హైదరాబాద్, న్యూస్‌లైన్ : దళిత బహుజనులకు బతుకమ్మను అంకితంచేసే ఉద్దేశంతో ఈ నెల 4 నుంచి 12వరకు ‘బహుజన బతుకమ్మ’ నిర్వహించనున్నట్టు తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ ప్రతినిధి విమలక్క తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను సోమవారం స్థానిక సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వివిధ సంఘాల ప్రతినిధులతో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణపై సాంస్కృతిపై సాగుతున్న సీమాంధ్ర పెట్టుబడిదారుల దాడిని తిప్పికొట్టేందుకే ఈసారి గిరిజన తండాలు, మాదిగ వాడల్లో పండుగను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బహుజన బతుకమ్మకు సుమారు 25 సంఘాలు మద్దతిస్తున్నాయన్నారు.
అనంతరం, బతుకమ్మ కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. 4న మెదక్‌లోని గజ్వేల్ ఎర్రవల్లి గ్రామంలోనూ, 5న హైదరాబాద్, కూకట్‌పల్లి(సుమిత్రానగర్)లోనూ, 7న నల్గొండ టౌన్‌లోనూ, 8న ఖమ్మంలోనూ, 9న ఆదిలాబాద్, చెన్నూరుల్లోనూ, 10న కరీంనగర్, వేములవాడలోనూ, 11న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, పాలమూరు జిల్లా కొడంగల్, 12న హన్మకొండలోనూ బహుజన బతుకమ్మ నిర్వహిస్తామన్నారు.
4 నుంచి 12 వరకు ‘బహుజన బతుకమ్మ’
Published Tue, Oct 1 2013 2:31 AM | Last Updated on Fri, Sep 1 2017 11:12 PM
Advertisement