Naxalites
-
‘అన్న’లు నిర్మించిన పాఠశాల
సాక్షి, సిద్దిపేట: ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు మృతి అన్న వార్తలు విన్నప్పుడల్లా ఆ ఊరి ప్రజలు ఉలిక్కిపడతారు. 30 ఏళ్ల కిందట బాలకార్మికులుగా మగ్గిపోతున్న తమ బిడ్డల కోసం బడి కట్టించిన ఆ అన్నలను తలుచుకుని కలవరపడుతుంటారు. తెలంగాణలో నక్సల్స్ ప్రభావం తీవ్రంగా ఉన్న రోజుల్లో నక్సల్స్ సిద్దిపే ట జిల్లా దుబ్బాక మండలం దుంపలపల్లిలో పేద పిల్లల కోసం పాఠశాలను నిర్మించారు. ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాల అదే.గ్రామస్తుల విజ్ఞప్తితో.. 1991 వరకు ఈ గ్రామంలో పాఠశాల పూరి గుడిసెలో కొనసాగింది. ఆ సమయంలో దుంపలపల్లికి వచ్చిన పీపుల్స్‌వార్ నాగన్న దళానికి పాఠశాల భవనం నిర్మించాలని గ్రామస్తులు విన్నవించారు. దీంతో మూడు గదులను నిర్మించాలని నక్సల్స్ నేతలు నాగన్న, నగేష్, రామన్న, జనార్దన్‌లు నిర్ణయించారు. 1991లో పనులు ప్రారంభించి, 1995 నాటికి పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చారు. అప్పట్లో ఈ బడి నిర్మాణానికి సుమారు రూ.5 లక్షల వరకు వెచ్చించినట్లు తెలిసింది. బడి నిర్మాణానికి గ్రామస్తులంతా శ్రమదానం చేశారు. కూల్చివేతను అడ్డుకున్న స్థానికులునక్సలైట్లు నిర్మించిన పాఠశాల శిథిలావస్థకు చేరటంతో వాటి స్థానంలో కొత్త భవనం నిర్మించాలని విద్యాశాఖ నిర్ణయించింది. మన ఊరు–మన బడి పథకంలో భాగంగా జీ ప్లస్ 1లో నాలుగు గదుల నిర్మాణానికి ఏడాదిన్నర క్రితం రూ.51 లక్షలు మంజూరు చేశారు. దీంతో పాత గదులను కూల్చివేసేందుకు అధికారులు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. ఈ గదులు నక్సల్స్‌కు గుర్తుగా ఉండాలని వాదించినట్లు తెలిసింది. దీంతో వెనక్కు తగ్గిన అధికారులు.. పాత బడి ఎదురుగా కొత్త పాఠశాల నిర్మాణం ఇటీవల ప్రారంభమైంది. ఈ పాఠశాలలో ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి వరకు బోధన సాగుతోంది. ఈ స్కూళ్లో ఇప్పటివరకు 943 మంది చదువుకున్నారు. ప్రస్తుతం 64 మంది (బాలురు 36, బాలికలు 28) విద్యార్థులు ఉన్నారు.కూల్చవద్దు అంటున్న స్థానికులుపాత భవనం కూల్చివేసి వాటి స్థానంలో నాలుగు తరగతి గదులు నిర్మించాలని మన ఊరు–మన బడి పథకంలో నిర్ణయించారు. పనులు ప్రారంభించే సమయంలో పాత గదులు కూల్చవద్దని స్థానికులు అడ్డుకున్నారు. ఎందుకని అడిగితే అప్పట్లో నక్సలైట్లు ఆ గదులను నిర్మించారని చెప్పారు. – నాగేశ్వర్ రావు, ప్రధానోపాధ్యాయుడు -
Udupi Encounter: మావోయిస్ట్ అగ్రనేత విక్రమ్ గౌడ మృతి
ఉడిపి: కర్ణాటకలోని ఉడిపి జిల్లా కర్కల తాలూకాలోని కబ్బినలే గ్రామంలో సోమవారం రాత్రి యాంటీ నక్సల్ ఫోర్స్ (ఏఎన్ఎఫ్), మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు నేత విక్రమ్ గౌడ్ హతమయ్యాడు.సీతాంబేలు ప్రాంతంలో నిర్వహిస్తున్న యాంటీ నక్సల్స్ సెర్చ్ ఆపరేషన్‌లో నక్సల్స్-ఏఎన్ఎఫ్ బృందానికి మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. నక్సల్ యూనిట్ అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం అందుకున్న ఏఎన్ఎఫ్ బృందం ఈ ఆపరేషన్‌ను ముమ్మరం చేసింది. మీడియాకు అందిన వివరాల ప్రకారం చిక్‌మగళూరు జిల్లా జయపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంటిని నక్సల్ యూనిట్ సందర్శించింది. తరువాత వారు కొప్ప తాలూకాలోని యెడగుండ గ్రామంలోకి కూడా చొరబడ్డారు. అక్కడ వారు అటవీ ఆక్రమణ, కస్తూరిరంగన్ నివేదికకు సంబంధించిన అంశాలపై చర్చించారు.దీనిపై వివరాలు అందిన దరిమిలా ఏఎన్ఎఫ్ ఆ ప్రాంతంలో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌ను ముమ్మరం చేసింది. సోమవారం రాత్రి ఐదుగురు మావోయిస్టులు కిరాణా సామాన్లు కొనుగోలు చేసేందుకు కబ్బినలే గ్రామంలోకి వచ్చారు. ఈ నేపధ్యంలో ఏఎన్ఎఫ్ బృందం, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు నేత విక్రమ్ గౌడ్ మృతి చెందగా, మిగిలిన మావోయిస్టులు తప్పించుకున్నారు.కర్ణాటకలో యాక్టివ్‌గా ఉన్న మావోయిస్టు నేతల్లో విక్రమ్ గౌడ పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది. విక్రమ్ గౌడ్ పలు హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నాడు. ఈ ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులకు చెందిన ఇతర గ్రూపులు యాక్టివ్‌గా మారే అవకాశాన్ని నిరోధించేందుకు పోలీసులు ఆ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేశారు.ఇది కూడా చదవండి: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి వెయ్యి రోజులు -
విద్వేషాల ఫ్యాక్టరీ కాంగ్రెస్
నాగపూర్: దేశంలో కాంగ్రెస్‌తోపాటు అర్బన్ నక్సలైట్ల విద్వేషపూరిత కుట్రలను ప్రజలు ఎంతమాత్రం సహించడం లేదని, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే అందుకు ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కుట్రలకు బలి కావాలని ప్రజలు కోరుకోవడం లేదన్నారు. హరియాణాలో బీజేపీ విజయం దేశ ప్రజల మూడ్‌ను ప్రతిబింబిస్తోందని తెలిపారు. కాంగ్రెస్ బాధ్యత లేని పార్టీ, అది విద్వేషాలను వ్యాప్తి చేసే ఫ్యాక్టరీ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హిందువుల మధ్య విభజన తీసుకురావాలన్నదే కాంగ్రెస్ ప్రయత్నమని ఆరోపించారు. దేశంలో భిన్నవర్గాల మధ్య చిచ్చు పెడుతోందని కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ బుధవారం మహారాష్ట్రలో రూ.7,600 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. 10 నూతన మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మహారాష్ట్రలో విపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి అధికారం కోసం రాష్ట్రాన్ని బలహీనపర్చాలని చూస్తోందని విమర్శించారు. బీజేపీ, శివసేన, ఎన్సీపీతో కూడిన అధికార మహాయుతి కూటమి రాష్ట్రాన్ని మరింత బలోపేతం చేయడానికి అంకితభావంతో కృషి చేస్తోందని ప్రశంసించారు. రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని, ఇలాంటి పరిణామం గతంలో ఎన్నడూ చూడలేదని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో కేవలం అవినీతి అక్రమాల్లోనే వేగం కనిపించిందని ఎద్దేవా చేశారు హరియాణాలో కాంగ్రెస్‌కు గుణపాఠం విభజన రాజకీయాలు చేస్తూ స్వలాభం కోసం ఓటర్లను తప్పుదోవ పటిస్తున్న కాంగ్రెస్ పట్ల దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ముస్లిం వర్గంలో భయోత్పాతం సృష్టించి, వారిని ఓటుబ్యాంక్‌గా మార్చుకోవడానికి కాంగ్రెస్ ప్రయతి్నస్తోందని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం హిందువులను విభజించడమే లక్ష్యంగా కుల రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. హరియాణాలో చరిత్రాత్మక విజయం సాధించామని, మహారాష్ట్రలోనూ అంతకంటే పెద్ద విజయం సాధించబోతున్నామని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తంచేశారు. ముస్లిం కులాలపై మాట్లాడరా? ముస్లిం వర్గంలోనూ ఎన్నో కులాలు ఉన్నాయని ఇప్పటిదాకా ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా చెప్పలేదని ప్రధానమంత్రి మండిపడ్డారు. ముస్లిం కులాల ప్రస్తావన వచి్చనప్పుడల్లా కాంగ్రెస్ నేతలు నోటికి తాళం వేసుకుంటున్నారని విమర్శించారు. హిందువుల విషయంలో మాత్రం కులం కోణంలో మాట్లాడుతుంటారని ధ్వజమెత్తారు. హిందువుల్లో ఒక కులంపైకి మరో కులాన్ని ఉసిగొల్పడమే కాంగ్రెస్ విధానమని ఆక్షేపించారు. హిందువులు ఎంతగా చీలిపోతే రాజకీయంగా అంత లాభమని ఆ పార్టీ భావిస్తోందన్నారు. హిందువుల మధ్య నిప్పు పెట్టి చలి కాచుకోవాలన్నదే కాంగ్రెస్ ఆలోచన అని నిప్పులు చెరిగారు. -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 8 మంది మావోయిస్టులు, స్పెషల్ టాస్‌్కఫోర్స్(ఎస్టీఎఫ్) జవాను నితీశ్ ఎక్కా మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. లేఖారమ్ నేతమ్, కైలాశ్ నేతమ్ అనే మరో ఇద్దరు జవాన్లు గాయపడినట్లు తెలిపారు. ఘటనా స్థలంలో పెద్ద సంఖ్యలో ఆయుధాలు, బ్యారెల్ గ్రనేడ్ లాంచర్‌తోపాటు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అబూజ్మడ్ అడవిలో ఈ నెల 12న ప్రారంభమైన ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా శనివారం ఉదయం భద్రతా సిబ్బంది గాలింపు కొనసాగిస్తుండగా, మావోయిస్టులు తారసపడ్డారని, ఇరువర్గాల మధ్య చాలాసేపు కాల్పులు కొనసాగాయని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ పోలీసులతోపాటు ఐటీబీపీ, బీఎస్ఎఫ్ సిబ్బంది సైతం ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారని వివరించారు. మావోయిస్టుల వైపునుంచి కాల్పులు ఆగిపోయిన తర్వాత వెళ్లి పరిశీలించగా 8 మృతదేహాలు కనిపించాయని స్పష్టం చేశారు. గాయపడిన ఇద్దరు జవాన్లను చికిత్స కోసం హెలికాప్టర్లో రాయ్‌పూర్‌కు తరలించారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవలి కాలంలో భద్రతా సిబ్బంది దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్నారు. కాంకేర్, కొండగావ్, నారాయణపూర్, బస్తర్, బీజాపూర్, దంతెవాడ, సుక్మా జిల్లాలో కూడిన బస్తర్ డివిజన్లో ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 131 మంది మావోయిస్టులు మరణించారు. ఏప్రిల్ 16న కాంకేర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏకంగా 29 మంది మావోయిస్టులు మృతిచెందిన సంగతి తెలిసిందే. నక్సలైట్లను పూర్తిగా ఏరివేయడమే తమ లక్ష్యమని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ప్రకటించారు. -
ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. గురువారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృత్యువాతపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్- బీజాపూర్ సరిహద్దుల్లో ఈ ఎన్కౌంటర్ జరిగింది. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని నారాయణపూర్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) ప్రభాత్ కుమార్ తెలిపారు. అయితే మరణించిన మావోయిస్టుల వివరాలు తెలియాల్సి ఉంది.వరస ఎన్కౌంటర్లు.. ఇటీవల ఛత్తీస్గడ్ అడవులను భద్రతాదళాలు జల్లెడ పడుతున్నాయి. వరస ఎన్కౌంటర్లలో అనేక మంది మావోయిస్టులు ప్రాణాలు విడుస్తున్నారు. గత నెల ఏప్రిల్ 16, 30వ తేదీల్లో చోటుచేసుకున్న భారీ ఎన్కౌంటర్లలో 39 మంది మావోయిస్టులు చనిపోవడం తెలిసిందే. బస్తర్ ప్రాంతంలో ఈ ఏడాదిలో వివిధ ఎన్కౌంటర్లలో103 మంది నక్సల్స్ చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. -
చత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
సుక్మా: చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా గోగుండా ప్రాంతంలో కాల్పుల మోత మోగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. సుక్మా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, దంతెవాడ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సీఆర్పీఎఫ్ 2వ బెటాలియన్, సీఆర్పీఎఫ్ 111 బెటాలియన్లు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టారు. ఈ కూంబింగ్‌లో భద్రతా బలగాలకు, మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఎదురు కాల్పుల్లో నలుగు మావోయిస్టుల మృతి చెందినట్లు సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ ధృవీకరించారు. ఘటనా స్థలంలో గాయపడిన మరికొంత మంది మావోయిస్టులును చుట్టుముట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సీఆర్పీఎఫ్ డీఐజీ అరవింద్ రాయ్ తెలిపారు. చదవండి: Temple Vandalised: భారత్ స్ట్రాంగ్ రియాక్షన్ -
నక్సలైట్ల ఘాతుకం.. బీజేపీ నాయకుడు మృతి
చత్తీస్‌గఢ్: చత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో నక్సల్స్ ఘాతుకానికి పాల్పడ్డారు. ఛోటేడోంగర్‌లో ఓ బీజేపీ నాయకుడిని నకల్స్ హతమార్చారు. దేవాలయంలో పూజలు చేసేందుకు వెళ్లిన బీజేపీ నాయకుడు కోమల్ మాంఘీని నకల్స్ తీవ్రంగా కొట్టి చంపారు. సదరు బీజేపీ నేతకు ఆమడై గనుల విషయంలో గతంలోనే నక్సల్స్ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆయన నక్సల్స్ హెచ్చరికలు పట్టించుకోకపోవటంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఛోటేడోంగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
చత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో సోమవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మహిళ సహా ఇద్దరు నక్సలైట్లు మృతి చెందారు. జిల్లాలోని భేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దంతేష్‌పురం అడవుల్లో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఎన్కౌంటర్ స్థలం నుంచి నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు(ఐఈడీ), ఆటోమేటిక్ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతుంది. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) బృందం నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో పాల్గొన్న సమయంలో కాల్పులు జరిగినట్లు సుక్మా పోలీస్ సూపరింటెండెంట్ సునీల్ శర్మ తెలిపారు. డీఆర్జీ జవాన్లపై నక్సలైట్లు కాల్పులు జరిపారని, ఆ తర్వాత పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయని పేర్కొన్నారు. చెప్పారు. జవాన్ల చేతిలో హతమైన మావోయిస్టులను గొల్లపల్లి ఎస్ఓఎస్ కమాండర్ మద్కమ్, ఆయన భార్య పొడియం భీమ్‌గా గుర్తించారు. మద్కమ్‌పై రూ 8 లక్షల రివార్డు ఉండగా.. ఆయన భార్యపై రూ. 3లక్షల రివార్డు ఉన్నట్లు పేర్కొన్నారు. చదవండి: Karnataka Elections: తెలుగువారి ప్రభావమున్న జిల్లాలో ఎవరిది పైచేయి -
నెత్తురు చిందిన బస్తర్
చెప్పుకోదగ్గ హింసాత్మక ఘటనలు లేకుండా కనీసం రెండేళ్లనుంచి ప్రశాంతంగా కనబడుతున్న ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం నక్సలైట్లు ఐఈడీ పేల్చి మినీ బస్సులో వెళ్తున్న పదిమంది జిల్లా రిజర్వ్ గార్డ్(డీఆర్జీ) పోలీసులనూ, ఒక డ్రైవర్‌నూ హతమార్చిన ఉదంతం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఆ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లా పల్నార్–అరణ్పూర్ మధ్యలో ఇటీవలే నిర్మించిన రహ దారిపై ఈ ఐఈడీని అమర్చారనీ, అది కూడా రెండు మూడురోజుల క్రితమేననీ వస్తున్న కథనాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఆదివాసీల హక్కుల కోసం తుపాకులు పట్టామని చెబుతున్న మావోయిస్టుల్లోగానీ, వారిని ఎదుర్కొంటున్న భద్రతా బలగాల తీరులోగానీ ఏ మార్పూ రాలేదని తాజా ఘటన చెబుతోంది. ఒకప్పుడు దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రభావవంతంగా ఉన్న వామపక్ష తీవ్ర వాదం చాన్నాళ్లుగా తగ్గుముఖం పట్టింది. 2000కు ముందు పది రాష్ట్రాల్లోని 200 జిల్లాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తిస్తే ఆ సంఖ్య 2021 నాటికి 41కి పడిపోయిందంటున్నారు. ఇప్పుడది 25 జిల్లాలకు మాత్రమే పరిమితమైందనీ, గత ఎనిమిదేళ్లలో నక్సల్ సంబంధిత హింసాత్మక ఘటనలు 55 శాతం తగ్గాయనీ, మరణాలు కూడా 63 శాతం తగ్గాయనీ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నాలుగు నెలల క్రితం విడుదల చేసిన నివేదిక తెలిపింది. హింసను కట్టడి చేయ టానికి అవసరమైన కఠిన చర్యలు తీసుకుంటూనే అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న పర్యవ సానంగా మావోయిస్టుల లొంగుబాట్లు కూడా అధికంగానే ఉన్నాయని ఆ నివేదిక వివరించింది. అయితే ఇలాంటి విజయాలే పోలీసు బలగాల్లో ఒక రకమైన నిర్లక్ష్యానికి దారితీశాయా అన్నది ఆలోచించుకోవాలి. తాజా ఉదంతాన్నే తీసుకుంటే అరణ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావో యిస్టుల కదలికలున్నాయని అందిన సమాచారంతో డీఆర్జీ పోలీసులు అక్కడికి వెళ్లారు. వెళ్లేముందూ, తిరిగొచ్చేటప్పుడూ ఒకే మార్గాన్ని ఉపయోగించకూడదన్న నిబంధన ఉంది. ఒకవేళ తప్పని సరైతే రెండుసార్లూ బలగాల కన్నా ముందు ఒక ప్రత్యేక టీం వెళ్లి ఆ దారిలో మందుపాతరలు, ఇతరత్రా బాంబులు లేవని నిర్ధారించాలి. పైగా ఈమధ్యకాలంలో మావోయిస్టుల వైపునుంచి ఐఈడీల వినియోగం బాగా ఎక్కువైందని తెలుస్తూనే ఉంది. గత నాలుగు నెలల్లో ఐఈడీలు గుర్తించి వెలికితీసిన ఉదంతాలు 34 వరకూ ఉన్నాయని వార్తలు వెలువడ్డాయి. గతంలో భారీయెత్తున ఆది వాసీలను సమీకరించి పోలీసు బలగాలపై విరుచుకుపడిన మావోయిస్టులు ఇటీవల తక్కువమందితో బృందాలను ఏర్పాటుచేసి దాడులకు దిగుతున్నారని ఒక మీడియా కథనం తెలిపింది. పైగా లోగడ కేవలం అయిదారు కేజీల ఐఈడీని పేలుళ్లకు వినియోగిస్తే ఇప్పుడది 30, 40 కేజీలవరకూ ఉంటోంది. అందువల్ల ప్రాణనష్టం అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని గమనించి అయినా అరణ్పూర్ వెళ్లిన డీఆర్జీ పోలీసులు తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాల్సింది. ఒకప్పుడు లొంగిపోయిన ఆదివాసీలతో సల్వాజుడుం పేరుతో ప్రైవేటు దళాలను ఏర్పాటుచేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో వాటిని రద్దుచేయక తప్పలేదు. ఆ తర్వాతే ఛత్తీస్‌గఢ్ పోలీసు విభాగంలో డీఆర్జీ పేరుతో ప్రత్యేక దళం ఏర్పాటయింది. ఇందులో కూడా అత్యధికులు లొంగిపోయిన మావోయిస్టులు. వారంతా ఆదివాసీలు. కనుక మావోయిస్టులకు వారిపై గురి ఉంటుంది. అటువంటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలి? ఘటన జరిగిన ప్రాంతంలో ఒకప్పుడు మావోయిస్టులు బలంగా ఉండేవారనీ, ఇప్పుడు వారి ప్రభావం పూర్తిగా పోయిందనీ మీడియా కథనాలు చెబుతున్నాయి. డీఆర్జీ పోలీసుల్లో నిర్లక్ష్యానికి అది కూడా కారణమైవుండొచ్చు. ఒకప్పుడు మధ్య, తూర్పు భారత ప్రాంతాల్లో ఎంతో బలంగా ఉన్న తాము ఎందువల్ల బలహీ నపడవలసి వచ్చిందన్న ఆత్మవిమర్శ మావోయిస్టుల్లో కొరవడిందని తాజా ఉదంతం చెబుతోంది. హింసాత్మక ఘటనలకు పాల్పడటం వల్ల ప్రభుత్వాలు మరింత కఠినంగా వ్యవహరిస్తాయే తప్ప దానివల్ల కలిగే మార్పేమీ ఉండదని పదే పదే రుజువవుతోంది. మావోయిస్టులు ఏదో ఒక చర్యకు పాల్పడగానే సమీప ప్రాంతాల్లోని ఆదివాసీ ప్రాంతాలపై పోలీసులు విరుచుకుపడటం, అమాయ కులు సైతం బాధితులుగా మారడం చాన్నాళ్లుగా కనబడుతూనే ఉంది. అరెస్టులు, కేసులు, ఏళ్ల తరబడి జైళ్లపాలు కావటం పర్యవసానంగా ఆదివాసీ కుటుంబాల జీవనం అస్తవ్యస్తమవుతోంది. పోషించేవారు లేక ఎన్నో కుటుంబాలు చెప్పనలవికాని ఇబ్బందులు పడుతున్నాయి. గతంతో పోలిస్తే మావోయిస్టుల ప్రభావంలో ఉన్న ప్రాంతాలు తగ్గిపోవడానికి ఇదొక ప్రధాన కారణం. కనీసం ఈ పరిణామమైనా తమ హింసాత్మక చర్యల్లోని నిరర్థకతపై పునరాలోచన కలిగిస్తే బాగుండేది. కానీ ఆ మాదిరి మార్పు రాలేదని ఈ ఉదంతం నిరూపించింది. ప్రజాస్వామ్యంలో భిన్నాభి ప్రాయాలను ప్రకటించటానికీ, ప్రభుత్వ విధానాల్లో లోపాలున్నాయనుకున్నప్పుడు వాటికి వ్యతి రేకంగా ప్రజానీకాన్ని కూడగట్టడానికీ ఎప్పుడూ అవకాశాలుంటాయి. అలాంటి ఉద్యమాలను ప్రభుత్వాలు అణచివేయటానికి ప్రయత్నించినప్పుడు ప్రతిఘటన కూడా అదే స్థాయిలో వస్తున్నది. సాగు చట్టాలపై ఏడాదిపైగా సాగిన రైతు ఉద్యమాన్ని నయానా భయానా నియంత్రించాలనుకున్న కేంద్రం చివరకు వారి డిమాండ్లకు తలొగ్గి ఆ చట్టాలను వెనక్కి తీసుకోకతప్పలేదు. వీటన్నిటినీ మావోయిస్టులు పరిగణనలోకి తీసుకోవాలి. ప్రజా ఉద్యమాలను నిర్మించే ప్రయత్నం చేయాలి. తమ హింసాత్మక చర్యలవల్ల సాధించేదేమీ లేకపోగా ఆదివాసులే కష్టనష్టాలు అనుభవించాల్సి వస్తున్నదని గుర్తించాలి. -
సుక్మా జిల్లాలో ఎన్ కౌంటర్
-
చనిపోయినా.. మోస్ట్ వాంటెడ్‌లే!
