నేడు ‘బహుజన బతుకమ్మ’ పాటల ఆవిష్కరణ: విమలక్క | Launch of Bahujana Bathukamma songs: Vimalakka | Sakshi
Sakshi News home page

నేడు ‘బహుజన బతుకమ్మ’ పాటల ఆవిష్కరణ: విమలక్క

Published Sun, Oct 8 2023 5:25 AM | Last Updated on Sun, Oct 8 2023 5:25 AM

Launch of Bahujana Bathukamma songs: Vimalakka - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అరు­ణోదయ సాంస్కృతిక సమా­ఖ్య­­(ఏసీఎఫ్‌) రూపొందించిన ‘పూసే పూల కవాతు’, ‘రావె రావె బతుకమ్మ రావే’­అనే పాటల వీడియోలను ఆది­వారం­(నేడు) ఉదయం 10 గంటలకు ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఆవిష్కరిస్తామని ప్రజాగాయకురాలు విమ­లక్క తెలిపారు.

13 ఏళ్లుగా నిర్వహిస్తున్న బహుజన బతుకమ్మను ఈ ఏడాది ‘మద్యం రద్దు– మగువల రక్షణ’అనే అంశంపై ప్రకృతి పూల కవాతుగా నిర్ణయించినట్లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పండుగ ఈ నెల 13న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మొదలై 22న ఖమ్మం జిల్లా ముదిగొండలో ముగుస్తుందని విమలక్క వెల్లడించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement