రాయ్‌పూర్:ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. అబూజ్మడ్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సలైట్లు,ఒక జవాను మృతి చెందారు. నారాయణపూర్,దంతేవాడ జిల్లాల సరిహద్దులో ఉన్న అబూజ్మడ్ అడవుల్లో శనివారం సాయంత్రం భద్రతాబలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు.
దీంతో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఘటనా స్థలం నుంచి ఏకే 47,ఎస్ఎల్ఆర్ వంటి ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎదురుకాల్పుల్లో మృతిచెందిన కానిస్టేబుల్‌ను దంతెవాడ డీఆర్జీ హెడ్ కానిస్టేబుల్ సన్ను కరమ్‌గా గుర్తించారు.
ఇటీవలి కాలంలో ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పుల ఘటనలు ఎక్కువయ్యాయి. ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టుల వైపు నుంచి ఎక్కువ ప్రాణనష్టం జరుగుతోంది. భద్రతాబలగాలు కూడా తమ జవాన్లను కోల్పోతున్నాయి.
ఇదీ చదవండి: లోయలో పడ్డ ఆర్మీ వాహనం..నలుగురు సైనికులు దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment