‘నా కొడుకును చంపినప్పుడు ఎటుపోయూరు?’
తాండూర్ : ‘నా కొడుకు కుర్సింగ బల్లార్షాను ఇన్ఫార్మర్ అని చెప్పి నక్సలైట్లు చంపినప్పుడు ఈ నాయకులంతా ఎటుపోరుుండ్రు’ అని కుర్సింగ బల్లార్షా తల్లి లచ్చుబాయి ప్రశ్నించారు. మంగళవారం తాండూర్ మండల కేంద్రంలో తన కుమారుడు కుర్సింగ శ్యాంరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తన భర్త చనిపోతే ఐదుగురు కొడుకులను పెంచి పెద్ద చేశా.. చిన్న కొడుకు బల్లార్షాను ఉన్నత చదువులు చదివించా. ఓ వైపు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ గ్రామస్తులకు సహాయపడుతూ ఉన్న బల్లార్షాను గతేడాది అక్టోబర్‌లో మావోయిస్టులు కాల్చి చంపారు.
1995లో జరిగిన ఎన్‌కౌంటర్‌కు బల్లార్షా ప్రధాన కారకుడని చెప్పడం ఎంత వరకు న్యాయం. అప్పుడు బల్లార్షా వయస్సు ఏడేళ్లు. అతను పోలీసులకు ఎలా సమాచారం ఇవ్వగలడు* అని లచ్చుబారుు ప్రశ్నించారు. నక్సలైట్లు తన కొడుకును కాల్చి చంపినప్పుడు తాము బాధలో ఉంటే ఏ ఒక్క నాయకుడు కాని, ప్రజాసంఘాల వారు కాని, పౌర హక్కుల నేతలు కాని పరామర్శించలేదని, నక్సలైట్ల చర్యను ఖండించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మాలాంటి వారికి అండగా నిలవాలని, తనలాంటి కడుపుకోత ఏ ఒక్క తల్లికి రాకూడదన్నారు.