'జనశక్తి డెన్గా టీయూఎఫ్ కార్యాలయం' | utf office using as den for janashakthi says akun sabarwal | Sakshi
Sakshi News home page

'జనశక్తి డెన్గా టీయూఎఫ్ కార్యాలయం'

Published Sun, Dec 4 2016 6:42 PM | Last Updated on Mon, Sep 4 2017 9:54 PM

'జనశక్తి డెన్గా టీయూఎఫ్ కార్యాలయం'

'జనశక్తి డెన్గా టీయూఎఫ్ కార్యాలయం'

హైదరాబాద్: టీయూఎఫ్ కార్యాలయం సీజ్ పై డీఐజీ అకున్ సబర్వాల్ స్పందించారు. మాచవరం పీఎస్ పరిధిలో భీంభరత్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. హైదరాబాద్లోని టీయూఎఫ్ కార్యాలయం నుంచి ఆయుధాలు అందుతున్నట్లు భీం భరత్ ఇచ్చిన సమాచారంతో దాడులు నిర్వహించామన్నారు. జనశక్తి డెన్‌గా టీయూఎఫ్ కార్యాలయాన్ని వాడుతున్నట్టు గుర్తించామని పేర్కొన్నారు.

కూర రాజన్న, అమర్, విమలక్క కేంద్ర కమిటీ సభ్యులుగా మూడు కొత్త దళాల రిక్రూట్మెంట్ కూడా జరుగుతున్నట్టు తేలిందని అకున్ సబర్వాల్ వెల్లడించారు. తదుపరి విచారణ జరిపి మరిన్ని కేసులు నమోదు చేస్తామన్నారు. కూర రాజన్న, అమర్, విమలక్క పాత్రలపైనా విచారణ సాగుతోందని అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement