John Kirby
-
ట్రూడో ఆరోపణలు తీవ్రమైనవే: అమెరికా
న్యూయార్క్: ఖలిస్తానీ ఉగ్రవాది హత్యోదంతంలో భారతీయ నిఘా వర్గాల పాత్రపై అమెరికా జాతీయ భద్రతా మండలి ఉన్నతాధికారి స్పందించారు. ‘ కెనడా పౌరుడైన నిజ్జర్ హత్యతో భారతీయ నిఘా వర్గాలకు సంబంధం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేస్తున్న ఆరోపణలు నిజంగా తీవ్రమైనవి. ఈ వివాదం ముగిసిపోవాలంటే సమగ్ర, విస్తృతస్థాయి దర్యాప్తు అవససరం. కెనడా ఇప్పుడు అదే పనిలో ఉంది. ఇందుకు భారత్ సైతం పూర్తి సహాయ సహకారాలు అందించాలని మేం కూడా కోరుకుంటున్నాం’ అని అమెరికా జాతీయ భద్రతా మండలి సమన్వయ కర్త(వ్యూహాత్మక సంబంధాలు) జాన్ కిర్బీ సీఎన్ఎన్ వార్తాసంస్థ ముఖాముఖిలో వ్యాఖ్యానించారు. -
మొట్టమొదటిసారి ప్రెస్ కాన్ఫరెన్సులో నరేంద్ర మోదీ?
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా వైట్ హౌస్ లో జరిగే యూఎస్ ప్రెస్ కాన్ఫెరెన్స్ లో ఆయన పాల్గొంటారని, అయితే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో రెండే రెండు ప్రశ్నలుంటాయని ఈ ఫార్మాట్ గురించి వివరించారు వైట్ హౌస్ జాతీయ భద్రతాధికారి జాన్ కిర్బీ. భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్ర మోదీ ఎప్పుడైనా ఇంటర్వ్యూలలో మాట్లాడటం తప్పిస్తే ఎన్నడూ ప్రెస్ కాన్ఫరెన్సులో పాల్గొంది లేదు. అయితే అమెరికా పర్యటనలో ఉన్న ఆయన చివర్లో మాత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొంటారని ఆ ఫార్మాట్లో కూడా కేవలం రెండే ప్రశ్నలుంటాయని తెలిపారు వైట్ హౌస్ భద్రతాధికారి జాన్ కిర్బీ. "బిగ్ డీల్" దీన్ని "బిగ్ డీల్" గా వర్ణిస్తూ.. భారత్ ప్రధాని ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం సంతోషకరం. ప్రస్తుతం ఇది రెండు దేశాలకు చాలా అవసరమైనదని, మోదీ కూడా ఇది అవసరమని చెప్పినట్లు తెలిపారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్సులో రెండే రెండు ప్రశ్నలుంటాయని.. ఒక ప్రశ్న యూఎస్ ప్రెస్ వారు అడిగితే రెండవది భారత జర్నలిస్టు అడుగుతారని ఆయన స్పష్టం చేశారు. ఈ రెండు ప్రశ్నల "బిగ్ డీల్" ఇప్పుడు అమెరికా మీడియాలో సంచలనంగా మారింది. ఇవి కూడా అడగండి.. ఇదిలా ఉండగా అమెరికా సెనేటర్లు మాత్రం భారత ప్రధానిని దేశంలోని రాజకీయ అనిశ్చితి గురించి, మత విద్వేషాల గురించి, పౌర సంస్థలపైన, విలేఖరులపైన జరుగుతున్న దాడుల గురించి, పత్రికా స్వేచ్ఛ, అంతర్జాల వినియోగంపై పరిధులు విధించడం వంటి అనేక విషయాల గురించి ప్రశ్నించమని కోరుతూ అధ్యక్షుడు జో బైడెన్ పై ఒత్తిడి చేస్తున్నారు. అయినా కూడా వైట్ హౌస్ వర్గాలు ప్రెస్ కాన్ఫరెన్సును రెండే ప్రశ్నలకు పరిమితం చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు సెనేటర్లు. ఇది కూడా చదవండి: ఇది "సాంకేతిక దశాబ్దం".. అమెరికా పర్యటనలో భారత ప్రధాని -
అమెరికా స్థావరాల్లో అఫ్గాన్ శరణార్థులు
సంక్షోభంలో ఉన్న అఫ్గానిస్తాన్ నుంచి భయంతో వలస వస్తున్న శరణార్థుల కోసం అమెరికా మరో మూడు మిలటరీ బేస్‌లను కేటాయించింది. ఇప్పటికే మధ్యప్రాచ్యం, యూరప్‌లో శరణార్థుల కోసం కేటాయించిన స్థావరాలతో పాటు తాజాగా మెరైన్ కార్ప్స్ బేస్, ఫోర్ట్ పికెట్, హోలోమ్యాన్ ఎయిర్‌బేస్‌లను సైతం వీరి కోసం కేటాయిస్తున్నట్లు యూఎస్ ప్రతినిధి జాన్ కిర్బే చెప్పారు. అఫ్గాన్ స్పెషల్ వీసా ఉన్న దరఖాస్తుదారులు, వారి కుటుంబసభ్యులు, రిస్కు ఎదుర్కొంటున్న వ్యక్తులను అఫ్గాన్ నుంచి తరలించే ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నామని, ఈ మిషన్ కు అదనపు మద్దతు కోసం కొత్త బేస్‌లను కేటాయించామని కిర్బే తెలిపారు.చదవండి: అమెరికా, చైనా మధ్య తొలిసారి సైనిక చర్చలు దీంతో అఫ్గాన్ శరణార్థుల కోసం అమెరికా స్వదేశంలో కేటాయించిన స్థావరాల సంఖ్య ఏడుకు చేరిందన్నారు. ఇవి కాకుండా ఖతార్, బహ్రెయిన్, జర్మనీల్లో అమెరికాకు మరో 10 స్థావరాలున్నాయని ఆయన వివరించారు. అమెరికాలోని అన్ని స్థావరాలు కలిసి 70 వేల మందికి ఆశ్రయం కల్పించగలవని కిర్బే చెప్పారు. శరణార్థులకు ఆశ్రయం కల్పించే విషయంలో మిలటరీకి హోమ్‌ల్యాండ్ శాఖ, ఆరోగ్య శాఖ సహాయం చేస్తున్నాయని వివరించారు. సరిహద్దు దేశాలేవీ అఫ్గానిస్తాన్ పౌరులను రానీయకపోవడంతో వీరంతా అమెరికా ఆశ్రయం కోసం ఎదురు చూస్తూ విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నారు. చదవండి: విమానాశ్రయాన్ని దిగ్బంధిస్తున్న తాలిబన్లు ఏ బేస్‌లో ఎంతమంది? జర్మనీలోని రమ్స్టెయిన్ బేస్‌కు గతవారం దాదాపు 7,500మంది శరణార్థులు వచ్చారు. ఈ బేస్ సామర్ధ్యం 12వేలని అధికారులు చెప్పారు. బహ్రెయిన్‌లోని ఇసా ఎయిర్‌బేస్‌లో 5 వేల మందికి ఆశ్రయం కల్పించే యత్నాలు జరుగుతున్నాయి. ఫోర్ట్ బ్లిస్‌లో 650 మందికి ఆవాసం కల్పించారు. దీని సామర్థ్యం పదివేలని అధికారులు చెప్పారు. ఫోర్ట్ డిక్స్లో 9,500 మందికి టెంట్ హౌస్‌ల్లో నివాసం కల్పించారు. అయితే కొన్ని బేస్‌ల్లో పరిస్థితి ఘోరంగా ఉందని అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. అల్ ఉదైద్ బేస్‌లో పరిస్థితి నరకం కన్నా హీనంగా ఉందని, ఎలుకలు తిరుగుతున్నాయని అధికారులు చెప్పారు. మరోవైపు మిలటరీ బేస్‌ల్లో శరణార్థు లకు తాత్కాలిక నివాసం కల్పిస్తున్నారు కానీ, తర్వాత వీరిని ఎక్కడకు తరలిస్తారన్న విషయమై అమెరికా స్పష్టత ఇవ్వలేదు. కొన్ని రాష్ట్రాల గవర్నర్లు వీరికి శాశ్వత ఆవాసం కల్పించేందుకు ముందుకువస్తున్నారు. ఈ బేస్‌లను అధ్యక్షుడు బైడెన్ సందర్శించాల్సి ఉన్నా, కాబూల్ పేలుళ్ల కారణంగా వాయిదా పడింది. సరిహద్దు దేశాలు మానవతా ధృక్పధంతో శరణార్థులకు ఆశ్రయం కల్పించాలని ఐరాస కోరింది. –నేషనల్ డెస్క్, సాక్షి -
ఉద్రిక్తతలు తొలగించుకోవాలి: కిర్బీ
వాషింగ్టన్: కశ్మీర్ వివాదం పరిష్కారానికి భారత్, పాకిస్తాన్ రెండు వైపుల నుంచి చొరవచూపాలని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ అభిప్రాయపడ్డారు. ఇరుదేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తపరిస్థితిని తొలగించుకోవాలని తాము కోరుకుంటున్నామని శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. సమస్య పరిష్కారానికి దేశాల మధ్య అర్థవంతమైన చర్చలు జరగాల్సి ఉందని అన్నారు. యూఎస్ కాంగ్రెస్‌లో పాకస్తాన్ను టెర్రరిస్టు దేశంగా ప్రకటించే బిల్లు ప్రస్తావన గురించి మాట్లాడుతూ.. అలాంటి ప్రత్యేకమైన బిల్లు ఏదీ తాన దృష్టికి రాలేదని కిర్బీ తెలిపారు. అదేసమయంలో చట్టసభల్లో తీసుకోబోయే నిర్ణయాలపై తాను కామెంట్ చేయబోనని అన్నారు. పాకిస్తాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతికి చిక్కే అవకాశాలపై పాత్రికేయుల ప్రశ్నకు సమాధానంగా.. పాక్ ఆయుధసంపత్తికి సంబంధించిన భద్రతా వ్యవహారంపై తాను నమ్మకంగా ఉన్నానని కిర్బీ అన్నారు. -
ఉడీ లాంటి దాడి తర్వాత ఉద్రిక్తతలు సహజం
ఉడీలో జరిగిన ఉగ్రదాడి చాలా దారుణమని, అలాంటి దాని తర్వాత ఇలాంటి ఉద్రిక్తతలు తలెత్తడం సహజమేనని అమెరికా తేల్చిచెప్పింది. ఈ అంశంపై అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ స్పందించారు. భారత సైన్యం నిర్వహించిన నిర్దేశిత దాడుల (సర్జికల్ స్ట్రైక్స్) గురించి చూశామని, పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు. భారత్, పాక్ సైన్యాలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారని భావిస్తున్నామని, ఉద్రిక్తతలను తగ్గించాలంటే ఇరువురి మధ్య కమ్యూనికేషన్ ఉండటం చాలా ముఖ్యమని చెప్పారు. ఉగ్రవాదం వల్ల ఈ ప్రాంతానికి ముప్పు పొంచి ఉందన్న విషయాన్ని అమెరికా పదే పదే చెబుతూనే ఉందని, ఉగ్రవాదానికి సరిహద్దులు లేవని, అందువల్ల లష్కరే తాయిబా జైషే మహ్మద్ లాంటి ఉగ్రవాద గ్రూపులను అణిచేయలని, వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు జాన్ కిర్బీ చెప్పారు. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ ఈనెల 27వ తేదీన భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో మాట్లాడారని, ఉడీ ఉగ్రదాడిని గట్టిగా ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారని అన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని తాము ఖండిస్తామని, దానివల్ల ఉద్రిక్తతలు తలెత్తకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ దాడి గురించి తాను ప్రత్యకంగా చెప్పాలనుకోను గానీ... ఉడీ లాంటి ఉగ్రదాడుల వల్ల భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరగడం సహజమేనని జాన్ కిర్బీ అన్నారు. ఉడీ లాంటి దాడులు చాలా భయంకరమైనవని చెప్పారు. ఈతరుణంలో భారత్, పాకిస్థాన్ రెండు దేశాలకూ తము ఇచ్చే సందేశం ఒకటేనని.. ఇరు దేశాల మధ్య చర్చలు పెరిగి, ఉద్రిక్తతలను మరింత పెంచే చర్యలు మానుకోవాలని సూచించారు. -
భారత్‌లో అసహనంపై అమెరికా ఆందోళన
వాషింగ్టన్ : భారత్‌లో అసహనం, హింస పెరుగుతున్నట్లు వస్తున్న నివేదికలపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై భారత ప్రభుత్వం తన పూర్తి అధికారాలను ఉపయోగించి పౌరులకు రక్షణ కల్పించాలని, వీటికి కారణమవుతున్న దోషులను శిక్షించాలని కోరింది. భారత్‌లో బీఫ్ తినేవారిపై దాడులు జరుగుతున్నాయని, ఇటీవల మధ్యప్రదేశ్‌లో గేదె మాంసం తీసుకెళుతున్న ఇద్దరు ముస్లిం మహిళలపై వేధింపులు జరిగినట్లు వచ్చిన నివేదికపై విదే శాంగ ప్రతినిధి జాన్ కిర్బీ పైవిధంగా స్పందించారు. భావప్రకటనా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ విషయంలో భారతీయులకు, ప్రభుత్వానికి తాము మద్దతుగా నిలుస్తామని, అలాగే అన్ని రకాల హింసలను ఎదుర్కొనేందుకు భారత్‌కు తాము అండగా ఉంటామని ఆయన అన్నారు. భారతీయుల్లో ఉన్న సహనాన్ని వారికి తెలియజేసేందుకు వారితో కలసి పనిచేస్తామని కిర్బీ స్పష్టంచేశారు. -
భారత్‌కు అణు మద్దతివ్వండి: అమెరికా
అణు సరఫరాదార్ల కూటమి దేశాలను కోరిన అమెరికా - ముందే మద్దతు ప్రకటించిన బ్రిటన్ - భారత్ ప్రయత్నాలకు అడ్డుపడుతున్న ఆ ఐదు దేశాలు వాషింగ్టన్: అణు సరఫరాదారుల కూటమి (ఎన్ఎస్జీ)లో చేరేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతివ్వాలని ఎన్ఎస్జీ సభ్యదేశాలను అమెరికా కోరింది. ఈ అంశంపై అమెరికా అంతర్గత భద్రత అధికార ప్రతినిధి జాన్ కిర్బీ గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 24న సియోల్‌లో జరగనున్న ఎన్ఎస్జీ ప్లీనరీ సమావేశం నేపథ్యంలో సభ్య దేశాలకు అమెరికా ఈ విజ్ఞప్తి చేయడం భారత్‌కు లాభించనుంది. భారత్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవద్దంటూ ఇటీవలే అమెరికా రక్షణ మంత్రి జాన్ కెర్రీ ఎన్ఎస్జీ సభ్య దేశాలకు లేఖను కూడా రాశారు. ఇదిలా ఉండగా భారత ప్రయత్నాలకు అమెరికాతోపాటు తమ నుంచి కూడా పూర్తి మద్దతు ఉంటుందని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ హామీఇచ్చారు. ఆయన గురువారం ప్రధాని మోదీకి ఫోన్ చేసి ఈ అంశంపై సుదీర్ఘంగా మాట్లాడినట్లు బ్రిటన్ అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. ఎన్ఎస్జీలో మొత్తం 48 సభ్యదేశాలున్నాయి. ఈ గ్రూపులో సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు చైనా, ఆస్ట్రియా, ఐర్లాండ్, టర్కీ, దక్షిణాఫ్రికా దేశాలు అడ్డుపడుతున్నాయి. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్పీటీ)పై భారత్ సంతకం చేయనందున ఎన్ఎస్జీలో చేరేందుకు తమకు అభ్యంతరాలున్నాయని చైనా వాదిస్తోంది. భారత్‌కు ఎన్ఎస్జీలో ప్రవేశం కల్పించినట్లయితే పాకిస్తాన్‌కు కూడా ప్రవేశం కల్పించాలని చైనా కోరుతోంది. ఎన్ఎస్జీతో పెద్దగా లాభం లేదు: నిపుణులు న్యూఢిల్లీ: అణు సరఫరా బృందం (ఎన్ఎస్జీ)లో సభ్యత్వం తీసుకోవటం ద్వారా భారత్‌కు పెద్దగా ఒరిగేదేమీ ఉండదని.. ప్రముఖ అణు శక్తి నిపుణుడు జి. బాలచంద్రన్ శుక్రవారం తెలిపారు. ‘భారత్-ఎన్ఎస్జీ సభ్యత్వం’ అనే అంశంపై ఢిల్లీలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సభ్యత్వం వల్ల అణుశక్తి పెట్టుబడులను బలోపేతం చేసుకోవచ్చు కానీ.. అంతకుమించి భారత అణుశక్తి కార్యక్రమంలో పెద్దగా లాభనష్టాలేమీ ఉండవన్నారు. భవిష్యత్తులో పాకిస్తాన్ సభ్యత్వానికి అడ్డుచెప్పకుండా ఉండేందుకే భారత సభ్యత్వానికి చైనా అడ్డుపడుతోందన్నారు. -
ఉగ్రవాదుల స్వర్గధామంగా పాక్
వాషింగ్టన్: ఉగ్రవాదులకు పాకిస్తాన్ స్వర్గధామంలా మారడంపై అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు భారత్, అఫ్ఘానిస్థాన్లోని టెర్రరిస్టు గ్రూపుల విషయంలో పాక్ అనుసరిస్తున్న వైఖరి ఏమాత్రం మారలేదని అమెరికన్ రక్షణ నిపుణులు చెబుతున్నారు. ఉగ్రవాద గ్రూపులకు పాక్‌లో ఉన్న స్వేచ్ఛ తమకెప్పుడూ ఆందోళన కలిగించే విషయమేనని, దీనిపై ఆ దేశంతో ఎప్పుడూ చర్చిస్తుంటామని పెంటగాన్ ఉన్నతాధికారి జాన్ కిర్బే శనివారం మీడియాతో పేర్కొన్నారు. లష్కరే తోయిబా, హక్కానీ నెట్వర్క్ ఉగ్రవాద సంస్థలపై పాక్ తగిన చర్యలు తీసుకుంటున్నదని ధ్రువీకరించలేమని అమెరికా విదేశాంగ శాఖ ఇటీవలే పేర్కొన్న నేపథ్యంలో పెంటగాన్ స్పందనకు ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఉగ్రవాదుల విషయంలో పాక్ వైఖరితో సంతృప్తి చెందనప్పటికీ ఒబామా ప్రభుత్వం ఆ దేశానికి భారీగా నిధుల సాయం అందిస్తుండటం గమనార్హం. ఇప్పటికే దాదాపు మూడు వేల కోట్ల రూపాయల వరకు సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. పాక్‌కు ఇంత భారీ మొత్తం సాయం అందించాల్సిన అవ సరమున్నదా అన్నది అమెరికా తేల్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.