ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల‌ ప్రవేశాలకు నోటిఫికేషన్ | Kaloji Narayana Rao Health University Issued Notification | Sakshi
Sakshi News home page

ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల‌ ప్రవేశాలకు నోటిఫికేషన్

Oct 31 2020 7:18 PM | Updated on Oct 31 2020 7:24 PM

Kaloji Narayana Rao Health University Issued Notification  - Sakshi

సాక్షి, వ‌రంగ‌ల్ : రాష్ర్టంలో దంత వైద్య ప్రవేశాల ప్ర‌క్రియ ప్రారంభం అయ్యింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు గాను ఆన్‌లైన్  దరఖాస్తుల నమోదుకు కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నేడు  నోటిఫికేషన్ విడుదల చేసింది.  జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ 2020లో అర్హత సాధించిన అభ్యర్థులు  నమోదు చేసుకోవాలని తెలిపారు. కరోనా వైరస్ దృష్ట్యా ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలిన   పీజీ తరహాలోనే యుజి ప్రవేశాలకు చేపట్టనున్నారు.  

01-11-20 నుంచి 08-11-20 వ‌ర‌కు  ఉదయం 8 గంటల నుంచి సాయింత్రం  5 గంటల‌ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని   సూచించారు.  నిర్ధేశిత ధరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.  ఆన్‌లైన్ లో సమర్పించిన దరఖాస్తులు , సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను  విడుదల చేస్తారు. ప్రవేశాలకు సంబంధించి అర్హత ఇతర  సమాచారం కోసం   యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.in లో సందర్శించాలని  యూనివర్సిటీ వర్గాలు ఓ  ప్రకటనలో  తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement