తెలుగు విశ్వవిద్యాలయం దివంగత ఎన్టీఆర్ మానసపుత్రిక అని, తెలుగుజాతి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రాణాలర్పించిన పొట్టిశ్రీరాములు పేరు మీద పెట్టిన సంస్థ అని, దానికి అపకారం చేస్తే ప్రజలు సహించరని రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు.
ఆల్కాట్‌తోట (రాజమండ్రి): తెలు గు విశ్వవిద్యాలయం దివంగత ఎన్టీఆర్ మానసపుత్రిక అని, తెలుగుజాతి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రాణాలర్పించిన పొట్టిశ్రీరాములు పేరు మీద పెట్టిన సంస్థ అని, దానికి అపకారం చేస్తే ప్రజలు సహించరని రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు.
బుధవారం సాయంత్రం స్థానిక ఆనం రోటరీ హాల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలుగు వర్సిటీని అస్థిర పరిచి ఉద్యోగులను, విద్యార్థులను రోడ్డున పడేశారన్నారు.వర్సిటీ పరిరక్షణకే రాజమండ్రిలో గురువారం చైతన్యదీక్ష చేపడుతున్నామని చెప్పారు.