంటూ బయటకు వస్తున్న చింతల శ్రీను అనే రోగిని గమనించి, అతడికి వీల్‌చైర్ ఎందుకు ఇవ్వలేదని వైద్యాధికారులను, సిబ్బందిని ప్రశ్నించారు. మరోసారి ఇలాంటి దృశ్యాలు కనిపిస్తే ఉద్యోగాలు ఊడతాయంటూ తీవ్రంగా హెచ్చరించారు. రోగికి తొలుత కుర్చీ తెప్పించి, అనంతరం అతనికి వీల్‌చైర్ తెప్పించి, వైద్యసేవల కోసం పంపించారు. తూతూ మంత్రంగా విధులు నిర్వహిస్తే ఊరుకోనని, ఆర్థిక దుబారా, స్కామ్‌లు చేస్తే వారిపై వేటు పడుతుందని హెచ్చరించారు. తనకు ఆస్పత్రికి వచ్చే కామన్ మ్యాన్ ముఖ్యమని, రోగులకు సేవల్లో జాప్యం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. వైద్యులు తప్పనిసరిగా సాయంత్రం 4 గంటల వరకు ఉండాలని, నెలకు ఒకసారి ఆస్పత్రికి వచ్చి సమస్యలపై చర్చించి పరిష్కరిస్తానని కలెక్టర్ చెప్పారు. వైద్య సిబ్బంది అంతా యాప్రాన్లు ధరించాలని, ఐడీ కార్డ్ పెట్టుకోవాలని స్పష్టం చేశారు. వార్డులను తనఖీ చేసిన అనంతరం ఆయన వైద్యులు, వైద్య విభాగాధిపతులు, ఆస్పత్రి అధికారులతో శుశ్రుతా హాలులో సమీక్ష నిర్వహించారు. -
మృతశిశువుల ఖననానికి రూ.500
-సాక్షి కథనంతో అధికారుల్లో చలనం కర్నూలు(హాస్పిటల్): ఆరు నెలలుగా గైనిక్ విభాగంలో ఏడు మృతశిశువులను బకెట్లలో దాచి ఉంచడంపై తెగిన బంధం...వీడని లోకం శీర్షికన ‘సాక్షి’లో ఈ నెల 14వ తేదీన ప్రచురితమైన కథనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ కథనానికి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి స్పందించి అధికారుల వ్యవహార తీరుపై తీవ్రస్థాయిలో మండిపడగా, జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ స్వయంగా రంగంలోకి దిగి మృతశిశువులకు అంతిమ సంస్కారం జరిపించారు. మృతశిశువుల ఖననానికి రూ.125 మాత్రమే చెల్లించే ఆసుపత్రి అధికారులు ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.500లకు పెంచుతూ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. ఆసుపత్రి కమిటీ సభ్యులైన సూపరింటెండెంట్ డాక్టర్ జె. వీరాస్వామి, డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ కృష్ణానాయక్, డాక్టర్ చంద్రశేఖర్, ఇన్చార్జి సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ వై. శ్రీనివాసులు బృందం మంగళవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. పెంచిన మొత్తం ఈ రోజు నుంచే అమలుల్లోకి వస్తుందని డాక్టర్ వీరాస్వామి తెలిపారు. ఎన్జీవోలు తాత్కాలికంగా సహాయం చేసినా, మధ్యలో ఇవ్వకపోతే తాము ఇబ్బంది పడాల్సి వస్తుందని, ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. -
కొండను తవ్వి ‘ఎలుక’ను పట్టి..
ఎలుకలు కొరకడంతో శిశువు మృతి చెందిన ఘటనలో పెద్దల పేర్లు మాయం చేసి, కింది స్థాయి ఉద్యోగులను బలిపశువులు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఐదు నెలలపాటు సుదీర్ఘ విచారణ జరిపిన పోలీసులు ‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు’ కిందిస్థాయి సిబ్బందినే బాధ్యులను చేశారనే విమర్శలు వస్తున్నాయి. * శిశువు మృతి కేసులో పెద్దల పేర్లు మాయం * చిరు ఉద్యోగులను బలిచేస్తున్నారని జీజీహెచ్ స్టాఫ్ నర్సుల ఆందోళన సాక్షి, గుంటూరు : గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి(జీజీహెచ్)లోని శిశు శస్త్రచికిత్సా విభాగంలో గత ఏడాది ఆగస్టు 26న ఎలుకల దాడిలో పసికందు మృతి చెందిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్రంలో తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం ఆర్ఎంఓ శ్రీనివాసులు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఇద్దరు స్టాఫ్‌నర్సులను సస్పెండ్ చేసి ఆ విభాగం వైద్యులు డాక్టర్ భాస్కరరావు , సూపరింటెండెంట్ డాక్టర్ వేణుగోపాలరావులను బదిలీ చేసింది. అయితే డాక్టర్ భాస్కరరావు హైకోర్టును ఆశ్రయించడంతో స్టే విధించారు. దీంతో ఆయన ఇక్కడే పని చేస్తున్నారు. పసికందు కేవలం ఆసుపత్రి అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని తల్లి చావలి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుం టామని గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అప్పట్లో ప్రకటించారు. ఇదిలావుండగా, తాజాగా సోమవారం రాత్రి జీజీహెచ్‌కు చెందిన ఏడుగురు నిందితులు కోర్టు ముందు హాజరై బెయిల్ పొందారు. ఈ కేసులో సూపరింటెండెంట్ పేరు, శిశువు మృతిచెందిన వైద్య విభాగం వైద్యుడి పేరు ఎక్కడా లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలుకలు ఆసుపత్రిలోకి రావడానికి ప్రధాన కారణం పారిశుద్ధ్య కాంట్రాక్టరేనని అప్పట్లో ఆ కాంట్రాక్ట్‌ను రద్దు చేసి కొత్తవారిని నియమించిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో పారిశుద్ధ్యం నిర్వహణ బాధ్యతలు చూడాల్సిన ఆర్ఎంఓ , నర్సింగ్ సూపరింటెండెంట్లు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉండాల్సి ఉండగా, వీరి పేర్లను ఏ-5, ఏ-7లుగా చూపారని నర్సింగ్ సంఘం నాయకులు పేర్కొంటున్నారు. ఈ ఘటనలో తమ నిర్లక్ష్యం ఏమీ లేనప్పటికీ తమపై సస్పెన్షన్ వేటు వేయడమే కాకుండా కేసులో ప్రధాన నిందితులుగా నమోదుచేయడం దారుణమని స్టాఫ్ నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘటన జరిగిన సమయంలో పసికందు తల్లి చావలి లక్ష్మి సైతం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తమ బిడ్డను ఎలుకలు కరిచిన విషయాన్ని వైద్యుడికి, సూపరింటెండెంట్‌కు తెలిపామని చెప్పిన విషయం విధితమే. పోలీసులు వీరిద్దరి పేర్లను కేసులో చేర్చకపోవడంపై ఆసుపత్రి వైద్యాధికారులు, సిబ్బంది తీవ్రంగా మండిపడుతున్నారు.