''తెలంగాణ ప్రభుత్వ జీఓపై కోర్టుకు వెళతాం'' | we-will-go-to-court-on-telangana-govt-go-ravela-kishrebabu | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 30 2014 7:19 PM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM

స్థానికత విషయంలో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీఓపై కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఏపి సాంఘీక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు చెప్పారు. తెలంగాణలో 1956కు ముందు ఉన్నవారినే స్థానికులుగా పరిగణించాలని ఆ ప్రభుత్వం జిఓ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ జీఓ జారీపై ఏపి ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీఓ ప్రకారం 1956 తరువాత నుంచి ఇక్కడ ఉన్నవారిని స్థానికులుగా పరిగణించరు. దాంతో విద్యార్థులకు, నిరుద్యోగులకు అనేక చిక్కులు ఇస్తాయి. ఆ జీఓపై కోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో మంత్రి కిషోర్ బాబు అడ్వకేట్ జనరల్(ఏజీ)ను సంప్రదించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement