kanker
-
Chattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఒక పోలీస్ కానిస్టేబుల్‌తో పాటు ఒక మావోయిస్టు మృతి చెందారు. జిల్లాలోని హిందూర్ అటవీ ప్రాంతంలోని చోటేబేటియా పోలస్ స్టేషన్ పరిధిలో కూంబింగ్ చేస్తుండగా పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో బస్తర్ ఫైటర్స్ యూనిట్‌కు చెందిన కానిస్టేబుల్ రమేష్ మృతి చెందాడు. సంఘటనా స్థలంలో ఒక మావోయిస్టు మృతదేహంతో పాటు ఏకే 47 తుపాకీని పోలీసులు కనుగొన్నారు. కూంబింగ్ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.కాగా, గత నెలలో బస్తర్ ప్రాంతంలోని సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లతో పాటు ఇద్దరు స్పెషల్ బెటాలియన్ కమాండోలు చనిపోయారు. ఇదీ చదవండి.. రామేశ్వరం కేఫ్ పేలుడు.. యువ టెకీని కాపాడిన అమ్మ ఫోన్‌కాల్ -
ఛత్తీస్‌గఢ్‌లో పేలిన మందు పాతర..నేలకొరిగిన బీఎస్ఎఫ్ జవాన్
కాంకేర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందు పాతర పేలి ఒక బీఎస్ఎఫ్ జవాను వీర మరణం పొందారు. పర్టాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సడక్టోలా గ్రామ సమీపంలో కూంబింగ్ జరుపుతుండగా గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ అఖిలేశ్ రాయ్(45) చనిపోయారని అధికారులు తెలిపారు. ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో గాలింపు ముమ్మరం చేశారు. -
అక్కడ మహిళల ఓట్లే అధికం.. లెక్కింపు బాధ్యతలూ వారికే!
ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లాలో నవంబర్ 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారిగా 81 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఈ ఎన్నికల పండుగలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని, అత్యధిక ఓటింగ్‌కు కారణంగా నిలిచారు. మహిళల ఉత్సాహాన్ని చూసిన ఎన్నికల అధికారులు ఈసారి ఓట్ల లెక్కింపును కూడా మహిళలకే అప్పగిస్తున్నారు. కంకేర్ జిల్లాలో జరిగే ఈ ఓట్ల లెక్కింపులో సూపర్వైజర్ నుంచి సర్వెంట్ వరకు అన్ని విధులను మహిళలే నిర్వర్తించనున్నారని అధికారులు తెలిపారు. డిసెంబరు 3న జరిగే ఓట్ల లెక్కింపునకు మొత్తం 196 మంది మహిళలను విధుల్లోకి తీసుకున్నారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3వ తేదీ ఉదయం ప్రారంభంకానుంది. ఈవీఎం లెక్కింపునకు 48 మంది మహిళా గెజిటెడ్ అధికారులు, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు 12 మంది.. మొత్తం 60 మంది మహిళా గెజిటెడ్ అధికారులను డ్యూటీ సూపర్వైజర్లుగా నియమించారు. కౌంటింగ్ అసిస్టెంట్లుగా 72 మంది మహిళా అసిస్టెంట్ టీచర్లు, క్లర్క్‌లను నియమించారు. దీంతో పాటు కౌంటింగ్ టేబుళ్ల వద్దకు ఈవీఎం యంత్రాలను తరలించేందుకు 62 మంది మహిళా సేవకులను విధుల్లోకి తీసుకున్నారు. ఫలితాలను ప్రకటించేందుకు ఇద్దరు మహిళా అధికారులకు అనౌన్సర్లుగా బాధ్యతలు అప్పగించారు. ఈ విధంగా మొత్తం 196 మంది మహిళా ఉద్యోగులు ఓట్ల లెక్కింపును పూర్తి చేయనున్నారు. కాంకేర్ కలెక్టర్ ప్రియాంక శుక్లా మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించేందుకు పలు ప్రయోగాలు చేశామన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లను దృష్టిలో ఉంచుకుని రెయిన్ బో పోలింగ్ బూత్ నిర్మించామని, ఇక్కడ మోహరించిన భద్రతా బలగాలు కూడా థర్డ్ జెండర్ వారేనని తెలిపారు. ఇది కూడా చదవండి: ట్రైన్ ఎక్కుతూ కాలు జారిన మహిళ.. కాపాడిన కానిస్టేబుల్! -
హాని చేయాలని చూస్తే బుద్ధి చెబుతాం
కాంకేర్(ఛత్తీస్‌గఢ్): భారత్‌కు ఎవరైనా హాని కలిగించాలని చూస్తే తగిన బుద్ధి చెబుతామని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పొరుగుదేశాన్ని హెచ్చరించారు. ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్ట్ ప్రభావిత కాంకేర్‌లో శనివారం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. తొమ్మిదేళ్లలో ప్రధాని మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను ఈ సందర్భంగా మంత్రి వివరించారు. పుల్వామా, ఉడి ఉగ్రదాడులకు ప్రతిగా 2016, 2019ల్లో చేపట్టిన సర్జికల్ స్ట్రైక్‌లను ఆయన ప్రస్తావించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం శక్తివంతంగా మారింది, ఇప్పుడు బలహీన దేశం ఎంతమాత్రం కాదని చెప్పారు. కేంద్రం చేపట్టిన చర్యలతో వామపక్ష తీవ్రవాద సంబంధ ఘటనలు ఇప్పుడు కేవలం 10–12 జిల్లాలకు మాత్రమే పరిమితం అయ్యాయన్నారు. -
గర్భిణీ భార్యను చూసేందుకు సెలవు పెట్టి వచ్చిన జవాన్.. నక్సల్స్ చేతిలో..
రాయ్‌పూర్: గర్భిణీ భార్యను చూసేందుకు సెలవులు పెట్టి ఇంటికి వచ్చిన ఓ జవాన్ మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఛత్తీస్‌గఢ్ కంకేర్ జిల్లా ఉసేలి గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది. జవాన్ మృతితో అతని భార్య, కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ జవాన్ వయసు 29 ఏళ్లు. గర్భిణీ భార్యను చూసేందుకు వారం రోజులు సెలవుపెట్టి స్వగ్రామం వచ్చాడు. షాపింగ్ చేసేందుకు శనివారం సాయంత్రం గ్రామంలోని మార్కెట్‌కు వెళ్లిన అతడిపై ఇద్దరు మావోయిస్టులు దాడి చేశారు. అతి దగ్గరకు వెళ్లి తుపాకీతో తలపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. జవాన్ సోదరుడితో పాటు గ్రామస్థులంతా చూస్తుండగానే ఈ హత్యకు పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. అయితే సాధారణంగా మవోయిస్టులు ఆర్మీ జవాన్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయరని ఓ విశ్రాంత అధికారి తెలిపారు. సీఆర్పీఎఫ్ లేదా ఇతర సెక్యూరిటీ సంస్థలకు చెందిన జవాన్లపై మాత్రం తరచూ దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఆర్మీ జవాన్‌ను ఇలా హత్య చేయడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. సీఆర్పీఎఫ్ జవాన్ అనుకునే ఇతడిపై దాడి చేసి ఉంటారని పేర్కొన్నారు. కాగా.. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు జవాన్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల ఘటనల్లో గత వారంలోనే ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. చదవండి: బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి.. మూడు గంటల్లోనే సురక్షితంగా బయటకు.. -
లంచ్ బాక్స్‌లో ఐదు కేజీల బాంబు
కాంకేర్: ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత కాంకేర్ జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది. మావోయిస్టులు అమర్చిన భారీ మందుపాతరను పోలీసులు గుర్తించి నిర్వీర్యం చేశారు. అమబేడ-ధనోరా గ్రామాల మధ్యనున్న రహదారిలోని వంతెన కింద లంచ్‌బాక్స్‌లో అమర్చిన బాంబును సోమవారం ఉదయం పోలీసులు, పారా మిలటరీ బలగాలు గుర్తించాయి. ఈ బాంబును బాంబ్ డిస్పోజల్ బృందాలు నిర్వీర్యం చేశాయి. అయిదు కిలోల బరువున్న ఈ బాంబు పేలితే భద్రతా దళాలకు భారీ నష్టం వాటిల్లి ఉండేదని కాంకేర్ సబ్ డివిజినల్ పోలీస్ అధికారి రాజ్‌కుమార్ తెలిపారు. -
మావోయిస్టుల కాల్పుల్లో ఇద్దరు జవాన్ల మృతి
రాయ్ పూర్: ఛత్తీస్ గఢ్ అడవుల్లో మావోయిస్టుల వేట కొనసాగిస్తున్న భద్రతా బలగాలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంకేర్ జిల్లాలో శనివారం ఉదయం చోటుచేసుకున్న ఎన్ కౌంటర్ లో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న జవాన్లపై మావోయిస్టులు మాటువేసి కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. శుక్రవారం కూడా మావోయిస్టులు ఇదే రీతిలో భద్రతా బలగాలపై మెరుపుదాడి చేయడంతో 12 మంది జవాన్లు గాయపడ్డారు. మార్చి 4న సుక్మా జిల్లాలో చోటుచేసుకున్న ఎన్ కౌంటర్ లో ఇద్దరు జవాన్లు చనిపోయారు. మావోయిస్టుల కాల్పుల్లో జవాన్లు గాయపడటం సాధారణమే అయినా రోజుల వ్యవధిలో ఇలాంటి సంఘటనలు జరుగుతుండటం గమనార్హం. -
మరోసారి పంజా విసిరిన మావోయిస్టులు
-
మరోసారి పంజా విసిరిన మావోయిస్టులు
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరో విధ్వంసానికి పాల్పడ్డారు. సుక్మా జిల్లాలో ఏడుగురు ఎస్టీఎఫ్ జవాన్లను హతమార్చి 24 నాలుగు గంటలలోపే కాంకేర్ జిల్లాలోని ఓ ఐరన్ ఓర్ మైనింగ్ కంపెనీపై దాడిచేసి 17 వాహనాలను తగలబెట్టారు. కోరాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్దాస్పూర్ ఐరన్ ఓర్ మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి వచ్చిన సాయుధ నక్సలైట్లు.. కూలీలను వెళ్లగొట్టి మైనింగ్ యంత్రాలు, జేసీబీలు, జీపులు ఇతరత్రా మొత్తం 17 వాహనాలకు నిప్పుపెట్టారని కాంకేర్ ఎస్పీ జితేంద్రసింగ్ మీనా తెలిపారు. ఘటన అనంతరం మావోయిస్టులు అడవిలోకి పారిపోయారని, వారికోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టామని ఎస్సీ చెప్పారు. కాగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. -
స్వలింగ సంపర్క యువతి ఆత్మహత్య
ఛత్తీస్ గఢ్ లో స్వలింగ సంపర్కులకు సంకటం ఎదురవుతోంది. గత రెండు నెలల్లో ముగ్గురు స్వలింగ సంపర్కులు ఒత్తిడులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా కాంకేర్ జిల్లా లోని పాక్నజుర్ లో ఒక 22 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆ స్వలింగ సంపర్క భాగస్వామిగా ఉన్న మైనర్ బాలిక కూడా ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. యువతికి కొద్ది నెలల క్రితం మైనర్ బాలికతో సంబంధం ఏర్పడింది. వారిద్దరూ కలసి జీవించడం ప్రారంభించారు. ఇటీవల ఆ యువతి మైనర్ బాలికను తన ఇంట్లోకి నేరుగా తీసుకురావడంతో సమస్య మొదలైంది. ఇరు పక్షాల తల్లిదండ్రులు దీన్ని గట్టిగా వ్యతిరేకించారు. మైనర్ బాలిక తల్లిదండ్రులు పోలీసుల సాయంతో తమ కూతురిని వెంట తీసుకుని వెళ్లారు. దీంతో యువతి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంగతి తెలిసిన మైనర్ బాలిక విషం తాగింది. ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.