
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శనివారం(మే25) పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు నక్సల్స్ మృతి చెందినట్లు సమాచారం.
మీర్తూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పులు జరిగిన ప్రదేశంలో ఆయుధాలు, వైర్‌లెస్ సెట్‌లు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు బీజాపూర్ పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment