అరుణోదయ కార్యాలయం సీజ్ | Arunodhaya office Siege | Sakshi
Sakshi News home page

అరుణోదయ కార్యాలయం సీజ్

Published Sat, Dec 3 2016 3:40 AM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM

అరుణోదయ కార్యాలయం సీజ్

అరుణోదయ కార్యాలయం సీజ్

 హైదరాబాద్: అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కార్యాలయంపై కామారెడ్డి జిల్లా పోలీసులు దాడి చేశారు. సోదాలు జరిపి విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయాన్ని సీజ్ చేశారు. ఈ సంఘటన శుక్రవారం ఇక్కడ దోమలగూడలో జరిగింది. సోదాల సందర్భంగా ఆఫీసులోనే ఉన్న అరుణోదయ విమలక్క,, నాయకులు బైరాగి మోహన్ తదితరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కామారెడ్డి సర్కిల్ పరిధిలోని మాచారెడ్డి పోలీసు స్టేషన్‌లో 2015 మార్చి 26న జరిగిన కేసులో ఆరుగురిని అప్పట్లోనే  పోలీసులు అరెస్టు చేశారు. ఆ కేసుతో సంబంధం ఉన్నదని భీంభరత్ అనే నిందితుడిని కామారెడ్డిలో గురు వారం అరెస్టు చేశారు. అతడి నుంచి విప్లవ సాహిత్యం, 20 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. అతడిచ్చిన సమా చారంతో పోలీసులు  అరుణోదయ ఆఫీస్‌పై దాడి చేశారు.

 అరుణోదయ ఆఫీసు సీజ్ దుర్మార్గం: విమలక్క
 తెలంగాణ ఉద్యమంలో ఆట, పాట, మాటలతో ప్రజలను అరుణోదయ కార్యకర్తలు చైతన్యం చేశారని, అలాంటి సంస్థ కార్యాలయాన్ని పోలీసులు సీజ్ చేయడం దుర్మార్గమని విమలక్క అన్నారు. పోలీసుల దాడులపై రాష్ర్ట మంత్రి హరీశ్‌రావుతో మాట్లాడాలని ప్రయత్నిస్తే ఫోను ఎత్తలేదని, హోంమంత్రి నారుుని దృష్టికి తీసుకువెళ్లామన్నారు. అంతకు ముందు విలేకరుతో విమలక్క మాట్లాడుతూ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ రాష్ర్ట సహాయ కార్యదర్శి భీంభరత్‌ను వెంటనే కోర్టులో హాజరు పర్చాలని డిమాండ్ చేశారు. భీంభరత్ కనిపించకుం డాపోయారని రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్, రాష్ర్ట మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. ఈ నెల 15 లోపు ఫిర్యాదుపై వివరాలను అందించాలని హక్కుల కమిషన్ డీజీపీకి ఉత్తర్వులు జారీ చేసినట్లు వారు తెలిపారు.  

 అక్రమ కేసుల్లో అరెస్టు: భీంభరత్
 భీంభరత్ విలేకరులతో మాట్లాడుతూ లంగర్‌హౌస్‌లో ఓ లాయర్‌తో మాట్లాడి వస్తుండగా గురువారం రాత్రి కామారెడ్డి పోలీసులు అరెస్టు చేసి అక్కడికి తీసుకువెళ్లారని, శుక్రవారం 3గంటల ప్రాంతంలో నగరానికి తీసుకువచ్చా రని అన్నారు. తనపై మోపిన అక్రమ కేసులను, అరుణో దయ కార్యాలయ సీజ్‌ను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు.

 ప్రజాస్వామ్య ఉద్యమాలపై అణచివేత : సీపీఐ
 అరుణోదయ సాంస్కృతిక సంస్థ కార్యాలయం సీజ్ చేయడాన్ని సీపీఐ ఖండించింది. ప్రజాస్వామ్య ఉద్యమాలను అణచేలా పోలీసుల చర్య ఉందని మండిపడింది. కార్యాలయంలో సాహిత్య, పాటల పుస్తకాలున్నా ఇలాంటి చర్యలకు పాల్పడటం గర్హనీయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement