న్యూఢిల్లీ: భారత రాజధాని ఢిల్లీ వేదికగా అంగరంగవైభవంగా జరిగిన 18వ జీ20 సమావేశాలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్బంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ముగింపు ప్రసంగంలో భాగస్వామ్య దేశాలకు కృతఙ్ఞతలు తెలిపి బ్రెజిల్ అధ్యక్షుడికి ప్రెసిడెన్సీ బాధ్యతలను అప్పగించారు.
బైడెన్ తొలిసారి భారత్‌లో..
జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు సమావేశాలు ముగిశాక వియత్నాం బయలుదేరి వెళ్లారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జో బైడెన్ మొట్టమొదటిసారి భారత్‌లో పర్యటించారు. జీ20 సమావేశాలు రెండోరోజు ఉదయాన్నే రాజ్‌ఘాట్‌కు వెళ్లి భారత జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించిన తర్వాత నేరుగా విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన వియత్నాం బయల్దేరారు. సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజునే బైడెన్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు.
#WATCH | G 20 in India | US President Joe Biden departs from Delhi to Vietnam, after concluding the G20 Summit, earlier visuals. pic.twitter.com/gsAG0m5GwX
— ANI (@ANI) September 10, 2023
వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు..
జీ20 సమావేశాలు ఒకపక్కన జరుగుతుండగానే ప్రధాని నరేంద్ర మోదీ పలువురు ప్రపంచ దేశాల అధ్యక్షులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సమావేశాలు తొలిరోజున మారిషస్, బంగ్లాదేశ్ దేశాలతో చర్చలు జరిపారు. రెండో రోజున యూకే, జపాన్, జర్మనీ, ఇటలీ దేశ నేతలతో సమావేశమయ్యారు.
ఇక ఆదివారం రోజున ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్‌తో ప్రధాని లంచ్ సమావేశం అది ముగిశాక కెనడా దేశాధినేతలతోనూ అనంతరం కొమొరోస్, తుర్కియే, యూఏఈ, దక్షిణ కొరియా, యురోపియన్ యూనియన్, బ్రెజిల్, నైజీరియా అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ చర్చల్లో భాగంగా కొన్ని కీలక అంశాలపై రంగాల వారీగా ఆయా దేశాలతో ఒప్పందాలు చేసుకోనున్నారు.
PM to hold more than 15 bilaterals with world leaders on G20 sidelines
— ANI Digital (@ani_digital) September 8, 2023
Read @ANI Story | https://t.co/W7Ti3xFuAG#NarendraModi #Modi #G20 #G20India2023 #NewDelhi pic.twitter.com/Wwv3pnWfbU
జయహో భారత్..
రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశాలను భారత్ విజయవంతంగా నిర్వహించింది. సమేవేశాలు తొలిరోజునే ప్రధాని ప్రతిపాదించిన ఢిల్లీ డిక్లరేషన్ విషయంలో భాగస్వామ్యదేశాల ఏకాభిప్రాయం సాధించడం భారత్ సాధించిన అపూర్వ విజయమనే చెప్పాలి. సమావేశాలు ముగింపు సందర్బంగా ప్రధాని ప్రతిపాదించిన 'వన్ ఎర్త్ నేషన్'పై సభ్యదేశాలు హర్షం వ్యక్తం చేశాయి.
ఇది కూడా చదవండి: G20 Summit: ఇకపై జీ20 కాదు.. జీ21
Comments
Please login to add a commentAdd a comment