janashakthi
-
‘జనశక్తి’ ఎగ్జిబిషన్లో మోదీ
న్యూఢిల్లీ: మన్‌కీ బాత్ 100వ ఎపిసోడ్ పూర్తయిన సందర్భంగా నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్(ఎన్జీఎంఏ)లో ఏర్పాటైన ఎగ్జిబిషన్‌ను ప్రధాని మోదీ ఆదివారం సందర్శించారు. ‘జన శక్తి: ఒక సమ్మిళిత శక్తి’ఇతి వృత్తంతో ఏర్పాటైన ఈ ఎగ్జిబిషన్లో ప్రముఖులైన 13 మంది కళాకారుల కళా ఖండాలున్నాయి. ఎగ్జిబిషన్లో ఆయన కలియదిరిగారని సాంస్కృతిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మన్‌కీ బాత్‌లో తమకు ప్రేరణనిచ్చిన అంశాల గురించి కళాకారులు ప్రధానికి వివరించారని పేర్కొంది. -
పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు..
సాక్షి, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో ఇద్దరు జనశక్తి సీపీఐ(ఎంఎల్) నక్సలైట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లెల్లకు చెందిన వ్యక్తితో పాటు, సిద్ధిపేట జక్కాపూర్‌కు చెందిన విఠల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. వారి వద్ద నుంచి కంట్రీమేడ్ పిస్టల్, రివాల్వర్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు రిక్రూట్మెంట్లు, నిర్వహణ కోసం అవసరమైన నిధుల సేకరణ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలోనే జనశక్తి నక్సల్ పోలీసులకు చిక్కినట్లు తెలిసింది. ఇంకా పలువురి నక్సల్స్ అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. -
పోలీసుల అదుపులో జనశక్తి నక్సల్స్?
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు సీపీఐ(ఎంఎల్) జనశక్తి నక్సల్స్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. జిల్లాలో నక్సలైట్ల ఉద్యమం కనుమరుగు కాగా కొత్తగా జిల్లాలో ఉద్యమాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారి వద్ద ఓ కంట్రిమెడ్ తుపాకీతో పాటు రివాల్వార్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. తంగళ్లపల్లి మండలం జిల్లె్లల్ల కు చెందిన ఒకరిని, సిద్ధిపేట జిల్లా జక్కాపూర్‌కు చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, జనశక్తి పేరుతో సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాల్లో నక్సలైట్ల ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారని సమాచారం. నక్సలైట్ల పేరుతో వ్యాపారులకు చిట్టీలు రాసి డబ్బులు వసూలు చేయాలని ప్లాన్ వేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే వారి వద్ద ఆయుధాలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సిరిసిల్ల పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. మాజీలతో లింక్.. జిల్లాలో 2006 తర్వాత నక్సలైట్ల కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో మాజీ న క్సలైట్లతో కలిసి పలువురు యువకులు సులభంగా డబ్బులు సంపాదించేందుకు ఆయుధాలతో బెదిరించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. పలు వురు వ్యాపారులకు చిట్టీలు రాస్తున్న క్రమంలో ఆ నలుగురు పోలీసులకు పట్టుబడినట్లు తెలిసింది. వారి వద్ద రెండు ఆయుధాలు లభించినట్లు సమాచారం. జిల్లాలో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరుగకుండానే పోలీసులు అప్రమత్తంగా ఉండి అసాంఘిక శక్తులను కట్టడి చేయడం విశేషం. -
జనశక్తి మాజీ నేత చంద్రన్న మృతి
ముషీరాబాద్: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రభుత్వానికి నక్సలైట్లకు మధ్య జరిగిన చర్చల్లో జనశక్తి పక్షాన ప్రతినిధిగా పాల్గొన్న జనశక్తి మాజీ నేత కె.చంద్రన్న (75) గురువారం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో మృతి చెందారు. కొంతకాలంగా మధుమేహం, శ్వాసకోశ వ్యాధులతో ఆయన బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇటీవల విద్యానగర్‌లోని ఆంధ్ర మహాసభ ఆస్పతిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. యాదాద్రి జిల్లా టంగుటూర్ గ్రామానికి చెందిన చంద్రన్న ఈసీఐఎల్ ఉద్యోగిగా పనిచేశారు. ఉద్యోగం చేసే సమయంలో విప్లవ కార్మిక సంఘాలతో పరిచయం ఏర్పడి భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇఫ్టో), జనశక్తిల రాష్ట్రస్థాయి నేతగా ఎది గారు. బీడీ, సింగరేణి కార్మికుల అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం ఉదయం 11 గంటలకు రాంనగర్‌లోని స్మశాన వాటికలో జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన మృతి పట్ల న్యూడెమోక్రసీ తీవ్ర సంతాపం ప్రకటించింది. -
'జనశక్తి డెన్‌గా టీయూఎఫ్ కార్యాలయం'
హైదరాబాద్: టీయూఎఫ్ కార్యాలయం సీజ్ పై డీఐజీ అకున్ సబర్వాల్ స్పందించారు. మాచవరం పీఎస్ పరిధిలో భీంభరత్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. హైదరాబాద్‌లోని టీయూఎఫ్ కార్యాలయం నుంచి ఆయుధాలు అందుతున్నట్లు భీం భరత్ ఇచ్చిన సమాచారంతో దాడులు నిర్వహించామన్నారు. జనశక్తి డెన్‌గా టీయూఎఫ్ కార్యాలయాన్ని వాడుతున్నట్టు గుర్తించామని పేర్కొన్నారు. కూర రాజన్న, అమర్, విమలక్క కేంద్ర కమిటీ సభ్యులుగా మూడు కొత్త దళాల రిక్రూట్మెంట్ కూడా జరుగుతున్నట్టు తేలిందని అకున్ సబర్వాల్ వెల్లడించారు. తదుపరి విచారణ జరిపి మరిన్ని కేసులు నమోదు చేస్తామన్నారు. కూర రాజన్న, అమర్, విమలక్క పాత్రలపైనా విచారణ సాగుతోందని అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు.