National Security Council
-
హిజాబ్ చట్టానికి బ్రేక్
ఇరాన్లో అత్యంత వివాదాస్పదమైన ‘హిజాబ్–పవిత్రత చట్టం’అమలుకు దేశ జాతీయ భద్రతా మండలి బ్రేకులు వేసింది. ఇరాన్ తీరు పట్ల ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ చట్టం అస్పష్టంగా ఉందని, దాన్ని సంస్కరించాల్సిన అవసరముందని అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అన్నారు. హిజాబ్ ధరించని మహిళలకు జరిమానాలతో పాటు 15 ఏళ్ల దాకా జైలు శిక్షకు చట్టం ప్రతిపాదించింది. పలు కఠినమైన శిక్షలు సూచించింది. హిజాబ్ విషయమై ఇరాన్లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై పెజెష్కియాన్ గతంలోనూ అసహ నం వ్యక్తం చేశారు. ‘‘హిజాబ్‌ను బలవంతంగా తొలగించలేకపోయాం. దాన్ని ధరించాల్సిందేనంటూ మహిళల హక్కులను కాలరాసే అధికారం మాకు లేదు’’అని ఇటీవలి అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆయన పదేపదే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల హామీని అమలు చేశారని భావిస్తున్నారు. మహిళా, కుటుంబ వ్యవహారాల మాజీ ఉపాధ్యక్షుడు మసౌమే ఎబ్టేకర్ కూడా ఈ చట్టాన్ని విమర్శించారు. ఈ చట్టాన్ని అమలు చేయడమంటే ఇరాన్లో సగం మందిపై అభియోగం మోపడమేనన్నారు. నిత్య వివాదం: హిజాబ్ వివాదం ఈనాటిది కాదు. మహిళలపై అణచివేతకు చిహ్నంగా ఉన్న హిజాబ్‌ను కొత్త తరం ధిక్కరిస్తూనే ఉంది. హిజాబ్ ధరించలేదని, వస్త్రధారణ అనుచితంగా ఉందని 2022లో మహసా అమీనీ అనే 22 ఏళ్ల కుర్దిష్ మహిళను ఇరాన్ నైతిక పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలో కోమాలోకి వెళ్లిన ఆమె తర్వాత ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు. ఆమె డాక్టర్ కావాలని కలలు కన్నారు. యూనివర్సిటీకి వెళ్లే ముందు వారం పాటు తల్లిదండ్రులతో ఉందామని వచ్చి ప్రాణాలొదిలారు. అమీనీ మరణంపై ఇరాన్‌వ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. మహిళలే గాక పురుషులు కూడా వాటిలో పాల్గొన్నారు. పోలీసుల చిత్రహింసలే ఆమెను పొట్టన పెట్టుకున్నాయంటూ దుయ్యబట్టారు. బలూచ్, అజెరిస్, అరబ్బులు కూడా కుర్దులతో కలిసి రోడ్డెక్కారు. సున్నీలు, షియాలని తేడా లేకుండా నిరసనల్లో పాల్గొన్నారు. వేలాది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వాన్ని ధిక్కరించిన, నిరసనల్లో పాల్గొన్న వారిలో 500 మంది మరణించారు. 120 మంది కంటి చూపు కోల్పోయారు. ఏడాదికి అలజడి తగ్గుముఖం పట్టాక దుస్తుల కోడ్ ఉల్లంఘించిన వారికి ప్రభుత్వం కఠిన శిక్షలు ప్రకటించింది. గాయని అరెస్టుతో: హిజాబ్ ధరించకుండా పాట పాడి, యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన ఇరాన్ గాయని పరస్తూ అహ్మదీ (27)ని అధికారులు తాజాగా అరెస్ట్ చేశారు. భుజాలు కనిపించేలా స్లీవ్‌లెస్ డ్రెస్‌లో నలుగురు పురుష కళాకారుల మధ్య పాడిన ఆ వీడియో అందరినీ ఆకర్షించింది. ఆమెతో పాటు అందులో ఉన్నవారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో మళ్లీ నిరసనలు మొదలయ్యాయి. 300 మందికి పైగా ఇరాన్ హక్కుల కార్యకర్తలు, రచయితలు, జర్నలిస్టులు కొత్త హిజాబ్ చట్టాన్ని బహిరంగంగా ఖండించారు. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో అహ్మదీని మర్నాడే విడుదల చేశారు. నిరసనలు పెరిగి రెండేళ్ల నాటి పరిస్థితి పునరావృతమయ్యేలా ఉండటంతో హిజాబ్ చట్టం అమలును తాత్కాలికంగా నిలిపేస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రూడో ఆరోపణలు తీవ్రమైనవే: అమెరికా
న్యూయార్క్: ఖలిస్తానీ ఉగ్రవాది హత్యోదంతంలో భారతీయ నిఘా వర్గాల పాత్రపై అమెరికా జాతీయ భద్రతా మండలి ఉన్నతాధికారి స్పందించారు. ‘ కెనడా పౌరుడైన నిజ్జర్ హత్యతో భారతీయ నిఘా వర్గాలకు సంబంధం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేస్తున్న ఆరోపణలు నిజంగా తీవ్రమైనవి. ఈ వివాదం ముగిసిపోవాలంటే సమగ్ర, విస్తృతస్థాయి దర్యాప్తు అవససరం. కెనడా ఇప్పుడు అదే పనిలో ఉంది. ఇందుకు భారత్ సైతం పూర్తి సహాయ సహకారాలు అందించాలని మేం కూడా కోరుకుంటున్నాం’ అని అమెరికా జాతీయ భద్రతా మండలి సమన్వయ కర్త(వ్యూహాత్మక సంబంధాలు) జాన్ కిర్బీ సీఎన్ఎన్ వార్తాసంస్థ ముఖాముఖిలో వ్యాఖ్యానించారు. -
నేడు అమిత్ షా సమక్షంలో.. 1.44 లక్షల కిలోల డ్రగ్స్ ధ్వంసం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విధ్వంసానికి కేంద్రం రంగం సిద్ధం చేసింది. సోమవారం ఢిల్లీలో హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలో నిర్వహించనున్న ‘డ్రగ్స్ స్మగ్లింగ్, జాతీయ భద్రత’ సదస్సులో ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ ఎన్సీబీ పరిధిలో పట్టుకున్న 6,590 కిలోలు సహా 1,44,000 కిలోల మాదకద్రవ్యాలను (రూ.2,416 కోట్లు) ధ్వంసం చేయనున్నారు. దీంతో కలిపి జూన్ 1, 2022 నుంచి జులై 15, 2023 వరకూ రాష్ట్రాల్లోని ఎన్సీబీ, యాంటీ నార్కొటిక్స్ టాస్క్ ఫోర్స్‌ల ప్రాంతీయ యూనిట్లు సమష్టిగా సుమారు రూ.9,580 కోట్ల విలువైన 8.76 లక్షల కిలోల డ్రగ్స్‌ను ధ్వంసం చేశాయి. సోమవారం నాటితో ఏడాదిలో ధ్వంసమయ్యే డ్రగ్స్ మొత్తం 10 లక్షల కిలోలు దాటనుంది. డ్రగ్స్ రహిత భారతదేశాన్ని సృష్టించడానికి ప్రభుత్వం మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా జీరో టోలరెన్స్ విధానం అవలంభిస్తోందని హోంశాఖ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. -
భారత్ వాణిని ప్రపంచం ఆసక్తిగా వింటోంది
జమ్మూ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో ప్రపంచ వేదికపై భారత్ పలుకుబడి, స్థాయి పెరిగిపోయాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. భారత్ చెప్పే విషయాలను ప్రపంచ సమాజం ఇప్పుడు ఆసక్తిగా వింటోందని చెప్పారు. గతంలో అంతర్జాతీయ వేదికలపై భారత్ ఏ విషయమైనా చెబితే, అంత సీరియస్‌గా తీసుకునేవారు కారని తెలిపారు. మోదీ ప్రభుత్వం వచ్చాక 2014 తర్వాత అలాంటి పరిస్థితులు లేవని చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్ జమ్మూలో జాతీయ భద్రతపై జరిగిన సదస్సులో సోమవారం ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ అమెరికా, ఈజిప్టుల్లో ఆరు రోజుల పర్యటన సందర్భంగా పలు చారిత్రక ఒప్పందాలపై సంతకాలు చేసిన నేపథ్యంలో రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో ప్రధాని మోదీ పలుకుబడి పెరిగిందని చెప్పారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ ‘బాస్’అంటూ మోదీని అభివరి్ణంచగా, అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆటోగ్రాఫ్ తీసుకునేంత ప్రజాదరణ కలిగిన నేతగా కొనియాడిన నేపథ్యంలో మంత్రి ఈ మాటలన్నారు. ప్రధాని మోదీ హయాంలో భారత్ మరింత శక్తివంతంగా మారిందన్న ఆయన..అవసరమైన పక్షంలో సరిహద్దుల వెలుపల కూడా దాడి చేయగలదంటూ పొరుగుదేశం పాకిస్తాన్‌ను హెచ్చరించారు. ఉగ్రవాదంపై మోదీ ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకుందని చెప్పారు. ఉగ్రవాదంపై ‘జీరో టాలరెన్స్’విధానం అంటే అర్థం ఏమిటో దేశంతోపాటు ప్రపంచమే తెలుసుకుందని వ్యాఖ్యానించారు. 2016, 2019ల్లో జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌ను ఆయన ప్రస్తావిస్తూ..ఇందుకు సంబంధించిన నిర్ణయాలను ప్రధాని మోదీ కేవలం 10 నిమిషాల్లోనే తీసుకున్నారని, దీన్ని బట్టి ఆయన సామర్థ్యమేంటో తెలుస్తుందని రాజ్‌నాథ్ తెలిపారు. సరిహద్దుల లోపలే కాదు, వెలుపల కూడా ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ను మన బలగాలు ధ్వంసం చేశాయన్నారు. ఉగ్రవాదాన్ని పెంచిపోíÙంచడమే ప్రభుత్వ విధానంగా మార్చుకున్న దేశాలు ఈ ఆటను ఎక్కువ సేపు ఆడలేవన్న విషయాన్ని గ్రహించాలని ఆయన పాక్‌నుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. భారత్ కృషితో నేడు చాలా వరకు పెద్ద దేశాలు ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడుతున్నాయని చెప్పారు. కశీ్మర్లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం ద్వారా ఏమీ సాధించలేమన్న విషయం పాక్ తెలుసుకోవాలన్నారు. పాక్ ముందుగా తన సొంతింటిని చక్కదిద్దుకోవాలని హితవుపలికారు. పాక్ ఆక్రమిత కశీ్మర్ కూడా భారత్‌దేనని చెప్పారు. దీనిపై పార్లమెంట్ ఇప్పటికే పలు తీర్మానాలు చేసిందని గుర్తు చేశారు. జమ్మూకశీ్మర్‌లో తామూ భాగమేనంటూ పీవోకే ప్రజలు డిమాండ్ చేసే రోజులు ఎంతో దూరంలో లేవని రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. -
కీలక అధికారికి ఉద్వాసన
వైట్‌హౌస్ ప్రధాన వ్యూహ నిపుణుడు స్టీఫెన్ బానన్‌ను జాతీయ భద్రతా మండలి పదవి నుంచి తొలగించారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. భద్రతా మండలి సభ్యులు, వాళ్ల విధుల విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక ప్రెసిడెన్షియల్ మెమొరాండం జారీ చేసిన ఆయన.. అందులో బానన్ పేరు పూర్తిగా పక్కన పెట్టేశారు. జాతీయ భద్రతా సలహాదారు మెక్ మాస్టర్ మొత్తం అన్ని సమావేశాల ఎజెండాలు సిద్ధం చేయాలని అందులో తెలిపారు. అంతేకాదు, హోం లాండ్ సెక్యూరిటీ సలహాదారు టామ్ బాసెర్ట్ను కూడా ఆయన కొంవరకు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే బానన్‌కు జాతీయ భద్రతామండలిలో స్థానం కల్పించారు. వైట్‌హౌస్ సీనియర్ సలహాదారులకు కూడా ఇది చాలా అరుదైన అవకాశం. అయితే ఇప్పుడు ఆయనను ఎందుకు పక్కన పెట్టారన్న విషయమే అర్థం కావడం లేదు. గత ప్రభుత్వ హయాంలో జాతీయ భద్రతా మండలిని సుసాన్ రైస్ పనిచేయించారని, ఇప్పుడు తాను దాన్ని మళ్లీ ఆపేస్తున్నానని బానన్ చెప్పినట్లు తెలుస్తోంది. అది సరిగా పనిచేసేలా చూసేందుకు జనరల్ మెక్ మాస్టర్ తిరిగి వచ్చారన్నారు. అయితే.. బానన్‌ను అక్కడి నుంచి తప్పించం అవమానం ఏమీ కాదని, ఆయనకు మరింత పెద్ద బాధ్యత అప్పగించే అవకాశం ఉందని అమెరికన్ మీడియా వర్గాలు అంటున్నాయి. -
వైట్‌హౌస్ ఉద్యోగానికి ముస్లిం మహిళ రాజీనామా
వాషింగ్టన్ : వలసలపై ట్రంప్ నిషేధం విధిం చిన 8 రోజుల అనం తరం వైట్‌హౌస్‌లో తన ఉద్యోగానికి రాజీనామా చేశానని బంగ్లాదేశ్ మూలాలున్న ముస్లిం మహిళ రుమానా అహ్మద్ తెలిపింది. 2011లో వైట్‌హౌస్ ఉద్యోగంలో చేరిన ఆమె అనంతరం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో సభ్యురాలైంది. అట్లాంటిక్ పత్రికకు తన అనుభవాల్ని రాస్తూ... ‘అమెరికా ప్రయోజ నాల పరిరక్షణకు కృషిచే యడమే నా పని. మా బృందంలో హిజబ్ ధరించే ఏకైక మహిళను. ఒబామా హయాం లో సంతోషంగా పనిచేసేదాన్ని. అయితే ట్రంప్ అధ్యక్షుడయ్యాక ముస్లిం ఉద్యోగుల్ని అనుమానంగా చూస్తున్నారు’ అని రుమానా పేర్కొంది. జార్జ్ వాషింగ్టన్ వర్సిటీలో చదివిన రుమానా... ఒబామాను స్ఫూర్తిగా తీసుకొని వైట్‌హౌస్‌లో చేరింది.