telangana united front
-
టఫ్ కార్యాలయాన్ని బాధ్యులకు అప్పగించాలి
న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి డీవీ కృష్ణ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు పౌర, ప్రజాస్వామిక హక్కులను గ్యారంటీ చేస్తామని రాష్ట్ర సాధన ఉద్యమంలో వాగ్దానం చేసి.. అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం, ఎమర్జెన్సీని తలపించేలా నిర్బంధ చర్యలకు పూనుకోవడం దురదృష్టకరమని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పేర్కొంది. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ (టఫ్) కార్యాలయంపై పోలీ సులు దాడి చేసి, మహిళా కార్యకర్తలను బయటకు పంపి బలవంతంగా మూసి వేయడాన్ని ఆ పార్టీ ఖండించింది. టఫ్ కార్యాలయాన్ని వెంటనే దాని బాధ్యులకు అప్పగించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డి.వి.కృష్ణ డిమాండ్ చేశారు. టఫ్ నాయకులు, ఇతర ప్రజాసంఘాల నాయకులు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మలను కలిసినపుడు, వెంటనే దాన్ని తెరిపించి అప్పగిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కానీ, ఎన్నోరోజులు గడిచినా అమలు చేయకపోవడం పట్ల ఆ పార్టీ నిరసనను ప్రకటించింది. కాగా, ప్రముఖ పాత్రికేయులు వి.హనుమంతరావు మృతి పట్ల న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి డి.వి.కృష్ణ సంతాపం ప్రకటించారు. -
అరుణోదయ కార్యాలయం సీజ్
హైదరాబాద్: అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కార్యాలయంపై కామారెడ్డి జిల్లా పోలీసులు దాడి చేశారు. సోదాలు జరిపి విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయాన్ని సీజ్ చేశారు. ఈ సంఘటన శుక్రవారం ఇక్కడ దోమలగూడలో జరిగింది. సోదాల సందర్భంగా ఆఫీసులోనే ఉన్న అరుణోదయ విమలక్క,, నాయకులు బైరాగి మోహన్ తదితరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కామారెడ్డి సర్కిల్ పరిధిలోని మాచారెడ్డి పోలీసు స్టేషన్లో 2015 మార్చి 26న జరిగిన కేసులో ఆరుగురిని అప్పట్లోనే పోలీసులు అరెస్టు చేశారు. ఆ కేసుతో సంబంధం ఉన్నదని భీంభరత్ అనే నిందితుడిని కామారెడ్డిలో గురు వారం అరెస్టు చేశారు. అతడి నుంచి విప్లవ సాహిత్యం, 20 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. అతడిచ్చిన సమా చారంతో పోలీసులు అరుణోదయ ఆఫీస్‌పై దాడి చేశారు. అరుణోదయ ఆఫీసు సీజ్ దుర్మార్గం: విమలక్క తెలంగాణ ఉద్యమంలో ఆట, పాట, మాటలతో ప్రజలను అరుణోదయ కార్యకర్తలు చైతన్యం చేశారని, అలాంటి సంస్థ కార్యాలయాన్ని పోలీసులు సీజ్ చేయడం దుర్మార్గమని విమలక్క అన్నారు. పోలీసుల దాడులపై రాష్ర్ట మంత్రి హరీశ్‌రావుతో మాట్లాడాలని ప్రయత్నిస్తే ఫోను ఎత్తలేదని, హోంమంత్రి నారుుని దృష్టికి తీసుకువెళ్లామన్నారు. అంతకు ముందు విలేకరుతో విమలక్క మాట్లాడుతూ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ రాష్ర్ట సహాయ కార్యదర్శి భీంభరత్‌ను వెంటనే కోర్టులో హాజరు పర్చాలని డిమాండ్ చేశారు. భీంభరత్ కనిపించకుం డాపోయారని రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్, రాష్ర్ట మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. ఈ నెల 15 లోపు ఫిర్యాదుపై వివరాలను అందించాలని హక్కుల కమిషన్ డీజీపీకి ఉత్తర్వులు జారీ చేసినట్లు వారు తెలిపారు. అక్రమ కేసుల్లో అరెస్టు: భీంభరత్ భీంభరత్ విలేకరులతో మాట్లాడుతూ లంగర్‌హౌస్‌లో ఓ లాయర్‌తో మాట్లాడి వస్తుండగా గురువారం రాత్రి కామారెడ్డి పోలీసులు అరెస్టు చేసి అక్కడికి తీసుకువెళ్లారని, శుక్రవారం 3గంటల ప్రాంతంలో నగరానికి తీసుకువచ్చా రని అన్నారు. తనపై మోపిన అక్రమ కేసులను, అరుణో దయ కార్యాలయ సీజ్‌ను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య ఉద్యమాలపై అణచివేత : సీపీఐ అరుణోదయ సాంస్కృతిక సంస్థ కార్యాలయం సీజ్ చేయడాన్ని సీపీఐ ఖండించింది. ప్రజాస్వామ్య ఉద్యమాలను అణచేలా పోలీసుల చర్య ఉందని మండిపడింది. కార్యాలయంలో సాహిత్య, పాటల పుస్తకాలున్నా ఇలాంటి చర్యలకు పాల్పడటం గర్హనీయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. -
హోంమంత్రి ని కలవనున్న విమలక్క
తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ సంయుక్త కార్యదర్శి భీం భరత్ అక్రమ అరెస్ట్‌కు సంబంధించిన విషయం పై చర్చించడానికి ఈ రోజు విమలక్క తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలవనున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహించిన విమలక్క మినిస్టర్ క్వాటర్స్‌లో హోంమంత్రిని కలిసి ఈ విషయం పై చర్చించనున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో పాల్గొననున్నారు. -
కేసీఆర్ కార్పొరేట్ల తొత్తు: టఫ్
హైదరాబాద్ సిటీ: కార్పోరేట్ శక్తులపై పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ప్రభుత్వం పుణ్యమా అని అదే కార్పోరేట్ల చేతుల్లోకి వెళ్లిపోయిందని తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్(టఫ్) విమర్శించింది. కేసీఆర్ ప్రభుత్వం కార్పోరేట్ కంపెనీలకు, బడా పారిశ్రామికవేత్తలకు తొత్తుగా మారి సామాన్యులను నిలువునా వంచిస్తోందని దుయ్యబట్టింది. ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం స్వార్థ శక్తుల చేత చిక్కిందని వారి నుంచి విడిపించి బంగారు తెలంగాణ సాధించేందుకు నవ తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టాలని తీర్మానించింది. తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ (టఫ్) ద్వితీయ వార్షికోత్సవ మహాసభలు సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రలో నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారులు, మేథావులు పాల్గొన్న ఈ సభకు టఫ్ కో చైర్పర్సన్ విమలక్క అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా సామాజికవేత్త స్వామి అగ్నివేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డక కూడా రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటాన్నారో సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు. తెలంగాణను వ్యతిరేకించిన వారు ఈ రోజు మంత్రి పదవుల్లో కూర్చున్నారని, ఉద్యమించిన వారు జైలు పాలవుతున్నారని ఆరోపించారు. పేదలకు భూమి, కేజీ నుంచి పీజీ ఉచిత విద్య వంటి ఎన్నికల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. -
‘బిల్లు’పై చర్చ ప్రజల మధ్య జరగాలి
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: ప్రస్తుతమున్న అసెంబ్లీని సమైక్యవాదుల అసెంబ్లీగా తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్(టఫ్) కో కన్వీనర్ విమలక్క అభివర్ణించారు. ఆదివారం రాత్రి మండల పరిధిలోని పోల్కంపల్లి గ్రామంలో టఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమ సభలో ఆమె ప్రసంగించారు. ప్రస్తుత అసెంబ్లీలో ఎమ్మెల్యేలు తిట్టుకోవడం, కొట్టుకోవడమే తప్ప తెలంగాణ బిల్లు ఆమోదం పొందనివ్వరన్నారు. అసెంబ్లీ వెలుపల ఉన్న ఫతే మైదాన్‌లో ఎమ్మెల్యేలు సమావేశమై ప్రజల సమక్షంలో తెలంగాణ బిల్లుపై చర్చించాలని ఆమె డిమాండ్ చేశారు. అప్పుడు ప్రజలే తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా చూసుకుంటారని విమలక్క పేర్కొన్నారు. సీమాంధ్ర పెట్టుబడిదారులు, తెలంగాణ దళారులతో కుమ్మక్కై తెలంగాణ రాకుండా కుట్ర పన్నుతున్నారని ఆమె ఆరోపించారు. ల్యాండ్, గ్రానైట్, మైన్స్ మాఫియాలంతా కూడా తెలంగాణను అడ్డుకోవాలని చూస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రాంతంలో అక్రమంగా కాజేసిన తమ భూములను కాపాడుకోవడానికే సీమాంధ్ర నాయకులు నానా కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. సీమాంధ్రుల భూములను లాక్కొని తెలంగాణ రైతులు నాగళ్లతో దున్నడం ఖాయమన్నారు. జిల్లాలో ఉన్న భూములు నేడు సీమాంధ్రుల కబ్జాలో ఉన్నాయని అన్నారు. ఇబ్రహీంపట్నం ప్రాంతం మీదుగా వెళుతున్న కృష్ణా నీటి పైపులను పగులగొట్టి ఇక్కడి పెద్ద చెరువును నింపుకోవాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సభలో టఫ్ రాష్ట్ర నాయకులు భీం భరత్, నారాయణదాసు, అరుణోదయ నాయకులు బైరాగీ, రాజు, సీపీఐ నాయకులు కావలి నర్సింహ, ఎంఎస్ఎఫ్ నాయకులు కొండ్రు ప్రవీణ్, బీజేపీ నాయకులు మొగిలి గణేశ్, గుండ్ల దానయ్యగౌడ్, టఫ్ నాయకులు రామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాధికారంతోనే సామాజిక న్యాయం
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నంత కాలం శాంతిభద్రతలు, భూములు, ఆదాయం వంటివాటిలో తమకూ వాటా ఉండాల్సిందేనని సీమాంధ్ర నేతలు డిమాండ్ చేశారు. రాజధానిగా 5 లేదా 10 ఏళ్లున్నా అధికారాల విభజనకు అంగీకరించేది లేదని తెలంగాణ నేతలు స్పష్టం చేశారు. ‘రెండు రాష్ట్రాలు-సామాజిక దృక్పథం’ పేరిట తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్(టీఆర్ఎల్డీ), తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్(టఫ్) సంయుక్తంగా ఆదివారం హైదరాబాద్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించింది. ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్, టఫ్ కన్వీనర్ విమలక్క సమన్వయకర్తలుగా వ్యవహరించారు. ఈ సదస్సులో లోక్‌సత్తా అధ్యక్షులు కఠారి శ్రీనివాసరావు, ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, సీమాంధ్ర బీసీ జేఏసీ వేల్పూరి శ్రీనివాసరావు, బీజేపీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీలు కె.ఆర్.ఆమోస్, పూల రవీందర్, ప్రొఫెసర్లు కేశవరావు జాదవ్, పి.ఎల్.విశ్వేశ్వర్రావు, లక్ష్మణ్, టీఆర్ఎల్డీ అధ్యక్షులు కె.ఇందిర, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ అధ్యక్షులు కప్పర ప్రసాదరావు, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు చింత స్వామిమాదిగ, టీఆర్ఎల్డీ నేతలు సి.హెచ్.శేషగిరిరావు, రియాజ్, ప్రముఖ కవి గూడ అంజన్న, శ్రీధర్ ధర్మాసనం తదితరులు ప్రసంగించారు. బీజేపీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ రాజ్యాధికారంలో వాటా లేకుండా సామాజిక న్యాయం సాధ్యం కాదన్నారు. బీసీలకూ సబ్‌ప్లాన్‌ను, చట్టసభల్లో రిజర్వేషన్లను అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కె.ఆర్.ఆమోస్ మాట్లాడుతూ అభ్యర్థుల ఎంపిక నుండి అమలుదాకా అగ్రవర్ణాలే అధిపత్యం వహిస్తున్నాయని, రాజకీయ చైతన్యంతోనే రాజ్యాధికారం వస్తుందన్నారు. తెలంగాణ ఆగదని, సమగ్ర అభివృద్ధి పైనే దృష్టి కేంద్రీకరించి పనిచేయాలని సూచించారు. లోక్‌సత్తా అధ్యక్షులు కఠారి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యావకాశాలు పెరిగితేనే చైతన్యం, తద్వారా రాజకీయాధికారం, సామాజికన్యాయం సాధ్యమన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ విద్యావకాశాలను పెంచి, మానవ వనరుల్లో నాణ్యతను పెంచాలని సూచించారు. ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నంతకాలం శాంతి భద్రతలు, భూములు, ఆదాయం వంటివాటిలో సీమాంధ్రకూ హక్కుంటే తప్ప సీమాంధ్రలో ఉద్యమాలు ఆగవన్నారు. సీమాంధ్ర రాజధానిలో మౌలిక సదుపాయాలకోసం కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రలో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికోసం కేంద్ర ప్రభుత్వమే అదనపు నిధులను కేటాయించాలని కోరారు. తెలంగాణకు వ్యతిరేకం కాదని, అభద్రతా భావాన్ని పోగొట్టే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. సీమాంధ్ర బీసీ జేఏసీ అధ్యక్షులు వేల్పూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, దోపిడీకి అలవాటు పడిన సీమాంధ్ర సంపన్నులు, పెట్టుబడిదారులు తప్ప తెలంగాణ ఏర్పాటుకు సామాజిక వర్గాలు వ్యతిరేకంగా లేవన్నారు. ఎమ్మెల్సీ, టఫ్ సెక్రటరీ జనరల్ కె.దిలీప్‌కుమార్ మాట్లాడుతూ, హైదరాబాద్ శాంతిభద్రతలు, భూములు, ఆదాయాల్లో హక్కులు పంచుతామంటే తెలంగాణ ప్రజలు అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. విభజనకు ముందుగానే నదీజలాల పంపకంపై స్పష్టమైన, నిర్దిష్టమైన ఒప్పందాలు చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమకు అన్యాయం జరుగకుండా చూడాల్సిన బాధ్యత అటు ఆంధ్రాపై, ఇటు తెలంగాణపై ఉమ్మడిగా ఉందన్నారు. అదనపు ఉద్యోగాల విషయంలో కేంద్ర ప్రభుత్వమే సూపర్ న్యూమరరీ పోస్టులుగా గుర్తించాలని దిలీప్‌కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల పోరాట ఫలితంగా వచ్చిన రాష్ట్రాన్ని దొరల తెలంగాణ కాకుండా రాష్ట్ర విభజనకు ముందే సామాజిక వాటాను కూడా ప్రకటించాలని కోరారు. తెలంగాణ ఏర్పాటు ఆగదని, అప్పటిదాకా ఉద్యమకారులు కొంత సంయమనంతో ఉండాలని కోరారు. కేంద్ర మంత్రివర్గ బృందాన్ని కలసి ఇరుప్రాంతాల మధ్య ఉన్న భయాందోళనలను తొలగించాలని కోరినట్టుగా దిలీప్‌కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, కవి గూడ అంజన్న, ఎమ్మెల్సీ కె.ఆర్.ఆమోస్‌ను దిలీప్‌కుమార్, విమలక్క సన్మానించారు. కేసీఆర్ ఫాంహౌస్‌లో భారీ బంకర్ : చింతా స్వామిమాదిగ మెదక్ జిల్లాలోని కేసీఆర్ ఫాంహౌస్‌లో బంకర్‌ను నిర్మించుకుంటున్నారని టీఆర్ఎస్ ఎస్సీసెల్ మాజీ అధ్యక్షులు చింతా స్వామిమాదిగ వెల్లడించారు. ఫాంహౌస్‌లో ఎకరం విస్తీర్ణానికి పైగా భారీగా బావిని తవ్వినట్టుగా ఒక పత్రికలోనూ వచ్చిందని గుర్తుచేశారు. వ్యవసాయ బావి అయితే ఒక ఎకరం విస్తీర్ణంలో ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌కు ఆనుకుని 40 ఎకరాలతో ప్రారంభమైన ఈ ఫాంహౌస్ చుట్టుపక్కల పేదలను బెదిరిస్తూ ఆక్రమించి, బలవంతంగా అమ్మించి ఇప్పుడు వందల ఎకరాలకు చేరుకున్నదని స్వామి ఆరోపించారు. ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో తెలంగాణకు కేంద్రంగా చేయాలని కుట్రలు జరుగుతున్నాయన్నారు. భవిష్యత్తులో పద్మనాభస్వామి ఆలయపు అనుభవాలను గుర్తుచేసుకోవాల్సి ఉంటుందని స్వామి అన్నారు. -
4 నుంచి 12 వరకు ‘బహుజన బతుకమ్మ’
హైదరాబాద్, న్యూస్‌లైన్ : దళిత బహుజనులకు బతుకమ్మను అంకితంచేసే ఉద్దేశంతో ఈ నెల 4 నుంచి 12వరకు ‘బహుజన బతుకమ్మ’ నిర్వహించనున్నట్టు తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ ప్రతినిధి విమలక్క తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను సోమవారం స్థానిక సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వివిధ సంఘాల ప్రతినిధులతో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణపై సాంస్కృతిపై సాగుతున్న సీమాంధ్ర పెట్టుబడిదారుల దాడిని తిప్పికొట్టేందుకే ఈసారి గిరిజన తండాలు, మాదిగ వాడల్లో పండుగను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బహుజన బతుకమ్మకు సుమారు 25 సంఘాలు మద్దతిస్తున్నాయన్నారు. అనంతరం, బతుకమ్మ కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. 4న మెదక్‌లోని గజ్వేల్ ఎర్రవల్లి గ్రామంలోనూ, 5న హైదరాబాద్, కూకట్పల్లి(సుమిత్రానగర్)లోనూ, 7న నల్గొండ టౌన్‌లోనూ, 8న ఖమ్మంలోనూ, 9న ఆదిలాబాద్, చెన్నూరుల్లోనూ, 10న కరీంనగర్, వేములవాడలోనూ, 11న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, పాలమూరు జిల్లా కొడంగల్, 12న హన్మకొండలోనూ బహుజన బతుకమ్మ నిర్వహిస్తామన్నారు. -
అమరుల త్యాగఫలమే తెలంగాణ
కుల్కచర్ల, న్యూస్‌లైన్: ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం, వందలమంది ప్రాణత్యాగాన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన చేసింది తప్ప రోజుకో పార్టీలు మారుతున్న దొంగ రాజకీయ నాయకుల వల్ల కాదని తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ అధ్యక్షురాలు విమలక్క అన్నారు. గురువారం స్వాతంత్య్ర దినం సందర్భంగా కుల్కచర్ల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో విమలక్కతో మాట, పాట కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటు అంశంపై పలువురు ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలకు విమలక్క సమాధానాలిచ్చారు. మధ్యమధ్యలో తెలంగాణ వనరుల దోపిడీ, ఉద్యమం తీరుతెన్నులను పాటల ద్వారా వినిపిస్తూ ఆకట్టుకున్నారు. అనంతరం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రం ప్రకటనతో తెలంగాణ వచ్చినట్లు కాదని, సీమాంధ్ర పెట్టుబడిదారుల నుంచి ఈ ప్రాంతం విముక్తి పొందినప్పుడే అసలైన తెలంగాణ రాష్ట్రం వచ్చినట్లని పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధుల కృత్రిమ ఉద్యమాలకు, బెదిరింపులకు లొంగకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయాలని అన్నారు. సమైక్య ఉద్యమానికి మద్దతుగా... తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న కిరణ్‌కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని, ఆయన తక్షణం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దొరల పాలన లేని సామాజిక తెలంగాణే తమ లక్ష్యమని, పెట్టుబడిదారుల పాలన అంతం చేసేంతవరకూ తమ పోరాటం కొనసాగుతుందని విమలక్క స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు ప్రహ్లాద్‌రావు, పీఏసీఎస్ అధ్యక్షుడు భీంరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సుధాకర్ రెడ్డి, నాగరాజు, మండల జేఏసీ అధ్యక్షుడు సత్యనారాయణ, కుల్కచర్ల సర్పంచ్ జానకిరాం, మండల టీడీపీ అధ్యక్షుడు రాంరెడ్డి, టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు రాఘవేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.