professor mallareddy
-
సర్వీస్ సీనియార్టీనా? ప్రొఫెసర్ సీనియార్టీనా?
కేయూ క్యాంపస్: కేయూ సైన్స్ డీన్ నియామకంలో యూనివర్సిటీ అధికారులు జాప్యం చేస్తున్నారు. సైన్స్ డీన్‌గా కొనసాగుతున్న గణిత శాస్త్ర విభాగం ప్రొఫెసర్, ప్రస్తుత కేయూ రిజిస్ట్రార్ ఆచార్య మల్లారెడ్డి సైన్స్ డీన్ పదవీకాలం గత నెల 31న ముగిసింది. 21 రోజులు గడిచినా.. మరో ప్రొఫెసర్‌ను డీన్‌గా నియమించలేదు. సైన్స్ విభాగాల్లో పీహెచ్డీ వైవాలు, సెమినార్ల నిర్వహణ బాధ్యతలతోపాటుగా కీలకమైన సెనెట్‌లోనూ, స్టాండింగ్ కమిటీలోని సభ్యుడిగా కూడా డీన్ కొనసాగుతారు. అలాంటి కీలకమైన పదవి నియామకంలో జాప్యం జరగడం యూనివర్సిటీలోని ప్రొఫెసర్లలో చర్చనీయాంశంగా మారింది.ఇద్దరిలో ఎవరిని నియమించాలి?డీన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రొఫెసర్ మల్లారెడ్డి తర్వాత సైన్స్ విభాగాల్లో ఎవరు సీనియర్ ఫ్రొఫెసర్‌గా ఉన్నారో ఆ ప్రొఫెసర్‌ను డీన్‌గా నియమించాల్సి ఉంటుంది. అయితే కెమిస్ట్రీ విభాగంలో ప్రొఫెసర్ జి.హనుమంతు, ఫిజిక్స్ విభాగంలో ప్రొఫెసర్ బి.వెంకట్రామ్రెడ్డి ఉన్నారు. వీరిలో ఎవరో ఒకరిని నియమించాలి. వీరిలో ఎవరిని నియమిస్తారనేది ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. మొదట సర్వీస్‌లో జాయిన్ అయినప్పటి నుంచి సీనియార్టీని పరిగణనలోకి తీసుకోవాలా? లేక పదోన్నతి పొందినప్పటి నుంచి సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకోవాలా? అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. కాగా.. గతంలో ఈ రెండు విధానాలనూ అనుసరించడంతో ప్రస్తుతం ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. రెండేళ్ల క్రితం అప్పటి వీసీ తాటికొండ రమేశ్ సర్వీస్‌లో మొదట జాయిన్ అయిన అంశాన్ని సీనియార్టీగా కాకుండా ప్రొఫెసర్‌గా నియమితులైన తర్వాత సీనియార్టీని పరిగణనలోకి తీసుకొని సైన్స్ డీన్‌గా గణిత శాస్త్ర విభాగం ఆచార్య పి.మల్లారెడ్డిని నియమించారు.యూనివర్సిటీ యాక్ట్‌లో ఏముందంటే..యూనివర్సిటీ యాక్ట్ ప్రకారం.. డీన్ అయ్యేవారు ప్రొఫెసర్ అయి ఉండాలని రోటేషన్ ప్రకారం అని మాత్రమే ఉందని తెలుస్తోంది. డీన్ల నియామాకంలో యూనివర్సిటీ యాక్ట్‌లో నిర్దిష్టమైన విధానం లేకపోవడం వల్ల వీసీలుగా బాధ్యతలను నిర్వర్తించినవారు తమ విచక్షణతోనే ఒక విధానం అంటూ కాకుండా.. రెండు విధానాలు అనుసరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇన్చార్జ్ వీసీగా వాకటి కరుణ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.కమిటీ వేయాలని యోచన!కాగా.. కాకతీయ యూనివర్సిటీలో ఇప్పటికీ రెండు విధానాలను అనుసరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సర్వీస్ సీనియార్టీని, మరికొన్ని సందర్భాల్లో ప్రెఫెసర్ అయిన వారి సీనియార్టీని డీన్లుగా నియమించినట్లు తెలుస్తోంది. కేయూ సైన్స్ డీన్‌గా ఎవరిని నియమించాలో తేల్చుకోలేకపోతున్న కేయూ రిజిస్ట్రార్ ఆచార్య పి.మల్లారెడ్డి ఈ విషయాన్ని కేయూ ఇన్చార్జ్ వీసీ వాకాటి కరుణ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం సైన్స్ డీన్‌గా ఎవరిని నియమించాలనే విషయంపై ఓ కమిటీ వేయాలనే యోచనలో రిజిస్ట్రార్ ఉన్నట్లు సమాచారం. ఆఇద్దరు ప్రొఫెసర్లలో ఒకరిని నియమించేవరకు రిజిస్ట్రార్ మల్లారెడ్డినే సైన్స్ డీన్‌గా అంటిల్ఫర్దర్ ఆర్డర్‌పై కొనసాగిస్తున్నారు. అయితే కమిటీలో ఉండాలని ఇద్దరు ముగ్గురిని సంప్రదించినా ఎవరూ ముందుకు రావడం లేదని సమాచారం. -
రేపే ఎంసెంట్–3
పరీక్ష రాయనున్న 4,710 మంది విద్యార్థులు ఎనిమిది పరీక్షా కేంద్రాల ఏర్పాటు నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు కేయూ క్యాంపస్ : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు గాను ఆదివారం జరిగే ఎంసెట్–3 నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. పరీక్షకు 4,710 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరగనుంది. హన్మకొండ సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కళాశాల, కాకతీయ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాల, యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల, యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల, వడ్డేపల్లిలోని ప్రభుత్వ పింగిళి డిగ్రీ కళాశాల, సీకెఎం ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కళాశాల, వరంగల్‌లోని ఎల్బి కళాశాల, హ్యూమనిటీస్ భవనంలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా పరీక్ష కేంద్రాల్లోకి ఒక గంట ముందుగానే ఉదయం 9గంటల నుంచే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. నిర్దేశించిన సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని టీఎస్ ఎంసెట్ –3 రీజినల్ కోఆర్డినేటర్ అయిన కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి తెలిపారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకుగాను ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. 12మంది అబ్జర్వర్లును, రెండు ఫైయింగ్స్క్వాడ్ల బృందాలు, ఎనిమిది మంది ఎన్ఫోర్స్మెంట్ అధికారులను నియమించినట్టు చెప్పారు. పరీక్ష కేంద్రాల్లోకి వాచ్‌లు, సెల్ఫోన్లుఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదన్నారు. కాకతీయ యూనివర్సిటీలోని కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రానికి గుండ్లసింగారం రూట్ నుంచి చేరుకోవాలని ప్రొఫెసర్ మల్లారెడ్డి సూచించారు. పరీక్షాకేంద్రాలకు వీలైనంత ముందుగా చేరుకోవాలని ఆయన కోరారు.