సాక్షి ప్రతినిధి, వరంగల్: యాప నారాయణ అలియాస్ హరిభూషణ్.. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడెం గ్రామం కోయతెగకు చెందిన మావోయిస్టు నేత. రాష్ట్ర కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యుడిగా వ్యవహరించిన ఆయన గతేడాది జూన్ 21న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అడవుల్లో కోవిడ్‌తో మరణించారు. అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు. ఏపీలోని గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తుమకోటకు చెందిన ఆయన.. అనారోగ్యంతో బాధపడుతూ గతేడాది అక్టోబర్ 14న బస్తర్ అటవీ ప్రాంతంలో చనిపోయారు. ..ఈ ఇద్దరు కీలక మావోయిస్టు నేతలు చనిపోయి నెలలు గడుస్తున్నా.. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వారి పేర్లను ఇంకా ‘మోస్ట్ వాంటెడ్’జాబితాలో ఉంచింది. ఎన్ఐఏ తమ వెబ్సైట్లో దేశవ్యాప్తంగా ఉగ్రవాద, తీవ్రవాద, వేర్పాటువాద, తీవ్ర ఆర్థిక నేరాలతో సంబంధమున్న 328 మంది పేర్లతో ‘మోస్ట్ వాంటెడ్, పరారీలో ఉన్న వారి జాబితా’ను రూపొందించింది. అందులో ఇప్పటికే చనిపోయిన మావోయిస్టు నేతల పేర్లు ఉండటం చర్చనీయాంశమవుతోంది. మావోయిస్టుల వివరాలపై మళ్లీ ఆరా.. సీపీఐ (మావోయిస్టు) పార్టీలో కీలక నేతలపై మరో సారి రివార్డులు పెరగనున్నాయని.. నిఘా వర్గాలు మోస్ట్ వాంటెడ్‌ల జాబితాను మళ్లీ రూపొందిస్తున్నాయని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల రిక్రూట్మెంట్ పెరిగిందన్న ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు.. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు నేతల వివరాలను జిల్లాలు, పోలీస్స్టేషన్ల వారీగా సేకరిస్తున్నారు. హనుమకొండ, జేఎస్ భూపాలపల్లి, జనగామ జిల్లాల నుంచి ఇప్పటికే ఇలాంటి డేటా తీసుకున్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్ సహా 11 రాష్ట్రాల్లో పనిచేస్తున్న మావోయిస్టు నేతల వివరాలు, వారిపై ఉన్న రివార్డులపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ రివార్డులు పెంచనున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన 54 మంది ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లో పనిచేస్తున్నట్టు తేలిందని సమాచారం. ‘మోస్ట్ వాంటెడ్’లో బస్వరాజ్, గణపతి, హిడ్మా ఎన్ఐఏ సిద్ధం చేసిన మావోయిస్టు కీలక నేతల జాబితాలో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారే అధికంగా ఉన్నట్టు తెలిసింది. కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాళ్ల కేశవరావు అలియాస్ బస్వరాజ్, గంగన్న, ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి పేర్లను టాప్ వాంటెడ్ లిస్టులో చేర్చగా.. ఆ తర్వాత మడావి హిడ్మా, మరికొందరి పేర్లున్నట్టు తెలిసింది. గణపతిపై ఇప్పటికే రూ.2.52 కోట్ల రివార్డు, బస్వరాజ్పై రూ.1.25 కోట్లు, కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్న నేతలపై రూ.కోటి చొప్పున రివార్డులు ఉన్నా యి. తెలంగాణ నుంచి 9మంది మావోయిస్టులు కేంద్ర కమిటీలో కీలకంగా ఉన్నట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఇందులో మల్లోజుల వేణుగోపాల్ అలి యాస్ భూపతి, కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ సాధు, కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, మల్లా రాజిరెడ్డి, గంకిడి సత్యనారాయణరెడ్డి, మో డం బాలకృష్ణ, పుల్లూరు ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, గాజర్ల రవి అలియాస్ గణేశ్, తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న, తిప్పిరి తిరుపతి తదితర అగ్రనేతల పేర్లు ఈ జాబితాలో చేర్చినట్లు సమాచారం. ఇక ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 40 మందిని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చినట్లు తెలిసింది. -
మావోయిస్టుల్లో కలవరం..వంద మందికి పైగా కరోనా
సాక్షి, హైదరాబాద్: అసలే ఎండాకాలం.. పైగా అది అడవి.. దాహార్తి తీర్చుకోవడమే గగనం.. మరోవైపు బీపీ, షుగర్, ఆస్తమా.. వీటికితోడు ఇప్పుడు కరోనా, లాక్డౌన్.. కొరియర్లు కలవలేకపోతున్నారు.. మందులు అందడంలేదు.. వెరసి దయనీయస్థితిలో మావోయిస్టులు. కనిపించే శత్రువుపైకి కాలుదువ్వే మావోయిస్టులు ఇప్పుడు కనిపించని శత్రువును ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతున్నారు. ఇప్పుడు రూటు మార్చి మందుల కోసం వేట మొదలుపెట్టారు. ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మావోలకు కొత్తకష్టం వచ్చి పడింది. కరోనా వైరస్ రూపంలో వారు ఇప్పుడు కొత్త శత్రువుతో పోరాటం చేస్తున్నారు. మొదటి కరోనా వేవ్‌ను విజయవంతంగా ఎదుర్కొన్నారు. కానీ, సెకండ్‌వేవ్‌తో విలవిల్లాడుతున్నారు. ఇప్పటికే 100 మందికిపైగా మావోయిస్టులు కరోనా బారిన పడ్డారని సమాచారం. అందులో పదిమంది వరకు మృతి చెందారు. కొరియర్లు, ప్రజాకోర్టులు.. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ మావోయిస్టులు ఏప్రిల్ 26న భారత్‌బంద్‌కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా పలుమార్లు బీజాపూర్, సుకుమా జిల్లాల్లోని పలు ఆదివాసీ గ్రామాల్లో వేలాదిమందితో సభలు, సమావేశాలు నిర్వహించారు. వందల సంఖ్యలో దళాల సభ్యులు, అగ్రనేతలు పాల్గొన్నారు. అక్కడక్కడా ప్రజాకోర్టులు నిర్వహించేవారు. తరచూ కొరియర్లు వచ్చి కలిసేవారు. ఈ కారణాల వల్ల దళాల సభ్యులకు వైరస్ పాకిందని పోలీసులు అనుమానిస్తున్నారు. వారు పారాసిటమాల్ మాత్రలతోనే సరిపెట్టుకుంటున్నారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారిలో కరోనా లక్షణాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, అదే మరణాలకు దారితీస్తోందని పోలీసులు తెలిపారు. అందుకే, తెలంగాణలోకి తమ కొరియర్లను పంపి కరోనా మాత్రలను సమకూర్చుకోవడం, వయసు మీద పడిన మావోయిస్టు నేతలను సాధారణ గ్రామస్థుల రూపంలో తీసుకువచ్చి వ్యాక్సిన్ వేయించడంపై వారు దృష్టి పెట్టారని నిఘావర్గాలు గుర్తించాయి. మరణాలకు కారణాలు ఇవే..! దండకారణ్యంలో సంచరించే మావోల్లో వ్యాపిస్తున్న స్ట్రెయిన్ చాలా ప్రమాదకరమైనదని సమాచారం. అయితే అది ఏంటన్నది ఇంతవరకూ గుర్తించలేదు. ఆస్తమా, బీపీ, షుగర్, గుండెజబ్బులు తదితర దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న మావోయిస్టులలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. మహారాష్ట్ర, తెలంగాణలో లాక్డౌన్ కారణంగా కొరియర్లు, సానుభూతిపరుల కదలికలు కష్టమవడంతో వారి నుంచి మందులు సకాలంలో అందడంలేదు. కొందరికి మాత్రలతో వ్యాధి అదుపులోకి రాక ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు పెట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతోంది. వేసవి కావడంతో అడవుల్లో తాగునీటి కొరత ఏర్పడింది. డెంగీ, మలేరియా లక్షణాలకు కరోనా లక్షణాలకు పెద్దగా తేడా లేకపోవడంతో వ్యాధి నిర్ధారణలో జాప్యం జరుగుతోంది. ర్యాంకుల ఆధారంగా మందులు ప్రస్తుతం మావోయిస్టుల దళాల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉంది. వారికోసం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో మందుల సేకరణ జరుగుతున్నట్లు మాకు కూడా సమాచారం ఉంది. ఇప్పుడు లాక్డౌన్ వల్ల ఆ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. గ్రామాల్లోకి మావోలు సాధారణ ప్రజల రూపంలో వచ్చి వ్యాక్సిన్లు వేయించుకుంటున్నారు. కేడర్‌లోని ర్యాంకులను బట్టే వ్యాక్సిన్లు వేయస్తున్నారు, మందులు సరఫరా చేస్తున్నారు. ఇటీవల భారత్‌బంద్ నేపథ్యంలో వారు వేలాదిమందిని సమీకరించి ఏర్పాటు చేసిన సమావేశాల అనంతరం దళాల్లో వైరస్ తీవ్రత పెరిగింది. కరోనా పాజిటివ్ ఉన్న సభ్యులెవరైనా లొంగిపోతే, వారికి ఎలాంటి హానీ తలపెట్టం. కావాల్సిన చికిత్స అందజేస్తాం. –అభిషేక్ ఎస్పీ, దంతెవాడ (చదవండి: ‘సిటీమార్’ స్టెప్పులతో డాక్టర్ల డ్యాన్స్.. దిశా పటాని కామెంట్) -
నక్సల్స్ ఘాతుకం: కాంట్రాక్టర్ దారుణ హత్య
సాక్షి, విశాఖపట్నం: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టు నక్సలైట్లు ఘాతుకానికి పాల్పడ్డారు. నిర్మాణ పనులు నిర్వహిస్తున్న ఓ కాంట్రాక్టర్‌ను దారుణంగా హత్య చేసిన నక్సల్స్ అదే సమయంలో అక్కడే గల విలువైన వాహనాలను దహనం చేశారు. సుక్మా జిల్లా మాథిలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోలియాగూడలో నక్సలైట్లు ఈ బీభత్స ఘటనకు పాల్పడ్డారు. భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి వచ్చిన మావోయిస్టులు తొలుత మూడు వాహనాలకు నిప్పటించారు. ఆ తర్వాత అక్కడే ఉండి నిర్మాణ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్‌ను చంపారు. నిన్న సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో తమ సహచరున్ని పోలీసులు కాల్చి చంపారనే ఆగ్రహంతో నక్సలైట్లు ఈ చర్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. స్థానికంగా భీతావహాన్ని కలిగించిన ఘటనా స్థలానికి పోలీసు బలగాలు చేరుకుంటున్నాయి. -
ఆ మందుపాతర 20ఏళ్ల నాటిది
ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): గాలింపు చర్యలకోసం వచ్చే పోలీసులను హతమార్చాలనే లక్ష్యంతో 20 ఏళ్ల క్రితం పీపుల్స్‌వార్ నక్సలైట్లు గ్రెనేడ్ల రూపంలో అమర్చిన మందుపాతరను తాజాగా వెలికితీశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో బయటపడ్డ గ్రెనేడ్లు పోలీసులను లక్ష్యం గా చేసుకునే అమర్చినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఆ ప్రాంతంలో పేలుడు పదార్థాలు, మందుపాతరల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. రెండోరోజు ఆదివారం జాగిలాల సహాయంతో బాంబు స్క్వాడ్ బృందాలు దుమాల పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టాయి. 20 ఏళ్ల క్రితం దుమాలను కేంద్రంగా చేసుకొని అప్పటి పీపుల్స్‌వార్, జనశక్తి నక్సలైట్లుతమ కార్యకలాపాలు కొనసాగించారు. పలుసార్లు ఇదే ప్రాంతంలో పోలీసుల నుంచి నక్సలైట్లు త్రుటిలో తప్పించుకున్న సంఘటనలున్నాయి. పోలీసులను హతమార్చాలనే ఉద్దేశంతో నక్సలైట్లు చిట్టివాగు ప్రాంతంలో అమర్చిన గ్రెనేడ్లు 20 ఏళ్ల అనంతరం బయటపడినట్లు చెబుతున్నారు. దుమాల అటవీ ప్రాంతంలో నక్సలైట్లు ఎక్కడెక్కడ మందుపాతరలు అమర్చారన్న దానిపై జిల్లా బాంబు స్క్వాడ్ బృందాలు అన్వేషణ సాగిస్తున్నాయి. మందుపాతరలను వెలికి తీయడానికి మాజీ నక్సలైట్ల సాయాన్ని తీసుకుంటున్నారు. నాడు రాగట్టపల్లిలో.. ఎల్లారెడ్డిపేట మండలం రాగట్టపల్లిలో జనశక్తి నక్సలైట్లు గడ్డివాములో దాచి ఉంచిన పేలుడు పదార్థాలను పోలీసులు కొద్దిరోజుల క్రితం స్వాధీనం చేసుకున్నారు. గడ్డివాములో పేలుడు పదార్థాలు దాచి ఉంచినట్లు లొంగిపోయిన నక్సలైట్ల ద్వారా పోలీసులు సమాచారం సేకరించారు. దుమాలలోనూ 20 ఏళ్ల క్రితం మందుపాతరల రూపంలో దాచి ఉంచిన గ్రెనేడ్లను స్వాధీనం చేసుకోవడం, ఈ రెండు సంఘటనలు పక్కపక్క గ్రామాల్లోనే చోటుచేసుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది. దుమాలలో పీపుల్స్‌వార్ నక్సలైట్లు అమర్చిన గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సర్వర్ స్పష్టం చేశారు. పీపుల్స్‌వార్ నక్సలైట్లు మాత్రమే గ్రెనేడ్లను మందుపాతర్లుగా వాడతారని ఆయన వివరించారు. -
మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్
ముంబై: మహారాష్ట్రలో ఆదివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. గడ్చిరోలి జిల్లాలోని ధనొరా పోలీస్ స్టేషన్ పరిధిలోని గల కొసమి-కిసనెల్లి అడవుల్లో ఈ ఎన్కౌంటర్ జరిగింది. (చదవండి : ములుగులో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోలు హతం) మావోయిస్టులు ఉన్నారనే సమచారంతో సీ60 కమాండో ఫొర్సెస్ కూబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో కొసమి-కిసనెల్లి అడవి మధ్యలో మావోయిస్టులు తారాసపడడంతో పరస్పరం కాల్పులకు దిగినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందగా, మరికొంతమంది తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది. -
నక్సల్స్‌కు మద్దతుగా పిటిషన్లా?
‘నక్సలైట్లు దేశానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించారు. అటువంటి వారికి మద్దతుగా పిటిషన్లు ఎలా వేస్తారు? ఇలాంటి పిటిషన్ల విషయంలో తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉంది. నక్సలైట్ల చేతిలో ఎంతోమంది పోలీసులు చనిపోయారు. ఆ పోలీసుల కుటుంబాల కోసం ఎవరైనా హైకోర్టులో పిటిషన్లు వేశారా? ఆ కుటుంబాలను ఎవరైనా పట్టించుకున్నారా?’ – హైకోర్టు ధర్మాసనం సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా పెదబయలు మండలం బురద మామిడిలో 2012లో ఇద్దరు ఆదివాసి రైతులను ఎన్కౌంటర్లో కాల్చి చంపడంపై విశ్రాంత న్యాయమూర్తితో విచారణ జరపాలని దాఖలైన వ్యాజ్యంపై విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. పౌర హక్కుల నేత ఎన్‌హెచ్ అక్బర్ 2012లో దీనిపై పిల్ దాఖలు చేశారు. ఘటనకు కారణమైన పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంతోపాటు బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించేలా ఆదేశించాలని అభ్యర్థించారు. దీనిపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. నక్సలైట్లపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. వారిని సమర్థిస్తూ పిల్ దాఖలు చేసినందుకు పిటిషనర్‌ను వివరణ కోరతామంది. -
పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు..
సాక్షి, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో ఇద్దరు జనశక్తి సీపీఐ(ఎంఎల్) నక్సలైట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లెల్లకు చెందిన వ్యక్తితో పాటు, సిద్ధిపేట జక్కాపూర్‌కు చెందిన విఠల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. వారి వద్ద నుంచి కంట్రీమేడ్ పిస్టల్, రివాల్వర్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు రిక్రూట్మెంట్లు, నిర్వహణ కోసం అవసరమైన నిధుల సేకరణ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలోనే జనశక్తి నక్సల్ పోలీసులకు చిక్కినట్లు తెలిసింది. ఇంకా పలువురి నక్సల్స్ అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. -
కన్నపేగును కాదని.. ఉద్యమమే ఊపిరిగా..
సాక్షి, సీలేరు (విశాఖపట్టణం) : కన్నపేగు బంధం విడదీయరానిది. కాలే కట్టె వరకు ఆ బంధం ఎంతో గొప్పది. కడుపున పుట్టిన బిడ్డకు తన రొమ్మునుంచి ప్రతీ పాలచుక్కును ఇచ్చి, పెరిగి పెద్దయ్యే వరకూ కంటికి రెప్పలా చూసుకుంటుంది. చిన్న గాయం తగిలినా ఆమె ప్రాణం విలవిలాడుతుంది. తన బిడ్డే సర్వస్వం అనుకునే ఎందరో మాతృమూర్తులను చూశాం. కానీ ఆ తల్లి పది నెలల బిడ్డ ఆలన పాలనా తమ బంధువులకు అప్పజెప్పి ఉద్యమమే ఊపిరిగా మావోయిస్టుల్లో చేరింది. తన తల్లిదండ్రులు ఎలా ఉంటారో తెలియదు, ఎప్పుడు వస్తారో, అసలు వస్తారో..రారో, ప్రాణాలతో వస్తారో రారో కూడా ఆ బిడ్డకు తెలియదు. ఇలాంటి తరుణంలో 30 ఏళ్ల తరువాత పేగుబంధం ఒకటి చేసింది. తన తల్లి ఉందని తెలుసుకొని ఒక కంట దుఖం, ఒక కంట ఆనందంతో తన తల్లిని చూసేందుకు పరుగులు తీసిన బిడ్డ. ఇందుకు సంబంధించిన వివరాలిలావున్నాయి. అనంతపురం జిల్లాకు చెందిన కైలాసం, కళావతి దంపతులు. వీరికి ఒక కుమారుడు. అతడికి పది నెలల వయసులోనే తల్లిదండ్రులు మావోయిస్టుల దళంలోకి చేరారు. 2005లో ఏవోబీలో జరిగిన ఎన్కౌంటర్లో తండ్రి కైలాసం మృతి చెందాడు. తల్లి ప్రస్తుతం ఇదే ఏవోబీలో పెదబయలు ఏరియా కార్యదర్శిగా కళావతి అలియాస్ భవానీ ఉంటోంది. ఇటీవల విశాఖ ఏజెన్సీ మాదిగమల్లు అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందడం తెలిసిందే. ఈ ఘటనలో భవాని గాయాలతో తప్పించుకొని చెరుకుమళ్లు గ్రామంలో మృత్యువుతో పోరాడుతూ పోలీసు బలగాలకు పట్టుబడింది. ఆమెను వారు రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పత్రికల్లో రావడంతో.. ఆమెది అనంతపురం జిల్లా పేరు కళావతి, భర్తపేరు కైలాసం అని పత్రికల్లో రావడంతో వరుసకు కైలాసానికి అన్నయ్య అయిన నాగేశ్వరరావు, భవాని అన్నయ్య నరేష్ గుర్తించారు. ఈ విషయాన్ని నాగేశ్వరరావు, నరేష్‌లు తమ వద్ద పెరుగుతూ ప్రస్తుతం అనంతపురం స్టేట్ బ్యాంక్‌లో క్యాషియర్‌గా ఉద్యోగం చేస్తున్న కళావతి కుమారుడికి చెప్పారు. దీంతో తన తల్లి ఉందని ఒక పక్క ఆనందం, మరో వైపు దుఖంతో పరుగు పరుగున రాజమండ్రిలో చికిత్స పొందుతున్న తన తల్లిని చూసేందుకు 12 మంది కుటుంబ సభ్యులతో వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు వి.చిట్టిబాబును కలిశారు. అతని ఆధ్వర్యంలో తన తల్లిని కలిసేందుకు ఆదివారం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లినట్లు చిట్టిబాబు సాక్షికి తెలిపారు. తల్లి, బిడ్డ చూసుకోవడం ఇదే మొదటిసారి మావోయిస్టు అగ్రనేత కైలాసం, భార్య కళావతి (భవాని). వీరిద్దరు కుమారుడిని పది నెలల వయసులో వదిలి ఉద్యమంలోకి వచ్చారు. అప్పటి నుంచి విశాఖ ఏజెన్సీ ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోనే మావోయిస్టు పార్టీలో తుపాకీ చేతపట్టి అడవుల్లోనే తిరిగారు. ఒక్కసారి కూడా సొంత గ్రామానికి వెళ్లింది లేదు. తమ బిడ్డను చూసుకునేందుకు వారికి వీలు కుదరలేదు. ఈ తరుణంలో ఎన్కౌంటర్ జరగడం, ఆమె గాయాలతో తప్పించుకోవడంతో ఆ కుమారుడికి కన్నతల్లిని చూసుకొనే అవకాశం దక్కింది. ఒక్కసారిగా తన తల్లిని కలిసి గుండెకు హత్తుకొని బోరున విలపించి ఆనందం చెందాడు. -
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ఎన్కౌంటర్
-
గడ్చిరోలిలో మావోయిస్టుల విధ్వంసకాండ
-
గడ్చిరోలిలో మావోయిస్టుల విధ్వంసకాండ
సాక్షి, గడ్చిరోలి: మహారాష్ట్రలో మావోయిస్టులు రెచ్చిపోయారు. గడ్చిరోలి జిల్లా కుర్ఖేడా తాలూకా దాదాపూర్ వద్ద మావోయిస్టులు బుధవారం రహదారి నిర్మాణ పనులకు సంబంధించిన 36 వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో ఆ వాహనాలు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. కాగా ఈ ఏడాది జనవరిలో కూడా మావోలు విధ్వంసానికి పాల్పడ్డారు. పలు వాహనాలకు నిప్పుపెట్టారు. అభివృద్ధి పనులను కాంట్రాక్టర్లు నిలిపివేయాలంటూ మావోయిస్టులు ఈ సందర్భంగా ఘటనా స్థలంలో కరపత్రాలు వదిలి వెళ్లారు. మరోవైపు తమ వాహనాలకు మావోయిస్టులు నిప్పుపెట్టడంతో కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఒడిశా పోలీసుకు అశోకచక్ర
న్యూఢిల్లీ: నక్సల్స్‌తో పోరాడుతూ వీరమరణం పొందిన ఒడిశా పోలీసు అధికారి ప్రమోద్‌కుమార్ సత్పతికి కేంద్రం అశోకచక్ర అవార్డు ప్రకటించింది. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్ఓజీ) అసిస్టెంట్ కమాండెంట్‌గా పనిచేసిన సత్పతి 2008, ఫిబ్రవరి 16న జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. సత్పతి ధైర్యసాహసాలు గుర్తిస్తూ ఆయనకు మరణానంతరం అశోకచక్రను ఇస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఆదివారం వెల్లడించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రాణత్యాగం చేసిన పోలీసుల జ్ఞాపకార్థం నిర్మించిన స్మారక స్థూపంపై సత్పతి పేరును కూడా చేర్చనున్నట్లు తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 21న ఈ స్మారకాన్ని ఆవిష్కరించనున్నారు. నాడు నక్సల్స్ వీరంగం.. 2008, ఫిబ్రవరి 15న సుమారు 500 మందికి పైగా సాయుధులైన మావోయిస్టులు ఒడిశాలో వీరంగం సృష్టించారు. నయాగఢ్ పోలీస్ స్టేషన్‌లోని పోలీసు శిక్షణ కేంద్రం, సమీపంలో ఉన్న మరో రెండు పోలీస్ స్టేషన్లు, నయాగడ్ ఔట్‌పోస్ట్, గంజాం జిల్లాలోని ఒక ఔట్‌పోస్ట్, పోలీస్ స్టేషన్లపై ఏకకాలంలో దాడికి పాల్పడ్డారు. ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్‌ల నుంచి వచ్చిన నక్సలైట్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొని 1200కు పైగా అధునాతన ఆయుధాలను కొల్లగొట్టారు. వారిని నిలువరించే క్రమంలో 14 మంది పోలీసులు, ఒక పౌరుడు చనిపోయారు. ఆ తరువాత మావోయిస్టులు పోలీసుల వాహనాల్లోనే సమీపంలోని గంజాం, ఫూల్బాని అడవుల్లోకి పారిపోయారు. అనంతరం, ఎస్ఓజీ, ఒడిశా స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్, సీఆర్పీఎఫ్ బృందాలు.. మావోయిస్టులు దాక్కున్న ప్రదేశాన్ని చుట్టుముట్టాయి. సత్పతి నేతృత్వంలోని బృందం మావోలపై దాడిని తీవ్రతరం చేసింది. కానీ నక్సల్స్ వద్ద ఉన్న ఆయుధాల ముందు భద్రతా దళాలు నిలవలేకపోయాయి. ఇరువర్గాల మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో సత్పతి మరణించారు. -
నక్సల్స్ నిధులకు అడ్డుకట్ట
న్యూఢిల్లీ: నక్సలైట్ల ఆదాయ మార్గాలను మూసివేయడంతోపాటు నక్సల్ నేతల ఆస్తులను జప్తు చేయడం కోసం వివిధ దర్యాప్తు సంస్థల అధికారులతో ఓ ప్రత్యేక బృందాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ బృందంలో వివిధ కేంద్ర సంస్థలతోపాటు రాష్ట్రాల పోలీసు, సీఐడీ విభాగాల వారు కూడా ఉంటారని హోం శాఖకు చెందిన ఓ అధికారి సోమవారం చెప్పారు. ఈ బృందానికి అదనపు కార్యదర్శి స్థాయి వ్యక్తి నేతృత్వం వహిస్తారనీ, ఐబీ, ఈడీ, డీఆర్ఐ, ఎన్ఐఏ, సీబీఐ, సీబీడీటీలతోపాటు రాష్ట్రాల నిఘా, నేర దర్యాప్తు విభాగాల అధికారులు కూడా సభ్యులుగా ఉంటారని అధికారి వివరించారు. నక్సల్ నేతలు బలవంతంగా వసూళ్లకు పాల్పడి, అనంతరం ఆ డబ్బును తమ వ్యక్తిగత ఆస్తులు కూడబెట్టుకోవడానికి, కుటుంబ సభ్యుల చదువు, విలాసాల కోసం వినియోగిస్తున్నారని సమాచారం అందిన నేపథ్యంలో హోం శాఖ తాజా చర్య తీసుకుంది. బిహార్–జార్ఖండ్ కమిటీకి చెందిన సీపీఐ (మావోయిస్టు) నేత ప్రద్యుమ్న శర్మ గతేడాది రూ. 22 లక్షలు కట్టి తన సోదరి కూతురిని ఓ ప్రైవేట్ వైద్యకళాశాలలో చేర్పించారు. అదే పార్టీకే చెందిన సందీప్ యాదవ్ అనే మరో నేత నోట్ల రద్దు సమయంలో రూ. 15 లక్షల విలువైన పాత నోట్లను మార్చుకున్నారు. ఆయన కూతురు ఓ ప్రముఖ ప్రైవేట్ విద్యా సంస్థలో, కొడుకు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నట్లు అధికారి తెలిపారు. మరో సీనియర్ నాయకుడు అరవింద్ యాదవ్ కూడా తన సోదరుడి చదువు కోసం రూ. 12 లక్షలు చెల్లించారన్నారు. -
రాంబో బాణాలు.. రాకెట్ బాంబులు
న్యూఢిల్లీ: భద్రతా దళాలపై దాడులు చేయడం కోసం నక్సలైట్లు సరికొత్త ఆయుధ సంపత్తిని సమకూర్చుకున్నారు. రాంబో బాణాలు, రాకెట్ బాంబులు వంటి ఆధునిక, ప్రాణాంతక సామగ్రితో భద్రతా దళాలకు సవాలుగా నిలుస్తున్నారు. ఈ మేరకు వామపక్ష తీవ్రవాద శిబిరంలో నెలకొన్న ధోరణులపై అధ్యయనం చేసిన ఉమ్మడి భద్రతా దళం (జేఎస్సీ) తాజా నివేదిక వెల్లడించింది. భద్రతా బృందాలకు చెందిన స్నిఫర్ డాగ్స్‌ను ఏమార్చేందుకు మావోయిస్టులు ముడి బాంబులను జంతువుల మలంలో దాచేస్తున్నారని తెలిపింది. 2017 తొలి త్రైమాసికంలో భద్రతా దళాల స్నిఫర్ డాగ్స్ ఈ కారణంగానే గాయపడటం లేదా మృతి చెందాయంది. నక్సల్స్ దాడులకు ఉపయోగించే సరికొత్త పద్ధతుల్లో ప్రముఖమైంది.. పేలుడు పదార్థంతో కూడిన రాంబో బాణం అని పేర్కొంది. గన్ పౌడర్ లేదా మందుగుండు కలిగిన ఆ బాణం లక్ష్యాన్ని తాకగానే పేలుతుంది. రాంబో బాణాలు ఎక్కువ నష్టాన్ని కలిగించకపోయినా భద్రతా సిబ్బందిలో ఆందోళన కలిస్తాయని.. తద్వారా దాడి చేయడానికి మావోలకు ఉపయోగపడతాయంది. -
గూడెం గుబాళిస్తోంది..!
సాక్షి, జగిత్యాల: అవి జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రం నుంచి 25 కి.మీల దూరంలో ఉన్న మారుమూల గిరిజన గ్రామం జగన్నాథ్‌పూర్. దానికి ఆనుకునే నాయికపుగూడెం. రెండు దశాబ్దాల క్రితం వరకు నక్సల్స్ సమావేశాలు.. పోలీసుల బూట్ల చప్పుళ్లతో అల్లకల్లోలంగా ఉన్న ఆ ప్రాంతాల్లో ఇప్పుడు ప్రశాంత వాతావరణం నెలకొంది. ఒకప్పుడు పోలీసులంటేనే భయంతో పరుగులు పెట్టిన ఆ గిరిజనులు.. ఇప్పుడు వారికి దోస్తులుగా మారారు. వారితో కష్టసుఖాలను పంచుకుం టున్నారు. తాము అభివృద్ధి చెందడంతో పాటు గ్రామాభివృద్ధికి బాటలు వేసుకున్నారు. ఏడాది క్రితం వరకు కనీసం ఎర్రబస్సు ఎరుగని ఆ ఊరికి రోజుకు రెండుసార్లు పరుగులు పెడుతోంది. ఏళ్ల తరబడి ఏ సదుపాయం లేకుండా ఓ గుడిసెలో కొనసాగుతున్న ప్రాథమిక పాఠశాలకు కొత్త భవనం వరించింది. ఏటా వర్షాకాలంలో వాగును తలపించే జగన్నాథ్‌పూర్–నాయికపుగూడం 2 కి.మీ రోడ్డుకు త్వరలోనే మహర్దశ పట్టనుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. స్వాతంత్య్రం సిద్ధించి ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న జగన్నాథ్‌పూర్.. నాయికపుగూడెం ఇప్పుడు అభివృద్ధి బాట పడుతున్నాయి. జగిత్యాల జిల్లా ఎస్పీ అనంతశర్మ దత్తత గ్రామంపై ‘సాక్షి’ఫోకస్.. మార్పుదిశగా..! సుమారు 850 మంది ఉన్న జగన్నాథ్‌పూర్.. నాయికపుగూడెంలో 90 శాతం మంది నిరక్షరాస్యులే. కొందరు పత్తి, మిర్చి పండిస్తే.. అనేక మంది వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్నారు. సరైన సౌకర్యాలు లేక గిరిజన విద్యార్థులు ప్రాథమిక విద్యకూ నోచుకోలేదు. అయితే ఎస్పీ అనంతశర్మ ఏడాది క్రితమే ఈ గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఆదివాసీల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేలా ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. గతేడాది మార్చి 8న గ్రామానికి చెందిన గిరిజన మహిళలతో మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకున్న ఎస్పీ వారికి మహిళల హక్కులపై అవగాహన కల్పించారు. పురుషులతో సమానంగా పోటీ పడేతత్వం గురించి వివరించారు. నాయికపుగూడెంలో రూ. 2 లక్షలతో నిర్మించనున్న పాఠశాలను నిర్మించారు. ప్రస్తుతం గిరిజన విద్యార్ధినీవిద్యార్థులు 23 మంది చదువుకుంటున్నారు. ఎస్పీతో కలసి గిరిజనులు తొలిసారిగా దీపావళి పండుగను జరుపుకున్నారు. జగన్నాథ్‌పూర్ టు హైదరాబాద్ పోలీసులు.. నక్సలైట్ల భయంతో జగన్నాథ్‌పూర్.. నాయికపుగూడెం గిరిజనులు ఏనాడూ బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టలేదు. జగిత్యాల వరకు వచ్చిన వారు కొందరు మాత్రమే ఉన్నారు. అడవిలో ఉంటూ జీవనం సాగిస్తున్న వారిని గుర్తించిన ఎస్పీ అనంతశర్మ.. తొలిసారిగా గతేడాది జులై 4న ప్రత్యేకంగా వారి కోసం ‘సందర్శనయాత్ర’ నిర్వహించి ఏకంగా హైదరాబాద్‌కు పంపించారు. గోల్కొండ, చార్మినార్ చరిత్రాత్మక కట్టడాలను చూసిన గిరి జనులు మురిసిపోయారు. అసెంబ్లీ, ట్యాంక్ బండ్, హైటెక్ సిటీ, విమానాశ్రయాలను చూసి ఆనందంతో పరవశించిపోయారు. స్వయం సాధికారిత వైపు అడుగులు గిరిజన మహిళా సాధికారిత కోసం నడుంబిగించిన ఎస్పీ అనంత శర్మ.. స్వయంగా కలకత్తాకు చెందిన నేషనల్ జ్యూట్ బోర్డును సంప్రదించారు. ఈ క్రమంలో గతేడాది సెప్టెంబర్‌లో జగన్నాథ్‌పూర్‌లో జాతీయ జనపనార శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 50 మంది మహిళలకు జనపనారతో వస్తువుల తయారీ, కుట్టుమిషన్లు, అల్లికలు వంటి వాటిపై రెండు నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. నెలరోజుల లోపే గిరిజన మహిళలు జనపనారతో లగేజీ బ్యాగు, హ్యాండ్‌బ్యాగ్, మార్కెట్బ్యాగ్, గిఫ్ట్బ్యాగ్, షాపింగ్ బ్యాగ్, మనీపౌచ్, చిల్డ్రన్ హ్యాండ్‌బ్యాగ్, ల్యాప్‌టాప్ బ్యాగ్‌లు తయారు చేయడం మొదలుపెట్టారు. మొత్తం వెయ్యికి పైగా బ్యాగులు తయారు చేసి రూ.60 వేలు సంపాదించారు. జియో నెట్వర్క్ అధికారులతో మాట్లాడి ఆ గిరిజన గ్రామంలో జియో 4జీ సేవలను సైతం ఎస్పీ ప్రారంభించారు. గిరిజనుల్లో చిరునవ్వు చూడాలని.. : అనంతశర్మ జగన్నాథ్‌పూర్.. నాయికపుగూడెం గిరిజనులు ఎంతో అమాయకులు. బాహ్య ప్రపంచానికి దూరంగా అడవిలో జీవిస్తున్న విషయం తెలుసుకున్న నేను ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్న. ముఖ్యంగా మహిళలు ఆర్థి కంగా ఎదిగేలా.. సాధికారిత సాధించేలా వారికి జనపనార శిక్షణ ఇప్పించా. అనతికాలంలో తాము తయారు చేసిన బ్యాగులతో రూ. 60 వేలు సంపాదించుకున్నారు. మహిళల్లో చైతన్యం కోసం సదస్సులు నిర్వహించాం. విజ్ఞానయాత్ర ద్వారా హైదరాబాద్ తిప్పించాం. గూడెంలో రక్షిత తాగునీరు అందించాలనే ఉద్దేశంతో రూ. 5 లక్షలతో మినరల్ ప్లాంట్ కొనుగోలు చేశాం. త్వరలోనే దీన్ని ఇన్స్టాల్ చేస్తాం. పురుషులకు ఇటుకల తయారీకి సంబంధించి మిషనరీ ఇప్పించాలని నిర్ణయించా. ఎంపీ కవిత సహకారంతో జగన్నాథ్పూర్ను అన్ని విధాల అభివృద్ధి చేస్తా.