
(ప్రతికాత్మక ఫొటో)
సుక్మా: చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా గోగుండా ప్రాంతంలో కాల్పుల మోత మోగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. సుక్మా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, దంతెవాడ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సీఆర్‌పీఎఫ్ 2వ బెటాలియన్, సీఆర్‌పీఎఫ్ 111 బెటాలియన్‌లు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టారు.
ఈ కూంబింగ్‌లో భద్రతా బలగాలకు, మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఎదురు కాల్పుల్లో నలుగు మావోయిస్టుల మృతి చెందినట్లు సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ ధృవీకరించారు. ఘటనా స్థలంలో గాయపడిన మరికొంత మంది మావోయిస్టులును చుట్టుముట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సీఆర్పీఎఫ్ డీఐజీ అరవింద్ రాయ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment