Harm
-
అమెరికన్లకు హాని చేయాలనుకుంటే అంతు చూస్తాం
వాషింగ్టన్: అమెరికన్లకు హాని చేయాలనుకునేవారి అంతు చూస్తామని, వారు భూమ్మీద ఏ మూల దాక్కున్నా వదలబోమని ఎఫ్‌బీఐ నూతన డైరెక్టర్ కశ్యప్ పటేల్ (కాశ్ పటేల్) హెచ్చరించారు. అమెరికా ప్రజలు గర్వించదగ్గ సంస్థగా ఎఫ్‌బీఐని పునర్నిర్మిస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిరకాల మిత్రుడైన కాశ్ పటేల్‌ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా సెనేట్ గురువారం ధ్రువీకరించింది. అనంతరం పటేల్... అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అటార్నీ జనరల్ పామ్ బోండీకి కృతజ్ఞతలు తెలిపారు. ఏజెన్సీని పారదర్శకంగా, జవాబుదారీగా, న్యాయానికి కట్టుబడినదిగా పునర్నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ‘‘ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తొమ్మిదో డైరెక్టర్‌గా నన్ను ధ్రువీకరించడం గౌరవంగా భావిస్తున్నా. అచంచల విశ్వాసం, మద్దతు ఇచ్చిన అధ్యక్షుడు ట్రంప్, అటార్నీ జనరల్ బోండీకి ధన్యవాదాలు. ‘జీ–మెన్’ నుంచి 9/11 దాడుల నేపథ్యంలో దేశాన్ని కాపాడటం వరకు ఎఫ్‌బీఐకి ఘనమైన వారసత్వం ఉంది. పారదర్శకంగా, జవాబుదారీతనంతో, న్యా యానికి కట్టుబడి ఉండే ఎఫ్‌బీఐకి అమెరికా ప్రజలు అర్హులు. రాజకీయ జోక్యంతో న్యాయ వ్యవస్థ ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది. ఈ రోజుతో అది ముగుస్తుంది’’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బాలీవుడ్ స్టైల్లో స్వాగతం.. ఎఫ్‌బీఐ కొత్త డైరెక్టర్‌గా కశ్యప్ పటేల్‌ను శ్వేతసౌధం స్వాగతించింది. వైట్‌హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ స్కావినో కాశ్‌కు బాలీవుడ్స్టైల్లో స్వాగతం పలికారు. నటుడు రణ్వీర్ సింగ్ నటించిన ‘బాజీరావ్ మస్తానీ’ చిత్రంలోని ‘మల్హరి’ పాటను ఎడిట్ చేసి.. రణవీర్ స్థానంలో పటేల్ ముఖాన్ని ఉంచిన వీడియోను షేర్ చేశారు. ‘‘ఎఫ్‌బీఐ కొత్త డైరెక్టర్ కాశ్ పటేల్‌కు అభినందనలు’’ అని స్కావినో ట్వీట్ చేశారు. 47 సెకన్ల నిడివి ఉన్న ఈ క్లిప్‌ను వెంటనే 30 లక్షల మందికి పైగా చూశారు. డెమొక్రాట్ల నుంచి వ్యతిరేకత.. పటేల్ నామినేషన్ రాజకీయంగా చర్చనీయాంశం కావడంతో ఆమోదానికి వారం రోజులు ఆలస్యమైంది. ఈ పదవికి ఆయన అనర్హుడంటూ డెమొక్రాట్లు ఆందోళన వ్యక్తం చేశారు. కుట్ర సిద్ధాంతాలతో ఆయన అనుబంధం, రాజకీయ శత్రువులపై ప్రతీకారం తీర్చుకుంటామంటూ గతంలో ఆయన ప్రకటనలు చేశారని, ట్రంప్ ఎఫ్‌బీఐ ప్రతీకార ప్రణాళికల సమాచారాన్ని దాచిపెట్టారని, పటేల్‌ను ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియమిస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని డెమొక్రాట్ సెనేటర్లు ఆరోపించారు. పటేల్ అమెరికన్ల ప్రయోజనాల పరిరక్షణకు కాకుండా.. ట్రంప్ ప్రయోజనాల కోసం పని చేస్తా రని మండిపడ్డారు. అయితే సెనేట్‌లో రిప బ్లికన్లకు మెజారిటీ ఉండటం తెలిసిందే. అలాస్కాకు చెందిన రిపబ్లికన్ సెనేటర్లు లీసా ముర్కోవ్స్కీ, మైనేకు చెందిన సుసాన్ కొలిన్స్ నుంచి వ్యతిరేకత ఎదురైంది. అయితే.. గతంలో ఇతర ట్రంప్ నామినీలను వ్యతి రేకించిన సెనేట్ మైనారిటీ నాయకుడు మిచ్ మెక్కా నెల్తో సహా మిగిలిన రిపబ్లికన్ పార్టీ మొత్తం పటేల్‌కు మద్దతు లభించింది. దీంతో.. సెనేట్ డెమొ క్రాట్లందరూ కాశ్‌కు వ్యతిరేకంగా ఓటు వేసి నా.. 51–49 ఓట్ల స్వల్ప తేడాతో ఆయన నామినేషన్ ఆమోదం పొందింది. భారతీయ నేపథ్యం.. కాశ్ పటేల్ తల్లిదండ్రులు గుజరాతీలు. యూఎస్‌లో స్థిరపడ్డారు. 1980లో న్యూయార్క్‌లో జన్మించిన పటేల్.. తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. లాంగ్ ఐలాండ్‌లోని గార్డెన్ సిటీ హైస్కూల్ నుంచి పట్టభద్రుడయ్యారు. రిచ్మండ్ విశ్వ విద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యను పూర్తి చేశారు. యూకేలోని యూనివర్సిటీ కాలేజ్ లండన్ ఫ్యాకల్టీ ఆఫ్ లాస్ నుంచి న్యాయ శాస్త్రంలో డిగ్రీ అందుకున్నారు. అంతర్జాతీయ చట్టంలో సర్టిఫికెట్ కోసం న్యూ యార్క్‌కు తిరిగి వచ్చారు. ఆ తరువాత జాతీయ భద్రతా సలహాదారుగా, హౌస్ పర్మనెంట్ సెలెక్ట్ కమిటీ ఆన్ ఇంటెలిజెన్స్ (హెచ్పీఎస్సీఐ)కి సీనియర్ కౌన్సెల్‌గా పనిచేశారు. -
హాని చేయాలని చూస్తే బుద్ధి చెబుతాం
కాంకేర్(ఛత్తీస్‌గఢ్): భారత్‌కు ఎవరైనా హాని కలిగించాలని చూస్తే తగిన బుద్ధి చెబుతామని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పొరుగుదేశాన్ని హెచ్చరించారు. ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్ట్ ప్రభావిత కాంకేర్‌లో శనివారం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. తొమ్మిదేళ్లలో ప్రధాని మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను ఈ సందర్భంగా మంత్రి వివరించారు. పుల్వామా, ఉడి ఉగ్రదాడులకు ప్రతిగా 2016, 2019ల్లో చేపట్టిన సర్జికల్ స్ట్రైక్‌లను ఆయన ప్రస్తావించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం శక్తివంతంగా మారింది, ఇప్పుడు బలహీన దేశం ఎంతమాత్రం కాదని చెప్పారు. కేంద్రం చేపట్టిన చర్యలతో వామపక్ష తీవ్రవాద సంబంధ ఘటనలు ఇప్పుడు కేవలం 10–12 జిల్లాలకు మాత్రమే పరిమితం అయ్యాయన్నారు. -
గూగుల్ విధానాలు .. భారత ఎకానమీకి హానికరం
న్యూఢిల్లీ: దేశీ పోటీదారులను అణగదొక్కేలా టెక్ దిగ్గజం గూగుల్ పాటిస్తున్న పోటీ వ్యతిరేక విధానా లు భారత వినియోగదారులు, ఆర్థిక వ్యవస్థకు హాని చేస్తున్నాయని మ్యాప్‌మైఇండియా సీఈవో, ఈడీ రోహన్ వర్మ వ్యాఖ్యానించారు. ‘గూగుల్ పోటీ వ్యతిరేక విధానాల ద్వారా కొత్త మార్కెట్లలో గుత్తాధిపత్యాన్ని చలాయిస్తుందని, తయారీ సంస్థలు.. యూజర్లలో ప్రత్యామ్నాయ ఆపరేటింగ్ సిస్ట మ్స్, యాప్ స్టోర్స్, యాప్స్ విస్తరణను అసాధ్యం చేస్తుందని పరిశ్రమ, ప్రభుత్వం, నియంత్రణ సంస్థలకు.. ఈ వ్యవహారాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేసిన వారందరికీ తెలుసు. గూగుల్ పోటీ వ్యతిరేక విధానాలనేవి మ్యాప్‌మైఇండియా వంటి స్వదేశీ పోటీ సంస్థలను గొంతు నొక్కడం ద్వారా భారతీ య వినియోగదారులు, ఎకానమీకి చేటు చేస్తాయి‘ అని వర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్‌లకు సంబంధించి గుత్తాధిపత్యం చలాయిస్తోందంటూ సీసీఐ రూ. 1,338 కో ట్ల జరిమానా విధించడాన్ని సవాలు చేస్తూ, ఎన్సీఎల్ఏటీని గూగుల్ ఆశ్రయించిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ), ప్రభుత్వం, పార్లమెంటు తీసుకుంటున్న అద్భుతమైన చర్యలు అమలు కాకుండా నిరోధించేందుకు, తనకు అనుకూలంగా వ్యవహరించేలా అందర్నీ ప్రభావితం చేసేందుకు, ఒత్తిడి తెచ్చేందుకు గూగుల్ ప్రయత్నాలు మొదలుపెట్టిందని వర్మ చెప్పారు. 2020లో కోవిడ్ విజృంభించినప్పుడు మ్యాప్‌మైఇండియా యాప్ కోవిడ్ కంటైన్మెంట్ జోన్లు, టెస్టింగ్.. ట్రీట్మెంట్ సెంటర్లు మొదలైన వివరాలన్నీ అందించేదని, గూగుల్ మ్యాప్స్‌లో ఇవేవీ ఉండేవి కావని వర్మ చెప్పారు. అలాంటి తమ యాప్‌ను గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి తొలగించిందని, అనేకానేక ఉత్తరప్రత్యుత్తరాల తర్వాత గానీ పునరుద్ధరించలేదని వివరించారు. మరోవైపు, సీసీఐ ఆదేశాలతో భారతీయ యూజర్లు, వ్యాపారవర్గాలకు విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతోనే తాము ఎన్సీఎల్ఏటీలో అప్పీలు చేసినట్లు గూగుల్ ప్రతినిధి తెలిపారు. -
అందుకే భారత్‌లో టీబీ ఇంతలా..
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధికంగా క్షయ(ట్యుబరిక్యులోసిస్) వ్యాధి ప్రభావానికి లోనవుతున్న దేశం మనదే. ఇది ముఖ్యంగా ఊపిరితిత్తులపై దాడి చేసే బ్యాక్టీరియా కారక అంటువ్యాధి. భారత్‌లో ఈ వ్యాధి ఇంతలా ప్రభావం చూపడానికి కారణం ఇక్కడ అవలంభిస్తున్న ఔషధ విధానాలే అని కెనడాలోని మెక్‌గిల్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన తాజా పరిశీలనలో తేలింది. ప్రపంచంలో అత్యధికంగా యాంటీ బయాటిక్స్ వినియోగిస్తున్న దేశం ఇండియానే. అయితే.. ఈ యాంటీ బయాటిక్స్ మితిమీరిన వాడకం మూలంగానే భారత్‌లో క్షయ వ్యాధి మందులకు లొంగకుండా తయారవుతుందని పరిశోధనకు నేతృత్వం వహించిన మధుకర్ పాయ్ వెల్లడించారు. ఇక్కడి ఫార్మసిస్టులు క్షయ వ్యాధి లక్షణాలు గల వారికి ఎలాంటి ఔషధాలు ఇస్తున్నారు అనే అంశంలో నిర్వహించిన పరిశీలనలో నివ్వెరపరిచే విషయాలు వెల్లడయ్యాయి. పూర్తిగా క్షయ వ్యాధి లక్షణాలతో ఉన్నవారికి ఫార్మిసిస్టులు సాధారణ యాంటీ బయాటిక్స్ ఇస్తున్నారని పరిశోధకులు గుర్తించారు. సరిగ్గా క్షయ వ్యాధి నిర్మూలనకు ఉపయోగపడే ఫస్ట్‌లైన్ యాంటీ టీబీ డ్రగ్స్(ఐసోనియాజిడ్, రిఫాంపిసిన్, ఇథాంబుటాల్, స్ట్రెప్టోమైసిన్)ను ఫార్మసిస్టులు ఇవ్వడంలేదని గుర్తించారు. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడుతున్న యాంటీ బయాటిక్స్ మూలంగా రోగులకు తీవ్ర హాని కలగడంతో పాటు.. భవిష్యత్తులో టీబీ మందులకు లొంగకుండా తయారవుతోందని పరిశోధకులు వెల్లడించారు. -
కొవ్వాడతో కాకినాడకు తీరని నష్టం
విశాఖపట్నం: ప్రపంచ దేశాలు అణువిద్యుత్ ను తగ్గించుకోవాలని చూస్తుంటే భారత పాలకులు మాత్రం ఆ విద్యుత్ ను పెంచుకోవాలని చూస్తున్నాయని సీపీఎం నేత ప్రకాశ్ కారత్ అన్నారు. కొవ్వాడ అణువిద్యుత్ ప్లాంటుతో తీరని నష్టం జరుగుతుందని ఆయన చెప్పారు. ఆదివారం ఆంధ్రా యూనివర్సిటీలో కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంటుకు వ్యతిరేకంగా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రకాశ్ కరత్ మాట్లాడుతూ కొవ్వాడ అణువిద్యుత్ ప్లాంటుతో కాకినాడ నుంచి ఒడిశా వరకు పర్యావరణం దెబ్బతింటుందని చెప్పారు. -
తెలుగు వర్సిటీకి చేటు.. జనం సహించరు
ఆల్కాట్‌తోట (రాజమండ్రి): తెలు గు విశ్వవిద్యాలయం దివంగత ఎన్టీఆర్ మానసపుత్రిక అని, తెలుగుజాతి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రాణాలర్పించిన పొట్టిశ్రీరాములు పేరు మీద పెట్టిన సంస్థ అని, దానికి అపకారం చేస్తే ప్రజలు సహించరని రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక ఆనం రోటరీ హాల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలుగు వర్సిటీని అస్థిర పరిచి ఉద్యోగులను, విద్యార్థులను రోడ్డున పడేశారన్నారు.వర్సిటీ పరిరక్షణకే రాజమండ్రిలో గురువారం చైతన్యదీక్ష చేపడుతున్నామని చెప్పారు. -
తెలుగు పద్యం
క్షమ కవచంబు, క్రోధ మది శత్రువు, జ్ఞాతి హుతాశనుండు, మి త్రము దగు మందు, దుర్జనులు దారుణ పన్నగముల్, సువిద్య వి త్తముచిత లజ్జ భూషణ ముదాత్త కవిత్వము రాజ్య మీ క్షమా ప్రముఖ పదార్థముల్ గలుగుపట్టున దత్కవచాదులేటికిన్. భావం: ఓర్పు ఉంటే కవచం అక్కర్లేదు. క్రోధం ఉంటే హాని కలిగించడానికి వేరే శత్రువుతో పని లేదు. దాయాది ఉంటే వేరే నిప్పు అవసరం లేదు. స్నేహితుడు ఉంటే ఔషధం అక్కరలేదు. దుష్టులు ఉంటే భయంకరమైన సర్పాలే అక్కర్లేదు. ఉదాత్తమైన కవిత్వం ఉంటే రాజ్యంతో పని లేదు. చక్కని విద్య ఉంటే సంపదతో ప్రయోజనం లేదు. తగురీతిని సిగ్గు ఉంటే వేరే అలంకారం అక్కర్లేదు. ఈ ఓర్పు మొదలైన లక్షణాలన్నీ చెంతనే ఉన్న పక్షంలో కవచం మొదలైన వాటి అవసరం లేదు.