వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా వైట్ హౌస్ లో జరిగే యూఎస్ ప్రెస్ కాన్ఫెరెన్స్ లో ఆయన పాల్గొంటారని, అయితే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో రెండే రెండు ప్రశ్నలుంటాయని ఈ ఫార్మాట్ గురించి వివరించారు వైట్ హౌస్ జాతీయ భద్రతాధికారి జాన్ కిర్బీ.
భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్ర మోదీ ఎప్పుడైనా ఇంటర్వ్యూలలో మాట్లాడటం తప్పిస్తే ఎన్నడూ ప్రెస్ కాన్ఫరెన్సులో పాల్గొంది లేదు. అయితే అమెరికా పర్యటనలో ఉన్న ఆయన చివర్లో మాత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొంటారని ఆ ఫార్మాట్లో కూడా కేవలం రెండే ప్రశ్నలుంటాయని తెలిపారు వైట్ హౌస్ భద్రతాధికారి జాన్ కిర్బీ.
"బిగ్ డీల్"
దీన్ని "బిగ్ డీల్" గా వర్ణిస్తూ.. భారత్ ప్రధాని ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం సంతోషకరం. ప్రస్తుతం ఇది రెండు దేశాలకు చాలా అవసరమైనదని, మోదీ కూడా ఇది అవసరమని చెప్పినట్లు తెలిపారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్సులో రెండే రెండు ప్రశ్నలుంటాయని.. ఒక ప్రశ్న యూఎస్ ప్రెస్ వారు అడిగితే రెండవది భారత జర్నలిస్టు అడుగుతారని ఆయన స్పష్టం చేశారు. ఈ రెండు ప్రశ్నల "బిగ్ డీల్" ఇప్పుడు అమెరికా మీడియాలో సంచలనంగా మారింది.
ఇవి కూడా అడగండి..
ఇదిలా ఉండగా అమెరికా సెనేటర్లు మాత్రం భారత ప్రధానిని దేశంలోని రాజకీయ అనిశ్చితి గురించి, మత విద్వేషాల గురించి, పౌర సంస్థలపైన, విలేఖరులపైన జరుగుతున్న దాడుల గురించి, పత్రికా స్వేచ్ఛ, అంతర్జాల వినియోగంపై పరిధులు విధించడం వంటి అనేక విషయాల గురించి ప్రశ్నించమని కోరుతూ అధ్యక్షుడు జో బైడెన్ పై ఒత్తిడి చేస్తున్నారు. అయినా కూడా వైట్ హౌస్ వర్గాలు ప్రెస్ కాన్ఫరెన్సును రెండే ప్రశ్నలకు పరిమితం చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు సెనేటర్లు.
ఇది కూడా చదవండి: ఇది "సాంకేతిక దశాబ్దం".. అమెరికా పర్యటనలో భారత ప్రధాని
Comments
Please login to add a commentAdd a comment