నిండా ముంచేశాడు..! | person cheats to people in kodad | Sakshi
Sakshi News home page

నిండా ముంచేశాడు..!

Published Sun, Feb 18 2018 11:15 AM | Last Updated on Tue, Aug 21 2018 6:02 PM

person cheats to people in kodad - Sakshi

నిందితుడు గోపాల కృష్ణ

తొలుత అతనో కానిస్టేబుల్‌.. ఆపై మరొకరితో పరీక్ష రాయించి ఎస్‌ఐ ఉద్యోగం సంపాదించాడు.. ఆ మోసం బయటపడడంతో సస్పెన్షన్‌కు గురయ్యాడు.. అనంతరం కొందరి సహకారంతో అధిక వడ్డీ ఆశచూపి వసూళ్ల పర్వానికి తెరలేపాడు.. మొదట నమ్మకంగా వ్యవహరించి ఆపై అందినకాడికి దోచుకున్నాడు.. ఇదీ.. ఐపీ దాఖలు చేసిన నకిలీ ఎస్‌ఐ ఘరానా మోసం. 

చిలుకూరు (కోదాడ): చిలుకూరు మండలం పాత కొండాపురం గ్రామానికి చెందిన శ్రీరాం చిన గోపాల కృష్ణ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకుంటు వడ్డీ వ్యాపారం చేస్తాడు. ఇతను తొలుత కానిస్టేబుల్‌. 2009లో ఎస్‌ఐ ఉద్యోగం వచ్చింది. అ తరువాత పైలటింగ్‌లో ఎస్‌ఐ ఉద్యోగం సాధించినట్లుగా ఆధారాలు లభ్యకావడంతో అతన్ని 2013 ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో సాగుతోంది.కాగా అనాటి నుంచి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయడంతోపాటు వడ్డీలకు డబ్బులు తీసుకుని అధిక వడ్డీలు ఇస్తామని ఆయన బంధువులను, స్నేహితులను పూర్తిగా నమ్మిం చాడు. 

ప్రారంభంలో డబ్బులు తీసుకుని సక్రమంగా ఇవ్వడంతో అతనిపై పూర్తి స్థాయిలో నమ్మకం కలిగింది. దీనిని ఆసరగా చేసుకుని చిలుకూరు మండలంలోని పాత, కొత్త కొండాపురం గ్రామాలు, రామాపురం, పోలేనిగూడెం, బేతవోలు, హుజూర్‌నగర్‌ గ్రామాల పరిధిలో, హైదరాబాద్‌లో తన బంధువుల వద్ద నుంచి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం, లిక్కర్‌ బిజినెస్, ఇళ్లు కట్టించి అమ్మడం లాంటి బిజినెస్‌లు చేస్తున్నారని నిమ్మించి వారి వద్ద నుంచి అధిక వడ్డీలకు డబ్బులు తీసుకున్నాడు. 

రూ. 7.50 కోట్లుకు ఐపీ దాఖలు
డబ్బులు తీసుకొన్న వారు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో అతని 43 మందికి రూ.7.50 కోట్లుకు ఐపీ దాఖలు చేశాడు. దీంతో  తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు 43 మంది రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు.   

ఆరుగురి అరెస్ట్‌
బాధితుల ఫిర్యాదు మేరకు ఖాకీలు దర్యాప్తు ముమ్మరం చేశారు. సూత్రధారి శ్రీరాం చిన  గోపాల్‌కృష్ణతో సహా అతడికి సహకిరం అందించిన  చిలుకూరు మండలం కొండా పురం గ్రామానికి చెందిన  పిల్లుట్ల వెంకటి, నారా యణపురం గ్రామానికి చెందిన తిప్పన నరసింహారావు, కీతవారిగూడెం గ్రామానికి  చెందిన కీత వెంకటరమణ, పెన్‌పహాడ్‌ మండలానికి  చెందిన యర్రంశెట్టి సతీష్, నూనవత్‌ అశోక్‌లను పోలీసులు అరెస్టు చేశారు. మరో 11 మంది పరారీలో ఉన్నట్లు తెలిసింది. వీరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.  

తన్వీ క్రియేషన్స్‌ పేరుతో..
తన్వీ క్రియేషన్స్‌  పేరుతో మల్‌క్‌పేట, హైదరాబాద్‌లో ఒక కార్యలయంలో ప్రారంబించా డు. ఈ పేరుతో ఉద్యగాలు ఇప్పిస్తామని, డబ్బులు పెట్టుబడులు పెడితే రిటన్స్‌ మంచి లాభాలు ఉన్నాయని నమ్మించాడు. ప్రారంభంలో డబ్బులు ఇచ్చిన వారికి లాభాలు అధిక మొత్తంలో ఇచ్చాడు. దీంతో అతనిపై నమ్మకం పెరిగింది. దీనిని ఆసరాగా చేసుకొని ఆయా గ్రామాల వారి బంధువులు, స్నేహితుల వద్ద నుంచి రూ.50 కోట్ల వరకు వడ్డీకి డబ్బులు తీసుకొన్నట్లుగా తెలసింది. వీరిలో సుమారుగా ఆయా గ్రామాల్లో 150 నుంచి 200 మంది వరకు బాధితులు ఉన్నట్లుగా తెలిసింది.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement