న్యూయార్క్: ఖలిస్తానీ ఉగ్రవాది హత్యోదంతంలో భారతీయ నిఘా వర్గాల పాత్రపై అమెరికా జాతీయ భద్రతా మండలి ఉన్నతాధికారి స్పందించారు. ‘ కెనడా పౌరుడైన నిజ్జర్ హత్యతో భారతీయ నిఘా వర్గాలకు సంబంధం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేస్తున్న ఆరోపణలు నిజంగా తీవ్రమైనవి.
ఈ వివాదం ముగిసిపోవాలంటే సమగ్ర, విస్తృతస్థాయి దర్యాప్తు అవససరం. కెనడా ఇప్పుడు అదే పనిలో ఉంది. ఇందుకు భారత్ సైతం పూర్తి సహాయ సహకారాలు అందించాలని మేం కూడా కోరుకుంటున్నాం’ అని అమెరికా జాతీయ భద్రతా మండలి సమన్వయ కర్త(వ్యూహాత్మక సంబంధాలు) జాన్ కిర్బీ సీఎన్‌ఎన్ వార్తాసంస్థ ముఖాముఖిలో వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment