రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక పోలీస్ కానిస్టేబుల్‌తో పాటు ఒక మావోయిస్టు మృతి చెందారు. జిల్లాలోని హిందూర్ అటవీ ప్రాంతంలోని చోటేబేటియా పోలస్ స్టేషన్ పరిధిలో కూంబింగ్ చేస్తుండగా పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి.
ఈ కాల్పుల్లో బస్తర్ ఫైటర్స్ యూనిట్‌కు చెందిన కానిస్టేబుల్ రమేష్ మృతి చెందాడు. సంఘటనా స్థలంలో ఒక మావోయిస్టు మృతదేహంతో పాటు ఏకే 47 తుపాకీని పోలీసులు కనుగొన్నారు. కూంబింగ్ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.కాగా, గత నెలలో బస్తర్ ప్రాంతంలోని సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లతో పాటు ఇద్దరు స్పెషల్ బెటాలియన్ కమాండోలు చనిపోయారు.
ఇదీ చదవండి.. రామేశ్వరం కేఫ్ పేలుడు.. యువ టెకీని కాపాడిన అమ్మ ఫోన్‌కాల్
Comments
Please login to add a commentAdd a comment