TUF
-
మీ ప్రకృతి ప్రేమ నిజమే అయితే...
ప్రకృతి వ్యవసాయం – రక్షిత ఫలసాయం అంటూ ఈ యేడు మేము బహుజన బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహి స్తుండటంతో రైతాంగంలో, మేధావుల్లో మంచి స్పందన లభిస్తున్నది. ఈ కార్యక్రమం గురించి తెలుసుకుని అనేక మంది రచనలు పంపించారు. ప్రకృతి వ్యవసాయం లేదా తరతరాలుగా మనం అనుసరిస్తున్న సాంప్రదాయిక సహజ వ్యవసాయ పద్ధతులను కొనసాగిస్తే ఐదు రకాల ప్రోత్సాహకాలను అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2020 లోనే ‘పరంపరాగత్ కృషి వికాస్ యోజనా’ పథకం కింద సబ్సిడీలు ప్రకటించింది. అయితే రసా యన ఎరువులు, పురుగుమందులు పూర్తిగా నిషే ధించి నేలతల్లినీ, ప్రజారోగ్యాన్నీ రక్షించే దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాము. శ్రీలంక ప్రభుత్వం, సిక్కిం రాష్ట్రం ప్రమాదకర రసాయన వ్యవసాయాన్ని పూర్తిగా నిషేధించాయని విన్నాము. ‘భార తీయ ప్రకృతి కృషి పద్ధతి’ కింద ఆంధ్రప్రదేశ్ , కేరళ రాష్ట్రాల్లో 2 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారని కొన్ని గణాంకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనీ, విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేలా దీన్నొక పాఠ్యాంశంగా చేర్చాలనీ డిమాండ్ చేస్తున్నాం. ‘ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆర్గానిక్ అగ్రి కల్చర్ మూవ్మెంట్’ గణాంకాల ప్రకారం 2018– 19లో భారతదేశంలో సుమారు 50 లక్షల ఎకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం సాగుతున్నది. ఆ నివేదిక ప్రకారం ప్రపంచంలో చైనా మూడవ స్థానంలో, అమెరికా ఏడవ స్థానంలో ఉండగా మనం 9వ స్థానంలో నిలిచాము. కాబట్టి ‘పరంపరాగత్ కృషి వికాస్ యోజన’ కింద ఎంతమంది రైతాంగానికి కేంద్ర ప్రభుత్వ సహాయం అందిందో ప్రకటించాల్సిన అవసరం ఉంది. పరంపరాగత వ్యవసాయానికి పరం పరగా వస్తున్న దేశీయ విత్తనాలు, బహుళ పంటలు ముఖ్యమైన వనరు. అలాంటి నాటు విత్తనాలను కాపాడి చిన్న, సన్నకారు రైతాంగానికి అందించాలి. కౌలు రైతులకు స్వయంగా సాగు చేసుకునే భూములు అందించడం ముఖ్యమైనది. కాబట్టి వేలాది ఎకరా లను హస్తగతం చేసుకున్న జమీందారీ, జాగిర్దారీ వ్యవస్థల్లాగా బహుళజాతి కంపెనీలకు రకరకాల పేర్ల పైన వేలాది ఎకరాలు అప్పగించరాదు. ప్రభుత్వ భూముల అమ్మకానికి చేసిన జీవోలను రద్దు చేసి రైతులకు భూపంపిణీ జరగాలి. చారిత్రక కడివెండి గ్రామంలో ‘దున్నేవారికి దుక్కులు – దుక్కుల్లో ప్రకృతి మొక్కలు’ అంటూ బహుజన బతుకమ్మ పిలుపు నిచ్చింది. అంతకు ముందే ఆలగడపలో సెజ్‌ల కోసం ప్రజల సాగు భూములను సేకరించవద్దని వేలాది ప్రజల సమ క్షంలో బహుజన బతుకమ్మ ఆడి పాడి చాటి చెప్పింది. బాబాసాహెబ్ ప్రవచించినట్లు ‘ఆర్థిక ప్రజా స్వామ్యం, రాజకీయ ప్రజాస్వామ్యం’ అమలు జరగా లంటే సామ్రాజ్యవాదుల జోక్యం లేకుండా వనరుల వికేంద్రీకరణ జరగాలి. వ్యవసాయం, చేతి వృత్తులు జంటగా అభివృద్ధి కావాలి. అందుకే భూసా రాన్ని కాపాడుకోవడానికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ స్కీమ్ స్థానంలో మొత్తంగా రసాయన ఎరు వులు, క్రిమిసంహారక మందులను అరికట్టే నిర్ణయం తీసు కోలేరా? ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని చెప్పడమే నిజమైతే పురుగు మందుల కంపెనీలు చేసే ప్రచారాన్నయినా ఎందుకు అరికట్టలేక పోతున్నారు? పాడి–పంట–పెంట విధానాల ద్వారా ఇంటింటికో ఎరువుల కర్మాగారం, పాడి ఉత్పత్తుల అభివృద్ధి, సాంప్రదాయక ఇంధన వనరుల అభివృద్ధి దిశగా పథక రచనలు జరగాలి. దేశీయ సహజ వనరులపై పిడికెడు మంది గుత్తాధిపత్యాన్ని నివారించగలిగి నప్పుడే ఈ దిశగా నిజమైన ప్రయాణం మొదల వుతుంది. విమలక్క బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ తరఫున... మొబైల్ : 88868 41280 -
'జనశక్తి డెన్‌గా టీయూఎఫ్ కార్యాలయం'
హైదరాబాద్: టీయూఎఫ్ కార్యాలయం సీజ్ పై డీఐజీ అకున్ సబర్వాల్ స్పందించారు. మాచవరం పీఎస్ పరిధిలో భీంభరత్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. హైదరాబాద్‌లోని టీయూఎఫ్ కార్యాలయం నుంచి ఆయుధాలు అందుతున్నట్లు భీం భరత్ ఇచ్చిన సమాచారంతో దాడులు నిర్వహించామన్నారు. జనశక్తి డెన్‌గా టీయూఎఫ్ కార్యాలయాన్ని వాడుతున్నట్టు గుర్తించామని పేర్కొన్నారు. కూర రాజన్న, అమర్, విమలక్క కేంద్ర కమిటీ సభ్యులుగా మూడు కొత్త దళాల రిక్రూట్మెంట్ కూడా జరుగుతున్నట్టు తేలిందని అకున్ సబర్వాల్ వెల్లడించారు. తదుపరి విచారణ జరిపి మరిన్ని కేసులు నమోదు చేస్తామన్నారు. కూర రాజన్న, అమర్, విమలక్క పాత్రలపైనా విచారణ సాగుతోందని అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు. -
విమలక్కపై పోలీసు చర్య: ఆఫీస్ సీజ్
హైదరాబాద్: ప్రజా గాయని, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్(టీయూఎఫ్) నాయకురాలు విమలక్కపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. హైదరాబాద్ దోమలగూడలోని ఆమె కార్యాలయాన్ని శుక్రవారం సీజ్ చేశారు. కార్యాలయం కేంద్రంగా విమలక్క చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ టీయూఎఫ్ కే చెందిన ప్రధాన కార్యదర్శి భరత్ ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. ఇంతకు ముందు కూడా విమలక్కపై అనేక కేసులు నమోదైన సంగతి తలిసిందే. -
'నా భర్త ఎక్కడున్నాడో పోలీసులే చెప్పాలి'
వికారాబాద్ రూరల్ (రంగారెడ్డి జిల్లా): తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్(టఫ్)లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నా భర్త భీంభరత్ ఎక్కడున్నాడో వెంటనే చెప్పాలని ఆయన భార్య జ్యోతి పోలీసులను డిమాండ్ చేశారు. వికారాబాద్‌లోని అతిథి గృహంలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ఉప్పర్‌పల్లిలో నివాసం ఉంటుండగా ఈ నెల 1వ తేదీ అర్ధరాత్రి 12.30 గంటలకు అచ్చంపేట, షాబాద్ పోలీసులమంటూ 20, 30 మంది వచ్చి ఏమీ చెప్పకుండా భీంభరత్‌ను తీసుకువెళ్లారన్నారు. మూడు రోజులు అవుతున్నా ఎందుకు తీసుకువెళ్లారో, ఎక్కడ ఉంచారో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్థరాత్రి ఇంట్లోకి చొరబడి అక్రమంగా తీసుకెళ్లడం వెనుక కుట్ర దాగిఉందని ఆరోపించారు. భీంభరత్‌కు ఏమైన అయితే పూర్తి బాధ్యత పోలీసులదేనన్నారు. ఈ విషయమై రాష్ట్ర హోంమంత్రిని కలిశామని, ఆయన జిల్లా ఎస్పీతో మాట్లాడారని జ్యోతి అన్నారు. భీంభరత్ వికారాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఉన్నట్లు 9490617966 నంబర్ నుంచి ఫోన్ వచ్చిందని, తీరా ఇక్కడి వచ్చి చూస్తే లేడని పేర్కొన్నారు. నా భర్తను 24 గంటల్లో కోర్టులో హాజరు పర్చాలని, లేని పక్షంలో రాష్ర్ట వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. ఆమె వెంట టఫ్ నాయకులు నాగిరెడ్డి, మహేష్, విశ్వం, అశోక్ తదితరులు ఉన్నారు. -
కేసీఆర్ కార్పొరేట్ల తొత్తు: టఫ్
హైదరాబాద్ సిటీ: కార్పోరేట్ శక్తులపై పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ప్రభుత్వం పుణ్యమా అని అదే కార్పోరేట్ల చేతుల్లోకి వెళ్లిపోయిందని తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్(టఫ్) విమర్శించింది. కేసీఆర్ ప్రభుత్వం కార్పోరేట్ కంపెనీలకు, బడా పారిశ్రామికవేత్తలకు తొత్తుగా మారి సామాన్యులను నిలువునా వంచిస్తోందని దుయ్యబట్టింది. ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం స్వార్థ శక్తుల చేత చిక్కిందని వారి నుంచి విడిపించి బంగారు తెలంగాణ సాధించేందుకు నవ తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టాలని తీర్మానించింది. తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ (టఫ్) ద్వితీయ వార్షికోత్సవ మహాసభలు సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రలో నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారులు, మేథావులు పాల్గొన్న ఈ సభకు టఫ్ కో చైర్పర్సన్ విమలక్క అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా సామాజికవేత్త స్వామి అగ్నివేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డక కూడా రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటాన్నారో సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు. తెలంగాణను వ్యతిరేకించిన వారు ఈ రోజు మంత్రి పదవుల్లో కూర్చున్నారని, ఉద్యమించిన వారు జైలు పాలవుతున్నారని ఆరోపించారు. పేదలకు భూమి, కేజీ నుంచి పీజీ ఉచిత విద్య వంటి ఎన్నికల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. -
నవ తెలంగాణ కోసం పోరాడాలి
తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ (టీయూఎఫ్) రాష్ట్ర కో-కన్వీనర్ విమలక్క షాబాద్ : తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పడమే బతుకమ్మ పండుగ ఉద్దేశమని తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ (టీయూఎఫ్) రాష్ట్ర కో-కన్వీనర్ విమలక్క పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన బహుజన బతుకమ్మలో ఆమె పాలుపంచుకున్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. సీమాంధ్ర పాలనలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు పూర్తిగా అణచివేయబడ్డాయని విమర్శించారు. రోజురోజుకూ ఆదరణ కోల్పోయిన ఈ పండుగలను ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకోవాలని సూచించారు. నవ తెలంగాణ కోసం ప్రజలు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఐదు లక్షల ఎకరాల భూములను పారిశ్రామికులకు అప్పగిస్తామని సీఎం కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రైవేట్ రంగ సంస్థలకు ప్రభుత్వ భూములు అప్పగిస్తే పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. ముందుగా మైనింగ్ మాఫియా భూములను రద్దు చేయాలని హితవుపలికారు. ఫిరంగినాలాకు మరమ్మతులు చేపట్టాలని గతంలో చందనవెళ్లి నుంచి ఇబ్రహీంపట్నం వరకు పాదయాత్ర చేసినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సాగునీటి వనరులపై చిత్తశుద్ధితో పనిచేయకపోతే ఈ ప్రభుత్వానికి కూడా గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందన్నారు. తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ రాష్ట్ర కమిటీ సభ్యులు భీంభరత్, జిల్లా కార్యదర్శి నారాయణదాస్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాల న్నారు. కార్యక్రమంలో అరుణోదయ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహన్బైరాగి, యువజన సంఘాల జిల్లా అధ్యక్షుడు మహేశ్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అనిత, జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మి, సర్పంచ్‌లు రాములుగౌడ్, లక్ష్మమ్మ, సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యులు పోచయ్య, సత్యనారాయణ, నాయకులు విశ్వ నాథం, శ్రీను, మహేశ్ పాల్గొన్నారు.