హైదరాబాద్ సిటీ: కార్పోరేట్ శక్తులపై పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ప్రభుత్వం పుణ్యమా అని అదే కార్పోరేట్ల చేతుల్లోకి వెళ్లిపోయిందని తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్(టఫ్) విమర్శించింది. కేసీఆర్ ప్రభుత్వం కార్పోరేట్ కంపెనీలకు, బడా పారిశ్రామికవేత్తలకు తొత్తుగా మారి సామాన్యులను నిలువునా వంచిస్తోందని దుయ్యబట్టింది. ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం స్వార్థ శక్తుల చేత చిక్కిందని వారి నుంచి విడిపించి బంగారు తెలంగాణ సాధించేందుకు నవ తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టాలని తీర్మానించింది. తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ (టఫ్) ద్వితీయ వార్షికోత్సవ మహాసభలు సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రలో నిర్వహించారు.
తెలంగాణ ఉద్యమకారులు, మేథావులు పాల్గొన్న ఈ సభకు టఫ్ కో చైర్‌పర్సన్ విమలక్క అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా సామాజికవేత్త స్వామి అగ్నివేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డక కూడా రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటాన్నారో సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు. తెలంగాణను వ్యతిరేకించిన వారు ఈ రోజు మంత్రి పదవుల్లో కూర్చున్నారని, ఉద్యమించిన వారు జైలు పాలవుతున్నారని ఆరోపించారు. పేదలకు భూమి, కేజీ నుంచి పీజీ ఉచిత విద్య వంటి ఎన్నికల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
కేసీఆర్ కార్పొరేట్ల తొత్తు: టఫ్
Published Tue, May 12 2015 12:24 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM
Advertisement