![Rajanna Sircilla District Police Arrested Two Janashakthi Naxalites - Sakshi](/styles/webp/s3/article_images/2020/07/6/Janashakthi-Naxalites.jpg.webp?itok=SBJBaIA9)
ఫైల్ ఫోటో
సాక్షి, రాజన్న సిరిసిల‍్ల: జిల్లాలో ఇద్దరు జనశక్తి సీపీఐ(ఎంఎల్) నక్సలైట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లెల్లకు చెందిన వ్యక్తితో పాటు, సిద్ధిపేట జక్కాపూర్‌కు చెందిన విఠల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. వారి వద్ద నుంచి కంట్రీమేడ్ పిస్టల్, రివాల్వర్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు రిక్రూట్‌మెంట్లు, నిర్వహణ కోసం అవసరమైన నిధుల సేకరణ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలోనే జనశక్తి నక్సల్ పోలీసులకు చిక్కినట్లు తెలిసింది. ఇంకా పలువురి నక్సల్స్ అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment