వైట్‌హౌస్‌ ఉద్యోగానికి ముస్లిం మహిళ రాజీనామా | Muslim Woman Lasts Just 8 Days as White House Staffer Under Trump | Sakshi
Sakshi News home page

వైట్‌హౌస్‌ ఉద్యోగానికి ముస్లిం మహిళ రాజీనామా

Published Mon, Feb 27 2017 1:57 AM | Last Updated on Tue, Oct 16 2018 5:59 PM

వైట్‌హౌస్‌ ఉద్యోగానికి ముస్లిం మహిళ రాజీనామా - Sakshi

వైట్‌హౌస్‌ ఉద్యోగానికి ముస్లిం మహిళ రాజీనామా

వాషింగ్టన్ : వలసలపై ట్రంప్‌ నిషేధం విధిం చిన 8 రోజుల అనం తరం వైట్‌హౌస్‌లో తన ఉద్యోగానికి రాజీనామా చేశానని బంగ్లాదేశ్‌ మూలాలున్న ముస్లిం మహిళ రుమానా అహ్మద్‌ తెలిపింది. 2011లో వైట్‌హౌస్‌ ఉద్యోగంలో చేరిన ఆమె అనంతరం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌లో సభ్యురాలైంది.

అట్లాంటిక్‌ పత్రికకు తన అనుభవాల్ని రాస్తూ... ‘అమెరికా ప్రయోజ నాల పరిరక్షణకు కృషిచే యడమే నా పని. మా బృందంలో హిజబ్‌ ధరించే ఏకైక మహిళను. ఒబామా హయాం లో సంతోషంగా పనిచేసేదాన్ని. అయితే ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక ముస్లిం ఉద్యోగుల్ని అనుమానంగా చూస్తున్నారు’ అని రుమానా పేర్కొంది.  జార్జ్‌ వాషింగ్టన్  వర్సిటీలో చదివిన రుమానా... ఒబామాను స్ఫూర్తిగా తీసుకొని వైట్‌హౌస్‌లో చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement