
కాంకేర్(ఛత్తీస్‌గఢ్): భారత్‌కు ఎవరైనా హాని కలిగించాలని చూస్తే తగిన బుద్ధి చెబుతామని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పొరుగుదేశాన్ని హెచ్చరించారు. ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్ట్ ప్రభావిత కాంకేర్‌లో శనివారం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. తొమ్మిదేళ్లలో ప్రధాని మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను ఈ సందర్భంగా మంత్రి వివరించారు.
పుల్వామా, ఉడి ఉగ్రదాడులకు ప్రతిగా 2016, 2019ల్లో చేపట్టిన సర్జికల్ స్ట్రైక్‌లను ఆయన ప్రస్తావించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం శక్తివంతంగా మారింది, ఇప్పుడు బలహీన దేశం ఎంతమాత్రం కాదని చెప్పారు. కేంద్రం చేపట్టిన చర్యలతో వామపక్ష తీవ్రవాద సంబంధ ఘటనలు ఇప్పుడు కేవలం 10–12 జిల్లాలకు మాత్రమే పరిమితం అయ్యాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment