జమ్మూ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో ప్రపంచ వేదికపై భారత్ పలుకుబడి, స్థాయి పెరిగిపోయాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. భారత్ చెప్పే విషయాలను ప్రపంచ సమాజం ఇప్పుడు ఆసక్తిగా వింటోందని చెప్పారు. గతంలో అంతర్జాతీయ వేదికలపై భారత్ ఏ విషయమైనా చెబితే, అంత సీరియస్‌గా తీసుకునేవారు కారని తెలిపారు. మోదీ ప్రభుత్వం వచ్చాక 2014 తర్వాత అలాంటి పరిస్థితులు లేవని చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్ జమ్మూలో జాతీయ భద్రతపై జరిగిన సదస్సులో సోమవారం ఆయన మాట్లాడారు.
ప్రధాని మోదీ అమెరికా, ఈజిప్టుల్లో ఆరు రోజుల పర్యటన సందర్భంగా పలు చారిత్రక ఒప్పందాలపై సంతకాలు చేసిన నేపథ్యంలో రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో ప్రధాని మోదీ పలుకుబడి పెరిగిందని చెప్పారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ ‘బాస్’అంటూ మోదీని అభివరి్ణంచగా, అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆటోగ్రాఫ్ తీసుకునేంత ప్రజాదరణ కలిగిన నేతగా కొనియాడిన నేపథ్యంలో మంత్రి ఈ మాటలన్నారు.
ప్రధాని మోదీ హయాంలో భారత్ మరింత శక్తివంతంగా మారిందన్న ఆయన..అవసరమైన పక్షంలో సరిహద్దుల వెలుపల కూడా దాడి చేయగలదంటూ పొరుగుదేశం పాకిస్తాన్‌ను హెచ్చరించారు. ఉగ్రవాదంపై మోదీ ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకుందని చెప్పారు. ఉగ్రవాదంపై ‘జీరో టాలరెన్స్’విధానం అంటే అర్థం ఏమిటో దేశంతోపాటు ప్రపంచమే తెలుసుకుందని వ్యాఖ్యానించారు. 2016, 2019ల్లో జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌ను ఆయన ప్రస్తావిస్తూ..ఇందుకు సంబంధించిన నిర్ణయాలను ప్రధాని మోదీ కేవలం 10 నిమిషాల్లోనే తీసుకున్నారని, దీన్ని బట్టి ఆయన సామర్థ్యమేంటో తెలుస్తుందని రాజ్‌నాథ్ తెలిపారు.
సరిహద్దుల లోపలే కాదు, వెలుపల కూడా ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ను మన బలగాలు ధ్వంసం చేశాయన్నారు. ఉగ్రవాదాన్ని పెంచిపోíÙంచడమే ప్రభుత్వ విధానంగా మార్చుకున్న దేశాలు ఈ ఆటను ఎక్కువ సేపు ఆడలేవన్న విషయాన్ని గ్రహించాలని ఆయన పాక్‌నుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. భారత్ కృషితో నేడు చాలా వరకు పెద్ద దేశాలు ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడుతున్నాయని చెప్పారు. కశీ్మర్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం ద్వారా ఏమీ సాధించలేమన్న విషయం పాక్ తెలుసుకోవాలన్నారు. పాక్ ముందుగా తన సొంతింటిని చక్కదిద్దుకోవాలని హితవుపలికారు. పాక్ ఆక్రమిత కశీ్మర్ కూడా భారత్‌దేనని చెప్పారు. దీనిపై పార్లమెంట్ ఇప్పటికే పలు తీర్మానాలు చేసిందని గుర్తు చేశారు. జమ్మూకశీ్మర్‌లో తామూ భాగమేనంటూ పీవోకే ప్రజలు డిమాండ్ చేసే రోజులు ఎంతో దూరంలో లేవని రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment