నాకు ఓటేయలేదు.. డబ్బులు తిరిగివ్వండి..! | Sarpanch Contestant Asks Voters To Return His Gifts In Rajanna Sircilla | Sakshi
Sakshi News home page

నాకు ఓటేయలేదు.. డబ్బులు తిరిగివ్వండి..!

Published Fri, Feb 1 2019 7:49 AM | Last Updated on Tue, Mar 19 2019 9:20 PM

Sarpanch Contestant Asks Voters To Return His Gifts In Rajanna Sircilla - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, తంగళ్లపల్లి (సిరిసిల్ల): ‘‘నాకు ఓటేయలేదు.. డబ్బులు వెనక్కిఇవ్వండి’అంటూ ఓడిపోయిన ఓ సర్పంచ్‌ అభ్యర్థి ఇంటింటికి తిరుగుతూ అభ్యర్థిస్తున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలవాలన్న ఏకైక లక్ష్యంతో సదరు అభ్యర్థి పెద్ద మొత్తం ఖర్చు పెట్టాడు. తీరా పదవి చేజారిపోయేసరికి బేజారయ్యాడు. కొంత మంది గ్రామస్తులు మాత్రం అయ్యో పాపం అంటూ తాము తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నారు. పదవీ కాంక్షతో స్థాయికి మించి అప్పులు చేసి ఎందరో తమ కుటుంబాలను రోడ్డుపాలు చేసుకుంటున్నారని తెలిపేందుకు ఈ ఘటన అద్దం పడుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement