chattisgarh naxals
-
లొంగుబాటా.. దాడులా...
రాయ్‌పూర్: లొంగిపోవడమా, తీవ్ర పరిణాలు ఎదుర్కోవడమా ఏదో ఒకటి తేల్చుకోవాలని నక్సలైట్లకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెచ్చరికలు జారీ చేశారు. ‘‘వెంటనే ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవండి. లేదంటే భద్రతా దళాల దాడులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి’’ అని స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో 2026 మార్చి చివరి నాటికి నక్సలిజాన్ని పూర్తి నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయన్నారు. నక్సలిజం నుంచి ఛత్తీస్ విముక్తి పొందినప్పుడే దేశమంతా ఆ ముప్పు నుంచి బయటపడుతుందన్నారు. అమిత్ ఆదివారం చత్తీస్‌గఢ్‌లో పర్యటించారు. రాయ్‌పూర్‌లో ప్రెసిడెంట్స్ పోలీసు కలర్ అవార్డు ప్రదానోత్సవంలో మాట్లాడారు. జగదల్పూర్లో బస్తర్ ఒలింపిక్స్ క్రీడోత్సవాల్లో ప్రసంగించారు. తీవ్రవాదాన్ని అరికట్టడంలో ఛత్తీస్ పోలీసులు ఏడాదిగా గణనీయమైన పురోగతి సాధించారని ప్రశంసించారు. ‘‘లొంగిపోయిన నక్సలైట్ల పునరావాసానికి రాష్ట్ర ప్రభుత్వం అద్భుత విధానం అమలు చేస్తోంది. తీవ్రవాదులు హింసకు స్వస్తి పలికి రాష్ట్ర ప్రగతికి చేయూతనందించాలి’’ అని పిలుపునిచ్చారు. ఏడాదిలో 287 మంది హతం ఛత్తీస్‌గఢ్‌లో గత ఏడాదిలో 287 మంది నక్సలైట్లు మరణించారని, 1,000 మంది అరెస్టయ్యారని, 837 మంది లొంగిపోయారని అమిత్ వివరించారు. నక్సలిజంపై పోరాటంలో పురోగతికి ఈ గణాంకాలే నిదర్శనమన్నారు. ‘‘ఏడాదిలో 14 మంది నక్సల్స్ అగ్ర నేతలు హతమయ్యారు. నక్సల్స్ హింసాకాండలో మరణించిన భద్రతా సిబ్బంది, సాధారణ పౌరుల సంఖ్య 100లోపే. నాలుగు దశాబ్దాల్లో ఇదే అతి తక్కువ. మావోయిస్టుల దాడుల్లో భద్రతా సిబ్బంది, పౌర మరణాలు 70 శాతం తగ్గాయి. నక్సలిజంపై చివరిదెబ్బ కొట్టడానికి కేంద్ర, రాష్ట్ర బలగాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రెసిడెంట్స్ పోలీసు కలర్ పురస్కారం అందుకోవాలంటే కనీసం పాతికేళ్లు సేవలందించి ఉండాలి. కానీ ఛత్తీస్‌గఢ్‌లో 2000లో ఏర్పాటైనా రాష్ట్ర పోలీసు దళానికి ఈ అవార్డు దక్కడం హర్షణీయం. పోలీసుల అంకితభావం, త్యాగం, ధైర్యసాహసాలే ఇందుకు కారణం. జమ్మూకశీ్మర్ కంటే బస్తర్ అందమైన ప్రాంతం. నక్సలిజం అంతమైతే ఇక్కడికి పర్యాటకులు భారీగా వస్తారు’’ అని అన్నారు.వేసక్టమీ చేసుకుంటేనే పెళ్లి లొంగిపోయిన మావోయిస్టుల వెల్లడి ‘‘కుటుంబ నియంత్రణ ఆపరేషన్. నక్సలైట్లలో తరచూ వినిపించే మాట. దళంలో ఉండగా పెళ్లి చేసుకోవాలంటే ముందు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవాలి. లేకపోతే పెళ్లికి అనుమతివ్వరు. అగ్రనేతల ఆదేశాలతో బలవంతంగానైనా ఆపరేషన్ చేయిస్తారు. నాకూ అలా ఆపరేషన్ చేయించారు’’ అని తెలంగాణకు చెందిన మాజీ మావోయిస్టు వెల్లడించారు. ‘‘ఆయుధాలు వదిలేసి లొంగిపోయి సాధారణ జీవితం మొదలు పెట్టాక సంతానం కావాలనిపించింది. మళ్లీ ఆపరేషన్ చేయించుకుని ఒక బాబుకు తండ్రినయ్యా’’ అని హోం మంత్రి అమిత్ షాకు తన అనుభవం వివరించారు. లొంగిపోయిన నక్సలైట్లతో ఆయన జగదల్పూర్లో ప్రత్యేకగా సమావేశమయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల మాజీ నక్సల్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘దళంలో స్త్రీ, పురుష సభ్యులు పెళ్లాడటం పరిపాటి. పిల్లలు పుడితే వారి సంరక్షణ, అడవుల్లో తిరగడం కష్టమవుతుందని, ఉద్యమానికీ ఇబ్బందని అగ్ర నేతలు చెబుతుంటారు. అందుకే నక్సలైట్లకు వేసక్టమీ తప్పనిసరి చేశారు’’ అని వారన్నారు. -
అమిత్ షా టూర్ వేళ అపశృతి..పేలుడులో జవాన్‌కు గాయాలు
రాయ్‌పూర్:కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం(డిసెంబర్15) ఛత్తీస్‌గఢ్ పర్యటన సందర్భంగా అపశృతి దొర్లింది. షా పర్యటనను పురస్కరించుకుని ఛత్తీస్‌గఢ్ కాంకేర్‌లో భద్రతా సిబ్బంది ముందస్తు తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల్లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీని భద్రతా సిబ్బంది గుర్తించారు. ఐఈడీని నిర్వీర్యం చేసే సమయంలో అది ఒక్కసారిగా పేలడంతో భద్రతా సిబ్బంది ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. తర్వాత భద్రతా సిబ్బంది ఆ ప్రాంతంలో విస్త్రృత సోదాలు నిర్వహించారు. పేలుడు పదార్థాలతో తిరుగుతున్న తొమ్మిది మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. అమిత్ షా పర్యటన వేళ ఈ ఘటన చోటుచేసుకోవడంతో కాంకేర్‌లో హై అలర్ట్ ప్రకటించారు.ఈ ప్రాంతంలో భద్రతా దళాలను భారీగా మోహరించినట్లు కాంకేర్ జిల్లా ఎస్పీ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం రాయ్‌పుర్ చేరుకున్నారు. రాయ్‌పూర్,బస్తర్ జిల్లాల్లో జరిగే పలు కార్యక్రమాలకు ఆయన హాజరవుతారు. -
దంతెవాడలో బలగాల ఆపరేషన్ సక్సెస్.. మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ!
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో దాదాపు 31 మంది నక్సలైట్లు మృతిచెందారు. దాదాపు 48 గంటల పాటు జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదు రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ కమాండర్లు కమలేశ్ అలియాస్ ఆర్కే, నీతి అలియాస్ ఊర్మిళ మరణించినట్లు సమాచారం.వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లో శుక్రవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఎన్కౌంటర్ తర్వాత భద్రతా బలగాలు ఘటనా స్థలం నుంచి ఇప్పటివరకు 31 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో భారీ ఎత్తున కూంబింగ్ కొనసాగుతోంది. దాదాపు 1,500 మంది భద్రత సిబ్బందితో 48 గంటలపాటు ఆపరేషన్ సాగినట్లు అధికారుల వెల్లడించారు. పొలాలు, చిత్తడి దారుల గుండా 10 కిలోమీటర్లు ప్రయాణించి, అక్కడినుంచి 12 కిలోమీటర్ల మేర కొండలు ఎక్కి ఎన్కౌంటర్ ప్రాంతానికి బలగాలలు చేరుకున్నాయి.ఇక, ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ నష్టం జరిగింది. ఎన్కౌంటర్లో మృతిచెందిన వారిలో ఐదు రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు కమలేష్ అలియాస్ ఆర్కె, నీతి అలియాస్ ఊర్మిళ మరణించినట్లు సమాచారం. ఊర్మిళ బీజాపూర్ జిల్లా గంగలూరు ప్రాంతానికి చెందినవారు కాగా, కమలేశ్ ఏపీలోని విజయవాడ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది.మరోవైపు.. ఎన్‌కౌంటర్‌పై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి స్పందించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజం అంతమై శాంతి నెలకొంటుంది. మన బలగాలు గొప్ప విజయాన్ని సాధించాయి. 31 మంది నక్సల్స్‌ను హతమార్చారు. మన సైనికులు గత రికార్డును బద్దలు కొట్టారు. ఎన్కౌంటర్ విషయంలో మా సైనికులను అభినందిస్తున్నాము. వారి ధైర్యానికి వందనం. ఈ ఘటన మావోయిస్టులు అణిచివేతకు మార్గం చూపించింది అంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘాల నేతలు స్పందించారు. మృతుల ఫొటోలు, వివరాలను పోలీసులు వెంటనే విడుదల చేయాలన్నారు. అలాగే, ఈ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారించాలని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: బెంగాల్లో మరో దారుణం -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్..ఇద్దరు మావోయిస్టులు మృతి
రాయ్‌పూర్:ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు,పోలీసులకు మధ్య మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.సుక్మా జిల్లా కార్కగున అటవీ ప్రాంతంలో మంగళవారం(సెప్టెంబర్24) కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతాబలగాలపై తొలుత మావోయిస్టులు కాల్పులు జరిపారు.ఈ కాల్పులకు ప్రతిగా బలగాలు జరిపిన కాల్పుల్లో మావోయిస్టులు మృతిచెందారు.సోమవారమే ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మడ్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్..ముగ్గురు మావోయిస్టులు మృతి
రాయ్‌పూర్:ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌జిల్లా అబూజ్మడ్ అడవుల్లో సోమవారం(సెప్టెంబర్23) పోలీసులు,మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు పురుషులు కాగా ఒక మహిళా మావోయిస్టున్నట్లు గుర్తించారు.ఘటనాస్థలం నుంచి మూడు మృతదేహాలతో పాటు ఒక ఏకే 47,ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్లు సమాచారం. -
పోలీసు క్యాంపుపై మావోయిస్టుల దాడి
రాయ్‌పూర్:ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు పోలీసు క్యాంప్‌పై దాడి చేశారు. సుక్మా జిల్లాలోని జేగురుకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి ఈ దాడి జరిగింది. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని 15నుంచి 20 రౌండ్లు కాల్పులు జరిపారు. మావోయిస్టుల దాడిని భద్రతా బలగాలు తిప్పికొట్టాయి.బలగాల ఎదురుదాడితో మావోయిస్టులు పారిపోయినట్లు సమాచారం. ఈ దాడిలో జవాన్ల వైపు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.30 నుంచి 40 మంది వరకు మావోయిస్టులు ఈ దాడిలో పాల్గొన్నట్లు సమాచారం.అరగంట పాటు మావోయిస్టులు, పోలీసుల మద్య కాల్పులు జరిగాయని తెలిపారు. ఇటీవలి కాలంలో ఛత్తీస్‌గఢ్‌లో బలగాలు జరిపిన కాల్పుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. దీనిని ప్రతీకారంగానే పోలీసు శిబిరంపై మావోయిస్టులు దాడికి యత్నించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇదీ చదవండి..జమ్మూకాశ్మీర్‌లో కాల్పుల మోత -
చత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శనివారం(మే25) పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు నక్సల్స్ మృతి చెందినట్లు సమాచారం. మీర్తూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పులు జరిగిన ప్రదేశంలో ఆయుధాలు, వైర్లెస్ సెట్లు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు బీజాపూర్ పోలీసులు తెలిపారు. -
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. 29 మంది మావోయిస్టుల మృతి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం(ఏప్రిల్16) భారీ ఎన్కౌంటర్ జరిగింది. కాంకేర్ జిల్లా మాడ్‌లో మావోయిస్టులకు, బీఎస్ఎఫ్ జవాన్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) కళ్యాణ్ ఎల్లిసెల తెలిపారు. చొట్టేబెటియా పోలీస్‌స్టేషన్ పరిధిలోని బినాగుండ-కోరగుట్ట జంగిల్స్ సమీపంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య తొలుత ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయన్నారు. ఎదురు కాల్పుల తర్వాత జరిగిన సోదాల్లో నాలుగు ఏకే 47 తుపాకులు, మూడు మెషీన్ గన్లు సహా మావోయిస్టులకు చెందిన ఆయుధాలను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు. కాల్పుల్లో మృతి చెందిన వారిలో మావోయిస్టు అగ్రనేత శంకర్రావు ఉన్నారు. ఈయన మీద రూ.25 లక్షల రివార్డు ఉంది. ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పటికే ఎన్కౌంటర్ ప్రదేశం నుంచి 29 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఆపరేషన్‌ను బీఎస్ఎఫ్ జవాన్లు, డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డు(డీఆర్జీ) పోలీసులు సంయుక్తంగా చేపట్టారు. -
Chattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఒక పోలీస్ కానిస్టేబుల్‌తో పాటు ఒక మావోయిస్టు మృతి చెందారు. జిల్లాలోని హిందూర్ అటవీ ప్రాంతంలోని చోటేబేటియా పోలస్ స్టేషన్ పరిధిలో కూంబింగ్ చేస్తుండగా పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో బస్తర్ ఫైటర్స్ యూనిట్‌కు చెందిన కానిస్టేబుల్ రమేష్ మృతి చెందాడు. సంఘటనా స్థలంలో ఒక మావోయిస్టు మృతదేహంతో పాటు ఏకే 47 తుపాకీని పోలీసులు కనుగొన్నారు. కూంబింగ్ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.కాగా, గత నెలలో బస్తర్ ప్రాంతంలోని సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లతో పాటు ఇద్దరు స్పెషల్ బెటాలియన్ కమాండోలు చనిపోయారు. ఇదీ చదవండి.. రామేశ్వరం కేఫ్ పేలుడు.. యువ టెకీని కాపాడిన అమ్మ ఫోన్‌కాల్ -
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం(జనవరి 30) ఉదయం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు భద్రతా సిబ్బంది మృతి చెందారని, మరో 14 మంది గాయపడ్టట్లు బస్తర్ జిల్లా పోలీసులు తెలిపారు. గాయపడ్డ జవాన్లను హెలికాప్టర్లో రాయ్‌పూర్‌కు చికిత్స నిమిత్తం తరలిస్తున్నట్లు చెప్పారు. మృతి చెందిన వారిని కోబ్రా కానిస్టేబుళ్లు సి. దేవన్, పవన్ కుమార్, సీఆర్పీఎఫ్ జవాను లాంధర్ సిన్హాగా గుర్తించారు. సుఖ్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దులోని టేకులగూడెం గ్రామంలో మావోయిస్టుల కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు సోమవారమే పారామిలిటరీ సిబ్బందితో బేస్ క్యాంపుకు ఏర్పాటు చేశారు. టేకులగూడెం సమీపంలోని జోనగూడ, అలిగూడ గ్రామాల మధ్య కోబ్రా, సీఆర్పీఎఫ్ బలగాలు మంగళవారం ఉదయం కూంబింగ్‌కు వెళ్లాయి. ఈ సమయంలో వారికి మావోయిస్టులు ఎదురుపడ్డారు. వెంటనే మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. ఉదయం ప్రారంభమైన ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మూడేళ్ల క్రితం 2021లో టేకులగూడెం అడవుల్లోనే మావోయిస్టులు, భద్రతాబలగాలకు భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో అప్పట్లో 21 మంది జవాన్లు మృతి చెందారు. మళ్లీ తిరిగి ఇప్పుడు అదే ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు భద్రతా సిబ్బంది మరణించడంతో పాటు భారీ సంఖ్యలో జవాన్లు గాయపడటం పోలీసులను కలవరపెడుతోంది. ఇదీచదవండి.. అజ్ఞాతం వీడిన సోరేన్ -
చత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
సుక్మా: చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా గోగుండా ప్రాంతంలో కాల్పుల మోత మోగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. సుక్మా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, దంతెవాడ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సీఆర్పీఎఫ్ 2వ బెటాలియన్, సీఆర్పీఎఫ్ 111 బెటాలియన్లు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టారు. ఈ కూంబింగ్‌లో భద్రతా బలగాలకు, మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఎదురు కాల్పుల్లో నలుగు మావోయిస్టుల మృతి చెందినట్లు సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ ధృవీకరించారు. ఘటనా స్థలంలో గాయపడిన మరికొంత మంది మావోయిస్టులును చుట్టుముట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సీఆర్పీఎఫ్ డీఐజీ అరవింద్ రాయ్ తెలిపారు. చదవండి: Temple Vandalised: భారత్ స్ట్రాంగ్ రియాక్షన్ -
మూడు రోజుల్లో పోలింగ్..బీజేపీ నేతను కాల్చి చంపిన మావోయిస్టులు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఫస్ట్ ఫేజ్ అసెంబ్లీ ఎన్నికలకు మూడు రోజుల ముందు మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న బీజేపీ నేతను కాల్చి చంపారు. నారాయణ్‌పూర్ జిల్లా కౌశల్నార్ ప్రాంతంలో శనివారం ఈ ఘటన జరిగింది. నారాయణ్‌పూర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్న రతన్ దూబే ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఇంతలో మావోయిస్టులు వచ్చి ఒక్కసారిగా ఆయనపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో దూబే అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలానికి ప్రత్యేక పోలీసుల టీమ్ వెళ్లి దర్యాప్తు చేస్తోందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. -
స్టీల్ ప్లాంట్‌లో పేలుడు.. ఉవ్వెత్తున ఎగిసిన అగ్ని కీలలు..
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. స్టీల్ ప్లాంట్‌లో మంటలు చెలరేగాయి. కాస్మారాలో ఉన్న రాయ్‌పూర్ స్టీల్ ప్లాంట్ నడుస్తున్నప్పుడు ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఘటనాసమయంలో దాదాపు 100 మంది కార్మికులు ప్లాంట్‌లో పనిచేస్తున్నారు. కాగా మంటల్లో కాలి ఒక వ్యక్తి మరణించినట్లు సమాచారం. స్టీల్ ప్లాంట్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అగ్ని కీలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. మంటలు వేగంగా వ్యాపించాయి. కాగా.. మంటల్లో కాలి పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. పేలుడుకు సంబంధించిన కారణాలు ఉంకా తెలియలేదు. దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: సీఎంను కించపరుస్తూ పోస్టులు.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అరెస్టు.. -
మహిళా మావోయిస్టులో అసభ్యకర ప్రవర్తన.. పీఎల్జీఏ సభ్యుడి హతం
చర్ల: మహిళా మావోయిస్టులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న పీఎల్జీఏ సభ్యుడిని మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించి హతమార్చారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకోగా బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. పీఎల్జీఏ 17వ బెటాలియన్‌కు చెందిన మను దుగ్గ పార్టీలో పనిచేస్తున్న మహిళా మావోయిస్టులపై అసభ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆయనపై మహిళా మావోయిస్టులు అగ్ర నాయకులకు ఫిర్యాదు చేయగా.. వారు పలుమార్లు హెచ్చరించినా తీరు మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం కాంకేర్ జిల్లాలోని దండకారణ్య ప్రాంతంలో ప్రజాకోర్టు నిర్వహించిన మావోయిస్టులు ఆయనను హతమార్చారు. ఈ మేరకు లేఖను కూడా మృతదేహం వద్ద వదిలారు. కాగా, మావోయిస్టులు హతమార్చిన పార్టీ పీఎల్జీఏ సభ్యుడు మను దుగ్గపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ.5 లక్షల రివార్డు ప్రకటించింది. ఇది కూడా చదవండి: ఇంజనీరింగ్ కాలేజ్ పార్ట్నర్స్ భారీ స్కెచ్.. ఓనర్ హత్యకు సుపారీ -
దంతేవాడ పేలుడు సూత్రధారి ఇతనే.. మావోయిస్టు దళంలో కీలక పాత్ర..
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత దంతేవాడ జిల్లాలోని అరన్పూర్ పేలుడు సూత్రధారి జగదీష్ చిత్రం తెరపైకి వచ్చింది. ఇతను చాలా కాలంగా బస్తర్‌లో యాక్టివ్‌గా ఉన్నాడు. నివేదికల ప్రకారం, అరన్‌పూర్‌లో జరిగిన పేలుడులో జగదీష్ మొత్తం సంఘటనకు ప్రణాళికను సిద్ధం చేశాడు. ఈ నక్సలైట్ నాయకుడి నేతృత్వంలోనే దంతేవాడలోని అరన్‌పూర్‌లో పేలుడు జరిగింది. ఈ ఘటనలో 10 మంది జవాన్లు, ఒక డ్రైవర్ బలి అయ్యారు. గతంలో జగదీష్ కాటేకల్యాణ్ ఏరియా కమిటీలో మాత్రమే యాక్టివ్‌గా ఉండేవాడు. అయితే పెద్ద పెద్ద సంఘటనలను నిరంతరం అమలు చేయడంలో విజయం సాధించడంతో జగదీష్ క్యాడర్ పెరిగింది. నక్సలైట్ల సైనిక దళంలో ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్నాడు. జగదీష్ ప్రాథమికంగా జాగరగుండ తూర్పు గ్రామానికి చెందినవాడు. ఇతనిపై రూ.5 లక్షల రివార్డు ప్రకటించారు. అరన్పూర్ పేలుడు తర్వాత జగదీష్‌తో పాటు మరో 12 మంది నక్సలైట్లపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దర్భా డివిజనల్ కమిటీలో చురుగ్గా ఉన్న నక్సల్స్ జగదీష్, లఖే, లింగే, సోమడు, మహేష్, హిద్మా, ఉమేష్, దేవే, నంద్ కుమార్, లఖ్మా, కోసా, ముఖేష్, చైతు, మంగ్తు, రాన్సాయి, జయలాల్, బమన్, సోమ, రాకేష్, భీమాతో పాటు మరికొందరిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందరిపై యూఏపీఏ చట్టం ప్రయోగించారు. చదవండి: బీజేపీ ఎమ్మెల్యే హత్య కేసు.. బీఎస్పీ ఎంపీకి షాక్.. గ్యాంగ్‌స్టర్‌కు పదేళ్ల జైలు.. -
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం
-
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 11 మంది జవాన్లు మృతి..
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ దంతెవాడ జిల్లా అరాన్పుర్ సమీపంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. జవాన్లతో వెళ్తున్న మినీ బస్సును టార్గెట్ చేసి ఐఈడీ పేల్చారు. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు 10 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా డిస్ట్రిక్ట్ రిజర్వుడు గార్డు(డీఆర్డీ)కు చెందినవారు. మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాలు ఇచ్చిన పక్కా సమాచారంతో అడవిలో కూంబింగ్ నిర్వహించేందుకు జవాన్లు వెళ్తుండగా.. వీరి రాకను పసిగట్టి మావోయిస్టులు దాడి చేశారు. మినీ బస్సును లక్ష్యంగా చేసుకుని ఐఈడీ పేల్చారు. అమరులైన జవాన్ల పేర్లు 1. రామ్‌కుమార్ యాదవ్ - హెడ్ కానిస్టేబుల్ 2. టికేశ్వర్ ధ్రువ్ - అసిస్టెంట్ కానిస్టేబుల్ CAF, ధమ్తరి 3. సలిక్ రామ్ సిన్హా - కానిస్టేబుల్, కంకేర్ 4. విక్రమ్ యాదవ్, హెడ్ కానిస్టేబుల్ 5. రాజేష్ సింగ్ - కానిస్టేబుల్ (ఘాజీపూర్, యుపి) 6. రవి పటేల్ - కానిస్టేబుల్ 7. అర్జున్ రాజ్‌భర్, కానిస్టేబుల్ (CAF) సీఎంకు అమిత్‌షా ఫోన్.. ఈ ఘటన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. ఛత్తీస్‌గఢ్ సీఎం బూపేశ్ బఘేల్‌కు ఫోన్ చేశారు. రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలపై ఆరా తీశారు. కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. జవాన్లు ప్రాణాలను బలిగొంటున్న మావోయిస్టులను వదిలిపెట్టబోమని సీఎం బఘేల్ తేల్చిచెప్పారు. పోరాటం చివరి దశలో ఉందని పేర్కొన్నారు. ఘటనలో చనిపోయిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ములుగు పోలీసులు అప్రమత్తం.. ఛత్తీస్‌గఢ్ ఘటనతో తెలంగాణలోని ములుగు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. డ్రోన్ కెమెరాలతో ఏజెన్సీని జల్లెడ పడుతున్నారు. వెంకటాపురం-భద్రాచలం ప్రధాన రహదారిపై మావోయిస్ పార్టీ అగ్ర నేతల వాల్ పోస్టర్లతో వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ములుగు జిల్లా ఏజెన్సీలో మావోయిస్టు యాక్షన్ టీం కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: భార్యను సమాధి చేసి దానిపై డ్యాన్సులు.. ఈ కేసు ఆధారంగా వెబ్ సిరీస్.. -
హిడ్మా చనిపోలేదు.. సేఫ్‌గా ఉన్నాడు
బస్తర్: తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ఎన్కౌంటర్లో పోలీసుల ప్రకటనపై ట్విస్ట్ చోటు చేసుకుంది. బుధవారం జరిగిన కాల్పులపై మావోయిస్ట్ కేంద్ర కమిటీ ఒక లేఖ రిలీజ్ చేసింది. మావోయిస్టు అగ్రనేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ) మొదటి బెటాలియన్ కమాండర్ మాడ్వి హిడ్మా చనిపోయాడన్న వార్తల్లో వాస్తవం లేదంటూ ప్రకటించింది. బుధవారం జరిగిన కాల్పుల్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మరణించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే.. తాజాగా మావోయిస్టు దక్షిణ బస్తర్ డివిజన్ కమిటి కార్యదర్శి పేరుతో లేఖ విడుదల అయ్యింది. అందులో ‘‘కేంద్ర కమిటీ సభ్యుడిగా హిడ్మా చనిపోలేదు. చనిపోయినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. హిడ్మా సేఫ్ గా ఉన్నాడు.దక్షిణ బస్తర్ జంగిల్ కొండలపై పోలీసులు, సీఆర్పీఎఫ్లు సంయుక్తంగా డ్రోన్లు, హెలికాప్టర్ ద్వారా దాడులు చేశాయి. గత ఏడాది ఏప్రిల్ లో కూడా వైమానిక బాంబు దాడి చేశారు. మావోయిస్ట్ పార్టీ నాయకత్వంను దెబ్బతియాలని వందల సంఖ్యలో బాంబులు పేల్చారు. రాత్రి, పగలు లేకుండా గగనతలం ద్వారా నిఘా పెట్టారు. వచ్చే ఎన్నికల్లోపు మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. అందులో భాగంగానే మావోయిస్టులపై ఈ దాడులు, ప్రకటనలు. ఈ భీకర దాడుల కారణంగా ప్రజలు పొలాలకు వెళ్లలేకపోతున్నారు. ప్రపంచంలోనే అన్ని ప్రగతిశీల కూటములు ఏకం కావాలని, యుద్ధానికి వ్యతిరేకంగా పోరాడాల’’ని లేఖ ద్వారా మావోయిస్టులు పిలుపు ఇచ్చారు. ఇదిలా ఉంటే.. దక్షిణ బస్తర్ ప్రాంతంలో సుక్మా జిల్లాలో పువర్తి గ్రామం స్థానికుడయిన హిడ్మా అక్కడి ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తి. దండకారణ్యంలో దాక్కున్న ఈ మావోయిస్టు అగ్రనేతను లక్ష్యంగా చేసుకుని భారీ ఎత్తున్న సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. గతంలోనూ హిడ్మా చనిపోయాడంటూ అనేకసార్లు ప్రచారం జరిగింది. హిడ్మా: చిక్కడు దొరకడు.. కేంద్ర కమిటీ వల్లే దెబ్బ తిన్నాడా? -
ఎన్నికల వేళ ఛత్తీస్‌లో హింస
పర్ణశాల/చింతూరు (రంపచోడవరం): ఛత్తీస్‌గఢ్‌లో మొదటి దశ ఎన్నికల వేళ యుద్ధ వాతావరణం నెలకొంది. ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన మావోయిస్టులు పలు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో బీఎస్ఎఫ్ ఎస్సైతోపాటు ఓ మావోయిస్టు మృతి చెందారు. కాంకేర్ జిల్లా కట్టకల్– గోమె గ్రామాల మధ్య రహదారిపై బీఎస్ఎఫ్ జవాన్లు తనిఖీలు చేస్తుండగా మావోయిస్టులు అమర్చిన అత్యాధునిక పేలుడు పదార్థం (ఐఈడీ) పేలింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బీఎస్ఎఫ్ ఎస్సై మహేంద్ర సింగ్‌ను రాయ్‌పూర్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. మహేంద్ర సింగ్‌ది రాజస్తాన్ రాష్ట్రమని అధికారులు చెప్పారు. ఇది గత 15 రోజుల్లో పేలిన నాలుగో ఐఈడీ కావడం గమనార్హం. బిజాపూర్ జిల్లా బద్రె సమీపంలోని అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఘటనా స్థలంలో భారీగా పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎన్నికలు జరిగే బస్తర్ ప్రాంతంలోని ఏడు జిల్లాల్లో పోలీసులు, ఎన్నికల సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన మందుపాతర్లు, బూబీ ట్రాప్లను పోలీసులు గుర్తించి, వెలికితీశారు. దంతెవాడ జిల్లా కోసల్‌నార్ గ్రామంలో డ్రోన్ కెమెరాలతో మావోయిస్టుల జాడలను గుర్తించామని ఎస్పీ అభిషేక్ పల్లవ్ తెలిపారు. నేడే మొదటి విడత పోలింగ్ ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మొదటి విడత పోలింగ్‌కు రంగం సిద్ధమయింది. రాష్ట్రంలోని మొత్తం 90 స్థానాలకు గాను 18 స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. వీళ్లు రియల్ ‘న్యూటన్’లు! సుక్మా: పాదరక్షలు లేకుండానే నదులు దాటాలి. అరకొర భద్రతా సిబ్బంది వెంటరాగా దట్టమైన అరణ్యాల గుండా ప్రయాణించాలి. రవాణా మార్గాలు లేనిచోటికి విమానాలు, హెలికాప్టర్ల ద్వారా చేరివేత..ఇవీ ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది పడుతున్న పాట్లు. పోలింగ్ అధికారిగా వెళ్లిన ఓ వ్యక్తి ఎదుర్కొన్న ఇబ్బందుల్ని వ్యంగ్యంగా చూపించిన న్యూటన్ చిత్రంలోని అనుభవాల్ని తాము నిజ జీవితంలో చూస్తున్నామని కొందరు అభిప్రాయపడగా, మరికొందరైతే తమని తాము విప్లవ యోధుడు భగత్‌సింగ్‌తో పోల్చుకుంటున్నారు. తొలి దశ ఎన్నికలు జరగనున్న బస్తర్‌ను అత్యంత సున్నిత ప్రాంతంగా ప్రకటించారు. ఇటీవల అక్కడ వరుసగా మావోయిస్టులు దాడులకు పాల్పడటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. అయినా వెరవకుండా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, పంచాయతీ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ముందుకొచ్చారు. పోలింగ్ బూత్‌లకు చేరుకోవడానికి మైళ్ల దూరం నడిచినా, ప్రాణాలకు ముప్పున్నా ఎవరూ ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. కొంత భయంగా ఉందని కొందరు చెప్పినా, ఎన్నికల విధులు నిర్వర్తించడం తమకు ఇష్టమేనని తెలిపారు. సుక్మాకు చెందిన 22 ఏళ్ల పంచాయతీ ఉద్యోగి ఒకరు స్పందిస్తూ తనకు ఇది గర్వకారణమైన క్షణమని, తన గ్రామంలో హెలికాప్టర్లో ప్రయాణించిన తొలి వ్యక్తిని తానేనని సంతోషం వ్యక్తం చేశారు. బీజాపూర్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చానని, భగత్‌సింగ్ తన స్ఫూర్తి ప్రదాత అని చెప్పారు. -
చత్తీస్‌గఢ్‌లో పోలింగ్‌కు ముందు మావోయిస్టుల విధ్వంసం
రాయపూర్ : చత్తీస్‌గఢ్‌లో తొలి దశ పోలింగ్‌కు ముందు ఆదివారం కంకేర్ జిల్లాలో జరిగిన మావోయిస్ట్‌ల దాడిలో ఓ బీఎస్ఎఫ్ జవాన్ మరణించారు. కట్టకల్, గోమ్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో నక్సల్స్ బీఎస్ఎఫ్ బృందంపై ఐఈడీని పేల్చి విధ్వంసం సృష్టించారని కంకేర్ ఎస్పీ కేఎల్ ధ్రువ్ పేర్కొన్నారు. నక్సల్ దాడిలో గాయపడిన ఎస్ఐ మహేంద్రసింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మొత్తం ఆరు ఐఈడీలు అమర్చిన మావోలు వరుసగా ఒకదాని తర్వాత మరొకటి పేల్చినట్టు పోలీసులు వెల్లడించారు. మరోవైపు బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలు చేపట్టిన ఎన్కౌంటర్లో శనివారం ఓ మావోయిస్టు మరణించగా మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి పెద్దఎత్తున ఆయుధాలు, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాగా చత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో ఇటీవల మావోయిస్టులు జరిపిన దాడిలో ఇద్దరు భద్రతా దళ సిబ్బందితో పాటు దూరదర్శన్ కెమెరామెన్ మరణించిన సంగతి తెలిసిందే. గత 15 రోజుల్లో మావోయిస్టులు చత్తీస్‌గఢ్‌లో చేపట్టిన ఐఈడీ పేలుడు ఇది నాలుగవది కావడం గమనార్హం.90 మంది సభ్యులు కలిగిన చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈనెల 12న, 20న రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. -
ఛత్తీస్‌లో నక్సల్స్ పంజా
మందుపాతర పేలుడులో ఇద్దరు జవాన్ల బలి ఎన్కౌంటర్లో ముగ్గురు నక్సల్స్ మృతి చింతూర్(ఖమ్మం), న్యూస్‌లైన్: ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ భద్రతా బలగాలపై పంజా విసిరారు. సుక్మా జిల్లాలో ఆదివారం నక్సల్స్ మందుపాతర పేల్చడంతో ఇద్దరు సీఆర్పీఎఫ్ అధికారులు మృతిచెందగా, 12 మంది జవాన్లు గాయపడ్డారు. మరోపక్క.. బీజాపూర్ జిల్లా లో శనివారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టు దళ కమాండర్లు చనిపోయారు. సుక్మా జిల్లాలోని బోధ్‌రాజ్ పదార్ గ్రామ సమీప అడవుల్లోకి కూంబింగ్‌కు వెళ్లిన ‘కోబ్రా’, సీఆర్పీఎఫ్, జిల్లా పోలీసు విభాగానికి చెందిన 400 మంది జవాన్ల కదలికను పసిగట్టిన మావోలు దారి కాచి భారీ మందుపాతర పేల్చారు. తర్వాత ఇరుపక్షాల మధ్య కాల్పులు జరిగాయి. పేలుడులో సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ నిహాల్ ఆలం, కానిస్టేబుల్ రాజీవ్ రావత్ అక్కడికక్కడే మృతిచెందారు. ఎస్ఐ హృదయ్వర్మ, సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ రత్నేశ్వర్, కానిస్టేబుళ్లు ప్రమోద్, మహేష్ శర్మ, జితేందర్, దినేశ్ యాదవ్, మహంతి, అసిస్టెంట్ కానిస్టేబుల్ నెహ్రులాల్ కాశ్యప్లు తీవ్రంగా గాయపడడంతో వారిని హెలికాప్టర్లో రాయ్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. శనివారం రాత్రి మహారాష్ట్ర సరిహద్దులోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు, నక్సల్స్ మధ్య జరిగిన హోరాహోరీ ఎన్కౌంటర్లో ముగ్గురు నక్సల్స్ దళ కమాండర్లు మృతిచెందారు. వీరిలో భార్యాభర్తలు ఉన్నారు. ఛత్తీస్, మహారాష్ట్ర పోలీసులు బడే కాకిలేర్ అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తుండగా నక్సల్స్ తారసపడ్డారు. ఇరుపక్షాలు కాల్పులు జరుపుకున్నాయి. ఘటనాస్థలంలో ఇద్దరు పురుషులు, ఓ మహిళా నక్సల్స్ మృతదేహాలు కనిపించాయి. మృతులను బీజాపూర్ జిల్లా పల్లెవాయి గ్రామానికి చెందిన గంగలూరు దళ కమాండర్ చైతు అలియాస్ నవీన్ మండావి, జైపేలీ గ్రామానికి చెందిన కమాండర్ మాసె తెల్లం(నవీన్ భార్య), సాగిమేటాకు చెందిన మిలీషియా కమాండర్ సన్ను ఉద్దేలుగా గుర్తించారు.