G20 Summit: జీ20 సమావేశాల ముగింపు వేళ ప్రధాని ప్రసంగం | Prime Minister Statement At Closing Ceremony Of The G20 Summit | Sakshi
Sakshi News home page

G20 Summit: జీ20 సమావేశాల ముగింపు వేళ ప్రధాని ప్రసంగం

Published Sun, Sep 10 2023 3:12 PM | Last Updated on Sun, Sep 10 2023 3:48 PM

Prime Minister Statement At Closing Ceremony Of The G20 Summit - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా కన్నులపండుగగా జరిగిన 18వ జీ20 సమావేశాలు ఈరోజు విజయవంతంగా ముగిశాయి. ఈ సమావేశాలకు అధ్యక్షత వహించిన భారత దేశం తదుపరి సమావేశాలకు బ్రెజిల్ ఆతిధ్యమివ్వనున్న నేపథ్యంలో ఆ దేశాధినేత లూలా డా సిల్వా చేతికి బ్యాటన్ అప్పగించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. 

నమ్మకముంది.. 
జీ20 సమావేశాల ముగింపు సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇండోనేషియా, భారత్, బ్రెజిల్  త్రయం స్ఫూర్తిపై మాకు పూర్తి నమ్మకముంది. బ్రెజిల్‌కు మేము పూర్తి సహాయసహకారాలు అందిస్తామని మా తదనంతరం వారి నాయకత్వంలో జీ20 భాగస్వామ్య లక్ష్యాలను మరింత ముందుకు తీసుకువెళుతుందని విశ్వసిస్తున్నామన్నారు.

ఓవర్ టు బ్రెజిల్.. 
బ్రెజిల్ అధ్యక్షుడు నా స్నేహితుడు లూలా డా సిల్వాకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనకు అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తున్నాను. అయితే నవంబర్‌లో జరగబోయే వర్చువల్ సెషన్ వరకు భారత్ జీ20 ప్రెసిడెన్సీ దేశంగానే కొనసాగుతుందన్నారు. ఆ సమావేశానికి సంబంధించిన వివరాలను మా బృందం అతిత్వరలోనే మీతో పంచుకుంటుందన్నారు. ఈ విడత సమావేశాల్లో మీరంతా అనేక అంశాలపై మీ అభిప్రాయాలను తెలిపారు మన పురోగతిని వేగవంతం చేయడానికి కొన్ని విలువైన సలహాలు ఇచ్చారు, మరెన్నో ప్రతిపాదనలు చేసారు.

థాంక్ యూ.. 
మిత్రులారా..! దీంతో ఈ జీ20 సమావేశం ముగిసిందని నేను ప్రకటిస్తున్నాను. 'ఒక్కటే భూమి, ఒక్కటే కుటుంబం, ఒక్కటే భవిష్యత్తు' అనే నినాదంతో మనం వేసుకున్న బాటను కొనసాగించాలని కోరుతున్నానన్నారు. 140 కోట్ల మంది భారతీయుల శుభాకాంక్షలతో మీ అందరికీ కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. 

శభాష్ భారత్.. 
రెండ్రోజుల పాటు ఢిల్లీలో జరిగిన జీ20 సమావేశాలను అధ్యక్ష హోదాలో భారత్ దిగ్విజయంగా నిర్వహించిందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ అన్నారు. దక్షిణ బౌగోళానికి చక్కటి ప్రాతనిధ్యం లభించిందని అన్నారు.

ఇక నుంచి జీ21..

భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న జీ20 సదస్సులో ఆఫ్రికా యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం కల్పించే విషయమై ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదన చేయగా సభ్యదేశాలు ఆమోదాన్ని తెలిపాయి. అనంతరం భారత విదేశాంగ శాఖమంత్రి జైశంకర్ ఆఫ్రికన్ యూనియన్ (AU) ఛైర్‌పర్సన్ అజాలి అసోమానిని ఆయనకు కేటాయించిన కుర్చీలో కూర్చోబెట్టారు. దీంతో 20 సభ్యుల జీ20లో ఆఫ్రికా యూనియన్ చేరికతో 21 సభ్యులయ్యారు.

నిన్న(శనివారం) 55 దేశాల సమూహమైన ఆఫ్రికా యూనియన్ వారికి జీ20లో శాశ్వత సభ్యత్వం విషయాన్ని ప్రధాని మోదీ ప్రకటించగా.. సభ్యదేశాలు ఈ ప్రతిపాదనను ఆమోదించాయి.  దాంతో ఇక నుంచి జీ20 కాస్తా జీ21 కానుంది.
ఇది కూడా చదవండి: జీ20 సమ్మిట్‌: కనువిందు చేస్తున్న రిషి సునాక్ దంపతులు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement